దామరగిద్ద, న్యూస్‌లైన్: సమాజంలో ప్రతి ఒక్క రూ అహింసను పాటించి, ధర్మాన్ని కాపాడేం దుకు ప్రయత్నించాలని శ్రీ రూపరహిత అహింసా యోగీశ్వరి వీరధర్మజమాత (మాణికేశ్వరిమాత) బోధించారు. జిల్లాసరిహద్దులోని యానగుంది సూర్యనంది క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మాత భక్తులకు దర్శనమిచ్చారు.
అనారోగ్యం కారణంగా మాత వాహనంలో కూర్చున్న చోటు నుంచే భక్తులకు దర్శనమించారు. ఈ సందర్భంగా మాత సందేశాన్ని ట్రస్టు నిర్వాహకులు చదివి విని పించారు. సాటి జీవులపట్ల ప్రేమ, దయ కలిగి ఉండాలని, గోవధను నిషేధించా, అహింసా మార్గంలో నడవాలని సూ చించారు. నీతి నియమాలతో జీవితాన్ని సాగిస్తూ ఆధ్యాత్మిక చింతనతో ధర్మ మార్గాన్ని అనుసరిస్తూలోక కల్యాణం కోసం కృషి చేయాలన్నారు.
అంతకుముందు ట్రస్టు ఆధ్వర్యంలో వేధమంత్రోచ్చరణల మధ్య అమ్మవారికి గురుపాదపూజ, ఏకరుద్ర భిషేకం నిర్వహించారు. కర్ణాటక, మహా రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి మాత దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మాత ప్రత్యేక వాహనంలోనే కూర్చొని ఉండటం వల్ల చాలామంది భక్తులకు దర్శనం స్పష్టంగా కలగలేదు. కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర మంత్రి మల్కిరెడ్డి, మాణికేశ్వరి ట్రస్టు కార్యదర్శి శివయ్యస్వామి, సభ్యులు ఏవీ మందార్ సిద్రామప్ప, జగ్‌జీవన్‌రెడ్డి, బీజేపీ నేత నాగూరావ్ నామాజీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత ప్రచారక్ అమరలింగన్న, అనుపూర్ మొగులాలి, యాదవరావు, తదితరులు పాల్గొన్నారు.
ధర్మాన్ని కాపాడాలి
Published Fri, Feb 28 2014 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 4:10 AM
Advertisement
Advertisement