సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
వివరాల ప్రకారం.. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అధిక వేగంలో ఉన్న కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమం ఉన్నట్టు తెలుస్తోంది. కారు ప్రమాదానికి గురైన సమయంలో ఆరుగురు ఉన్నట్టు సమాచారం. మృతులను హైదరాబాద్‌కు చెందిన వంశీగౌడ్, దినేష్, బాలు, హర్షబాబు, వినయ్‌గా గుర్తించారు. ప్రమాదం నుంచి మణికంఠ ఒక్కడే బయట పడ్డారు.
ఈ ఘటనపై చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. యువకులందరూ మద్యం సేవించినట్టు చెప్పారు. రాత్రంతా పార్టీ చేసుకుని.. కారు నడిపినట్టు తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన మణికంఠకు బ్రీత్ అనలైజర్ టెస్టు చేయగా మద్యం సేవించినట్టు వెల్లడైంది. 57 పాయింట్స్ చూపించినట్టు చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment