చిన్ననాటి స్నేహితుడిని ఇంటికి పిలిచి.. తన గొంతు కోసి ఆపై.. | - | Sakshi
Sakshi News home page

చిన్ననాటి స్నేహితుడిని ఇంటికి పిలిచి.. తన గొంతు కోసి ఆపై..

Published Mon, Oct 9 2023 1:50 AM | Last Updated on Mon, Oct 9 2023 9:14 AM

- - Sakshi

యాదాద్రి: స్నేహితుడిని ఇంటికి పిలిచి గొంతు కోసి పరారయ్యాడు ఓ యువకుడు. ఈ ఘటన నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్‌కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిల్‌కాలనీలో నివాసముంటున్న నల్లగంతుల నితిన్‌ శనివారం సాయంత్రం బుద్ధవనంలో సూర్‌వైజర్‌గా పనిచేస్తున్న తన చిన్ననాటి స్నేహితుడు పుట్టపాక విష్ణువర్ధన్‌కు ఫోన్‌ చేసి ఇంటికి రమ్మన్నాడు.

విష్ణువర్ధన్‌ వెళ్లేసరికి నితిన్‌ మద్యం, గంజాయి సేవించి మత్తులో ఉన్నాడు. తన గురించి చెడుగా ప్రచారం చేస్తున్నావంటూ విష్ణువర్ధన్‌తో నితిన్‌ వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుండగానే నితిన్‌ తన వద్ద ఉన్న బ్లేడ్‌తో విష్ణువర్ధన్‌ గొంతు కోసి పరారయ్యాడు. విష్ణువర్ధన్‌ ఇచ్చిన పిర్యాదు మేరకు నితిన్‌పై కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నట్లు విజయపురి టౌన్‌ ఎస్‌ఐ సంపత్‌గౌడ్‌ తెలిపారు. విష్ణువర్ధన్‌ను ఆస్పత్రికి తరలించగా వైద్యులు అతడి గొంతుపై 9 కుట్లు వేశారు. ప్రాణాపాయం ఏమీలేదని డాక్టర్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement