
స్వాతంత్య్రం అంటే తెలుసుకున్నా...
కొన్నేళ్ల క్రితం వరకు స్వాతంత్య్ర దినోత్సవం అంటే సెలవు రోజు.. కుటుంబసభ్యులతో ఇంట్లో గడపవచ్చని భావించేదానిని. అది తెలియనితనం. కానీ బాధ్యతాయుత పౌరురాలిగా మారాక నా ఆలోచనలో మార్పు వచ్చింది. నిజమైన స్వాతంత్య్రం అంటే ఏంటో తెలుసుకున్నా. సైద్ధాంతిక భావజాలం, అంధ విశ్వాసాల చట్రంలో ఇరుక్కుపోకుండా వాటి నుంచి బయటకు రావాలి. దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలి.
– ‘రోజా’ ఫేమ్ మధుబాల
దేశానికి ఏమిస్తున్నామో తెలుసుకోవాలి
స్వాతంత్య్రం కోసం పోరాడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతగా ఉండాల్సిన రోజు. మనకు లభించిన స్వాతంత్య్రం విలువను చూపించాల్సిన రోజు. అమరుల త్యాగాలను స్మరించుకునేందుకు వేడుకల్లో పాల్గొనాలి. మువ్వన్నెల జెండాకు సెల్యూట్ చేయడం మన బాధ్యత. ఆ రోజు ఎవరికి తోచిన విధంగా వారు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి. మన వంతుగా మనం దేశానికి ఏం ఇస్తున్నాం అనేది తెలుసుకోవాల్సిన రోజు. – సినీ నటి పూజా హెగ్డే
Comments
Please login to add a commentAdd a comment