Kantara Become Second Highest Gross Kannada film of all time Best KGF-1 - Sakshi
Sakshi News home page

Kantara Movie: కాంతార మరో రికార్డ్.. ఆ జాబితాలో కేజీఎఫ్-1ను దాటేసింది

Published Fri, Oct 28 2022 8:45 PM | Last Updated on Fri, Oct 28 2022 9:22 PM

Kantara Become Second Highest Gross Kannada film of all time Beats KGF1 - Sakshi

కన్నడ మూవీ కాంతార బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను కొల్లగొడుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కలెక్షన్లతో మోత మోగిస్తోంది. పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. తాజాగా ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంది. యశ్ నటించిన కేజీఎఫ్-1ను వెనక్కినెట్టింది. రిషబ్ శెట్టి హీరోగా దర్శకత్వం వహించిన ఈ మూవీని హోంబలే సంస్థ నిర్మించింది. 

(చదవండి: కాంతార తగ్గేదేలే.. ఆ విషయంలో కేజీఎఫ్ -2 రికార్డ్ బ్రేక్)

అతి తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం కర్ణాటకలో పలు రికార్డులు బద్దలు కొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కేవలం మౌత్‌టాక్‌తోనే ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాల జాబితాలో కేజీఎఫ్-2  రూ.1207 కోట్ల భారీ వసూళ్లతో అగ్రస్థానంలో ఉంది. 2022లో అన్ని భాషల్లో కలిపి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో కాంతార కూడా చేరింది.  ఆ జాబితాలో కేజీఎఫ్- 2, ఆర్ఆర్ఆర్, పొన్నియిన్ సెల్వన్-పార్ట్1 , విక్రమ్, బ్రహ్మాస్త్ర -పార్ట్ 1, భూల్ భూలయ్యా -2 చిత్రాల తర్వాత ఏడో స్థానంలో కాంతార నిలిచింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement