మహాశివరాత్రి పర్వదినాన జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భక్తులతో పోటెత్తింది. ఓంకార నాదంతో శ్రీగిరి మార్మోగింది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులు మల్లన్నను దర్శించుకొని పునీతులయ్యారు.
మహాశివరాత్రి పర్వదినాన జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భక్తులతో పోటెత్తింది. ఓంకార నాదంతో శ్రీగిరి మార్మోగింది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులు మల్లన్నను దర్శించుకొని పునీతులయ్యారు. మల్లన్న ప్రభోత్సవం అత్యంత రమణీయంగా సాగింది. హరహర మహాదేవ..శంభోశంకర అంటూ భక్తులు నినదిస్తూ ఉత్సవంలో పాల్గొన్నారు. నందివాహనంపై ఆదిదంపతులు ఆలయ ప్రదక్షిణ చేశారు. అనంతరం పాగాలంకరణ, స్వామివార్ల కల్యాణాన్ని నిర్వహించారు.
- న్యూస్‌లైన్, శ్రీశైలం