టైసన్ నడిచిందోచ్.
మన పిల్లలు తొలిసారిగా ఈ చిత్రంలోని రోస్‌మేరీ కూడా ప్రస్తుతం అలాంటి ఆనందాన్నే అనుభవిస్తోంది. చిత్రంలో కనిపిస్తోందే.. కుక్క.. అవును అది కుక్కే.. పేరు టైసన్. అదీ కూడా ఇప్పుడు చేస్తోంది తన తొలి అడుగులను వేయడమే.. అవును మరి.. టైసన్ తొలిసారిగా తన ఓనర్ తో కలసి ఇటీవల వాకింగ్‌కు వెళ్లింది.
పైగా.. అంత చిన్న కాళ్లతో నడవడానికి ఆపసోపాలు పడిపోయింది కూడా.. టైసన్‌ను చూసి.. దాన్ని తల్లి జడుసుకుని దూరం పెట్టిందట. అప్పుడు రోస్‌మేరీయే దగ్గరుండి ఆలనాపాలనా చూసింది. బ్రిటన్‌లోని కీల్ పట్టణంలో ఉండే టైసన్ ఎత్తు కేవలం 4 అంగుళాలు.. బరువు 360 గ్రాములు. ఇది బ్రిటన్‌లోనే అత్యంత చిన్న శునకం. వరల్డ్ రికార్డు జస్ట్‌లో మిస్ అయిపోయింది. ప్రపంచంలోనే అత్యంత చిన్న కుక్క ఎత్తు 3.8 అంగుళాలు.