mahashiva rathri
-
వేయిస్తంభాల గుడికి తండోప తండాలుగా భక్తులు
-
శివోహం.. గోదావరి తీరానికి పోటెత్తిన భక్తులు
-
కీసరగుట్టలో మహా శివరాత్రి వేడుకలు
-
ఇక్కడ శివలింగాన్ని ఏర్పాటు- చేసిన శ్రీరామచంద్రమూర్తి
-
విశాఖలో టి. సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు
-
హన్మకొండలో మహా రుద్రాభిషేకం
-
మహాశివరాత్రి.. సీతానగరం ఘాట్‌లో భక్తుల రద్దీ (ఫొటోలు)
-
విష్ణువుకేమో ఆదిస్థానం.. శివభక్తులకు ఎంతో ప్రత్యేకం
మహాశివరాత్రి.. పరమ శివుడికి ఎంతో ప్రత్యేకం. భక్తులు పగలు పూజలతో ఉపవాసాలతో.. రాత్రంతా జాగారం చేస్తూ ఆ భోళాశంకరుడిని ఉపాసిస్తారు. ఈ పవిత్ర దినాన ఆ లయకారుడు తాండవం ప్రదర్శిస్తాడని ప్రశస్తి. అదే విధంగా.. శివపార్వతుల వివాహ సందర్భమే మహాశివరాత్రిగా చెప్తుంటారు. ఈ సందర్భంగా ఓ ఆలయం గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. ఆదిదంపతుల్లాగా అన్యోన్యంగా ఉండాలంటే ఈ ఆలయాన్ని తప్పక దర్శించాలంటారు!. త్రియుగీ నారాయణ్ ఆలయం. ఇది విష్ణుమూర్తికి చెందిన అత్యంత ప్రాచీనాలయం. పౌరాణికంగానూ ఈ ఆలయానికి ప్రశస్తి ఉంది. వైష్ణవుల ప్రకారం త్రియుగీ నారాయణ్ విష్ణువు ఆదిస్థానం, నిత్య నివాసస్థానం. కానీ.. శైవులు ఈ ఆలయాన్ని, ప్రాంతాన్ని పుణ్యస్థలిగా భావిస్తారు. ఎందుకంటే.. శివపార్వతుల వివాహం జరిగిన వేదికగా ఈ ప్రాంతానికి పురాణాల్లో పేరుంది. పైగా ఈ వివాహ వేడుకకు బ్రహ్మవిష్ణులే సాక్షులుగా వ్యవహరించారని చెప్తుంటారు. పురాతనమయిన పవిత్ర స్థలము త్రియుగీ నారాయణ్ గ్రామం. పార్వతి పరమేశ్వరుల వివాహస్దలంగా భక్తులు నమ్ముతారు. ఈ ఆలయంలోపల రెండు అడుగుల ఎత్తు ఉన్న శ్రీలక్ష్మినారాయణుల మూర్తులు ఉన్నాయి. ఎదురుగా హోమగుండం ఉంటుంది. ఆ గుండం శివపార్వతుల వివాహం నుంచి మూడు యుగాలుగా(సత్య, త్రేతా, ద్వాపర యుగాలు.. ఇప్పుడు కలి యుగం) అలా వెలుగుతూనే ఉన్నదని చెప్తుంటారు. అందుకే ఈ ఆలయానికి అఖండ ధూని(నిరంతరం వెలుగుతూ ఉంటుందని ) ఆలయం అనే మరో పేరు కూడా ఉంది. ఇక హోమం కోసం ప్రత్యేకంగా అక్కడొక మనిషి ఉంటాడు. ఒక దుంగ కాలిన తరువాత మరొక దుంగను వేస్తూ మంటను ఆరకుండా చూస్తుంటారు. అక్కడికి వచ్చే భక్తులు కూడా హోమకుండంలో తలొక కర్రముక్క వేస్తారు. అందులోని విభూతిని అతి పవిత్రమైనదిగా భావిస్తారు. దాంపత్యం సజావుగా సాగుతుందనే నమ్మకంతో ఆ విభూతిని తమ వెంట తీసుకెళ్తారు కూడా. మూడు యుగాలు దాటినా ఆ హోమం వెలుగుతూనే ఉండడం.. అందుకు శ్రీమన్నారాయణుడే సాక్షిగా ఉండడంతో ఈ ఆలయానికి త్రియుగి నారాయణ్ అనే పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది. ఇక.. త్రియుగి నారాయణ్ ఆలయం, కేదార్నాథ్ నిర్మాణశైలిని పోలి ఉంటుంది. ఆలయం ఎదురుగా బ్రహ్మ శిల వద్ద సత్య యుగంలో శివపార్వతుల వివాహం జరిగింది అని స్దలపురాణం. బయట ఒక చిన్నమందిరం ఉంది. నాలుగు మూలలా రాతి స్తంభాలు, రాతి పైకప్పుమాత్రం ఉండి, మందిరం మధ్యలో నేలమీద నుంచి కొద్దిగా ఎత్తులో ఒక రాతిపలక పానవట్టంలాగ ఉండి మధ్యలో ఒక చిన్న శివలింగం కనిపిస్తుంది. ఆలయం బయట ప్రాంగణములో రుద్ర, విష్ణు, బ్రహ్మ కుండములు ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలో సరస్వతీ కుండము.. చుట్టుపక్కల ఉన్న మూడు కుండములను నింపుతుంది. అయితే ఇది విష్ణువు నాభి నుంచి పుట్టిందని చెప్తుంటారు. శివపార్వతుల వివాహానికి ముందు దేవతలందరూ రుద్ర, విష్ణు, బ్రహ్మ కుండములలో స్నానం ఆచరించారనేది స్థల పురాణం. ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ జిల్లా త్రియుగీ నారాయణ్ గ్రామంలో ఉంది ఈ ఆలయం. వేసవి కాలంలో ఈ ప్రాంతం సందర్శనానికి అనుకూలం. దీనిని ఆదిశంకరాచార్యులు నిర్మించారని నమ్ముతారు. ఉత్తరాఖండ్ ప్రాంతంలో అనేక దేవాలయాలను నిర్మించిన ఘనత ఆదిశంకరాచార్యులదే. పురాణేతిహాస సాహిత్యంలో సతి, పార్వతి గురించిన కథలు ఉన్నాయి. దక్షుని కుమార్తె అయిన 'సతీదేవి' (దాక్షాయణి) శివునికి ఇల్లాలు. కాని దక్షయజ్ఞంలో తనకు, శివునికి జరిగిన అవమానానికి క్షోభించి ఆమె అగ్నిలో ఆహుతి అయ్యింది. తరువాత ఆమె హిమవంతుడు, మేనకల కుమార్తెగా జన్మించింది. పర్వత రాజ తనయ గనుక 'పార్వతి' అని ఆమె పిలువబడింది. మొదట ఆమె తన మేని వర్చస్సుతో పరమశివుడ్ని ఆకట్టుకునే యత్నం చేసింది. ఫలితం లేదు. ఆపై మనస్ఫూర్తిగా గౌరీ కుండ్ వద్ద కఠోరమైన తపసు ఆచరించి శివుని వరించింది. ఈ తపస్సు వల్లే ఆమెకు ఉమ, అపర్ణ అనే పేర్లు వచ్చాయి. ఆపై ఆమె తపస్సుకి మెచ్చి శివుడు.. గుప్తకాశీ వద్ద పార్వతీదేవిని వివాహం చేసుకోవాలని కోరినట్లు పురాణంలో ఉంది. ఆమెను తన శరీరంలో సగంగా స్వీకరించి అర్థనారీశ్వరుడు అయ్యాడు. గౌరీ కుండ్.. త్రియుగీ నారాయణ్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. త్రియుగీ నారాయణ్‌కు వెళ్లే భక్తులు గౌరీ కండ్లో ఉన్న పార్వతీ ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. కేదార్నాథ్ ఆలయానికి ఇది బేస్ క్యాంప్‌గా ఉంటుంది. త్రియుగీ నారాయణ్ గ్రామం వద్ద మందాకినీ- సోన్గంగా నదులు సంగమిస్తాయి. ఇది హిమంతుడి రాజధానిగా చెప్తారు. పార్వతీ దేవికి సోదరుడిగా విష్ణువు వ్యవహరించగా, బ్రహ్మ ఆ వివాహాన్ని జరిపించాడని స్థల పురాణంలో ఉంది. -
కీసరగుట్టకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
మాడుగుల నాగఫణి శర్మతో మహాశివరాత్రి ప్రత్యేక కార్యక్రమం
-
11 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
సాక్షి, శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. భూకైలాసంగా ప్రసిద్ధి చెందిన ఈ దివ్యక్షేత్రంలో 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిపేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 11న ప్రత్యేక పూజలతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. సాయంత్రం అంకురార్పణ అనంతరం శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 12న స్వామి, అమ్మవార్లకు భృంగి వాహనసేవ, 13న హంస వాహన సేవ, దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ, 14న మయూర వాహన సేవ, టీటీడీ తరఫున పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుంది. అలాగే 15న రావణ వాహనసేవ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ, 16న పుష్పపల్లకి సేవ, 17న గజ వాహనసేవ, 18న మహాశివరాత్రి సాయంత్రం ప్రభోత్సవం, రాత్రి ఏడు గంటలకు నందివాహన సేవ, రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, రాత్రి 12 గంటలకు స్వామి, అమ్మవార్లకు కళ్యాణోత్సవం జరుగుతుంది. 19న సాయంత్రం స్వామి, అమ్మవార్ల రథోత్సవం, తెప్పోత్సవం, 20న పూర్ణాహుతి, రాత్రి ఏడు గంటలకు ధ్వజావరోహణ, 21న అశ్వవాహన సేవ, రాత్రి ఎనిమిది గంటలకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ నిర్వహిస్తారు. (చదవండి: చాంతాడంతా చలానాలు పెండింగ్..మూడు రోజుల్లో రూ. 25 కోట్లు వసూళ్లు) -
శంభో..శివ శంభో!
శ్రీశైలం టెంపుల్: ఇలకైలాసమైన శ్రీశైలం శ్రీగిరిపై వేంచేసి ఉన్న భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సన్నద్ధమైంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శ్రీగిరికి ప్రత్యేక స్థానం. ఇక్కడ మల్లన్నకు జరిగే విశిష్ట సేవలు మరెక్కడా జరగవు. వాటిలో మల్లన్న పాగాలంకరణ ఒకటి. మహా శివరాత్రి పర్వదినాన లింగోద్భవ కాలంలో జరిగే ఈ సేవ అత్యంత విశిష్టమైనది. మంగళవారం మహా శివరాత్రి పర్వదినం కావడంతో పాగాలంకరణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం జాండ్రపేట హస్తినాపురం గ్రామానికి చెందిన చేనేత కుటుంబం వంశపారంపర్యంగా మల్లన్నకు తలపాగాను తయారు చేస్తుంది. ఆ గ్రామానికి చెందిన పృధ్వి వెంకటేశ్వర్లు ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు వెంకట సుబ్బారావు తండ్రికి సహకరిస్తున్నారు. స్వామివారికి దిక్కులే వస్త్రాలు. అందుకే పాగాలంకరణ సేవ చేసేవారు దిగంబరంగానే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఆ సమయంలో ఆలయం, పరిసరాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. పాగాలంకరణ పూర్తయ్యాక విద్యుత్ వెలుగులు నింపుతారు. పాగాలంకరుడైన మల్లన్నను చూసేందుకు భక్తుల రెండు కళ్లు చాలవు. అనంతరం రాత్రి 12 గంటలకు భ్రమరాంబ, మల్లికార్జునుడికి బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహిస్తారు. వైభవంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు శ్రీగిరిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 22న ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు విశేష వాహన సేవ నిర్వహిస్తున్నారు. మంగళవారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మల్లన్నను దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ‘శంభో.. శివ శంభో’అని స్వామివారిని కీర్తిస్తూ శ్రీగిరి చేరుకుంటున్నారు. పలువురు శివమాలను ధరించి వస్తున్నారు. నల్లమల కొండల్లో పాదయాత్ర చేసుకుంటూ వేలాది మంది శ్రీగిరికి చేరుకుంటున్నారు. గజ వాహనంపై మల్లన్న దరహాసం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు సోమవారం భ్రమరాంబా సమేతుడైన మల్లన్న గజవాహనంపై విహరించాడు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను గజవాహనంపై ఆశీనులను చేసి ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, వేద పండితులు వేదమంత్రోచ్ఛరణల నడుమ ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం గజవాహనాధీశులైన స్వామి, అమ్మవార్లను ఆలయ ప్రదక్షిణ చేయించి క్షేత్రప్రధాన వీధుల్లోకి తోడ్కొని వచ్చి గ్రామోత్సవానికి తరలించారు. కళాకారుల కోలాహలం నడుమ గ్రామోత్సవం వైభవంగా సాగింది. స్వామి అమ్మవార్లను భక్తులు కన్నులారా దర్శించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులకు ఏ లోటు లేకుండా ఏర్పాట్లు శ్రీశైల మహా క్షేత్రంలో జరుగుతున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా తరలివస్తున్న భక్తులకు ఏ లోటు రానివ్వకుండా దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తున్నాం. భక్తులందరికీ స్వామి వారి అలంకార దర్శనాన్ని కల్పించాం. క్యూలో వేచి ఉన్న భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాం. – ఎస్.లవన్న, ఈవో, శ్రీశైల దేవస్థానం -
శివతత్త్వం: నిత్యం.. సత్యం.. అనంతం
పరమశివుడు అర్ధనారీశ్వరుడు. ఆదిభిక్షువు. భక్త వత్సలుడు. బోళాశంకరుడు. నిర్వికారుడు, నిరాకారుడు, నిరాడంబరుడు. ఇన్ని వేదాంత లక్షణాలున్న ఈశ్వరుడు ఏ శివక్షేత్రంలో చూసినా లింగాకారంలోనే కనపడతాడు కాని శరీరాకృతిలో దర్శనమివ్వడు. అదెలాగంటే ఒక వృత్తం తన ఆకారంలో చాలా గొప్పది. అది అనంతమైన మోతాదులో పెరుగుతూ వెళ్లినా దాని కేంద్రం ఒక్కటే. పరిపూర్ణ తత్త్వమనేది ఒక గోళానికి చెందింది. పరిపూర్ణమైన దానిలోని భాగాలన్నీ పరిపూర్ణాలే అని తెలుసుకోగలగడమే ఆధ్యాత్మిక సాధన! అందుకే పౌరాణికవేత్తలు సృష్టి యావత్తూ శివలింగమేనంటారు. అన్ని స్పందనలూ, చేతనలూ ఈశ్వరుడిలోనే, ఈశ్వరుడి వల్లనే అంటారు! అందుకే అటు అనంతం ఇటు అనంతం, òపైన అనంతం, కింద అనంతం చుట్టూ తిరిగి చూస్తే సర్వం లింగాకారమే... అదే శివతత్త్వం. మహేశ్వరుని వంటి నిరాడంబరుడు మనకెక్కడా దర్శనమివ్వడు. గజచర్మం కట్టుకుంటాడు. చేతిలో కపాలం పట్టుకుని బిచ్చమెత్తుకుంటాడు. కాష్టాలవాడలో కాపురముంటాడు. విషపు నాగులను మెడనిండా మాలలుగా ధరిస్తాడు. రుద్రాక్షపూసల్ని వంటినిండా అలంకరించుకుంటాడు. ఆయన సిగలో చంద్రుడున్నాడని గొప్పలు పోదామంటే అదీ కుదరదు. ఆ శిరస్సున ఉండే చంద్రుడు వెన్నెల సోనలు కురిపించే నిండు చందురుడేమీ కాదు. సన్నని చంద్రరేఖ. పోనీ, సరైన వాహనమైనా ఉందా అంటే లేదు. ముసలి ఎద్దునెక్కి ఊరేగుతాడు. ఆయనని సేవించే పరిజనం ఏమైనా పెద్దవాళ్లా అంటే ప్రమద గణాలు, భూతగణాలే. అయితేనేం, వారితోనే ఆయన జగత్ ప్రసిద్ధుడయ్యాడు. మహా విరాగి ఎంత పేదవారయినా సరే, పెళ్లికి పట్టుబట్టలు కట్టుకుంటారు, వంటికి చందనాలు అద్దుకుంటారు. సుగంధ పరిమళాలతో కూడిన పూదండలను అలంకరించుకుంటారు. వేగంగా సంచరించే పక్షినో, జంతువునో వాహనంగా చేసుకుంటారు. పెళ్లికి అందరూ రాగలిగేందుకు అనువైన ముహూర్తాన్ని చూసి పగలు లేదా సాయంత్రం పెళ్లి పెట్టుకుంటారు. కానీ, పరమ విరాగి అయిన శివుడేమో పెళ్లికి కూడా గజచర్మమే కట్టుకు తిరుగుతాడు. ముసలి ఎద్దునెక్కి వూరేగుతాడు. ఏ వాసనా లేని తుమ్మిపూలు చాలంటాడు. బూడిద పూసుకు తిరుగుతాడు. ఒక విందూ లేదూ, వినోదమూ లేదు. తన భక్తులు తనకు నవకాయ పిండివంటలు వండి నివేదించనక్కరలేదు. కటిక ఉపవాసముంటే చాలంటాడు. తనకోసం ఒక పూట మేలుకుని ఉంటే మంచిదంటాడు. ప్రతి చర్యలోనూ అంతులేనంతటి అంతరార్థం శివుణ్ణి దిగంబరుడంటారు. దిగంబరుడంటే దిక్కులే వస్త్రాలుగా కలిగినవాడని అర్థం. అందుకే ఆయన సర్వాంతర్యామి అయ్యాడు. లోకంలో ప్రతివారు కీడును పోగొట్టుకోవడానికి, సంపదలు పొందడానికి మంగళకర ద్రవ్యాలైన సుగంధ చందనాదులను ధరిస్తారు. ఇవి మళ్లీ కోరికలు పుట్టిస్తాయి. కోరికలు లేనివాడయిన శివునికి వీటితో పనిలేదు. అందుకే అన్నింటికీ దూరంగా ఉంటాడు. భాగ్యవంతుడు కాకున్నా కోరిన వారికి సకల సంపదలను ప్రసాదిస్తాడు. సంచరించేది శ్మశానంలోనే అయినా, లోకాన్నిటినీ శాసించగలడు. తనకే సంపదలూ లేకపోతేనేం, ఆయన అనుగ్రహమే గొప్ప సంపద. అంటే మనకు ఏమీ లేకపోయినా, అవతలి వారికి ఇవ్వాలన్న మనసు ఉంటే చాలనీ, పైపై ఆడంబరాలు లేకున్నా, గొప్ప కార్యాలు సాధించడానికి అదేమీ అడ్డం కాదన్నది ఆయన రూపంలోని, చర్యలలోని అంతరార్థంగా భావించాలి. అర్ధనారీశ్వరత్వం శివుడెలా ఉంటాడో, ఆయన భార్య పార్వతి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఆయన గజచర్మమే చుట్టుకున్నా, ఆవిడ మాత్రం పట్టుబట్టలు కట్టుకుంటుంది. ఒంటినిండా నగలు ధరిస్తుంది. çశరీరానికి చందనం అద్దుకుంటుంది. సింహాన్ని వాహనంగా చేసుకుని నవరత్న ఖచిత సింహాసనంపై ఆసీనురాలవుతుంది. తనకు లేవు కదా అని ఆయన తన దేవేరి అయిన పార్వతిని పట్టుబట్టలు కట్టుకోవద్దనలేదు. ఆభరణాలు ధరించవద్దని కానీ, అలంకారాలు చేసుకోవద్దని కానీ శాసించలేదు. ఆమెను ఆమెగా ప్రేమించాడు. తన శరీరంలో సగభాగాన్ని ఆమెకు ఇచ్చేశాడు. శివతత్త్వాన్ని అలవాటు చేసుకోవడమంటే నిరాడంబర జీవితాన్ని ఎంచుకోవడమేనని వేదాంతులు, పండితులు చెబుతారు. ఎందుకంటే అది అనుభవంలోకి వస్తే తప్ప అర్థం కాదు. శివుడంటే ఒక వ్యక్తా? అతనికి ఒక ఆకారం ఉన్నదా? ఎక్కడో ఫలానా ప్రదేశంలో కూర్చుని ఉన్నవాడా? కాదు. సమస్త విశ్వమూ శివుడే. దేనిలో నుంచి అంతా వచ్చిందో, దేనిలో అంతా జీవిస్తున్నదో, తిరిగి దేనిలోనికి అంతా లయమైపోతున్నదో అదే శివతత్వం. దీని నుంచి బయటకు వెళ్లడానికి వీలుకాదు. ఎందుకంటే సృష్టి అంతా శివుడే. ఆయన విశ్వరూపుడు. అదే సమయంలో ఆయన రూపం లేనివాడు, నిరాకారుడు. ఒకవైపు రుద్రమూర్తి. మరోవైపు బోళాశంకరుడు. సుందరేశుడు ఆయన. సౌందర్యానికి అధిపతీ ఆయనే. అదే సమయంలో భయంకరమైన అఘోర రూపం కూడా ఆయనదే. ఆనంద తాండవంలో చైతన్య శీలతనూ, ధ్యానంలోని స్థిరత్వాన్నీ, చీకటినీ, వెలుగు నూ, అమాయకత్వాన్నీ, తార్కికబుద్ధినీ, దయాగుణాన్నీ.. అన్నింటినీ కలగలిపి ఒక్కటిగా పంచేదే శివతత్త్వం. ఇది ఒక లీల. విశ్వచైతన్యపు ప్రదర్శన. ఎలాగైతే నాట్యమూ, నాట్యకారుడూ విడివిడి గా ఉండలేరో.. అలాగే సృష్టి, సృష్టికర్త వేర్వేరు విషయాలు కావు. ఈ సత్యమే నటరాజ స్వరూపంలో కనిపిస్తుంది. ఈ రూపంలో పంచభూతాలు గోచరిస్తాయి. నటరాజు స్వయంగా చైతన్య స్వరూపం. ఆయన ఆనంద నర్తనమే ఈ విశ్వం. ఆ సత్యమే శివతత్త్వం. అది తెలుసుకుని ఆ ఆనందాన్ని అనుభవించగలిగే పర్వదినమే మహా శివరాత్రి. భక్తులు ఉపవాస జాగరణలు చేసేది ఆ అలౌకిక ఆనందాన్ని ఆస్వాదించేందుకే! మృత్యుంజయం అత్యంత పవిత్రమైన మంత్రాలలో శివుని మృత్యుంజయ మంత్రం ఒకటి. మృత్యుంజయ అంటే చావుపై గెలుపు. ఆత్మకు చావు లేదు. అది ఒక శరీరం నుంచి మరొక శరీరానికి ప్రయాణిస్తుంది. మృత్యుంజయత్వం అంటే ఈ అశాశ్వతమైన జీవనంపై గెలిచి, మనసు శాశ్వతత్వానికి చేరుకోవడం. నేను శాశ్వతం, ఎన్నటికీ మార్పు చెందనిదేదో అది నాలో ఉన్నదని మనసు గ్రహిస్తుంది. అప్పుడు భయం ఉండదు. భయం అనేది మృత్యువుకు గల సంకేతాలలో ఒకటి. భయాన్ని జయించినపుడు ఈ అశాశ్వతమైన విషయాలను గుర్తుంచుకోవడం మానేసి, ఎన్నటికీ నాశనం కాని దానికోసం కదులుతాం. మనం ఈ రెండింటి కలయికగా ఉన్నాం. ఆత్మ... నాశనం లేనిది. శరీరం నశించిపోయేది. చాలాసార్లు మన మనసు శరీరానికి అంటిపెట్టుకుని తాను చనిపోతున్నానని భావిస్తూ ఉంటుంది. మనసును ఈ పరిమితమైన గుర్తింపు నుంచి అపరిమితమైన విశ్వవ్యాప్తమైన గుర్తింపు దిశగా మృత్యుంజయ మంత్రం తీసుకెళ్తుంది. ఈ మంత్రంలో ఒక ప్రార్థన ఉంది. ఆకాశమే కేశాలుగా గల అమిత బలవంతుడైన శివుడు మనల్ని బలవంతునిగా చేయుగాక. ఏ బంధాలూ లేని ఆ పరమ శివుడు మనల్ని అన్ని బంధాల నుంచి విముక్తుణ్ని చేయుగాక అని అంతరార్థం. మారేడుతో ఎందుకు పూజిస్తారు? మహాశివుడికి మారేడు దళాలంటే మహా ఇష్టం. అందుకే మారేడును ‘శివేష్ట’ అని అంటారు. మారేడు ను బిల్వం అని కూడా అంటారు. బిల్వం అంటే శ్రీఫలం. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఫలాలను ఇచ్చేదనీ, సిరిని తెచ్చే ఫలం కలది అని అర్థం. మారేడు మంగళకరమైనది. మారేడు పత్రాలు త్రిశిఖలా ఉంటాయి. మూడు ఆకులతో ఉన్నందున త్రిశూలానికి సంకేతంగా భావిస్తారు. బిల్వపత్రాలతో పూజించడం వెనుక శాస్త్రీయత దాగి ఉంది. గాలిని, నీటిని శుభ్రపరచడంలో మారేడు ఆకులను మించినవి లేవు. ఈ చెట్టు గాలి శరీరానికి సోకినా, ఈ గాలిని పీల్చినా జబ్బులు రావు. బాహ్య, అంతర కణాలను శుద్ధి చేసి, శరీరాన్ని శ్రేష్ఠంగా ఉంచుతుంది. దేవాలయం గర్భగుడిలో గాలి సోకదు, సూర్యకిరణాలు ప్రసరించవు కనుక స్వచ్ఛత కోల్పోయే అవకాశం వుంది. అలాంటి వాతావరణంలో మారేడు ఆకులు స్వచ్ఛతను కలుగచేస్తాయి. అది మారేడు విశిష్టత. సూర్యుడిలో ఉండే తేజస్సు మారేడులో ఉంటుంది. శరీరం లోపలి భాగాల్లో, బయట వాతావరణంలో ఎక్కడ చెడు ప్రభావం ఉన్నా, దాన్ని హరిÜ్తుంది. మారేడు వల్ల తన భక్తులకు ఇన్ని ప్రయోజనాలున్నాయి కనుకనే మారేడంటే శివుడికి మహా ఇష్టం కా కాబోలు. -
మెగా అభిమానులకు సర్ప్రైజ్.. శివరాత్రికి గుడ్ న్యూస్
Chiranjeevi Bhola Shankar First Look Release On 1 March: మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్లో వస్తోన్న మాస్సివ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'భోళా శంకర్'. తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'వేదాళం' సినిమాకు రీమెక్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. చిరంజీవి 155వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్నా హీరోయిన్గా చేస్తున్న 'భోళా శంకర్' మూవీలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇదివరకూ ఈ సినిమా నుంచి విడుదలైన ప్రీ లుక్కు అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఈ శివరాత్రికి మెగా అభిమానులకు చిత్రబృందం కానుక ఇవ్వనుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మార్చి 1న ఉదయం 9:05 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. శివుడికి మరొక పేరు అయిన శంకర్ టైటిల్ పాత్రలో చిరంజీవి నటిస్తున్నందున ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసేందుకు ఇదే మంచి సమయమని మేకర్స్ భావించినట్లు తెలుస్తోంది. This Maha Shivarathri 🙏 Get ready for the MEGA VIBE of #Bholaa⚡️ MEGA🌟@KChiruTweets #BholaaShankarFirstLook on March 1st @ 9:05 AM 🤘#BholaaShankar 🔱 @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @AKentsOfficial @BholaaShankar#MegaEuphoria ✨ pic.twitter.com/L9cpYB5PUd — Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) February 27, 2022 -
కొత్త సినిమాలపై ఓ లుక్కేద్దాం!
పండగ అంటే చాలు.. సినిమాల అప్డేట్స్ కోసం ఎదురు చూస్తుంటారు సినీ లవర్స్. మహాశివరాత్రి సినీ అభిమానులను సంతోషపెట్టింది. వెంకటేశ్‌ని యంగ్ లుక్‌లో చూపెట్టింది. ప్రేయసితో కలసి ప్రత్యక్షమయ్యారు ప్రభాస్. గోపీచంద్‌తో కలిసి తమన్నా సీటీ కొట్టారు. ‘హరిహర వీరమల్లు’ అన్నారు పవన్ కల్యాణ్. ఇంకా కొత్త పోస్టర్లు పండగకి విడుదలయ్యాయి. కొత్త లుక్స్‌పై లుక్కేద్దాం. వెంకటేశ్ యువకుడిగాను, వృద్ధుడిగానూ కనిపించనున్న చిత్రం ‘నారప్ప’. తమిళ ‘అసురన్’కి రీమేక్‌గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే వృద్ధ లుక్ విడుదల కాగా పండగకు యంగ్ లుక్‌ని విడుదల చేశారు. డి. సురేష్‌బాబు, కలైపులి యస్. థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకీ సోలోగా వస్తే ప్రభాస్ తన ప్రేయసి పూజా హెగ్డేతో వచ్చారు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాధేశ్యామ్’లో ప్రభాస్, పూజా జంటగా నటిస్తున్నారు. వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 30న విడుదల కానుంది. ఇక శివరాత్రి సందర్భంగా ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్‌తో వచ్చారు పవన్ కల్యాణ్. క్రిష్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న తాజా చిత్రానికి ఈ టైటిల్ ఖరారు చేసి, లుక్‌ని విడుదల చేశారు. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో ఏయం రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. గోపీచంద్, తమన్నా సీటీ కొడుతూ సందడి చేశారు. ఈ ఇద్దరూ జంటగా సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ‘సీటీమార్’లోని తాజా ఫొటో విడుదలైంది. ‘అన్నం’.. పరబ్రహ్మ స్వరూపం అంటున్నారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. అరిటాకులో ‘అన్నం’ అనే అక్షరాలు, పక్కనే వేట కొడవలితో పోస్టర్ని విడుదల చేశారు. శివరాత్రి శివుడి పండగ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన పేరునే టైటిల్‌గా చేసుకుని ‘శివుడు’ అంటూ వచ్చారు ఆది పినిశెట్టి. సుశీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం లుక్ విడుదలైంది. దర్శకుడు రవిరాజా పినిశెట్టి సమర్పణలో ఈ చిత్రాన్ని సత్యప్రభాస్ నిర్మిస్తున్నారు. భారీ చిత్రాలు నిర్మించే యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా నిర్మాణంలో మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఏక్ మినీ కథ’. సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం టీజర్ విడుదలైంది. పవన్ తేజ, సూర్య శ్రీనివాస్, రూపిక ముఖ్య తారలుగా కుంచమ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఛిల్ బ్రో’ లుక్ వచ్చింది. ఇంకా పలు చిత్రాల లుక్స్ రిలీజయ్యాయి. -
మహాశివరాత్రికి ముస్తాబైన వేములవాడ
-
మహా శివరాత్రికి శివలింగాపురం
ఆర్.కె. సురేష్, మధుబాల జంటగా తోట కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శివలింగాపురం’. రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై రావూరి వెంకట స్వామి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రావూరి వెంకట స్వామి మాట్లాడుతూ– ‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ భక్తిరస చిత్రమిది. శివలింగాపురం అనే గ్రామంలో అత్యంత మహిమగల శివలింగం దొంగలించబడుతుంది. ఆ శివలింగాన్ని విద్రోహుల చెర నుంచి ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి హీరో ఎలా రక్షించాడు? అనే కథని తోట కృష్ణ చక్కగా తెరకెక్కించారు. సెన్సార్ పూర్తి చేసుకున్న మా సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో మహా శివరాత్రి పర్వదినాన విడుదల చేస్తున్నాం’’ అన్నారు. డీఎస్ రావు, బేబీ హర్షిత తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఘన శ్యామ్. -
శ్రీశైలంలో ఘనంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
-
తెలుగురాష్ట్రాల్లో వైభవంగా శివరాత్రి శోభ
-
శివనామస్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు
-
ముగిసిన మహాశివరాత్రి ఉత్సవ యాగాలు
శ్రీశైలం: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 10 నుంచి నవాహ్నిక దీక్షతో ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవ యాగాలు గురువారం పూర్ణాహుతితో ముగిశాయి. తొమ్మిది రోజులపాటు స్వామిఅమ్మవార్లకు జరిగిన నిత్యహోమబలిహరణలు, జపానుష్థానములు, స్వామివార్లకు విశేషార్చనలు, అమ్మవారికి నవావరణార్చనలు తదితర పూజలకు ముగింపుగా రుద్ర,చండీహోమాలకు పూర్ణాహుతి జరిగింది. ఉదయం ప్రత్యేకపూజలను నిర్వహించిన అనంతరం 10.45 గంటలకు పూర్ణాహతిని నిర్వహించారు ఈఓ సాగర్‌బాబు, అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా పూర్ణాహుతి ద్రవ్యాలకు ప్రత్యేకపూజలను చేశారు. పూర్ణాహుతి ద్రవ్యాలైన నారికేళాలు, పలు సుగంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు మొదలైన పూర్ణాహుతి ద్రవ్యాలను హోమగుండానికి సమర్పించారు. కార్యక్రమం ముగిశాక, వసంతోత్సవంలో భాగంగా ఆలయ అర్చకులు, వేదపండితులు పూర్ణాహుతిలో పాల్గొన్న వారందరిపై వసంతాన్ని (పసుపు,సున్నం కలిపిన మంత్రపూరిత జలం) సమంత్రకంగా భక్తులతో ప్రొక్షించారు. అనంతరం ఉత్సవనిర్వాహకుడైన చండీశ్వరుని పల్లకీలో ఊరేగిస్తూ ఆలయప్రదక్షిణ చేయించి మల్లికా గుండం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ఆ స్వామికి విశేషపూజలను నిర్వహించారు. చండీశ్వరునికి వేదమంత్రోచ్ఛారణల మధ్య త్రిశూల స్నానం చేయించారు. వైష్ణవాచారంలో దీనినే చక్రస్నాన ం అంటారని, శైవసంబంధమైన క్షేత్రాలలో త్రిశూల స్నానంగా అభివర్ణిస్తారని వేదపండితులు తెలిపారు. ఉత్సవాల ముగింపు సూచనగా ధ్వజావరోహణ: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 10న ప్రారంభంగా కాగా ఉత్సవాల ఆరంభ సూచనగా ఈ నెల 10న సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ చేశారు. గురువారం ఉత్సవాలు ముగియడంతో ఉదయం పూర్ణాహుతిని నిర్వహించి అదేరోజు సాయంత్రం 7గంటల నుంచి ధ్వజావరోహణ కార్యక్రమ పూజలను నిర్వహించి ధ్వజపటాన్ని ధ్వజస్తంభం నుంచి శాస్త్రోక్తంగా వేదమంత్రోచ్ఛరణల మధ్య కిందకు దించారు. శుక్రవారం రాత్రి శివరాత్రి రోజున వధూవరులైన స్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవ, శయనోత్సవ, ఏకాంతసేవలను నిర్వహిస్తామని ఈఓ సాగర్‌బాబు తెలిపారు. -
మార్మోగిన శివనామస్మరణ
వేములవాడ, న్యూస్‌లైన్ : వేములవాడ శ్రీరాజేశ్వరస్వామి క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు గురువారం అంత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా తలనీలాలు సమర్పించిన భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలాచరించి మొక్కులు చెల్లించుకున్నారు. వేలాదిమంది శివదీక్షాపరులు శివనామస్మరణ చేస్తూ ఇరుముడులతో తరలివచ్చి దీక్షలు విరమించారు. రద్దీ అధికంగా ఉండడంతో నిత్య, నిశీ, ఆర్జిత పూజలను రద్దుచేసి లఘుదర్శనం కల్పించారు. సాయంత్రం 6.30 గంటలకు మహాలింగార్చన మొదలై రాత్రి 9గంటల వరకు కొనసాగింది. అనంతరం రాత్రి 11.30 గంటలకు లింగోద్భవ వేడుక కన్నులపండువగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక వేకువజాము వరకు కొనసాగింది. పట్టువస్త్రాల సమర్పణ మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలను ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు సమర్పించారు. ఆలయ పాలకమండలి అథితిగృహంలో శాస్త్రోక్తంగా పట్టువస్త్రాలను శిరోధారణ చేసిన వీరు అశేషజనవాహిన మధ్యన లయానికి చేరుకుని స్వామివారికి సమర్పించారు. భక్తిప్రపత్తులతో మొక్కుల చెల్లింపు.. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లింపులు నిరంతరాయంగా సాగాయి. కోడెటికెట్ల కోసం భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్యూలైన్లలో స్పల్పంగా తోపులాట జరిగింది. పలువురు భక్తులు స్వామివారికి నిలువెత్తు బంగారం (బెల్లం) తూకం వేయించి ఆలయ ఆవరణలో పంచిపెట్టారు.తలనీలాల మొక్కులతో కల్యాణకట్ట కిక్కిరిసిపోయింది. ఇవి మినహా నిత్యపూజలన్నీ రద్దుచేయడంతో లఘుదర్శనం సాఫీగా సాగింది. దీక్షల విరమణ మండల, అర్ధమండల దీక్షలు స్వీకరించిన సుమారు ఐదువేల మంది శివస్వాములు ఓంకారనాదాలు చేస్తూ ఇరుముడులతో తరలివచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వెళ్లి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం భీమేశ్వరాలయానికి చేరుకుని దీక్షలు విరమించారు. రాజన్న సేవలో ప్రముఖులు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీరాజరాజేశ్వరస్వామి సేవలో పలువురు ప్రముఖులు తరించారు. బీజేపీ జాతీయ నాయకుడు బండారు దత్తాత్రేయ, ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఎమ్మెల్సీలు టి.సంతోష్‌కుమార్, వెంకట్రావు, కలెక్టర్ వీరబ్రహ్మయ్య దంపతులు, ఎస్పీ శివకుమార్, ఓఎస్డీ సుబ్బరాయుడు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. దత్తాత్రేయ స్వామివారికి కోడెమొక్కు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. అంచనాలు తారుమారు.. మహా జాతరకు సుమారు నాలుగు లక్షల మంది తరలివస్తారని ఆలయ వర్గాలు వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. సుమారు రెండు లక్షల మంది మాత్రమే వచ్చినట్లు అంచనా. శుక్రవారం మరో లక్షమంది భక్తులు రావచ్చునని అధికారులు భావిస్తున్నారు. మొత్తమ్మీద మహాశివరాత్రికి మూడు లక్షలు మించి జనం రాకపోవచ్చునని స్పష్టమవుతోంది. భక్తుల ఏర్పాట్లను ఉత్సవాల ప్రత్యేకాధికారి, జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఆలయ చైర్మన్ బొమ్మ వెంకటేశ్వర్లు, ఈవో సిహెచ్వీ.కృష్ణాజీరావు, ధర్మకర్తలు, అరుణ్‌తేజాచారి, సగ్గు పద్మాదేవరాజ్, ఆకునూరి బాలరాజు, సింగిరెడ్డి స్వామిరెడ్డి, గుండా చంద్రమౌళి, కుమటాల శ్రీనివాస్, బండం మల్లారెడ్డి, విజయారాజంతోపాటు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగు మనోహర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి తదితరులు పర్యవేక్షించారు. సిరిసిల్ల డీఎస్పీ దామెర నర్సయ్య నేతృత్వంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
ప్రభోత్సవం.. ప్రణవనాదం
మహాశివరాత్రి పర్వదినాన జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భక్తులతో పోటెత్తింది. ఓంకార నాదంతో శ్రీగిరి మార్మోగింది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులు మల్లన్నను దర్శించుకొని పునీతులయ్యారు. మల్లన్న ప్రభోత్సవం అత్యంత రమణీయంగా సాగింది. హరహర మహాదేవ..శంభోశంకర అంటూ భక్తులు నినదిస్తూ ఉత్సవంలో పాల్గొన్నారు. నందివాహనంపై ఆదిదంపతులు ఆలయ ప్రదక్షిణ చేశారు. అనంతరం పాగాలంకరణ, స్వామివార్ల కల్యాణాన్ని నిర్వహించారు. - న్యూస్‌లైన్, శ్రీశైలం -
ధర్మాన్ని కాపాడాలి
దామరగిద్ద, న్యూస్‌లైన్: సమాజంలో ప్రతి ఒక్క రూ అహింసను పాటించి, ధర్మాన్ని కాపాడేం దుకు ప్రయత్నించాలని శ్రీ రూపరహిత అహింసా యోగీశ్వరి వీరధర్మజమాత (మాణికేశ్వరిమాత) బోధించారు. జిల్లాసరిహద్దులోని యానగుంది సూర్యనంది క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మాత భక్తులకు దర్శనమిచ్చారు. అనారోగ్యం కారణంగా మాత వాహనంలో కూర్చున్న చోటు నుంచే భక్తులకు దర్శనమించారు. ఈ సందర్భంగా మాత సందేశాన్ని ట్రస్టు నిర్వాహకులు చదివి విని పించారు. సాటి జీవులపట్ల ప్రేమ, దయ కలిగి ఉండాలని, గోవధను నిషేధించా, అహింసా మార్గంలో నడవాలని సూ చించారు. నీతి నియమాలతో జీవితాన్ని సాగిస్తూ ఆధ్యాత్మిక చింతనతో ధర్మ మార్గాన్ని అనుసరిస్తూలోక కల్యాణం కోసం కృషి చేయాలన్నారు. అంతకుముందు ట్రస్టు ఆధ్వర్యంలో వేధమంత్రోచ్చరణల మధ్య అమ్మవారికి గురుపాదపూజ, ఏకరుద్ర భిషేకం నిర్వహించారు. కర్ణాటక, మహా రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి మాత దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మాత ప్రత్యేక వాహనంలోనే కూర్చొని ఉండటం వల్ల చాలామంది భక్తులకు దర్శనం స్పష్టంగా కలగలేదు. కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర మంత్రి మల్కిరెడ్డి, మాణికేశ్వరి ట్రస్టు కార్యదర్శి శివయ్యస్వామి, సభ్యులు ఏవీ మందార్ సిద్రామప్ప, జగ్జీవన్రెడ్డి, బీజేపీ నేత నాగూరావ్ నామాజీ, ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక్ అమరలింగన్న, అనుపూర్ మొగులాలి, యాదవరావు, తదితరులు పాల్గొన్నారు.