
సాక్షి, కర్ణాటక: కర్ణాటక చామరాజ నగరలోని గొమ్మటపుర గ్రామంలో శనివారం గొరెహబ్బ ఉత్సవం నిర్వహించారు. గ్రామంలోని యువత ఒకరిపై ఒకరు పేడ చల్లుకుంటూ సందడి చేశారు. ప్రతి సంవత్సరం దీపావళి పండుగ అనంతరం ఈ గ్రామంలో పేడోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇలా యువత ఒకరిపై ఒకరి పేడ చల్లుకుంటే పంటలు బాగా పండుతాయని వారి నమ్మకం.

Comments
Please login to add a commentAdd a comment