కొన్ని రోజుల క్రితం పాముల పెంపకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విషాన్ని సేకరించడం కోసమే వాటిని పెంచుతారు. ఇప్పుడు తాజాగా తేళ్ల పెంపకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఒక గదిలో తేళ్లను పెంచడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. నిజానికి తేలు కరిస్తే, అది మరణానికి కూడా దారి తీస్తుంది. తేలు విషం ప్రాణాంతకం. అందుకే ఎవరైనాసరే తేళ్లకు దూరంగా ఉండాలని కోరుకుంటారు.
ఒకేచోట కొన్ని వేల తేళ్లు కనిపిస్తే ఎలా ఉంటుంది? అవును.. ఇటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తేళ్లను ప్రత్యేక అరలలో ఉంచి పెంచుతుండటం కనిపిస్తుంది. వాటికి ఆహారం వేయడాన్ని కూడా చూడవచ్చు. తేళ్ల పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది ప్రాణాలమీదకు వస్తుంది. ఇంతకీ తేళ్లను ఎందుకు పెంచుతారు? వీటి వలన ఉపయోగాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఔషధాల తయారీ
తేళ్లను రెండు ప్రయోజనాల కోసం పెంచుతారు. మనిషిని చంపగల తేలు విషాన్ని అనేక రకాల ఔషధాల తయారీలో వినియోగిస్తారు. తేలు విషాన్ని క్యాన్సర్‌తో సహా అనేక ప్రాణాంతక వ్యాధులలో వినియోగిస్తారు. వాటి విషాన్ని ప్రత్యేకంగా నిల్వ చేస్తారు. పలు దేశాలలో తేళ్లను తింటారు. కాగా ఒక్కో తేలు ప్రతిరోజూ 2 మిల్లీగ్రాముల విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనిని తేళ్ల పెంపకందారులు ఎంతో జాగ్రత్తగా సేకరిస్తారు. తేలు విషం లీటరు ధర 10 మిలియన్ డాలర్లు (రూ. 74 కోట్ల 15 లక్షలు) తేలు విషాన్ని సౌందర్య సాధనాల తయారీలోనూ ఉపయోగిస్తారు. సోషల్ మీడియాలో షేర్ అయిన ఈ వీడియోను ఇప్పటి వరకు కొన్ని మిలియన్ల మంది వీక్షించారు.
ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని ఏలుతున్న భారత సంతతి నేతలు
Did you know? Scorpions farms do exist. Each scorpion produces about 2 milligrams of venom daily, which is milked using a pair of tweezers and tongs. A liter is worth $10 million, used for cosmetics and medicines
— Massimo (@Rainmaker1973) September 2, 2023
[📹 King Scorpion / efre812]pic.twitter.com/PGdbpdpG8h
Comments
Please login to add a commentAdd a comment