Kannada Heroine Haripriya Engagement with Vasishta Simha - Sakshi
Sakshi News home page

Haripriya: ప్రియుడితో హీరోయిన్‌ నిశ్చితార్థం, ఫొటోలు వైరల్‌

Published Sat, Dec 3 2022 8:24 PM | Last Updated on Sat, Dec 3 2022 9:55 PM

kannada Heroine Haripriya Engagement with Vasishta Simha - Sakshi

కన్నడ నటుడు వశిష్ఠ, హీరోయిన్‌ హరిప్రియ డేటింగ్‌లో ఉన్నారంటూ శాండల్‌వుడ్‌లో టాక్‌ నడుస్తోంది. ఇటీవలే వీరిద్దరూ దుబాయ్‌ నుంచి బెంగళూరుకు తిరిగివస్తూ ఎయిర్‌పోర్టులో మీడియాకు చిక్కడంతో వారి ప్రేమ విషయం నిజమేనని అందరూ ఫిక్స్‌ అయిపోయారు. త్వరలోనే వారు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. చూస్తుంటే ఇదే నిజం కాబోతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా వశిష్ఠ, హరిప్రియల నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మధ్య చాలా సింపుల్‌గా వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది.

కాగా వశిష్ట, హరిప్రియ ఓ సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. తొలిచూపులోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడగా అది కాస్తా ప్రేమగా మారింది.  కాగా హరిప్రియ కన్నడలో ఉగ్రమ్‌, రన్న, రికీ, నీర్‌ దోసె, భర్జరి, సంహారా, లైఫ్‌ జోతే ఓంద్‌ సెల్ఫీ, బెల్‌ బాటమ్‌ చిత్రాలతో ఫేమ్‌ సంపాదించారు. మరోవైపు సింహా ఆర్య లవ్‌ చిత్రంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. రాజా హులి, రుద్ర తాండవలో విలన్‌గానూ మెప్పించాడు.

చదవండి: RRR షూటింగ్‌లో అనారోగ్యంతో బాధపడ్డ రాజమౌళి
టికెట్‌ టు ఫినాలే విన్‌ అయితే కప్పు కొట్టే ఛాన్సే లేదా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement