Arthritis problems
-
కీళ్ల నొప్పుల నివారణ మన చేతుల్లోనే..
ఆర్థరైటిస్ అంటే కీళ్లనొప్పులు లేదా కీళ్ల వాతంగా చెప్పవచ్చు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఈ నెల 12వ తేదీ ‘ప్రపంచ ఆర్థరైటిస్ డే’. ‘‘దీన్ని ఎదుర్కోవడం మీ చేతుల్లోనే, అందుకే దీనిపై చర్యకు ఉపక్రమించండి’’ (ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్, టేక్ యాక్షన్) అన్నది ఈ ఏడాది థీమ్. ఈ నేపథ్యంలో దీని నివారణకూ, మేనేజ్మెంట్కూ బాధితుల చేతుల్లో ఏ మేరకు అవకాశం ఉందనే అనేక విషయాలపై అవగాహన కోసం ఈ కథనం. వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్లు అరిగిపోతుంటాయనీ, దాంతో కీళ్లు ఒరుసుకుపోయి నొప్పి వస్తుంటుందనీ, ఇది వయసు పెరగడం వల్ల వచ్చే సమస్య కాబట్టి సర్దుకుపోక తప్పదనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇది కొంతవరకే వాస్తవం. నిజానికి కీళ్లనొప్పులు / కీళ్లవాతం అనేక కారణాలతో వస్తుంటాయి. వీటిల్లో వందకు పైగా రకాలున్నాయి. అన్నింటినీ కలుపుకుని ఆర్థరైటిస్ లేదా కీళ్లవాతం అనే ఒక పదంతో సూచిస్తుంటారు. పైగా వయసు పెరిగిన వారిలోనే వస్తుంటాయన్నది కూడా పూర్తిగా నిజం కాదు. చాలామంది మధ్యవయస్కుల్లోనూ, కొంతమంది యువకుల్లోనూ కనిపిస్తుంటాయి. కారణాలు కొన్ని వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల కారణంగా, హార్మోన్ల అసమతౌల్యతలూ, విటమిన్ల లోపాలు, వాతావరణ కాలుష్యాలూ... ఇలా అనేక కారణాలతో వస్తుంటాయి. అరుగుదలతో వచ్చే వాటిని మినహాయిస్తే... సొంత కణాలపైనే తమ సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ ప్రతికూలంగా పనిచేసి, కణాలను దెబ్బతీయడం వల్ల వచ్చే కీళ్ల వాతాలూ ఉన్నాయి. ఇలా వచ్చేవాటిని ఆటో ఇమ్యూన్ సమస్యలుగా పేర్కొంటారు. శరీరంలోకి ప్రవేశించే శత్రుకణాలను దెబ్బతీయడానికి పుట్టే యాంటీబాడీస్... తమ సొంత కణాలే పరాయివిగా భావించి దెబ్బతీయడంతో కొందరిలో ఎముకలు, కీళ్లు, కండరాలతో పాటు... కొన్ని సందర్భాల్లో కీలకమైన అవయవాలు, వ్యవస్థలూ దెబ్బతినవచ్చు. ఆర్థరైటిస్‌లలో ప్రధాన ఆటోఇమ్యూన్ వ్యాధులు... ఆటోఇమ్యూన్ సమస్యలతో మహిళల్లో కనిపించే వ్యాధుల్లో లూపస్ (ఎస్‌ఎల్‌ఈ), రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, సిస్టమిక్ స్కీ›్లరోసిస్, ఏపియన్ వంటివి ముఖ్యమైనవి. ఎస్‌ఎల్‌ఈ మహిళల్లో ఎక్కువగా కనిపించే ఓ ముఖ్యమైన వ్యాధి. ఇది కిడ్నీలు, కీళ్లు, చర్మం, మెదడు, కండరాల వంటి అనేక అవయవాలను దెబ్బతీస్తుంది. అది చూపే ప్రభావాన్ని బట్టి కొందరిలో తేలికపాటి నుంచి తీవ్రమైన సమస్యగానూ ఉండవచ్చు. కొందరిలో ప్రాణాపాయానికీ దారితీయవచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ (ఆర్ఏ) కీళ్ల మీద ప్రభావం చూపే వ్యాధి. సరైన చికిత్స తీసుకోకపోతే కీళ్లు వంకర్లుపోయి, శాశ్వత వైకల్యానికీ దారితీయవచ్చు. ఇది కీళ్లను మాత్రమే కాకుండా లంగ్స్, రక్తనాళాలు, కళ్లు, నాడీవ్యవస్థతో సహా శరీరంలోని ఇతర అవయవాలను లక్ష్యంగా చేసుకుని, ఇతర వ్యవస్థలనూ ధ్వంసం చేసే అవకాశమూ ఉంది. ఈ సమస్యతో బాధపడేవారిలో కొలెస్ట్రాల్ పెరుగుదలకు ఆస్కారం ఎక్కువ. అలాగే నాడీ వ్యవస్థ దెబ్బతినవచ్చు. ఈ కారణాలతో మరణాలకూ అవకాశం ఉంది. స్కిర్లోడెర్మా అనే కీళ్లవాతంలో చర్మం గట్టిపడటంతో పాటు జీర్ణవ్యవస్థ, గుండె, లంగ్స్, కిడ్నీల వంటి అవయవాలు ప్రభావితం కావచ్చు. యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అనే కీళ్లవ్యాధిలో రక్తం తరచూ గడ్డకడుతుంది. మహిళల్లో గర్భస్రావాలూ జరుగుతుంటాయి. ఇవిగాక ఇతర వ్యాధులు చాలానే ఉంటాయి. లక్షణాలు: కీళ్లవాతాలకు దాని రకాన్ని బట్టి కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. ఈ లక్షణాలు అందరిలోనూ ఒకేలా బయటపడకపోవచ్చు. వ్యాధి రకాన్ని బట్టి, తీవ్రతను బట్టి, బాధితుల వయసు, వారి ఇతర వ్యాధులను బట్టి లక్షణాల తీరు మారుతూ ఉంటుంది. అయితే దాదాపు అన్ని రకాల కీళ్లవ్యాధుల్లో కనిపించే సాధారణ లక్షణాలను క్రోడీకరిస్తే... సాయంత్రానికి జ్వరం రావడం, నీరసం, నిస్సత్తువ, అలసట, క్రమంగా బరువు తగ్గడం, ఆకలి మందగించడం లాంటి లక్షణాలు తొలిదశలో కనిపిస్తాయి. ఇవే లక్షణాలు ఇతర వ్యాధుల్లోనూ కనిపిస్తుండటం వల్ల వీటిని ఆర్థరైటిస్‌గా గుర్తించడం కొంచెం కష్టమైన పని. నిర్దిష్టంగా కీళ్ల విషయానికి వస్తే కీళ్లలో విపరీతమైన నొప్పి, వాపు, అక్కడ ఎర్రగా కందిపోయినట్లుగా అవుతుంది. ఈ లక్షణాలు కనిపించేనాటికి బాధితులు తమ సొంత పనుల్ని కూడా చేసుకోలేని స్థితి వస్తుంది. ఇతర జాగ్రత్తలు... వీటిలో చాలావాటికి నివారణ ఉండదు. ఎందుకంటే ఇవి జన్యుపరమైనవీ, జన్యులోపాలతో వచ్చేవి. ఈ కారణంతో ఈ పరిమితి ఉంటుంది. ఈ జన్యులోపాలకు పర్యావరణ కారణాలూ, జీవనశైలీ తోడైనప్పుడు ఇవి బయటపడతాయి. అందుకే ఈ ఏడాది థీమ్‌ను బట్టి మన చేతుల్లో ఉండే అంశాలేమిటో తెలుసుకుని, ఆ మేరకు చర్యలు తీసుకోవడం చాలావరకు మేలు చేయడంతో పాటు... కొంతమేర నివారణకూ తోడ్పడేందుకు అవకాశం ఉంది. ఆ జాగ్రత్తలివి... బరువును తగ్గించుకోవాలి. దీనివల్ల మందులు సమర్థంగా పనిచేయడమే కాకుండా గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇదీ చికిత్సలో భాగమే. దీనివల్ల కీళ్లు వంకర్లు పోవు. ∙పొగతాగడం, మద్యపానం అలవాటును పూర్తిగా మానేయాలి. క్యాల్షియమ్ సమృద్ధిగా ఉండే ఆహారాల్ని తీసుకోవాలి. విశ్రాంతి వల్ల కీళ్లవాతాన్ని నివారించవచ్చునని కొందరు అపోహపడతారు. ఇది పూర్తిగా అవాస్తవం. కీళ్లవాతం వచ్చినవారిలో ఒంటి కదలికలు చురుగ్గా ఉండేలా నడక వంటి వ్యాయామాలు చేయాలి. దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలన్నది మరో అపోహ. ఇదీ వాస్తవం కాదు. ఈ అపోహలకు దూరంగా ఉండటమూ బాధితుల చేతుల్లో ఉన్న పనే. ఈ ఏడాది థీమ్‌ను అనుసరిస్తూ... బాధితులు తగిన జాగ్రత్తల్ని పాటించడం, రుమటాలజిస్టులను సంప్రదించి, వ్యాధిని తొలిదశలోనే గుర్తించి, జీవనశైలిని మెరుగుపరచుకుంటే కీళ్లవ్యాధుల బాధల నుంచి దూరంగా ఉండవచ్చు. చికిత్స: ఆర్థరైటిస్‌కి కారణమైన కీళ్లవాతాన్ని బట్టి చికిత్స ఉంటుంది. చాలావాటికి కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులతోపాటు, చిన్న మోతాదుల్లో స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. జబ్బు తీవ్రత ఎక్కువగా ఉంటే తగు మోతాదులో స్టెరాయిడ్స్‌తో పాటు ‘డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్’ని మొదలుపెట్టాలి. జబ్బు తీవ్రతను అదుపు చేయడం కష్టమైన సందర్భాల్లో కొందరిలో ‘బయలాజిక్స్’ అనే మందుల్ని ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అన్ని రకాల కీళ్లవాతాలకూ ఒకేరకం బయలాజిక్స్ పనిచేయవు. వ్యాధి తీవ్రత, ప్రభావితమైన అవయవం, బాధితులు స్త్రీ లేదా పురుషుడా అన్న అంశంతో పాటు ఒకవేళ బాధితులు మహిళలైతే వారు గర్భవతా లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మందుల్నీ, వాటి మోతాదుల్ని రుమటాలజిస్టులు నిర్ణయించి, సూచిస్తుంటారు. డా‘‘ విజయ ప్రసన్న పరిమి, సీనియర్ రుమటాలజిస్ట్ (చదవండి: స్టెరాయిడ్స్ ఇంత ప్రమాదమా? ఇమ్రాన్ ఖాన్ సైతం..) -
కీళ్లనొప్పులా?.. ఈ ఆహారం తీసుకోండి!
ప్రస్తుతం చాలా మంది చేతులు, తుంటి, వెన్నెముక, మోకాళ్లు, కీళ్లలో నొప్పులతో బాధపడుతున్నారు. ప్రస్తుతం చాలా మందిలో యూరిక్ యాసిడ్ పెరగడం కారణంగా కీళ్ల నొప్పులు, వాపుల సమస్యల బారిన పడుతున్నారు. వ్యాయామాలు చేయడం కారణంగా ఈ నొప్పులు తీవ్ర తరమవుతున్నాయి. ఎలాంటి ఆహారాలు తీసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందో తెలుసుకుందాం. కీళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతి రోజు ఆహారంలో బాదం, వేరుశెనగ, వాల్నట్స్ తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో పుష్కలంగా లభించే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వీటిల్లో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్ ఉ కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. ఎక్కువగా వినియోగించడం వల్ల కీళ్లనొప్పుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. బెర్రీలు బ్లబెర్రీస్, బ్లాక్బెర్రీస్, స్ట్రాబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల వీటిని ప్రతిరోజు తినడం కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెర్రీల వల్ల శరీరానికి ఫ్రీ రాడికల్స్ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కూరగాయలు సల్ఫోరాఫేన్ కలిగిన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా సులభంగా యూరిక్ యాసిడ్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు బ్రోకలీ, కాలీఫ్లవర్లను ఆహారంలో తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్ కీళ్ల నొప్పులున్నవారు ఆలివ్ ఆయిల్‌ను వినియోగించి తయారు చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా మార డంతోపాటు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. డార్క్ చాక్లెట్ ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు లభిస్తాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు రోజూ వీటిని తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. మధుమేహం ఉన్నవారు తీసుకోవడం వల్ల చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. (చదవండి: దెబ్బ తగిలిన ప్రతీసారీ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాల్సిందేనా? ఎలాంటప్పుడూ అవసరం?..) -
సాధారణ నొప్పులు అనుకోవద్దు.. ఆర్థరైటిస్‌పై అవగాహన అవసరం!
ఆర్థరైటిస్ అంటే కీళ్ల సమస్య (జాయింట్స్ ప్రాబ్లమ్) అని అర్థం. ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్, హైబీపీ, క్యాన్సర్‌లాంటి జబ్బుల కంటే ఆర్థరైటిస్ సమస్య తీవ్రతే చాలామందిలో ఉంటుంది. కానీ దీనిపై అవగాహన మాత్రం అంతంత మాత్రమే. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఒక దశలో శరీర వైకల్యాలు రావచ్చు. పైగా ఎంత త్వరగా గుర్తిస్తే అంత తేలిగ్గా చికిత్స చేసి అదుపులో ఉంచగలగడం సాధ్యం. ఈ నెల 12న ఆర్థరైటిస్ డే. ఈ సందర్భంగా ఆర్థరైటిస్‌పై అవగాహన కోసం ఈ కథనం. ఆర్థరైటిస్ అంటే ఎముకలు, వాటి కణజాలాలకు సంబంధించిన సమస్య. ఇందులోనూ దాదాపు 200 రకాల కంటే ఎక్కువ వ్యాధులే ఉంటాయి. మామూలు ప్రజల అవగాహన కోసం వాటన్నింటినీ కలిపి ‘ఆర్థరైటిస్’గా పేర్కొంటారు. సాధారణంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కీళ్ల దగ్గర నొప్పి, వాపు, అవి గట్టిగా (స్టిఫ్‌గా) మారడాన్ని, ఆయా కీళ్లలో కదలికలు తగ్గడాన్ని ‘ఆర్థరైటిస్’గా చెప్పవచ్చు. ఈ సమస్యల తీవ్రత సాధారణంగా ఉదయం పూట ఎక్కువగా ఉంటుంది. ఆర్థరైటిస్‌లో రకాలు ఆర్థరైటిస్‌లో చాలా రకాలు ఉంటాయి. అయితే ఇందులో ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకైలోజింగ్ స్పాండైల్ ఆర్థరైటిస్, గౌట్, జువెనైల్ ఇడియోఫథిక్ ఆర్థరైటిస్ (పిల్లల్లో వచ్చే ఆర్థరైటిస్), లూపస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ వంటివి కొన్ని. కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల తర్వాతి పరిణామంగా ఆర్థరైటిస్ కనిపిస్తుంది. పిల్లల్లో పుట్టుకతో వచ్చే ఆరోగ్య సమస్యల కారణంగా కొందరిలో దేహంలోని ఇతర వ్యవస్థలపై కూడా దుష్ప్రభావం పడవచ్చు. అలాగే మరికొందరిలో ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ సమస్యలూ కనిపించవచ్చు. నివారణ/తీవ్రత తగ్గించడానికి సూచనలు అసలు జబ్బే లేనప్పుడు లేదా సమస్య తొలిదశలో ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన జీవనశైలి (లైఫ్‌స్టైల్)తో దీన్ని నివారించడం అవసరం. ఇందుకోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత విశ్రాంతి, కంటినిండా నిద్ర, అన్ని రకాల పోషకాలతో కూడిన సమతులాహారం, ఒత్తిడి లేకుండా ఉండటం వంటి జాగ్రత్తలు అవసరం. పొగతాగడం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. వ్యాయామం చాలా కీలకం కాబట్టి కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అవేమిటంటే... అసలే కీళ్లనొప్పులు, కీళ్ల దగ్గర కదలికలు చాలా పరిమితంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి వ్యాయామం చేయడం కష్టం కావచ్చు. అయితే అస్సలు వ్యాయామం చేయకుండా ఉంటే కీలు మరింతగా కదలికలు కోల్పోయే అవకాశం ఉంది. అందుకే నొప్పి కలగనంత మేరకు, అలసట కలగనంతవరకు కీళ్లు కదిలిస్తూ క్రమంగా వ్యాయామాన్ని పెంచుకుంటూ పోవడం మేలు. నడక, ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాలు మేలు చేస్తాయి. చికిత్స సాధారణంగా లక్షణాల తీవ్రత తగ్గించేలా, కీలు మరింతగా దెబ్బతినకుండా ఉండేలా, వ్యాధికి ప్రభావితమైన అవయవం దాని పనితీరును కోల్పోకుండా చూసేలా చికిత్స ఉంటుంది. అలాగే మందులు ఇచ్చేప్పుడు డాక్టర్లు అవాంఛనీయమైన నష్టాలు, దుష్ప్రభావాలు లేకుండా ఉండటంతో పాటు సైడ్ఎఫెక్ట్స్ వీలైనంతగా తక్కువగా ఉండేలా చూస్తారు. ఆ మేరకు డాక్టర్లు మందుల మోతాదులను నిర్ణయిస్తారు. ఇందులో భాగంగా డాక్టర్లు నొప్పి నివారణ మందులైన నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేషన్ డ్రగ్స్ (ఎన్ఎస్ఏఐడీ), డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్ (డీఎమ్‌ఏఆర్‌డీ), బయాలజిక్స్ వంటి మందులను వాడుతుంటారు. శస్త్రచికిత్స ఆర్థరైటిస్ సమస్యకు తగిన సమయంలో (సాధారణంగా తొలిదశల్లో) చికిత్స తీసుకోనివారిలో కీళ్లు, ఎముకలు దెబ్బతినడం, ఇతరత్రా మరికొన్ని దుష్ప్రభావాలు కనిపించవచ్చు. అలాంటివారిలో కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించడం వల్ల వ్యాధి ముదరకుండా చూసుకోవడంతో పాటు శస్త్రచికిత్స వంటి ఆర్థిక, సామాజిక, కుటుంబ భారాలను కూడా నివారించే అవకాశాలుంటాయి. లక్షణాలు ఆర్థరైటిస్ లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండవు. ఇవి కొద్దిపాటి తీవ్రత (మైల్డ్) నుంచి తీవ్రమైన (సివియర్) లక్షణాల వరకు ఉండవచ్చు. ఒకే వ్యక్తిలో సైతం కాలానుగుణంగా మారుతుండవచ్చు. ఏళ్ల తరబడి కనిపించడంతో పాటు కాలం గడిచేకొద్దీ తీవ్రత పెరగవచ్చు. తొలిదశలో ఆకలి తగ్గడం, జ్వరం, బాగా నీరసించిపోవడం, బరువు తగ్గడం వంటివి కనిపిస్తాయి. ఇవన్నీ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక దశలో సాధారణంగానే కనిపించే సమస్యలు కావడం వల్ల వీటిని తొలిదశలో కనుగొనడం కాస్త కష్టమే. ఈ సమస్య కారణంగా ఏ అవయవం ప్రభావితమైతే... ఆ అవయవానికి సంబంధించిన లక్షణాలు వ్యక్తమవుతూ ఉంటాయి. అయితే ఆర్థరైటిస్‌లో ప్రధానంగా కీళ్లు దెబ్బతినడం జరుగుతుంది. దాని తాలూకు లక్షణాలే బయటకు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కీళ్లు ఎర్రగా కమిలినట్లుగా ఉండి, విపరీతమైన నొప్పిరావచ్చు. ఆర్థరైటిస్ గురించి ఎందుకు అప్రమత్తత అవసరమంటే... ఇది కేవలం దేహంలోని ఒక వ్యవస్థకే పరిమితం కాకుండా చాలా వ్యవస్థలను దెబ్బతీస్తుంది. చికిత్స అందించకపోతే చాలా రకాల దుష్ప్రభావాలు కనిపించే అవకాశముంది. మంచి చికిత్స అందిస్తే చాలావరకు అదుపు లో ఉంటుంది. ఒకవేళ సరైన చికిత్స అందించకపోతే శరీరంలోని ముఖ్యమైన అవయవాల మీద వీటి ప్రభావం పడి, వాటి పనితీరులలో తీవ్రమైన మార్పు రావచ్చు. ఒక్కోసారి ఈ సమస్య కారణంగా కొందరి లో చూపుపోవడం, గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాలు దెబ్బతిని డయాలసిస్‌పై ఆధారపడాల్సిన అవసరం రావడం జరగవచ్చు. ఫలితంగా జీవననాణ్యత (క్వాలిటీ ఆఫ్ లైఫ్) తగ్గిపోతుంది. వ్యాధి నిర్ధారణ ఎక్స్–రే, సీటీ స్కాన్, ఎమ్మారై పరీక్షలతో పాటు కొన్ని రకాల అడ్వాన్స్డ్ రక్తపరీక్షల సహాయంతో వ్యాధినిర్ధారణ జరుగుతుంది. ఆర్థరైటిస్‌కు చికిత్స ఉందా? తొలిదశలోనే ఈ సమస్యను త్వరగా గుర్తిస్తే సమర్థమైన చికిత్స అందించవచ్చు. ఫలితంగా జీవననాణ్యతతో పాటు బాధితుల జీవితకాలాన్ని పెంచవచ్చు. -డాక్టర్ విజయ ప్రసన్న పరిమి సీనియర్ రుమటాలజిస్ట్ -
కీళ్ల నొప్పులా.. ఈ పండ్లు తిన్నారంటే
నేటి కాలంలో 30 ఏళ్లు దాటితే చాలు కీళ్ల నొప్పులు ప్రారంభమవుతున్నాయి. ఈ పరిస్థితిలో వాటిని ఎదుర్కోవటానికి చాలామంది చాలా చిట్కాలు పాటిస్తున్నారు. కానీ ఎటువంటి ఫలితాలు ఉండటం లేదు. కానీ ఆహారంలో ఈ మూడు పండ్లను చేర్చుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. ఆ పండ్లేమిటంటే...కీళ్లనొప్పులను తగ్గించే పండ్లు నారింజ: రోజూ నారింజను తినడం వల్ల శరీరంలో నీటి కొరత తీరుతుంది. ఇందులో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. ఇది కీళ్లనొప్పులని తగ్గించడంలో సహాయపడుతుంది. ద్రాక్ష: వీలయినంత వరకు ద్రాక్షపండ్లను తీసుకోవడం ద్వారా అనేక రకాల వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. చిన్నప్పటినుంచి పిల్లలకి ద్రాక్ష పండ్లను తినిపించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పుచ్చకాయ: వేసవి కాలంలో పుచ్చకాయ తినడం అన్ని విధాల శ్రేయస్కరం. దీనివల్ల శరీరంలో నీటి కొరత ఉండదు. తక్షణ శక్తి లభిస్తుంది. దీనిని తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి. ఎండాకాలం బయటికి వెళ్లే ముందు లేదా బయటి నుంచి వచ్చిన తర్వాత పుచ్చకాయ తీసుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు కీళ్ల నొప్పులని తగ్గిస్తాయి. -
కీళ్లనొప్పులు బాధిస్తున్నాయా.. ఇలా చేయండి
మారుతున్న జీవనవిధానం, శారీరక శ్రమ లోపించడం, పోషకాహారలోపం, వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు, ఒకే భంగిమలో కూర్చుని పనులు చేయడం వంటి వాటి వల్ల గతంలో యాభైలు, అరవైలు దాటిన తర్వాత వచ్చే కీళ్లనొప్పులు ఇటీవలి కాలంలో ముప్ఫైలు, నలభైలలోనే చాలామందిని వేధిస్తున్నాయి. కీళ్లకు సంబంధించిన సమస్యలను ఆర్థరైటిస్ అంటారు. దీన్లో చాలా రకాలున్నాయి. మోకాళ్లలో కార్టిలేజ్ అరగడం వల్ల, సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గడం వల్ల కీళ్లు రెండూ ఒరుసుకుపోయి నొప్పి, వాపు మొదలై కీళ్లు కదపడం ఇబ్బందిగా మారుతుంది. ఏ వ్యాధికైనా కారణాలు తెలుసుకోగలిగితే నివారణ, చికిత్స సులువు అవుతాయి. ఆ తర్వాత ఆహార నియమాలు, చిన్న చిన్న వ్యాయామాల ద్వారా కీళ్లనొప్పులను ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం. ఎముకలు అరిగిపోవడం వల్ల వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. అధిక బరువు, సరైన వ్యాయామం చేయకపోవడం, వయసు పైబడడం, ఎక్కువగా జాగింగ్ చేయడం, ఎక్కువగా మెట్లు ఎక్కడం, మితిమీరిన వ్యాయామం, పోషకాహార లోపం, క్యాల్షియం లోపం, వైరల్ ఇన్ఫెక్షన్లు, రసాయనాల సమతుల్యత లోపం, హార్మోన్ల ప్రభావం, రోగనిరోధకశక్తి తగ్గడం వల్ల కూడా ఆర్థరైటిస్ సమస్య తలెత్తుతుంది. మోకాలు కదిల్చినప్పుడు మెల్లగా మొదలయ్యే నొప్పి క్రమేపీ నడవలేని స్థితికి చేరుస్తుంది. ఈ ఆహారం తీసుకోవాలి కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారం అవసరం. కాలానుగుణంగా వచ్చే అన్ని రకాల పండ్లు, క్యారెట్, బీట్రూట్, కాప్సికం, బీన్స్, చిక్కుడు లాంటి రంగు రంగుల కూరగాయల్ని సలాడ్లు, కూరలు లేదా సూప్ రూపంలో రోజూ తీసుకోవాలి. అలాగే క్యాబేజి, కాలీఫ్లవర్, బ్రొకొలి, ముల్లంగి లాంటివి అధికంగా తీసుకోవాలి. ఇంకా ఆహారంలో పసుపు, అల్లం, వెల్లుల్లి ఎక్కువగా తీసుకుంటే మంచిది. తక్కువ కొవ్వు ఉండే కోడి మాంసం, ఒమేగా–3 అధికంగా ఉండే చేప, అవిసె, ఆక్రోట్ ఎక్కువగా తీసుకోవాలి. సరైన ఆహారంతో పాటు చేయగలిగినంత వరకు వ్యాయామం కూడా చేస్తే మంచిది. వీటికి దూరంగా ఉండాలి పాలిష్ చేసిన తెల్ల బియ్యం అన్నం, మైదాతో తయారు చేసిన చిరుతిళ్లు, బేకరీ ఫుడ్స్, వేపుళ్ళు, స్వీట్లు, పంచదార, టీ, కాఫీలు మొదలైనవన్నీ పరిమితంగా తీసుకోవాలి. కొవ్వు అధికంగా ఉండే మాంసాహారం తగ్గించాలి. అలాగని పూర్తిగా మానేయవలసిన అవసరం లేదు. మోకాలి నొప్పులుంటే యోగాసనాలు వేయకూడదు అనే అపోహ ఒకటి వ్యాప్తిలో ఉంది. అది తప్పు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు వేయదగిన, వేయవలసిన ఆసనాలు కొన్ని ఉన్నాయి. వాటితో నొప్పులు తగ్గడంతోపాటు, కీళ్ల కదలికలు మెరుగవుతాయి. వాటిలో ముఖ్యమైనవి వీరాసనం, త్రికోణాసనం. త్రికోణాసనం ఇలా... కాళ్ల మధ్య 3 అడుగుల దూరం ఉండేలా నిలబడాలి. కుడి పాదం కుడి పక్కకు తిప్పాలి. నడుము కదల్చకుండా, నడుము పైభాగాన్ని కుడి వైపుకు వంచి, కుడి చేతిని కుడి పాదం దగ్గర నేలకు ఆనించాలి. ఇలా చేస్తున్నప్పుడే, ఎడమ చేతిని నిటారుగా గాల్లోకి లేపి ఉంచాలి. ముఖాన్ని పైకి లేపిన చేతి వైపు తిప్పాలి. ఇదే విధంగా ఎడమ వైపు కూడా చేయాలి. వీరాసనం ఇలా ... అరికాళ్లు పిరుదులకు ఆనేలా మోకాళ్లను లోపలికి మడిచి నేల మీద కూర్చోవాలి. రెండు అర చేతులను మోకాళ్ల మీద ఉంచాలి. ఈ ఆసనంలో 30 – 60 సెకన్ల పాటు ఉండాలి.పైన చెప్పుకున్న ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామం చేస్తుంటే కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. -
కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయా.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కచ్చితంగా తగ్గుతాయి..
సాక్షి, కర్నూలు: ఉదయం లేచిన వెంటనే కదలలేరు, నడవలేరు. కాసేపు కుర్చీలో కూర్చుని మళ్లీ లేవాలంటే నరకం. కీళ్లన్నీ బిగుసుకుపోయి ఉంటాయి. అడుగు తీసి అడుగు వేయాలన్నా, కాస్త కష్టమైన పనిచేయాలన్నా ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. దీనినే వైద్యపరిభాషలో రుమటాయిడ్ ఆర్థరైటిస్(కీళ్లవాతం) అంటారు. చలికాలంలో ఈ సమస్య మరింత వేదనకు గురి చేస్తుంది. చలితీవ్రత పెరిగే కొద్దీ ఈ వ్యాధి బాధితుల బాధ వర్ణణాతీతం. జిల్లాలో ఇటీవల కీళ్లవాతం బాధితుల సంఖ్య పెరుగుతోంది. గతంలో జిల్లా జనాభాలో 5 శాతం ఉన్న వారి సంఖ్య ఇప్పుడు ఆరుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 25 వేల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. మొదట్లో కేవలం నగరాలు, పట్టణాల్లో మాత్రమే ఈ సమస్య బాధితులు ఉండగా.. ఇప్పుడు గ్రామాల్లోనూ పెరిగారు. జీవనశైలిలో మార్పుల కారణంగా జంక్ ఫుడ్, కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తినడం, వ్యాయామం చేయకుండా ఒకేచోట ఎక్కువసేపు కూర్చోవడం అధికంగా వంశపారంపర్యం మరో కారణంగా వైద్యులు పేర్కొంటున్నారు. గతంలో ఈ సమస్య 40 ఏళ్లు దాటిన వారిలో అధికంగా కనిపించేది. ఇప్పుడు పాతికేళ్ల వయస్సు నుంచే మొదలవుతోంది. చదవండి: పేదరికంలోకి 50 కోట్ల మంది.. ఇక సమయం లేదు: డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే... ఇది దీర్ఘకాలిక వ్యాధి. శరీరంలోని వ్యాధినిరోధక వ్యవస్థ వ్యతిరేక దిశలో పనిచేయడం వల్ల ఇది సంభవిస్తుంది. దీనివల్ల కీళ్లలో నొప్పి, వాపు, బిగువును కలుగజేస్తుంది. ఒకే సమయంలో శరీరం రెండువైపులా సమంగా కీళ్లనొప్పి కలుగుతుంది. కొన్ని వారాల్లో ఇది వృద్ధి చెంది కీళ్లను నాశనం చేయడం ప్రారంభిస్తుంది. ఇది సాధారణంగా చెయ్యి, పాదం, మణికట్టు, మోచేయి, చీలమండలంలోని చిన్న కీళ్లను ప్రభావితం చేస్తుంది. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాధి నిర్ధారణకు ప్రభావిత కీళ్లకు శారీరక పరీక్ష, ఆర్ఏ ఫ్యాక్టర్, యాంటి సీసీపీ రక్తపరీక్షలు, ఎక్స్‌రే చేయించాలి. చదవండి: మూడ్స్ బాగు చేసి ఆరోగ్యాన్నీ, ఆనందాన్నిపెంచే చాక్లెట్స్! లక్షణాలు ➡ఒకటి లేదా ఎక్కువ చేయికీళ్లలో మానకుండా ఉన్న వాపు ➡తెల్లవారుజామున 30 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉండే కీళ్ల బిగువు ➡కీళ్లలో మెలిపెడుతున్న నొప్పి ➡పిడికిలి బిగించడంలో ఇబ్బంది ➡అలసట, అలసిన భావన ➡ఈ వ్యాధి వల్ల కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, చర్మం ప్రభావితం అవుతాయి. కారణాలు ➡వంశపారంపర్యం, జీవనశైలిలో లోపాలు, జంక్‌ఫుడ్, మాంసాహారం, కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం ➡గతంలో చికున్‌గున్యా, డెంగీ జ్వరం వచ్చినా దాని తాలూకు వైరస్లు కీళ్లలో ఉండి దీర్ఘకాలం నొప్పులుగా మారి కీళ్లవాతానికి దారి తీస్తుంది. ➡ఇది కీళ్లకు, దాని చుట్టుపక్కల ఉన్న మృదులాస్తికి, సమీప ఎముకలకు హాని కలిగిస్తుంది. చదవండి: గుడ్‌న్యూస్! కాఫీతాగే అలవాటు మతిమరుపును నివారిస్తుంది.. ఎలాగంటే.. కీళ్లను కాపాడుకోవడం ఇలా.. వ్యాయామం.. చలికాలంలో రోజూ వ్యాయామం చేయడం వల్ల నొప్పి తగ్గడం, కీళ్లు, కండరాలు బలంగా తయారు అవుతాయి. దీనివల్ల కీళ్లు చురుకుగా కదులుతాయి. అయితే ఒకేసారి ఎక్కువగా గాకుండా చిన్న చిన్న వ్యాయామాలు వైద్యుల సూచనలతో చేయాలి. కీళ్ల వాతం ఉండేవారు వారు నడిచే మార్గాలు, పనుల వల్ల కీళ్లు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. వెచ్చగా ఉంచుకోవడం.. శరీరానికి వెచ్చదనం రక్తప్రసరణను మెరుగుపరిచి నొప్పికి కారణమయ్యే కెమికల్‌ను తొలగిస్తుంది. దీంతో పాటు నొప్పి సెన్సిటివిటీని తగ్గించి నొప్పిని తట్టుకునేస్థాయిని పెంచుతుంది. దీనివల్ల కీళ్లు బిగుసుకుపోవడం తగ్గుతుంది. వేడినీటి స్నానం, హీటింగ్ ప్యాడ్స్, గ్లౌజ్‌లు, షూస్, ఉలెన్ డ్రెస్ ధరించడం వల్ల కీళ్లు బిగుసుకోవడాన్ని తగ్గించుకోవవచ్చు. విటమిన్ డి లోపం.. విటమిన్ డి ఎముకలు, కీళ్లు, పళ్లకే గాకుండా వ్యాధినిరోధకశక్తిని పెంచేందుకు ప్రధానం. విటమిన్ డి లోపం వల్ల కీళ్లనొప్పి అధికం అవుతుంది. కీళ్లు బిగుతుగా అవుతాయి. సూర్యరశ్మి వల్ల విటమిన్ డి లభిస్తుంది. అది వీలుకాని వారు ప్రతిరోజూ 600 ఐయూ విటమిన్ డి మాత్రను తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకోవాలి.. కీళ్ల వ్యాధి ఉండేవారికి చలికాలంలో వ్యాధినిరోధకశక్తి బలహీన పడి సులువుగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో ఫ్లూ, న్యూమోనియా వ్యాక్సిన్ తీసుకోవాలి. అధిక బరువు వల్ల చురుకుతనం తగ్గిపోతుంది. వీరిలో అధిక శాతం వ్యాయామంపై నిర్లక్ష్యం ఉంటుంది. కాబట్టి బరువు తగ్గే వ్యాయామాలు చేయాలి. నీరు అధికంగా తాగాలి. ముఖ్యంగా గౌట్ రోగులు ఉప్పు తగ్గించాలి. ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో అధికంగా నీటి శాతం చేరి కీళ్లు మరీ ఎక్కువగా బిగుసుకుపోతాయి. చలికి బిగుసుకునే కీళ్లు సాధారణంగా చలికాలంలో కీళ్లు కొంచెం బిగుతుగా ఉంటాయి. కీళ్లవాతం వ్యాధిగ్రస్తులలో మరీ ఎక్కువగా ఇబ్బందికరంగా ఉంటుంది. దీనికి కారణం వాతావరణంలో వచ్చే మార్పులు కీళ్లపై ప్రభావం చూపుతాయి. కీళ్లు వ్యాకోచించడం వల్ల కీళ్లలో ఉండే ద్రవంలో మార్పుల వల్ల, పెయిన్ సెన్సిటివిటివి చలికాలంలో పెరగడం వల్ల 20 శాతం ఎక్కువ నొప్పి తెలుస్తుంది. కీళ్లు ఎక్కువగా బిగుతుగా మారతాయి. ఇలాంటి వారు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. – డాక్టర్ ఎ. సృజన, రుమటాలజిస్టు, కర్నూలు -
ఆర్థరైటిస్ నొప్పులకు పెయిన్ కిల్లర్స్ వద్దు!
కొందరికి కీళ్లలో విపరీతమైన నొప్పులు వస్తుంటాయి. కాళ్లూ చేతులపై అధికభారం పడ్డప్పుడు ఎక్కువవుతూ ఉంటాయి. సాధారణంగా మోకాళ్లు, మోచేతులు, కాలి వేళ్లు, మణికట్టు. భుజాలు, నడుము, వెన్నెముక భాగాల వాపుతో నొప్పితో పాటు అప్పుడప్పుడూ జ్వరం రావడం, కదల్లేకపోవడం లాంటి లక్షణాలూ కనిపించవచ్చు. ఇలాంటి కీళ్ల సమస్యను వైద్యపరిభాషలో ‘రుమటాయిడ్ ఆర్థరైటిస్’ అంటారు. గతంలో పెద్దవయసు వారిలోనే వచ్చే కీళ్ల నొప్పులు ఇటీవల 20 – 40 ఏళ్ల వయసున్న వారిలోనూ కనిపిస్తున్నాయి. ఇదీ కారణం... ఎముకల మధ్య కుషన్‌లా ‘కార్టిలేజ్’ పొర ఉంటుంది. ఇది అరిగిపోయినా లేదా చాలా ఎక్కువగా దెబ్బతిన్నా, ఆ ప్రాంతం లో వాపు వచ్చినా, ఎముకలు ఒకదానితో ఒకటి ఒరుసుకున్నా ఈ కీళ్లనొప్పులు వస్తాయి. ఈ కండిషన్‌ను ‘ఆస్టియో ఆర్థరైటిస్’ అంటారు. పెయిన్‌కిల్లర్స్ వద్దు! ఇలాంటివాళ్లలో కొందరు నొప్పులు రాగానే పెయిన్‌కిల్లర్స్ వాడుతుంటారు. అది సరికాదు. అవి వాడినంత సేపు బాగానే ఉంటుంది. వాటి ప్రభావం తగ్గగానే మళ్లీ నొప్పులు మొదలవుతాయి. అవి కిడ్నీలాంటి కీలక అవయవాలను దెబ్బతీస్తాయి. ఈనొప్పులు వస్తున్నప్పుడు వెంటనే ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, ఆయన సలహా మేరకు ఈఎస్ఆర్, ఆర్ఏ ఫ్యాక్టర్, సీరమ్ యూరిక్ యాసిడ్, సీబీసీ, అర్థరైటిస్ ప్రొఫైల్, ఎక్స్‌రేలాంటి కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. ఆ ఫలితాల ఆధారంగా చికిత్సలుంటాయి. కొన్నిసార్లు మందులతో పాటు ఫిజియోథెరపీ అవసరం కావచ్చు. కొందరిలో అరుదుగా సర్జరీ కూడా చేయించాల్సి రావచ్చు. చదవండి: పురుషుల్లో కంటే మహిళల్లోనే ఉబకాయం పెరుగుతోంది.. ఈ జాగ్రత్తలు పాటించాలి... ► స్థూలకాయం లేకుండా చూసుకోవాలి. బరువు అదుపునకు వ్యాయామం చేయాలి ► క్యాల్షియం ఉన్న ఆహార పదార్థాలు అంటే తాజా కూరగాయలు, పాలు, గుడ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి ► వంటలలో ఉప్పు, నూనె బాగా తగ్గించాలి. ► డయాబెటిస్ ఉంటే అదుపులో ఉంచుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలే తప్ప డాక్టర్ సలహా లేకుండా చాలాకాలం పాటు పెయిన్‌కిల్లర్స్ వాడితే అసలు జబ్బు తగ్గకపోగా అదనంగా ఇతరత్రా సమస్యలు రావచ్చు. చదవండి: ఇలా చేస్తే.. ఎంత వయసొచ్చినా యంగ్‌గా.. డాక్టర్ కొల్లా సాకేత్ -కన్సల్టెంట్స్పోర్ట్స్ అండ్ రీజనరేటివ్ ఆర్థోపెడిక్ సర్జన్ -
చిన్నవయసులో ఆర్ధరైటిస్.. ఈ లక్షణాలు ఉన్నాయేమో చూసుకోండి
అడుగు కదిలితే నరకం చూపే నొప్పి, ఒక జాయింటు నుంచి లేదా ఒక వేలు నుంచి ప్రారంభమై శరీరంలోని అన్ని జాయింట్లకు విస్తరిస్తుంది, వయసుతో సంబంధం లేకుండా అందరినీ పీడిస్తుంది.. అదే ఆర్ధరైటిస్ లేదా కీళ్లవాతం! పూర్వం వయసు మళ్లిన వారు మాత్రమే ఈ వ్యాధితో బాధపడేవారు. నేడు చిన్నవయసులో సైతం ఈ వ్యాధి వస్తోంది. వయసు పైబడినవారిలో మోకాళ్లు అరిగిపోయి ఆర్థరైటిస్ వస్తుంది. మరి చిన్నవయసులో ఎందుకు వస్తుందంటే.. అనేక కారణాలున్నాయి. డెంగ్యూ, చికున్ గున్యా, స్వైన్‌ఫ్లూ లాంటి వైరల్ జ్వరాలు సోకితే వచ్చిన కీళ్ల నొప్పులు ఏడాదిపాటు ఉంటున్నాయి. అలా కాకుండా శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం, అనవా సరమైన వ్యర్థాలు పెరగడం, జన్యులోపాల వల్ల వచ్చే కీళ్లవాతం దీర్ఘకాలం ఉంటుంది. ఇవే కాకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, జీవక్రియ లోపం, హార్మోన్స్ అసమతుల్యత, థైరాయిడ్ ప్రభావం, సొరియాసిస్, శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ శక్తి తగ్గడం, సైనోవియల్ అనే ద్రవంలో తేడాలు ఏర్పడటం, అధిక బరువు, ప్రమాదాలు, ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడటం, ఆహార విధానంలో మార్పులు, గాయాలు తగిలినపుడు లిగమెంట్, కార్టిలేజ్ దెబ్బతినడం, జాయింటుల్లో వచ్చే ఇన్ఫెక్షన్లు,డిస్లొకేషన్, సికిల్ సెల్ డిసీజ్, బోన్ ట్యూమర్స్, బ్లీడింగ్ డిజార్డర్స్ వంటివన్నీ కీళ్లనొప్పులకు ప్రధాన కారణాలవుతాయి. చదవండి: ఇకపై క్యాన్సర్‌తో కాళ్లూ, చేతులు కోల్పోనక్కర్లేదు! పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. వయసుతో సంబంధం లేకుండా అందరిలో కనిపించినా, ముఖ్యంగా 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సున్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కీళ్లవాతం గుర్తించడం తేలికైన పనే. శరీరంలో ఒకటి కంటే ఎక్కువ జాయింట్ల వద్ద నొప్పులు ఉంటే అది కచ్చితంగా కీళ్లవాతమే అని భావించాలి. జాయింట్ల వద్ద నొప్పులు, వాపులు ఉంటే ఈ లక్షణంగానే గుర్తించాలి. నిద్రలేచిన తరువాత జాయింట్ల వద్ద నొప్పులు, నడవలేని, లేవలేని పరిస్థితి కనిపిస్తుంది. జ్వరం తగ్గిన తరువాత కీళ్లనొప్పులు కొనసాగినే ఆర్ధరైటిస్‌గా అనుమానించాల్సిందే. కీళ్లవాతంలో అనేక రకాలున్నాయి. చదవండి: సుఖమైన నిద్ర కోరుకునే వారికి ఇది కూడా అవసరమే! గౌట్ ఈ తరహా కీళ్లవాతానికి శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం ప్రధాన కారణం. ముఖ్యంగా జాయింట్స్ దగ్గర చిన్న స్పటికాల మాదిరిగా యూరిక్ యాసిడ్ పేరుకుపోవడంతో జాయింట్లో నొప్పి, వాపు ప్రారంభమవుతుంది. పెరుగుతున్న యూరిక్ యాసిడ్‌ను శరీరం బయటకు పంపించలేకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. కీళ్లవాతం ప్రభావం మొదట బొటన వేలు జాయింట్‌ల్లో కనిపిస్తుంది. చీలమండలు, కీళ్లు, మణికట్లు, చేతివేళ్లు, మోచేతి ప్రాంతాల్లో జాయింట్లు వాపు, నొప్పితో ఎర్రగా మారుతాయి. సొరియాటిక్ ఆర్థరైటిస్ సొరియాసిస్ అనే చర్మ వ్యాధి కారణంగా తల, మోచేయి, మోకాలు, మెడ ప్రాంతాల్లో ప్యాచ్‌ల మాదిరిగా చర్మం ఎర్రగా మారుతుంది. ఈ ప్యాచ్‌లు లేదా మచ్చలు చేతి వేళ్లు, కాలి వేళ్ల దగ్గరకు విస్తరించినపుడు సొరియాటిస్ ఆర్థరైటిస్ ప్రారంభమవుతుంది. రెండు చేతులు, కాళ్లలోని జాయింటులు దీని ప్రభావానికి లోనవుతాయి. చేతి వేళ్లలోనూ, కాలి వేళ్లలోనూ నొప్పి, వాపు ఉంటుంది. కొందరిలో స్పాండిలైటిస్ వస్తుంది. రుమటాయిడ్ ఆర్ధరైటిస్ ఈ వ్యాధి ఒక కీలుకు పరిమితం కాకుండా శరీరంలోని అన్ని జాయింట్స్‌కూ విస్తరిస్తుంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం వల్ల వస్తుంది. చలి కాలంలో దీని బాధ ఎక్కువ. ఈ వ్యాధి చేతివేళ్లకు, మోకాలి జాయింట్స్‌కు, మణికట్టు కీలుకు, కాలివేళ్ల కీళ్లకు ఎక్కువగా వ్యాపిస్తుంది. దీని వల్ల ఉదయం పూట నొప్పులు ఎక్కువగా ఉండి, కదల్లేని పరిస్థితి కనిపిస్తుంది. నిరంతరం ఒళ్లు వేడిగా ఉంటుంది. ఆకలి తగ్గుతుంది. మూత్రవిసర్జన అధికంగా ఉంటుంది. ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా ఉంది. అంకైలోజింగ్ స్పాండిలోసిస్ వెన్నెముకలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. క్రమంగా నొప్పి విస్తరిస్తుంటుంది. కారణం తెలియకపోయినా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. అస్టియో ఆర్థరైటిస్ వయసు పెరుగుతున్నకొద్దీ కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల అస్టియో ఆర్థరైటిస్ వస్తుంది. ఎముకల చివరన ఉన్న కార్టిలేజ్ అరిగిపోయి, ఎముకలు రెండూ ఒకదానికొకటి ఒరుసుకుపోయి, ఆ భాగాన నొప్పి, వాపు వంటివి కనిపిస్తాయి. దీని వల్ల కూర్చొని లేచినప్పుడు, ఉదయం పూట లేచినప్పుడు జాయింట్లు పట్టినట్టుగా ఉంటాయి. మొదట పది అడుగులు కూడా నడవడానికి వీలుండదు. నడుస్తుంటే కీళ్లలో టకటకమనే శబ్డం వస్తుంది. కింద కూర్చోవడం, మెట్లు ఎక్కడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువగా మోకాలులో ఈ నొప్పి కనిపిస్తుంది. రుతుస్రావం ఆగిపోయిన స్త్రీలలో , వయసు మళ్లినవారిలో, చిన్న వయసులో గర్భాశయం తొలగించిన వారిలో, హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారిలో కనిపిస్తుంతది. కీళ్ల పైన ఒత్తిడి పెరిగి ఎప్పుడూ నొప్పి, వాపు, జ్వరం వచ్చినట్టుగా ఉంటుంది. కీళ్ళనొప్పులతో బాధపడుతున్నవారికి రక్తపరీక్షలు, ఎక్స్‌రే, ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా ఏ కారణం వల్ల ఏయే కీళ్ళు దెబ్బతిన్నదన్న విషయాన్ని నిర్ధారణ చేయవచ్చు. చాలామంది కీళ్ళనొప్పులకు ఆపరేషన్ తప్ప గత్యంతరం లేదని భయపడుతుంటారు. కాని ఆపరేషన్ లేకుండా ఆయుర్వేదం, హోమియోల్లో మంచి చికిత్సలే అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ పరిస్థితి విషమిస్తే కృత్రిమ కీళ్లమార్పిడి చేస్తున్నారు. తుంటి ఎముక బాల్, యాంకిల్ జాయింట్, షోల్డర్ జాయింట్, చేతివేళ్ల జాయింట్లకు కూడా చికిత్సలున్నాయి. అంతేకాకుండా ఆరు నుంచి ఏడాదిలోపు ఇంజక్షన్ల ద్వారా ఈ నొప్పులన్నీ తగ్గిపోతున్నాయి. అయితే ఈ మందులు ఎక్కువగా వాడితే కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉన్నందున డాక్టరు సలహా మేరకే వాడాలి. వ్యాయామం చేయడం, అధిక బరువు తగ్గడం, దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం, ఆరోగ్యవంతమైన జీవనశైలి పాటించడం వల్ల ఆర్ధరైటిస్‌ను ఆమడ దూరంలో ఉంచవచ్చు. ∙డి. శాయి ప్రమోద్ ఆర్ధరైటిస్‌ను ఇలా అదుపు చేద్దాం! కీళ్లవాతాన్ని అరికట్టడంలో కింద పేర్కొన్న మార్గాలు సత్ఫలితాలిస్తాయి. ► కాల్షియం అధికంగా ఉండే పదార్థాలైన పాలు, పెరుగు, కోడిగుడ్లు, కీర, బొప్పాయి, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. మసాలా వస్తువులు, అధిక బరువును తగ్గించుకోవాలి. ► కాపడుకునేటప్పుడు మోకాళ్ల కింద మెత్తటి దిండు పెట్టుకోవాలి. అధిక బరువులు ఎత్తకూడదు. ► కాపంచదారతో చేసే క్యాండీ, సోడా, ఐస్‌క్రీమ్ వంటి ఆహారాలను తీసుకోకూడదు. ► కాప్రాసెస్ చేసిన రెడ్ మీట్ ఇన్ఫ్లమేషన్కు దారితీస్తుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల రెడ్ మీట్‌కు దూరంగా ఉంటేనే మంచిది. ► కాగ్లుటెన్ అధికంగా ఉండే పదార్ధాలకు దూరంగా ఉండాలి. ఫాస్ట్‌ఫుడ్, బ్రేక్‌ఫాస్ట్ సెరల్స్, రిఫైన్ గ్రెయిన్స్, ప్రిజర్వేటివ్ రసాయనాలు కలిపినవి కూడా తీసుకోకూడదు. ► కామద్యం అలవాటు ఉన్నవారు ఆల్కహాల్‌ను మానేయాలి. లేదంటే వెన్నెముకపై ప్రభావం పడి పెళుసుగా మారుతుంది. -
తేలు విషంతో కీళ్ల నొప్పుల నివారణ?
వినేందుకు కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ.. తేళ్ల విషయంలోని పదార్థాలతో ఆర్థరైటిస్ అంటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందని గుర్తించారు ఫ్రెడ్ హుచిట్సన్ కేన్సర్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు. ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో తేలు విషంలోని ఓ బుల్లి ప్రొటీన్ కీళ్ల తాలూకు మంట/వాపు లను తగ్గించేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వారి మంట/వాపులను తగ్గించేందుకు ఇప్పటికే కొన్ని మందులు ఉన్నప్పటికీ వాటితో దుష్ప్రభావాలు ఎక్కువ. స్టెరాయిడ్లను వాడటం వల్ల శరీరం మొత్తం సమస్యలకు లోనవుతుంది. ఫలితంగా రక్తపోటు పెరిగే, బరువు పెరిగే అవకాశాలూ ఎక్కువ. ఒకటికంటే ఎక్కువ కీళ్లలో నొప్పులు ఉన్నవారికి ఈ దుష్ప్రభావాలను తట్టుకోవడం కష్టమవుతుందని, ఈ సమస్యను అధిగమించేందుకు తాము చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నామని డాక్టర్ జిమ్ ఓల్సన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. నాలుగేళ్ల క్రితం తాము దుష్ప్రభావాలు లేని మందు కోసం తేలు, సాలీడు విషాల్లోని సుమారు పెప్టైడ్లను పరిశీలించినప్పుడు ఒక పెప్టైడ్ కార్టిలేజ్‌లోనే సహజంగా పెరుగుతున్నట్లు గుర్తించామని ఓల్సన్ తెలిపారు. ఈ పెప్టైడ్తో మెరుగైన చికిత్స కల్పించవచ్చునని గుర్తించి ఎలుకలపై ప్రయోగాలు చేపట్టామని, ఆపెప్‌టైడ్ ఆర్థరైటిస్ లక్షణాలను విజయవంతంగా నయం చేసిందని వివరించారు. అయితే ఈ ప్రొటీన్ ఆధారంగా కొత్త మందులు తయారు చేసేందుకు మరికొంత సమయం పడుతుందని చెప్పారు. -
ఇంత చిన్న వయసులోనూ కీళ్లవాతాలా?
మా పొరిగింటివాళ్ల అబ్బాయి వయసు 14 ఏళ్లు. అతడికి కీళ్లవాతం వచ్చిందని డాక్టర్ చెప్పారు. దాంతో మేము ఎంతో ఆశ్చర్యపోయాం. ఇంత చిన్న పిల్లలకు కూడా ఆర్థరైటిస్ వస్తుందా? కీళ్లవాతం లేదా ఆర్థరైటిస్ అనేవి కేవలం పెద్దవాళ్లకే వస్తాయనే అపోహ చాలామందిలో ఉంటుంది. పిల్లలు కూడా చిన్న వయసులోనే లూపస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఏంకైలోజింగ్ స్పాండలైటిస్, వాస్క్యులైటిస్ వంటి అనేక రకాల కీళ్లవాతాల బారిన పడవచ్చు. వీటన్నింటిలోకీ జువెనైల్ ఇడియోపథిక్ ఆర్థరైటిస్ అనే రకం చాలా సాధారణంగా కనిపిస్తుంటుంది. ఇవన్నీ దీర్ఘకాలిక వ్యాధులు. ఎందుకొస్తాయంటే: ఈ జబ్బులు ఎందుకు వస్తాయనే కారణాలు పెద్దగా తెలియదు. అనేక పరిశోధనల తర్వాత జన్యులోపాలే వీటికి ప్రధాన కారణాలని శాస్త్రవేత్తలు నిర్ధారణ చేశారు. జన్యులోపం ఉన్నప్పుడు బయటి వాతావరణంలోని క్రిములు, కాలుష్యం వంటి అంశాలు వ్యాధిని తేలిగ్గా ప్రేరేపించగలవు. ఫలితంగా మన శరీరంలోని వ్యాధినిరోధక శక్తి సొంత కణాలనే పరాయివిగా భావించి వాటిపై దాడికి దిగుతాయి. ఈ దాడి ఫలితంగా కీళ్లు, కండరాలు మాత్రమేగాక ఇంకా చాలా అవయవాలు ప్రభావితమవుతాయి. అందుకే దీన్ని ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటారు. లక్షణాలు: వ్యాధి లక్షణాలు పిల్లలందరిలో ఒకేలా ఉండవు. ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపించడమే కాకుండా తరచూ మారుతుంటాయి. ఎక్కువగా కీళ్ల మీద ప్రభావం చూపినప్పటికీ, ఊపిరితిత్తులు, కళ్లు, చర్మం, కాలేయం, మూత్రపిండాలు, గుండె వంటి అవయవాలపైన కూడా ఈ వ్యాధి ప్రభావం పడుతుంది. పెద్దవారిలో కనిపించే కీళ్లవాతానికీ, పిల్లల్లో కనిపించే దానికి చాలా తేడాలుంటాయి. పిల్లల్లో అభివృద్ధి చెందే ఎముకలపైన ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పిల్లల్లో పెరుగుదల ఆగిపోతుంది. కళ్ల మీద కూడా ప్రభావం పడి, చూపు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ కీళ్లవాతపు వ్యాధులు సాధారణ చికిత్సా విధానాలకు లొంగవు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ లక్షణాల తీవ్రత పెరగడం, మందుల దుష్ప్రభావాలు కలగడం, జీవితకాలపు వైకల్యం వంటి ప్రమాదాలనూ ఎదుర్కొంటారు. కొన్నిసార్లు జబ్బు తీవ్రత అకస్మాత్తుగా ఏ కారణమూ లేకుండానే పెరిగిపోతుంది. మరికొన్నిసార్లు ఎలాంటి తీవ్రతా కనిపించదు. అలాగే మానసిక ఆరోగ్యంపై కూడా ఈ వ్యాధుల ప్రభావం ఉంటుంది. ఆందోళన, డిప్రెషన్, ఆత్మహత్యాప్రయత్నాల వంటి పరిణామాలకు దారితీస్తాయి. అందువల్ల కుటుంబసభ్యుల మీద కూడా ఒత్తిడి ఉంటుంది. విద్యా, వృత్తిపరమైన ఇబ్బందుల కారణంగా రోగులు సామాజికంగా ఇక్కట్లు ఎదుర్కొంటారు. చికిత్సలు: గతంలో అరుదుగా కనిపించే ఈ రకం జబ్బుల్ని ఇటీవల తరచూ చూడటం జరుగుతోంది. చికిత్సావిధానాలు కీళ్లవాతం రకాన్ని బట్టి ఉంటాయి. కొంతమందికి చిన్న నొప్పి నివారణ మందులతోనే నయమవుతుంది. మరికొందరిలో స్టెరాయిడ్స్ అవసరమవుతాయి. వాటికీ లొంగని వ్యాధులకూ, ప్రాణాంతకమైన రకాలకు డిసీజ్ మాడిఫైడ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్ (డీమార్డ్స్) అనే తరహా మందులు వాడాల్సి ఉంటుంది. వీటిని నివారించలేనప్పటికీ, సరైన సమయంలో వైద్యచికిత్స తీసుకుంటే శాశ్వతంగా ఉపశమనం పొందవచ్చు. జాగ్రత్తలు: ►ఈ జబ్బు లక్షణాలను పసిగట్టినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే రుమటాలజిస్ట్ను కలవాలి. వ్యాధి నిర్ధారణ జరిగాక, దాని తీవ్రతను బట్టి మందులు సూచిస్తారు. ►రుమటాలజిస్ట్ పర్యవేక్షణలో మాత్రమే ఈ మందులు వాడాలి ►కంటిపైనా, ఇతర అవయవాలపై ఈ వ్యాధి ప్రభావం పడిందో లేదో తెలుసుకునేందుకు తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి ►సరైన పోషణ, క్యాల్షియమ్, విటమిన్–డి సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అయితే చాలామందికి ఆహారం ద్వారా కావలసిన క్యాల్షియమ్ లభించదు. అలాంటి వారికి క్యాల్షియమ్ సప్లిమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది ►కీళ్లవాతం వల్ల ఎముకలు, కండరాలు బలాన్ని కోల్పోతాయి. సరైన వ్యాయామం వల్ల ఇవి బలంగా తయారవుతాయి. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల వైకల్యాన్ని నివారించవచ్చు. ఈ చిన్న చిన్న జాగ్రత్తలతో, రుమటాలజిస్టుల సలహా మేరకు సరైన మందులు వాడటం వల్ల ఈ రోగులు నార్మల్ జీవితాన్నే గడపవచ్చు. డాక్టర్ విజయ ప్రసన్న పరిమి సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్. -
లూపస్ అంటువ్యాధా? ఎందుకు వస్తుంది?
మా పక్కింటావిడకి లూపస్ వ్యాధి ఉందని వైద్యులు నిర్ధారణ చేశారు. ఆవిడ తరచూ నా దగ్గరకు వస్తుంటుంది. దీనివల్ల నాకు కూడా ఆ వ్యాధి వస్తుందేమోనని ఆందోళనగా ఉంది. అసలు లూపస్ అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి. ఈ జబ్బు ఎందుకు వస్తుంది? లూపస్ లేదా ఎస్‌ఎల్‌ఈ (సిస్టమిక్ లూపస్ అరిథమెటోసిస్) అనే ఈ వ్యాధి ఒక దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే రోగి తాలూకు వ్యాధి నిరోధక శక్తి రోగిపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే వ్యాధి అన్నమాట. మనందరిలో ఒక వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. అది బయటి నుంచి వచ్చే వ్యాధుల నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. జన్యులోపాల వంటి ఏవైనా కారణాల వల్ల మన వ్యాధి నిరోధక శక్తి... మన శత్రుకణాలను తుదముట్టించడానికి బదులుగా, మన సొంతకణాలనే మన శత్రువులుగా పరిగణించి, వాటిపై దాడి చేస్తుంది. దాంతో కంచే చేను మేసినట్టుగా మన సొంత అవయవాలే మన వ్యాధి నిరోధకశక్తి బారిన పడతాయి. అందువల్ల వచ్చే వ్యాధిని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్షమందిలో ఒకరి నుంచి 15 మంది వరకు ఈ జబ్బు వస్తుంటుంది. సాధారణంగా 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న స్త్రీలు దీని బారిన ఎక్కువగా పడుతుంటారు. ఇది ఎంతమాత్రమూ అంటువ్యాధి కాదు. ఒకరి నుంచి మరొకరికి ఇది అంటుకోదు. కాబట్టి ఈ జబ్బు ఉన్నవారితో సన్నిహితంగా మెలగడం వల్ల, సహజీవనం చేయడం వల్ల ఈ వ్యాధి సోకదు. ఇలాంటి వ్యాధిగ్రస్తులను వెలివేయనక్కర్లేదు. పైపెచ్చు వారి పట్ల మరింత ప్రేమ, ఆదరణ చూపించడం వల్ల వారిలో మానసిక ఒత్తిడి తగ్గి, మనోధైర్యం పెరుగుతుంది. అలా వ్యాధి తీవ్రతను కూడా తగ్గించవచ్చు. ఈ జబ్బు లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండవు. అలాగే ఒకే రోగిలో కూడా తరచూ లక్షణాలు మారిపోతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఎలాంటి లక్షణాలూ కనిపించకుండానే వ్యాధి ఉండవచ్చు. మరికొన్నిసార్లు చాలా తీవ్రరూపంలో లక్షణాలు కనిపించవచ్చు. ఈ వ్యాధిని తొలిదశలో అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. ఈ రోగులు సూర్యరశ్మికి అతి సున్నితంగా ఉంటారు. ఎండబారిన పడ్డప్పుడు ఒంటిమీద ర్యాష్, దద్దుర్లు, దురద వంటివి కలుగుతాయి. వివిధ రకాలైన మచ్చలు, దీర్ఘకాలికంగా మానని పుండ్లు, నోటిలో పూత, జుట్టు ఎక్కువగా రాలడం, కీళ్లనొప్పుల వంటివి ఈ వ్యాధి ఉన్నవారిలో కనిపించే సాధారణ లక్షణాలు. వ్యాధి తీవ్రత వల్ల కొందరిలో ఒక్కోసారి యుక్తవయసులోనే పక్షవాతం, గుండెపోటు, బుద్ధిమందగించడం వంటి విపరీత లక్షణాలు కూడా కనిపించవచ్చు. అకస్మాత్తుగా చూపుపోవడం, తరచూ ఫిట్స్‌రావడం, రక్తహీనత, తెల్లరక్తకణాలు–ప్లేట్లెట్లు తగ్గిపోవడం కూడా సంభవించవచ్చు. గుండె మీద, ఊపిరితిత్తుల మీద పొర ఏర్పడి, చుట్టూ నీరు చేరడం కూడా జరగవచ్చు. మహిళల్లో తరచూ గర్భస్రావాలు జరగడానికి కూడా లూపస్ ఒక కారణం. ఈ వ్యాధి ప్రభావం మూత్రపిండాలపై పడినప్పుడు ఒళ్లంతా వాపు, బీపీ పెరగడం, మూత్రం నుంచి ఎక్కువగా ప్రోటీన్ పోవడం వంటివి జరుగుతాయి. శరీరంలోని ఏ అవయవమైనా ఈ వ్యాధి బారిన పడవచ్చు. పై అవయవాలు ప్రభావితం అయినప్పుడు... వాటికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి. అప్పుడు ఎన్ని రకాల యాంటీబయాటిక్స్ వాడినా ప్రయోజనం ఉండక, స్టెరాయిడ్స్ అనే మందులు వాడినప్పుడు ఉపశమనం కలుగుతుంటే... లూపస్ వ్యాధిని గుర్తించడానికి అది మంచి అవకాశంగా పరిగణించవచ్చు. ఇలాంటి రోగులను వెంటనే రుమటాలజిస్టులకు చూపించాలి. వ్యాధి నిర్ధారణ చేసి, వారి ఆధ్వర్యంలో మందులు వాడటం వల్ల ఈ వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు. ఆర్థరైటిస్ రోగుల ఆహారం ఎలా ఉండాలి? నా వయసు 33 ఏళ్లు. ఇటీవలే నాకు కీళ్లవాతం (ఆర్థరైటిస్) ఉందని వైద్యులు నిర్ధారణ చేశారు. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఆహార నియమాలను వివరించండి. కీళ్లవాతం (ఆర్థరైటిస్) అని వైద్యులు నిర్ధారణ చేసిన వెంటనే రోగులు, వాళ్ల బంధువులు రోగి అనుసరించాల్సిన ఆహార నియమాల గురించి మొట్టమొదట కలవరపడతారు. అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సావిధానాల కన్న ఆహారపు అలవాట్ల గురించి ఎక్కువగా ఆందోళన పడతారు. ఏ వస్తువులు తినాలి, ఏవి తినకూడదు, ఏయే పదార్థాల వల్ల వాతం తగ్గుతుంది లేదా పెరుగుతుంది లాంటి సందేహాలతో సతమతమవుతారు. చాలామంది వెంటనే దుంపకూరలు, గుడ్లు, మాంసం, వంకాయ, గోంగూర వంటివి తినడం మానేస్తారు. అలాగే కొంతమంది ఒక్కసారిగా చేపలు, వెల్లుల్లి ఎక్కువగా తినడం మొదలుపెడతారు. నిజానికి గౌట్ అనే ఒక రకమైన కీళ్లవాతంలో తప్ప... వేరే ఏ ఇతర కీళ్లవాతాలలోనూ ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అనేక రకాల పరిశోధనలు, క్షుణ్ణంగా పరిశీలనలు జరిపిన తర్వాత శాస్త్రవేత్తలు తేల్చి చెప్పిన మాట ఇది. గౌట్ అనే వ్యాధిలో యూరిక్ యాసిడ్ అనే ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి జరిగి కీళ్లలోకి చేరుతుంది. దానివల్ల కీళ్లలో నొప్పి, వాపు, ఎర్రబారడం వంటివి జరుగుతాయి. ఈ వ్యాధితో బాధపడేవారు మాత్రమే యూరిక్ యాసిడ్ తక్కువగా ఉత్పత్తి చేసే ఆహారాన్ని ఎంపిక చేసేకోవాలి. గౌట్ వ్యాధిగ్రస్తులు మాత్రం మాంసం, చేపలు, పీతలు, రొయ్యలు, బీన్స్ వంటి పదార్థాలను తినకూడదు. అలాగే మద్యం వల్ల కూడా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. అందువల్ల పైన పేర్కొన్నవాటికి దూరంగా ఉండాలి. ఇక ఆర్థరైటిస్ వంటి ఇతర కీళ్లవాతాలతో బాధపడేవారు ఏ విధమైన ఆహార నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. మంచి పౌష్టికాహారంతోపాటు క్యాల్షియమ్ ఎక్కువగా లభించే గుడ్లు, పాలు, పాల పదార్థాలు, ఆకుకూరలు, నట్స్ ఎక్కువగా తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. దాంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కీళ్లకు ఎంతో అవసరం. అది కీళ్లకు మేలు చేస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు స్టెరాయిడ్స్ తప్పవా? నా వయసు 52 ఏళ్లు. నేను తొమ్మిది సంవత్సరాల నుంచి రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నాను. నొప్పి, వాపు తగ్గడం కోసం ప్రిడ్నిసలోన్ అనే మందును చాలా కాలం నుంచీ వాడుతున్నాను. రెండేళ్ల నుంచి నొప్పి పెరిగింది. ప్రతి నెలా స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఉపయోగిస్తున్నాను. నెల కిందట నా ఎడమ కాలు ఎముక విరిగి, ఇంట్లో పనులు చేసుకోడానికి ఇబ్బంది కలుగుతోంది. ఉద్యోగం కూడా మానేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యాధికి స్టెరాయిడ్స్ కాకుండా మెరుగైన చికిత్స ఏదైనా ఉందా? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే మన ఒంట్లో ఉండే రక్షణ వ్యవస్థ మన కణాలనే గుర్తించే సమర్థతను కోల్పోయి మన శరీర అవయవాలపైనే దాడి చేస్తుంది. దాంతో ఈ వ్యాధి వస్తుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధి. దీనిని ప్రారంభదశలోనే గుర్తించి సకాలంలో చికిత్సను ప్రారంభించాలి. నిపుణులు వ్యాధి తీరును బట్టి, తీవ్రతను బట్టి చికిత్స ప్రారంభిస్తారు. అనేక చికిత్స విధానాలు ఉన్నాయి. స్టెరాయిడ్స్ అనేవి చికిత్స విధానాలలో ఒక భాగం. వీటిని దీర్ఘకాలం వాడితే చాలా రకాల ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి. వాటిలో ముఖ్యమైనవి షుగర్, నొప్పి, ఎముకలు బలహీనంగా కావడం... దాంతో తేలిగ్గా విరిగిపోవడం, కంటి శుక్లం, అంటువ్యాధులకు తేలిగ్గా లోనుకావడం వంటివి ముఖ్యమైనవి. కాబట్టి చికిత్స చేసే డాక్టర్లు స్టెరాయిడ్ స్పేరింగ్ డ్రగ్స్ మందులను ఉపయోగిస్తారు. వ్యాధి నిర్ధారణ జరగగానే వీటిని ఉపయోగించాలి. వీటితో పాటు చిన్న చిన్న మోతాదుల్లోనే స్టెరాయిడ్స్‌ను మూడు నుంచి ఆర్నెల్ల వరకు మాత్రమే ఉపయోగించాలి. ఈ స్టెరాయిడ్ స్పేరింగ్ మందుల వల్ల వ్యాధి తీవ్రతను, తీవ్రమైన వ్యాధి వల్ల కలిగే నొప్పి, వాపు, క్లిష్టమైన సమస్యలను అరికట్టవచ్చు. ఇటీవల అనేక ఆధునిక చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని బయొలాజిక్స్ అంటారు. తొలి ప్రాథమ్య ఔషధాలకు లొంగని వ్యాధిగ్రస్తుల్లో వీటిని ఉపయోగిస్తారు. ఈ మందుల వల్ల సత్వర ఉపశమనం కలుగుతుంది. త్వరగా స్టెరాయిడ్స్ వాడకాన్ని తగ్గించుకునే అవకాశం లభిస్తుంది. డాక్టర్ విజయ ప్రసన్న పరిమి సీనియర్ రుమటాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12,బంజారాహిల్స్, హైదరాబాద్. -
పిల్లల్లో కూడా కీళ్లవాతాలు వస్తాయా?
మా ఫ్రెండ్‌వాళ్ల అబ్బాయి వయసు 15 ఏళ్లు. ఈమధ్య అతడికి కీళ్లవాతం వచ్చిందని డాక్టర్ చెప్పారు. దాంతో మేము ఎంతగానో ఆశ్చర్యపోయాం. ఇంత చిన్న పిల్లలకు కూడా ఆర్థరైటిస్ వస్తుందా? కీళ్లవాతం లేదా ఆర్థరైటిస్ అనేవి కేవలం పెద్దవాళ్లకే వస్తాయనే అపోహ చాలామందిలో ఉంటుంది. ఈ వ్యాధులు కేవలం పెద్దవారికే పరిమితం కావు. పిల్లలు కూడా చిన్న వయసులోనే లూపస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఏంకైలోజింగ్ స్పాండలైటిస్, వాస్క్యులైటిస్ వంటి అనేక రకాల కీళ్లవాతాల బారిన పడవచ్చు. వీటన్నింటిలోకీ జువెనైల్ ఇడియోపథిక్ ఆర్థరైటిస్ అనేది చాలా సాధారణంగా చూసే రకం. ఇవన్నీ దీర్ఘకాలిక వ్యాధులు. నెలలు, సంవత్సరాలు లేదా జీవితకాలం కూడా కొనసాగుతాయి. పిల్లలకు కీళ్లవాతం ఎందుకొస్తుంది? : ఈ జబ్బులు ఎందుకు వస్తాయనే అంశంపై నిర్దిష్టంగా ఇంకా కారణాలు పెద్దగా తెలియదు. అయితే రకరకాల పరిశోధనల తర్వాత వీటిని జన్యులోపాలే ప్రధాన కారణాలని శాస్త్రవేత్తలు నిర్ధారణ చేశారు. జన్యులోపం ఉన్నప్పుడు బయటి వాతావరణంలోని క్రిములు, కాలుష్యం వంటి అంశాలు వ్యాధిని తేలిగ్గా ప్రేరేపించగలవు. ఫలితంగా మన శరీరంలోని వ్యాధినిరోధక శక్తి సొంత కణాలనే పరాయివిగా భావించి వాటిపై దాడికి దిగుతాయి. ఈ స్వీయదాడి ఫలితంగా కీళ్లు, కండరాలు మాత్రమేగాక ఇంకా చాలా అవయవాలు ప్రభావితమవుతాయి. అందుకే దీన్ని ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటారు. లక్షణాలు: వ్యాధి లక్షణాలు పిల్లలందరిలో ఒకేలా ఉండవు. ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపించడమే కాకుండా తరచూ మారుతుంటాయి. ఎక్కువగా కీళ్ల మీద ప్రభావం చూపినప్పటికీ, ఊపిరితిత్తులు, కళ్లు, చర్మం, కాలేయం, మూత్రపిండాలు, గుండె వంటి అవయవాలపైన కూడా ఈ వ్యాధి ప్రభావం పడుతుంది. పెద్దవారిలో కనిపించే కీళ్లవాతానికీ, పిల్లల్లో కనిపించే దానికి చాలా తేడాలుంటాయి. పిల్లల్లో అభివృద్ధి చెందే ఎముకలపైన ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పిల్లల్లో పెరుగుదల ఆగిపోతుంది. కళ్ల మీద కూడా ప్రభావం పడి, చూపు పోయే ప్రమాదం ఉంటుంది. ఈ కీళ్లవాతపు వ్యాధులు సాధారణ చికిత్సా విధానాలకు లొంగవు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ లక్షణాల తీవ్రత పెరగడం, మందుల దుష్ప్రభావాలు కలగడం, జీవితకాలపు వైకల్యం వంటి ప్రమాదాలనూ ఎదుర్కొంటారు. కొన్నిసార్లు జబ్బు తీవ్రత అకస్మాత్తుగా ఏ కారణమూ లేకుండానే పెరిగిపోతుంది. మరికొన్నిసార్లు ఎలాంటి తీవ్రతా కనిపించదు. అలాగే మానసిక ఆరోగ్యంపై కూడా ఈ వ్యాధుల ప్రభావం ఉంటుంది. ఆందోళన, డిప్రెషన్, ఆత్మహత్యాప్రయత్నాల వంటి పరిణామాలకు దారితీస్తాయి. అందువల్ల కుటుంబసభ్యుల మీద కూడా ఒత్తిడి ఉంటుంది. విద్యా, వృత్తిపరమైన ఇబ్బందుల కారణంగా రోగులు సామాజికంగా ఇక్కట్లు ఎదుర్కొంటారు. జాగ్రత్తలు : ఈ జబ్బు లక్షణాలను పసిగట్టినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే రుమటాలజిస్ట్ను కలవాలి. వ్యాధి నిర్ధారణ జరిగాక, దాని తీవ్రతను బట్టి వారు మందులు సూచిస్తారు. ►రుమటాలజిస్ట్ పర్యవేక్షణలో మాత్రమే ఈ మందులు వాడాలి. ►కంటిపైనా, ఇతర అవయవాలపై ఈ వ్యాధి ప్రభావం పడిందో లేదో తెలుసుకునేందుకు తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ►సరైన పోషణ, క్యాల్షియమ్, విటమిన్–డి సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అయితే చాలామందికి ఆహారం ద్వారా కావలసిన క్యాల్షియమ్ లభించదు. అలాంటి వారికి క్యాల్షియమ్ సప్లిమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ►కీళ్లవాతం వల్ల ఎముకలు, కండరాలు బలాన్ని కోల్పోతాయి. సరైన వ్యాయామం వల్ల ఇవి బలంగా తయారవుతాయి. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల వైకల్యాన్ని నివారించవచ్చు. ►ఈ చిన్న చిన్న జాగ్రత్తలతో, రుమటాలజిస్టుల సలహా మేరకు సరైన మందులు వాడటం వల్ల ఈ రోగులు ఎప్పటికీ నార్మల్ జీవితాన్నే గడపవచ్చు. చికిత్సా విధానాలు: గతంలో అరుదుగా కనిపించే ఈ రకం జబ్బుల్ని ఇటీవల తరచూ చూడటం జరుగుతోంది. చికిత్సావిధానాలు కీళ్లవాతం రకాన్ని బట్టి ఉంటాయి. కొంతమందికి చిన్ని నొప్పినివారణ మందులతోనే నయమవుతుంది. మరికొందరిలో స్టెరాయిడ్స్ అవసరమవుతాయి. వాటికీ లొంగని వ్యాధులకూ, ప్రాణాంతకమైన రకాలకు డిసీజ్ మాడిఫైడ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్ (డీమార్డ్స్) అనే తరహా మందులు వాడాల్సి ఉంటుంది. వీటిని నివారించలేనప్పటికీ, సరైన సమయంలో వైద్యచికిత్స తీసుకుంటే శాశ్వతంగా ఉపశమనం పొందవచ్చు. -
ఆర్థరైటిస్కూ వ్యక్తిగత వైద్యం...
కీళ్లవాతం (రుమటాయిడ్ ఆర్థరైటిస్)కు మరింత మెరుగైన చికిత్స అందించేందుకు నార్త్ వెస్టర్న్ మెడిసిన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జన్యుక్రమం ఆసరా తీసుకున్నారు. వ్యక్తి జన్యుక్రమానికి అనుగుణంగా వారికి కీళ్లవాతం మందులు తయారుచేసి ఇవ్వడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం ఇస్తున్న మందులు చాలామందిలో ఏ మాత్రం ప్రభావం చూపవన్న సంగతి తెలిసిందే. కీళ్ల వాతానికి ప్రస్తుతం చాలా మందులు అందుబాటులో ఉన్నాయనీ.. అయితే ఒక్కోదాన్నీ 12 వారాల పాటు వాడిన తరువాతే అది పనిచేస్తుందా? లేదా? అన్నది తెలుస్తుందనీ.. ఒకవేళ పనిచేయకపోతే డాక్టర్లు వెంటనే మరో మందు పేరు రాస్తారనీ.. ఇది కూడా పనిచేస్తుందన్న గ్యారెంటీ ఏమీ ఉండదనీ పెర్ల్‌మ్యాన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. ఈ నేపథ్యంలో తాము ఒక అధ్యయనం నిర్వహించామని, కొంతమంది బాధితుల జన్యుక్రమాలను విశ్లేషించామని చెప్పారు. సాధారణ మందులతో మంచి ఫలితాలు సాధించిన వారి జన్యువులతో పోల్చి అవే మందులు ఇచ్చినప్పుడు వీరిలోనూ మెరుగైన ఫలితాలు వచ్చాయని వివరించారు. ఈ అధ్యయనం ఆధారంగా జన్యుమార్పులకు అనుగుణంగా మెరుగైన ఫలితాలిచ్చే మందులను గుర్తించగలిగామని, త్వరలో కీళ్లవాతం ఉన్న వారందరికీ ఈ పద్ధతి అందుబాటులోకి వచ్చే అవకాశముందని చెప్పారు. -
తేలు విషంతో కూడా చికిత్స..
హ్యూస్టన్: కాస్త వయసు మీదపడితే కీళ్ల నొప్పులు పెట్టే ఇబ్బంది అంతాఇంతా కాదు. అడుగుతీసి అడుగు వేయడానికే వృద్ధులు ఇబ్బంది పడుతుంటారు. ఇక మెట్లెక్కడమంటే వారికి నరకం కనిపిస్తుంది. అయితే ఇలాంటివారికి శాస్త్రవేత్తలు ఓ శుభవార్త చెబుతున్నారు. తేలు విషం రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సకు ఎంతగానో ఉపయోగపడుతుందని, పైగా ఎటువంటి దుష్ఫలితాలు కూడా ఉండవని భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే జంతువులపై చేసిన పరిశోధనలు సత్ఫలితాలనిచ్చాయని అమెరికాలోని బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు తెలిపారు. పరిశోధకుల్లో ఒకరైన క్రిస్టియన్ బీటన్ ఈ విషయమై మాట్లాడుతూ.. ఫైబ్రోబ్లాస్ట్ లైక్ సినోవైయోసైట్స్(ఎఫ్ఎల్ఎస్) కణాలు ఈ వ్యాధిలో కీలక పాత్ర పోషిస్తాయని, ఈ కణాలు పెరిగి.. ఒకచోటు నుంచి మరోచోటుకు కదిలినప్పుడు తీవ్రమైన నొప్పి కలుగుతుందని, ఈ కణాల కారణంగానే కొన్నిసార్లు కీళ్లు దెబ్బతింటాయన్నారు. ఈ కణాలు రోగనిరోధక శక్తి కలిగించే కణాలను కూడా ఆకర్షించి, నాశనం చేస్తాయని తెలిపారు. తాజా చికిత్సలో తేలు విషయంలో ఉండే పొటాషియం కంపోనెంట్ ఎఫ్ఎల్ఎస్ కణాలను నిర్వీర్యం చేస్తుందని, ఫలితంగా ఇతర కణాలకు ఎటువంటి హాని కలగకుండానే వ్యాధి నయమవుతుందని చెప్పారు. -
పొద్దున్నే కీళ్లు పట్టేస్తున్నాయి... ఎందుకిలా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. నేను పదేళ్లుగా కీళ్లనొప్పుల సమస్యతో బాధపడుతున్నాను. పొద్దున్న లేవగానే కీళ్లన్నీ పట్టేసి జ్వరం వచ్చినట్లుగా ఉండి, మధ్యాహ్నానికి ఉపశమనం కలుగుతోంది. ఈఎస్ఆర్ పెరిగి ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చిందన్నారు. ఈ కీళ్లనొప్పులకు హోమియోలో చికిత్స ఉందా? – సుమతి, కర్నూలు మీకు వచ్చిన వ్యాధిని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో ఒకర కం. మన శరీరం వ్యాధుల బారిన పడకుండా కాపాడటానికి, వాటితో పోరాడటానికి ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఆ రక్షణ వ్యవస్థ ఒక్కోసారి పొరబడి తన సొంత శరీరం పైనే దాడి చేస్తే వచ్చే సమస్యల్లో ఇది ఒకటి. ఈ వ్యాధి శరీరంలోని ఇరుపక్కలా సమాంతరంగా వ్యాప్తి చెందుతుంది. కీళ్లు తీవ్రమైన వాపునకు గురికావడంతో వాటి కదలికలు పూర్తిగా స్తంభిస్తాయి. దాంతో కీళ్లు వైకల్యానికి గురికావడం, కీళ్లనొప్పులు, వాపు, కీళ్లు పట్టివేయడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. కీళ్లతోబాటు కళ్లు, నోరు, ఊపిరితిత్తులకు కూడా వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఒక్కోసారి ఒకటి కంటే ఎక్కువ కీళ్లలో కనిపిస్తుంది. అయితే మొదట చేతివేళ్లు, కాలివేళ్ల వంటి చిన్న చిన్న కీళ్లలో మొదలై ఆ తర్వాత మోచేయి, మోకాలు, తుంటి వంటి పెద్ద కీళ్లలోకి పాకుతుంది. కారణాలు : ∙శరీరంలోని జీవక్రియల్లో అసమతుల్యత, రోగ నిరోధక వ్యవస్థలోని మార్పుల వల్ల ఈ జబ్బు వస్తుంది. ∙శారీరక, మానసిక ఒత్తిడి ∙పొగతాగడం, మద్యం అలవాటు ఉన్నవారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. ∙ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అస్సలు పాటించని వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. లక్షణాలు : ∙నిరాశ, అలసట, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం ∙మడమలు, చేతి ఎముకలపై చిన్న గడ్డలు రావడం ∙ఉదయం లేచిన వెంటనే కీళ్లు బిగపట్టినట్లుగా ఉండి, నొప్పి ఉండటం ∙ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం, ఊపిరితిత్తులు గట్టిపడటం ∙రక్తహీనత, జ్వరం వంటివి. నిర్ధారణ పరీక్షలు : సీబీపీ, ఈఎస్ఆర్, ఎక్స్–రే, ఎమ్మారై, ఆర్.ఏ. ఫ్యాక్టర్, ఏఎన్ఏ, ఎల్ఎఫ్టీ. చికిత్స : రోగి మానసిక, శారీరక లక్షణాలను అనుసరించి చికిత్స చేయాల్సి ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. బ్రయోనియా, రస్టాక్స్, కాల్చికమ్, ఆర్సినికమ్, లైకోపోడియమ్, నేట్రమ్మూర్ మొదలైన మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే వ్యాధి సంపూర్తిగా నయమవుతుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ మైగ్రేన్ పెద్ద సమస్యగా మారిపోయింది..? నా వయసు 32 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని. నాకు కొంతకాలంగా తలలో ఒకవైపు విపరీతమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే మైగ్రేన్ అన్నారు. దీంతో ఏ పనిపైనా శ్రద్ధ పెట్టలేకపోతున్నాను. నా ఈ సమస్యకు హోమియోలో పూర్తి పరిష్కారం లభించే అవకాశం ఉందా? సలహా ఇవ్వగలరు. – సురేశ్, హైదరాబాద్ సాధారణంగా ఈ సమస్య 15 – 45 ఏళ్ల వారిలో ఎక్కువగా ఉంటుంది. యువకులతో పోలిస్తే యువతుల్లో మరీ ఎక్కువ. పార్శ్వపు నొప్పి అని కూడా పిలిచే ఈ మైగ్రేన్ తలనొప్పిలో తలలో ఒకవైపు తీవ్రమైన నొప్పి వస్తుంది. సాధారణంగా ఇది మెడ వెనక ప్రారంభమై కంటివరకు వ్యాపిస్తుంది. కారణాలు: పార్శ్వపు నొప్పికి నిర్దిష్ట కారణాలేమిటనే విషయం ఇప్పటికీ స్పష్టంగా తెలియనప్పటికీ, తలలోని కొన్ని రకాల రసాయనాలు అధిక మోతాదులో విడుదల కావడం వల్ల పార్శ్వపు నొప్పి వస్తుందని తెలుస్తోంది. ఇక శారీరక, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, చాలాసేపు ఆకలితో ఉండటం, సమయానికి భోజనం చేయకపోవడం, సైనసైటిస్, అతి వెలుగు, గట్టి శబ్దాలు, ఘాటైన సువాసనలు, పొగ, మద్యం వంటి అలవాట్లు, మహిళల్లో నెలసరి సమయాల్లో, మెనోపాజ్ సమయాల్లో స్త్రీలలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వంటివి ఈ సమస్యకు కారణాలుగా చెప్పవచ్చు. లక్షణాలు : పార్శ్వపు నొప్పిలో చాలారకాల లక్షణాలు కనిపిస్తాయి. వాటిని మూడు రకాలుగా విభజించవచ్చు. 1. పార్శ్వపు నొప్పి వచ్చేముందు కనిపించే లక్షణాలు : ఇవి పార్శ్వపునొప్పి వచ్చే కొద్ది గంటలు లేదా నిమిషాల ముందు వస్తాయి. చికాకు, నీరసం, అలసట, నిరుత్సాహం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని రకాల తినుబండారాలు ఇష్టపడటం, వెలుతురు, శబ్దాలను తట్టుకోలేకపోవడం, కళ్లు మసకబారడం, కళ్ల ముందు మెరుపులు కనిపించడం జరగవచ్చు. వీటినే ‘ఆరా’ అంటారు. 2. పార్శ్వపునొప్పి సమయంలో కనిపించే లక్షణాలు: అతి తీవ్రమైన తలనొప్పి, తలలో ఒకవైపు వస్తుంటుంది. ఇది 4 నుంచి 72 గంటల పాటు ఉండవచ్చు. 3. పార్శ్వపు నొప్పి వచ్చాక కనిపించే లక్షణాలు: చికాకు ఎక్కువగా ఉండటం, నీరసంగా ఉండటం, వికారం, వాంతులు, విరేచనాలు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స / నివారణ : కొన్ని అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి. మనకు ఏయే అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తున్నాయో జాగ్రత్తగా గమనించి, వాటికి దూరంగా ఉండటం ద్వారా మైగ్రేన్‌ను నివారించవచ్చు. అలాగే కాన్స్టిట్యూషన్ పద్ధతిలో ఇచ్చే ఉన్నత ప్రమాణాలతో కూడిన హోమియో చికిత్స ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ మాటిమాటికీ జలుబు... వాసనలు తెలియడం లేదు నా వయసు 29 ఏళ్లు. నాకు గత ఆర్నెల్లుగా తుమ్ములు, ముక్కుకారడం, ముక్కులు బిగదీసుకుపోతున్నాయి. ఇలా తరచూ జలుబుచేస్తూనే ఉంది. వాసనలు తెలియడం లేదు. చాలా మంది డాక్టర్లను కలిశాను. ఈ సమస్య తగ్గినట్టే తగ్గి, మళ్లీ వస్తోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? హోమియోలో దీనికి పరిష్కారం చెప్పండి. – సుధాకర్‌రావు, నల్లగొండ మీరు వివరించిన లక్షణాలను బట్టి మీరు ‘అలర్జిక్ రైనైటిస్’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీకు సరిపడనివి తగిలినప్పుడు (దుమ్ము, ధూళి, పుప్పొడి, ఘాటువాసనలు) మీకు అలర్జీ మొదలవుతుంది. దాంతో ముక్కులోని రక్తనాళాలు ఉబ్బినట్లుగా అయి, ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కు బిగదీసుకుపోవడం వంటివి కనిపిస్తాయి. లక్షణాలు : ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కుకారడం వంటి లక్షణాలే గాక... వాటిని నిర్లక్ష్యం చేస్తే సైనస్లకు ఇన్ఫెక్షన్ సోకి తలబరువు, తలనొప్పి వంటివి కనిపించవచ్చు. ముక్కుపొరలు ఉబ్బడం వల్ల గాలి లోపలికి వెళ్లక వాసనలు కూడా తగ్గిపోతాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మున్ముందు సైనసైటిస్, నేసల్ పాలిప్స్, వంటి పెద్ద పెద్ద సమస్యలూ వచ్చేందుకు అవకాశం ఉంది. వ్యాధి నిర్ధారణ కోసం ఎక్స్–రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. నివారణ: ∙అలర్జీ కారకాలకు సాధ్యమైనంత దూరంగా ఉండటం ∙సరైన పోషకాహారం తీసుకోవడం ∙ముక్కుకు సంబంధించిన వ్యాయామాలు చేయడం చల్ల్లని వాతావరణానికి, పొగతాగే అలవాటుకు దూరంగా ఉండటం. చికిత్స: హోమియోలో వ్యక్తిగత లక్షణాలనూ, మానసిక స్వభావాన్ని బట్టి కాన్స్టిట్యూషన్ చికిత్స ఇవ్వవచ్చు. దీనివల్ల వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. క్రమక్రమంగా వ్యాధి తీవ్రతను తగ్గిస్తూ పోయి, అలా సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ ఉంటే అలర్జిక్ రైనైటిస్ పూర్తిగా తగ్గుతుంది. హోమియోలో కాన్స్టిట్యూషనల్ ప్రక్రియ ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
సహజసిద్ధమైన మోకాలుకు ప్రత్యామ్నాయం ‘అట్యూన్’
తాడేపల్లి రూరల్, న్యూస్‌లైన్: జాయింటు రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సలు అవసరమయ్యే ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడుతున్న వారికి ‘అట్యూన్’ ద్వారా మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలో తాడేపల్లి మణిపాల్ సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి ఒక విప్లవాత్మకమైన విధానానికి నాంది పలికిందని మణిపాల్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ నిపుణుడు నల్లమోతు జగదీష్ పేర్కొన్నారు. శుక్రవారం మణిపాల్ ఆసుపత్రిలో ‘అట్యూన్’ ఇంప్లాంట్‌ను ఉపయోగించి జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. ‘అట్యూన్’ ప్రపంచంలో అందుబాటులోకి వచ్చిన అత్యంత అధునాతన విధానమని, దీని ద్వారా ముఖ్యమైన, సహజసిద్ధమైన ఎముకలోని చాలా భాగాన్ని, లిగ్మెంట్స్, కణజాలాన్ని అందేలా ఉంచడం జరుగుతుందని, దాని వలన ఎముకలు దీర్ఘకాలం ఇబ్బందికి గురికాకుండా ఉంటాయని తెలిపారు. సాధారణ మోకాలు జాయింటు లాగా అట్యూన్ అదనపు ఎముక నష్టం లేకుండా 140 నుంచి 150 డిగ్రీలలో మడవ వచ్చని తెలిపారు. గతంలో మోకాలు శస్త్రచికిత్స కోసం వినియోగించిన ఇంప్లాంట్స్ కేవలం 8 నుండి 10 సంవత్సరాల వరకు మాత్రమే పని చేసేవని, కానీ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ రూపొందించిన అట్యూన్ 30 సంవత్సరాలు పని చేస్తుందన్నారు. ఇటీవల కాలంలో యువకులు సైతం మోకాలు నొప్పులతో ఇబ్బందులు పడుతుండడాన్ని గుర్తించిన ఆ కంపెనీ 30 సంవత్సరాలపాటు మనగలిగే ఈ అట్యూన్ను రూపొందించిందన్నారు. అట్యూన్ను కేవలం ప్రత్యేక శిక్షణ పొందిన వైద్యులకు మాత్రమే జాన్సన్ కంపెనీ సరఫరా చేస్తుందని, మొదటి దశలో దేశవ్యాప్తంగా కేవలం అట్యూన్ శస్త్ర చికిత్స నిమిత్తం 12 మంది వైద్యులకు మాత్రమే శిక్షణ ఇచ్చారని, వారిలో ఆంధ్రప్రదేశ్ నుండి తాను శిక్షణ పొందినట్టు డాక్టర్ జగదీష్ తెలిపారు.