వైద్య చికిత్స కోసం దొంగగా మారి...  | Karnataka Man Turned Thief For Medical Treatment | Sakshi
Sakshi News home page

వైద్య చికిత్స కోసం దొంగగా మారి... 

Dec 14 2021 2:53 PM | Updated on Dec 14 2021 2:53 PM

Karnataka Man Turned Thief For Medical Treatment - Sakshi

నిందితుడు యల్లప్ప

ఓడీ చెరువు(అనంతపురం జిల్లా): చేతిలో చిల్లిగవ్వలేక వైద్య చికిత్సలకు ఇబ్బంది పడుతూ దొంగగా మారాల్సి వచ్చిందని పోలీసుల ఎదుట కర్ణాటక వాసి వాపోయాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని గొర్తుపల్లి చెర్లోపల్లికి చెందిన యల్లప్ప రెండు కాళ్లకు గాయాలతో బాధపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సరైన వైద్యం చేయించుకోలేక పోయాడు.

చదవండి: దారుణ హత్య: తల, మొండెం వేరుచేసి తలతో పారిపోయిన ప్రియుడు 

ఈ క్రమంలోనే సోమవారం ద్విచక్ర వాహనంపై ఓడీ చెరువు మండలం గౌరాపురం మీదుగా వెళుతూ.. పొలం పనులు ముగించుకుని ఒంటరిగా ఎదురైన వృద్ధురాలు గుణమ్మతో మాటలు కలిపాడు. చెవిలోని కమ్మలు ఇస్తే రూ.25వేలు ఇస్తానని నమ్మబలికాడు. దీంతో ఆమె కమ్మలు తీసి ఇవ్వగానే ద్విచక్ర వాహనంపై ఉడాయించాడు. వృద్ధురాలి కేకలకు అప్రమత్తమైన స్థానికులు వాహనాల్లో వెంబడించి కర్ణాటక సరిహద్దులో యల్లప్పను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తన దుస్థితిని పోలీసులకు వివరించి, వైద్య చికిత్సల కోసమే ఇలా మోసం చేయాల్సి వచ్చిందంటూ  నిందితుడు వాపోయాడు. ఘటనపై ఎస్‌ఐ గోపీ దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement