జూనియర్‌ గద్దర్‌కు ఘన నివాళి | Teacher Who Treated As Junior Gaddar Died In Gadwal | Sakshi
Sakshi News home page

జూనియర్‌ గద్దర్‌కు ఘన నివాళి

Published Thu, Jul 4 2019 6:56 AM | Last Updated on Thu, Jul 4 2019 6:56 AM

Teacher Who Treated As Junior Gaddar Died In Gadwal - Sakshi

ఉపాధ్యాయుడు ప్రభాకర్‌ అంత్యక్రియల్లో పాడె మోస్తున్న ఎమ్మెల్యే

సాక్షి, అలంపూర్‌: జూనియర్‌ గద్దర్‌గా పేరుగాంచిన ఉపాధ్యాయుడు ప్రభాకర్‌కు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కన్నీటి వీడ్కోలు పలికారు. అలంపూర్‌కు చెందిన ప్రభాకర్‌ గుండెపోటుతో మంగళవారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు స్ధానిక శ్మశాన వాటికలో బుధవారం నిర్వహించారు. కళాకారుడిగా, సామాజిక సేవా కార్యకర్తగా, యూటీఎఫ్‌ సంఘంలో జిల్లా కోశాధికారిగా వివిధ రంగాల్లో సేవలు అందించి అందరి మన్ననలు పొందిన ఉపాధ్యాయుడు మృతితో పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. 

కుటుంబానికి ప్రగాఢ సానుభూతి 
ఉపాధ్యాయుడు మృతి చెందిన సమాచారంతో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి బుధవారం అలంపూర్‌కు చేరుకొని భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. అదేవిధంగా టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి ఎన్‌.కిష్టయ్య, మహబుబ్‌నగర్‌ జిల్లా అధ్యక్షుడు రవికుమార్, నాగర్‌కర్నూల్‌ జిల్లా అధ్యక్షుడు జంగయ్య, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు రామదాసు, జిల్లా అధ్యక్షుడు తిప్పన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్, ఎంఈఓలు రాజు, అశోక్‌కుమార్, డేవిడ్‌ తదితరులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

వీరితోపాటు వెంకటేష్‌ రమేష్, కృష్ణ, నాగరాజు తదితరులున్నారు. అలాగే హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌ ఉపాధ్యాయుడు ప్రభాకర్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయనతోపాటు తెలంగాణ రాష్ట్ర పశు వైద్యాధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌ ఉన్నారు. అనంతరం వారు ప్రభాకర్‌ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రభాకర్‌ అంత్యక్రియల్లో ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్రహం పాల్గొన్నారు. భౌతికకాయాన్ని సందర్శించిన ఆయన నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి పాడె మోసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయనతోపాటు నాయకులు నారాయణరెడ్డి, సుదర్శన్‌గౌడ్, జయరాముడు, కిషోర్, సుంకన్న ఉన్నారు. 
   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement