భర్తకు నోటితో ఊపిరి అందిస్తున్న భార్య
లక్నో: గుండెపోటుతో ఆచేతన స్థితిలోకి వెళ్లిన భర్తకు నోటితో ఊపిరి ఊది ప్రాణం పోసింది ఓ భార్య. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురా నగరంలో జరిగింది. రైలులో ప్రయాణం చేస్తుండగా ఓ వ్యక్తికి గుండపోటు వచ్చింది. మథురా స్టేషన్‌కు ట్రైన్ వచ్చి ఆగిన వెంటనే బాధితుడిని ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే బాధితుడు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నాడు.
సమాచారం అందుకున్న ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నాడు. బాధితుడి పరిస్థితిని గమనించి.. నోటితో ఊపిరి అందించటం (సీపీఆర్) చేయాలని అతడి భార్యకు సూచించారు. సుమారు 33 సెకన్ల పాటు భార్య ఊపిరి అందించటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు ఆమె భర్త. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
మథురా రైల్వే స్టేషన్‌లో బాధితుడు కేశవన్‌తో అతడి భార్య దయా, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్
నిజామొద్దిన్ నుంచి కోజికోడ్ వెళ్తుండగా..
కేరళలోని కాసరగోడ్‌కు చెందిన బాధితుడు కేశవన్(67) తన భార్య దయాతో కలిసి రెండు వారాల క్రితం ఉత్తరాఖండ్‌లోని చార్ ధామ్ యాత్రకు వెళ్లారు. వారితో మొత్తం 80 మంది బృందం వెళ్లింది. తిరుగు ప్రయాణంలో.. కోయంబత్తూర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ఢిల్లీ నుంచి కోజికోడ్ వెళ్తున్నారు భార్యాభర్తలు. బీ4 కోచ్ 67-68 సీట్లలో ప్రయాణం చేస్తున్న కేశవన్.. కొద్ది దూరం వెళ్లగానే అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో మథురా స్టేషన్‌లో దించి ఆర్‌పీఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు.
బాధితుడు కేశవన్ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్న కానిస్టేబుల్
ఆసుపత్రికి తరలింపు..
ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ అశోక్ కుమార్, నీరంజన్ సింగ్‌లు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించి అంబులెన్స్‌ను పంపాలను సూచించారు. సీపీఆర్ చేసిన తర్వాత అంబులెన్స్‌లో రైల్వే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు తెలిపారు. గుండె, ఊపరితిత్తులకు సంబంధించిన చికిత్స పొందుతున్నట్లు డాక్టర్ దిలీప్ కుమార్ కౌశిక్ తెలిపారు. సీపీఆర్ చేసేలా ప్రోత్సహించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌కు కృతజ్ఞతలు తెలిపారు కేశవన్ భార్య దయా.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు కేశవన్
ఇదీ చదవండి: వైరల్ వీడియో: చలనం లేని బిడ్డకు ఊపిరి ఊది ప్రాణం పోసిన డాక్టరమ్మ
30 सेकेंड में पत्नी ने मौत के मुंह से खीच लाई जान, CPR देकर पति को बचाया, मौत भी इस महिला के सामने हार गई #CPR #Health #ViralVideo pic.twitter.com/rzqwsZCqCr
— Zee News (@ZeeNews) October 2, 2022
Comments
Please login to add a commentAdd a comment