టైసన్ గే డోపి
ఒలింపిక్ పతకం వెనక్కి
ఏడాది నిషేధం
కొలరాడో స్ప్రింగ్స్: అమెరికా అథ్లెటిక్స్‌కు మరో మచ్చ. స్ప్రింట్ స్టార్ టైసన్ గే డోపింగ్‌లో పట్టుబడ్డాడు. పోటీలు లేనప్పుడు (రాండమ్ అవుట్ ఆఫ్ కాంపిటిషన్) జరిపిన రెండు టెస్టులతో పాటు ఓ ఈవెంట్ సందర్భంగా చేసిన మరో డోప్ టెస్టులోనూ అతను నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. దీంతో అమెరికా యాంటీ డోపింగ్ అసోసియేషన్ (యూఎస్‌ఏడీఏ) అతనిపై ఏడాది పాటు నిషేధం విధించింది.
అలాగే లండన్ ఒలింపిక్స్‌లో టైసన్ గే గెలిచిన రజత పతకాన్ని యూఎస్ ఒలింపిక్ కమిటీ వెనక్కి తీసుకుంది. గతేడాది జూన్ 23న యూఎస్ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్‌షిప్ సందర్భంగా యూఎస్‌ఏడీఏ, ఐఏఏఎఫ్‌లు సంయుక్తంగా టైసన్ గే మూత్ర నమూ నాలను సేకరించాయి. ఆ చాంపియన్‌షిప్‌లోనే అతను డోపింగ్‌కు పాల్పడినట్లుగా గుర్తించి నిషేధాన్ని అప్పట్నుంచే అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.