నటకిరీటీ రాజేంద్రప్రసాద్, సీనియర్ నటి మధుబాల ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘కాలేజ్ కుమార్’. రాహుల్ విజయ్, ప్రియ వడ్డమాని జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో దర్శకుడిగా హరి సంతోష్ టాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు. లక్ష్మణ్ గౌడా సమర్పణలో ఎల్ పద్మనాభ నిర్మించారు. కన్నడ చిత్రానికి రీమేక్‌గా వస్తున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. చిత్ర ట్రైలర్‌ను నటుడు సాయికుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్క తండ్రి కనెక్ట్ అయ్యే సినిమా ‘కాలేజ్ కుమార్’అని పేర్కొన్నాడు. విజయ్ మాస్టర్ అబ్బాయి రాహుల్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడని తెలిసి ఆనందంగా ఫీలయ్యానన్నాడు. మంచి ఎమోషన్, ఫీల్ ఉన్న సినిమా అని.. మార్చి 6న ఈ చిత్రాన్ని అందరూ చూసి ఆశీర్వదించాలని సాయి కుమార్ కోరాడు.
‘ఈ సినిమాలో మర్చిపోలేని పాత్ర చేశాను. రాహుల్ విజయ్ నా కుమారుడి పాత్రలో అద్భుతంగా నటించాడు. మంచి సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ఈసినిమాను కూడా తప్పకుండా సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను. సెంటిమెంట్, ఫన్ ఇలా అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. రెగ్యులర్ పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో నా పాత్ర ఉంటుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నా’అని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో ఫైట్ మాస్టర్ విజయ్, డైరెక్టర్ హరి సంతోష్, సురేష్ కొండేటి, హీరో హీరోయిన్లు, ఇతర తారాగణం, టెక్నీషియన్స్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి:
లక్ష్మీ పార్వతి ప్రధాన పాత్రలో ‘రాధాకృష్ణ’
‘కరెంట్ పోయిందంటే కచ్చితంగా మర్డరే’
Comments
Please login to add a commentAdd a comment