Chiranjeevi Bhola Shankar: First Look Release This Mahashivaratri On 1 March Deets Inside - Sakshi
Sakshi News home page

Chiranjeevi Bhola Shankar: మెగా అభిమానులకు సర్​ప్రైజ్​.. శివరాత్రికి గుడ్​ న్యూస్​

Published Sun, Feb 27 2022 4:18 PM | Last Updated on Sun, Feb 27 2022 5:04 PM

Chiranjeevi Bhola Shankar First Look Release On 1 March - Sakshi

Chiranjeevi Bhola Shankar First Look Release On 1 March: మెగాస్టార్​ చిరంజీవి, మెహర్​ రమేష్​ కాంబినేషన్​లో వస్తోన్న మాస్సివ్ యాక్షన్​ థ్రిల్లర్​​ మూవీ 'భోళా శంకర్'​. తమిళ స్టార్​ హీరో అజిత్​ నటించిన సూపర్​ హిట్​ చిత్రం 'వేదాళం' సినిమాకు రీమెక్​గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. చిరంజీవి 155వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్​టైన్​మెంట్స్​, క్రియేటివ్​ కమర్షియల్స్​ బ్యానర్స్​పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్నా హీరోయిన్​గా చేస్తున్న 'భోళా శంకర్'​ మూవీలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్​ నటిస్తోంది. 

ఇదివరకూ ఈ సినిమా నుంచి విడుదలైన ప్రీ లుక్​కు అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఈ శివరాత్రికి మెగా అభిమానులకు చిత్రబృందం కానుక ఇవ్వనుంది. ఈ సినిమా ఫస్ట్​ లుక్​ను మార్చి 1న ఉదయం 9:05 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్​. శివుడికి మరొక పేరు అయిన శంకర్​ టైటిల్​ పాత్రలో చిరంజీవి నటిస్తున్నందున ఫస్ట్​ లుక్​ను రిలీజ్​ చేసేందుకు ఇదే మంచి సమయమని మేకర్స్​ భావించినట్లు తెలుస్తోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement