ఆ హీరోయిన్ జీవితంపై సినిమా చేస్తా | Would love to do a biopic on Madhubala, says Kriti Sanon | Sakshi
Sakshi News home page

ఆ హీరోయిన్ జీవితంపై సినిమా చేస్తా

Published Thu, Aug 6 2015 6:32 PM | Last Updated on Tue, Aug 28 2018 5:11 PM

ఆ హీరోయిన్ జీవితంపై సినిమా చేస్తా - Sakshi

ఆ హీరోయిన్ జీవితంపై సినిమా చేస్తా

ప్రిన్స్ మహేశ్ బాబు సరసన 1... నేనొక్కడినే సినిమాలో చేసిన కృతి సనన్ గుర్తుంది కదూ. ఆ సినిమా తర్వాత ఒక్కసారిగా బాలీవుడ్ అవకాశాలు తన్నుకొచ్చాయి. జాకీ ష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్ ఆరంగేట్రం సినిమా అయిన 'హీరోపంతి'లో నటించింది. ఇప్పుడు షారుక్ ఖాన్, కాజోల్లతో కలిసి 'దిల్వాలే' సినిమా చేస్తోంది. అవకాశం ఉంటే దివంగత నటీమణి మధుబాల జీవితచిత్రంలో చేయాలని ఉందని ఈ సుందరాంగి చెబుతోంది. మధుబాలా చాలా అందంగా ఉండేవారని, తాను ఆమెను ఆరాధిస్తానని కృతి చెప్పింది. ఇండియా ఇంటర్నేషనల్ జ్యూయలరీ వీక్ షోలో ఆమె జైపూర్కు చెందిన సునీల్ జ్యూయలర్స్ కలెక్షన్కు షోస్టాపర్గా వ్యవహరించింది.

మధుబాల ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లోనే ఉన్నారని, ఆమెను చాలామంది ఇప్పటికీ ఆరాధిస్తారని కృతిసనన్ చెప్పింది. ఆమె జీవితం గురించి చాలామందికి తెలియదని, దాన్ని అందరికీ చూపించాలనే ఉద్దేశంతోనే ఆమె జీవితచరిత్ర సినిమా చేయాలనుకుంటున్నానని తెలిపింది. మొఘలే ఆజమ్, చల్తీకా నామ్ గాడీ, బర్సాత్ కీ రాత్ లాంటి అనేక అద్భుతమైన సినిమాల్లో మధుబాల నటించారు. దీర్ఘకాలం పాటు అనారోగ్యంతో బాధపడి, 1969లో కన్నుమూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement