ప్రస్తుతం రెండే సినిమాల గురించి తెలుగు యువత తెగ మాట్లాడుకుంటున్నారు. ఇందులో ఒకటి 'జైలర్'. మరొకటి 'భోళా శంకర్'. రజినీని ఓ రేంజులో లేపుతున్న మనోళ్లు.. చిరుకు ఘోరమైన సినిమా ఇచ్చిన డైరెక్టర్ మెహర్ రమేశ్‌పై తెగ విమర్శలు చేస్తున్నారు. ఫ్లాపుల దర్శకుడిగా ఇంతలా ట్రోలింగ్‌కి గురవుతున్న మెహర్‌లో ఓ నటుడు ఉన్నాడని, మహేశ్ సినిమాలో కామెడీ కూడా చేశాడని మీలో ఎవరికైనా తెలుసా?
(ఇదీ చదవండి: హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!)
అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు. మెహర్ రమేశ్ పేరు చెప్పగానే 'శక్తి', 'కంత్రి', 'షాడో' ఇప్పుడు 'భోళా శంకర్' ఇలా అన్నీ అట్టర్ ఫ్లాప్ సినిమాలే గుర్తొస్తాయి. అయితే దర్శకుడు కాకముందు అంటే 2002లో తొలుత ఇతడు నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. చిరంజీవికి వరసకు తమ్ముడు అయ్యే మెహర్.. మహేశ్‌బాబు 'బాబీ' మూవీ సునీల్ అనే కామెడీ రోల్ చేశాడు. ఆ సినిమా ఆడకపోవడంతో మెహర్ యాక్టింగ్ వదిలేశాడు.
తొలుత నటుడిగా ఎంట్రీ ఇచ్చిన మెహర్.. తర్వాత పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్‌గా చేరాడు. అయితే ఒకానొక సందర్భంలో అనుకోకుండా 'ఆంధ్రావాలా' కన్నడ రీమేక్ 'వీర కన్నడిగ' తీసే అవకాశం వచ్చింది. అలా బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. అ తర్వాత 'ఒక్కడు' చిత్రాన్ని కన్నడలో 'అజయ్'గా రీమేక్ చేసి మరో హిట్ కొట్టాడు. ఇలా పరభాషలో సక్సెస్ అందుకున్న మెహర్ రమేశ్.. తెలుగులో మాత్రం ఒక్కటంటే హిట్ కొట్టలేకపోయాడు. చేసిన ఐదు సినిమాలు బోల్తా కొట్టేశాయి. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా ట్రోలింగ్‌తో మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు.
(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్.. నాలుగు సినిమాలు.. రికార్డ్ కలెక్షన్స్!)
Comments
Please login to add a commentAdd a comment