తేలును పట్టుకుని చూపిస్తున్న మహిళ
కర్ణాటక, యశవంతపుర : నాగపంచమి రోజు పుట్టలకు, నాగవిగ్రహలకు పూజలు చేయటం అనవాయితీ. అయితే ఇక్కడి ప్రజలు తేళ్లను పట్టకుని ఒంటిపై వేసుకుని ఒక పండుగలా జరుపుకుంటారు. నాగపంచమి పండుగ సందర్భంగా యాదగిరి జిల్లా గురుమఠకల్ తాలూకా కందకూరు గ్రామంలో గుట్టలో ఉన్న కొండమ్మదేవి జాతర సందర్భంగా అక్కడికి తేళ్ల అధిక సంఖ్యలో వచ్చి చేరుకుంటాయి. భక్తులు వాటిని పట్టకుని ఒంటిపై పాకేలా చేస్తారు. ఇలా చేస్తే రోగాలు దరి చేరవని వారి నమ్మకం. ఈ జాతర యాదగిరి జిల్లాలో విశేషంగా జరుగుతుంది. కొండమ్మదేవికి, తేళ్లకు ప్రత్యేక పూజలు భక్తులు తమ కోరికలను తీర్చుకోవటం అనవాయితీ.
Comments
Please login to add a commentAdd a comment