Director Srikanth Siddham Interesting Comments About Prema Desam Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Prema Desam: అందుకే ‘ప్రేమదేశం’ బడ్జెట్‌ పెరిగింది: శ్రీకాంత్ సిద్ధం

Published Sat, Jan 28 2023 2:18 PM | Last Updated on Sat, Jan 28 2023 4:36 PM

Srikanth Siddham Talk About Prema Desam Movie - Sakshi

‘హైదరాబాద్ లో బి.టెక్ చదువుకొని అమెరికా వెళ్లి సాఫ్ట్ వెర్ లో జాబ్ చేస్తున్న నాకు సినిమా తియ్యాలనే ప్యాషన్ ఉండడంతో ఇండియాకు రావడం జరిగింది. . డైరెక్షన్ పరంగా నేను ఎవరి దగ్గర పని చేయలేదు. షార్ట్ ఫిలిం తీసిన నేను నెక్స్ట్ స్టెప్ లో మంచి లవ్ సబ్జెక్టు ఉన్న ఫ్యూచర్ ఫిలిం తీస్తే బాగుంటుందని, ‘ప్రేమదేశం’ తీశా’ అని చిత్ర దర్శక, నిర్మాత శ్రీకాంత్ సిద్ధం అన్నారు. .సిరి క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ పై త్రిగున్ , మేఘా ఆకాష్  హీరో హీరోయిన్లుగా శ్రీకాంత్ సిద్ధం స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రేమదేశం’. అలనాటి అందాల తార మధుబాల ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 3న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాత శ్రీకాంత్‌ సిద్దం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

రెండు విభిన్నమైన ప్రేమ కథలను తీసుకొని చేసిన  సినిమానే ‘ప్రేమదేశం’. మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమాలో మంచి మోడరన్ గెటప్ ఉన్న తల్లి పాత్రకు ఇదివరకే చేసిన  వారితో  చేస్తే రొటీన్ గా ఉంటుందని అలాగే ప్రేక్షకులకు కొంత ఫ్రెస్ నెస్ తో పాటు ఆ క్యారెక్టర్ లో కొంత బబ్లీ నెస్ ఉంటుందని భావించి మధుబాల గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. వారితో పాటు విలక్షణ నటుడైన తనికెళ్ల భరణి గారు ఈ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. 

► ఇందులో తల్లీ,కొడుకుల రిలేషన్ చాలా చక్కగా చూపించడం జరిగింది. త్రిగున్ , మేఘా ఆకాష్ పెయిర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. వారిద్దరూ మంచి పర్ఫామెన్స్ ఇవ్వడమే కాకుండా ఎంతో సహజంగా నటించారు. ఇంకా మిగిలిన నటి,నటులు కొత్తవారైనా చాలా చక్కగా నటించారు

► ప్రేమదేశం అంటే ఎక్కువగా కనెక్ట్ అయ్యేది యూత్. యూత్ బేస్డ్ గా చూస్తే సాంగ్స్ పరంగా, సీన్స్ పరంగా,  కాలేజీ బ్యాక్ డ్రాప్ పరంగా చాలా  కేర్ తీసుకొని చేయడంతో యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. 

► నాటి “ప్రేమదేశం” సినిమాకు ఏఆర్ రహమాన్ ప్రాణం పోస్తే.. నేడు మణిశర్మ తన బ్యాగ్రౌండ్ స్కోర్ తోను సంగీతం తోను అంతే ప్రాణం పోశాడు. మేము విడుదల చేసిన “ప్రేమదేశం” టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. ఇందులోని “పదములే లేవు పిల్ల” పాట, తెలవారెనే స్వామి ఇలా ఈ సినిమాలో ఉన్న అన్ని పాటలు కూడా అన్ని మాధ్యమాలలో టాప్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి .

► ఈ సినిమా కథ విషయంలో విజువల్ గా నా మైండ్ లో బౌండ్ స్క్రిప్ట్ రికార్డ్ అయిన అందువల్ల అదే వేలో వెళ్ళాను. డైరెక్టర్ గా నాకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదు కానీ ఓన్ గా ప్రొడక్షన్ చేయడం, అలాగే కొంత మంది ఫ్రెండ్స్ తో కలసి ఈ సినిమా చేయడం జరిగింది. సినిమా బాగా రావాలనే క్రమంలో కొంత బడ్జెట్ పెరిగింది. దాంతో ఫైనాన్స్ పరంగా కొంత ఇబ్బంది ఎదురైనా కూడా ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేశాం. ఆలా చెయ్యడానికి కారణం మాకు కథ మీద ఉన్న నమ్మకం, అలాగే మణి శర్మ  గారిమీద ఉన్న విశ్వాసం. ఈ రెండు ఉండడం వలన  ప్రేక్షకులను కచ్చితంగా థియేటర్స్ రప్పిస్తుందనే నమ్మకం ఉంది.

► అప్పటి బ్లాక్ బస్టర్ ప్రేమదేశం సినిమాకు ఎ మాత్రం తగ్గకుండా కాలేజ్ బ్యాక్ డ్రాప్‌తో  ఔట్ అండ్ అవుట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ కచ్చితంగా అలరిస్తునే నమ్మకం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement