కర్ణాటక, దొడ్డబళ్లాపురం: సంతానం కోసం ఆశపడ్డ ఆ దంపతులు తీసుకున్న నాటు మాత్రలు వికటించి ప్రాణాల మీదకు తెచ్చిన సంఘటన నెలమంగల తాలూకా అరిశినకుంట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులయిన శశిధర్,గంగమ్మ దంపతులు మాత్రలు మింగినవారు. శశిధర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మతిచెందగా, భార్య గంగమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వీరికి పెళ్లయి 12 సంవత్సరాలైన పిల్లలు కలగకపోవడంతో తీవ్ర కలత చెందారు. సోమవారంనాడు బీహార్‌కు చెందిన కొందరు కారులో ప్రకటన చేసుకుంటూ వచ్చి సంతానం కోసం మాత్రలు ఇస్తామని నమ్మబలికారు. మాత్రల విలువ రూ.25వేలని చెప్పారు. వారి మాటలు నమ్మిన దంపతులు అడ్వాన్స్‌గా రూ.2వేలు ఇచ్చి మాత్రలు తీసుకున్నారు. విక్రేతల ముందే దంపతులిద్దరూ మాత్రలు మింగారు. 10 నిమిషాల్లో ఇద్దరికీ వాంతులు,విరేచనాలు అయ్యాయి. తక్షణం ఇరుగుపొరుగు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పలించక శశిధర్ మృతిచెందగా గంగమ్మ చికిత్స పొందుతోంది. నెలమంగల పోలీసులు గంగమ్మ వద్ద వాంగ్మూలం తీసుకుని కేసు నమోదుచేసి, మాత్రలు అమ్మిన ముఠా కోసం వెదుకుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment