
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తమిళ హిట్ వేదాళంకి రీమేక్‌గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరుకు చెల్లెలిగా నటిస్తుంది.ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటి వరకూ రిలీజైన పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా భోళా శంకర్ సినిమాకు సంబంధించి మేకర్స్ “స్ట్రీక్ ఆఫ్ శంకర్” పేరుతో గ్లింప్స్‌ను వదిలారు.
జై బోలో భోళా శంకర్🙏🏻
— AK Entertainments (@AKentsOfficial) February 18, 2023
Celebrating this Mahashivartri with the Vibrant “STREAK OF SHANKAR”🔱
from #BholaaShankar ❤️🔥
- https://t.co/5qUTcQTRD9
Mega🌟@KChiruTweets @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial #MahathiSwaraSagar @BholaaShankar#StreakofShankar pic.twitter.com/wTZCZ5Taht