ప్రస్తుతం చాలా మంది చేతులు, తుంటి, వెన్నెముక, మోకాళ్లు, కీళ్లలో నొప్పులతో బాధపడుతున్నారు. ప్రస్తుతం చాలా మందిలో యూరిక్ యాసిడ్ పెరగడం కారణంగా కీళ్ల నొప్పులు, వాపుల సమస్యల బారిన పడుతున్నారు. వ్యాయామాలు చేయడం కారణంగా ఈ నొప్పులు తీవ్ర తరమవుతున్నాయి. ఎలాంటి ఆహారాలు తీసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందో తెలుసుకుందాం.
కీళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతి రోజు ఆహారంలో బాదం, వేరుశెనగ, వాల్‌నట్స్ తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో పుష్కలంగా లభించే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వీటిల్లో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్ ఉ కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. ఎక్కువగా వినియోగించడం వల్ల కీళ్లనొప్పుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
బెర్రీలు బ్లబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, స్ట్రాబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల వీటిని ప్రతిరోజు తినడం కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెర్రీల వల్ల శరీరానికి ఫ్రీ రాడికల్స్ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
కూరగాయలు సల్ఫోరాఫేన్ కలిగిన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా సులభంగా యూరిక్ యాసిడ్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు బ్రోకలీ, కాలీఫ్లవర్‌లను ఆహారంలో తీసుకోవాలి.
ఆలివ్ ఆయిల్ కీళ్ల నొప్పులున్నవారు ఆలివ్ ఆయిల్‌ను వినియోగించి తయారు చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా మార డంతోపాటు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
డార్క్ చాక్లెట్ ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు లభిస్తాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు రోజూ వీటిని తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. మధుమేహం ఉన్నవారు తీసుకోవడం వల్ల చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి.
(చదవండి: దెబ్బ తగిలిన ప్రతీసారీ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాల్సిందేనా? ఎలాంటప్పుడూ అవసరం?..)
Comments
Please login to add a commentAdd a comment