
చిరంజీవి ఓ నిర్ణయం తీసుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాడు. తన సినిమాల రిలీజ్ విషయంలో చాలా జాగ్రత్తగా వుంటాడు. చిరు రీ ఎంట్రీ తర్వాత తన అనుభవాన్ని ఉపయోగించి మేకర్స్‌కు సలహాలు ఇస్తున్నాడు. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా భోళాశంకర్. ఉగాది రోజు ఎనౌన్స్ చేసిన భోళా శంకర్ రిలీజ్ డేట్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. బాక్సాఫీస్ దగ్గర మహేశ్ వర్సెస్ చిరంజీవి వార్ కన్ఫార్మ్ అనుకుంటున్నారు అందరూ. అయితే చిరంజీవి రిలీజ్ డేట్ చెప్పి మెగా ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తే...ఇన్ డైరెక్ట్ గా మహేశ్‌బాబు ఫ్యాన్స్‌కు హింట్ ఇచ్చి కంగారు పెడుతున్నాడు.
చిరంజీవి తన మూవీ ఏదైనా బాక్సాపీస్ దగ్గర సింగిల్‌గా రిలీజ్ కావాలనుకుంటున్నాడు. ఇంకో సినిమాతో పోటీ పడితే కలెక్షన్స్‌పై ప్రభావం చూపిస్తుంది. అందుకే భారీ ఓపెనింగ్స్ ఉండాలనే కాన్సెప్ట్ చిరంజీవిది. తొందరపడి రిస్క్ చేయటం చిరంజీవికి ఇష్టం ఉండదు. అందుకని మెగాస్టార్ చాలామటుకు సోలో రిలీజ్‌కే ఇష్టపడతాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సంక్రాంతికి వీరసింహారెడ్డితో పోటీపడ్డాడు.
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమా భోళా శంకర్. ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 14న విడుదల చేయాలనుకున్నారు. అయితే వాల్తేరు వీరయ్యకి చిరంజీవికి డేట్స్ అడ్జెస్ట్ చేయటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సాధారణంగా మెగాస్టార్ ఫెస్టివల్ సీజన్స్‌లో రావటానికే ఇష్టపడతాడు. పైగా అదే రోజు మహేశ్- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న #SSMB28 విడుదల చేయనున్నట్లు నిర్మాత నాగ వంశీ ఎప్పుడో చెప్పాడు. దీంతో బాక్సాపీస్ దగ్గర మెగాస్టార్.. సూపర్ స్టార్ వార్ ఫిక్స్ అనుకుంటున్నారు. కానీ మహేశ్ మూవీ ఆగస్టు 11న రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించటం లేదు. ఉగాది అప్‌డేట్ ఇస్తామంటూ చెప్పిన #SSMB28 మేకర్స్ మహేశ్ ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేశారు. ఇక రిలీజ్ విషయంలో కూడా అదే పని చేశారు.
ఈ #SSMB28 మూవీ షూటింగ్ ఏప్రిల్ మంత్ ఎండింగ్‌కు ఫైట్స్, సాంగ్స్ మినహా టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసేలా డైరెక్టర్ త్రివిక్రమ్ ప్లాన్ చేశాడు. అయినా పోస్ట్ ప్రొడక్షన్ అనుకున్నవిధంగా పూర్తయ్యేలా కనిపించకపోవటంతో ఈ మూవీ రిలీజ్ ఆగస్టు 11 నుంచి డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన మెగాస్టార్ మరో సినిమా ఆ డేట్ ఫిక్స్ చేసుకోకముందే తను లాక్ చేసుకున్నాడు. భోళా శంకర్ ఆగస్టు 11న రిలీజ్ చేయటానికి మరో రీజన్ కూడా వుంది. ఫోర్ డేస్ లాంగ్ వీకెండ్ వుంది. ఆగస్టు 11 ఫ్రైడే.. ఆ తర్వాత సెకండ్ శాటర్ డే... సండే... మంగళవారం ఆగస్టు 15 హాలీడేస్. కంటిన్యూస్ గా సెలవులు రావటంతో ఈ టైమ్ లో రిలీజ్ చేస్తే... ఓపెనింగ్ కలెక్షన్స్ అదిరిపోయే రేంజ్‌లో వుండేలా మెగా ప్లాన్ వేశాడు చిరంజీవి. ఈ లెక్కన మహేశ్ మూవీ వెనక్కి వెళ్లటంతో మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతుంటే... మహేశ్ ఫ్యాన్స్ మాత్రం నిరాశలో ఉన్నారు.
This Telugu NEW YEAR Begins in Advance with a MEGA upDATE😎
— Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) March 21, 2023
Mega🌟@KChiruTweets #BholaaShankar 🔱 Releasing WorldWide In Theatres on AUG 11th 2023 ❤️🔥#HappyUgadi @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @AKentsOfficial @adityamusic @dudlyraj @prakash3933 @kishore_Atv pic.twitter.com/cZLpEJFhC3
Comments
Please login to add a commentAdd a comment