యాదాద్రి: సంసార జీవితానికి అడ్డు వస్తున్నాడన్న నెపంతో ఓ మహిళ బాలుడిని గొంతు నులిచి హత్య చేసి ఆపై సాధారణ మరణంగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేసింది. సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం ఫిర్యాదుతో సూర్యాపేట మండలంలోని మూడో విడత ఇందిరమ్మ కాలనీకి చెందిన మచ్చ మధు 2015లో కులాంతర వివాహం చేసుకున్నాడు.
వీరికి రెండేళ్ల తర్వాత బాబు టైసన్ (06)జన్మించాడు. టైసన్‌కు రెండేళ్ల వయసున్న సమయంలోనే తండ్రి వదిలేసి వెళ్లిన తల్లి మరొకరిని వివాహం చేసుకుంది. దీంతో మధు తల్లి కళమ్మ దగ్గరే టైసన్ పెరుగున్నాడు. ఆరు నెలల క్రితం మోతె మండలం సర్వారం గ్రామానికి చెందిన బొడ్డు వాణి అలియాస్ రాణితో మధు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. అప్పటినుంచి ఇద్దరు సహజీవనం చేస్తున్నారు.టైసన్‌ను సూర్యాపేట పట్టణంలోని సూర్యాపేట పబ్లిక్ స్కూల్‌లో 1వ తరగతిలో విద్యనభ్యసిస్తున్నాడు.
అమ్మా.. కడుపులో నొప్పిగా ఉందన్నా..
టైసన్ రోజు మాదిరిగానే స్కూల్‌కు వెళ్లాడు. స్కూల్‌నుంచి రాగానే సవతి తల్లికి అమ్మా బాగా కడుపులో నొప్పిగా ఉందని చెప్పాడు. వెంటనే గదిలోకి వెళ్లి మంచంపై నిద్రిస్తుండగా.. సవతి తల్లి టైసన్ గొంతు గట్టిగా నులిమి హతమార్చింది. వెంటనే టైసన్ తండ్రి మధుకు ఫోన్ ద్వారా టైసన్‌కు బాగా కడుపులో నొప్పిగా ఉందని.. రోదిస్తున్నాడంటూ తెలిపింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు.
నాయనమ్మ ఫిర్యాదుతో..
టైసన్ నాయనమ్మ కళమ్మ మనువడి మృతిపై తనకు అనుమానం ఉందని ఈనెల 4న పోలీసులకు ఫిర్యాదు చేసింది. టైసన్ మృతదేహానికి జనరల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించగా.. నివేదికలో గొంతు నులిమి చంపినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. వెంటనే సవతి తల్లిపై అనుమానం వ్యక్తం కావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. దీంతో ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment