Lung cancer
-
World Lung Cancer Day 2024 లక్షణాలను గుర్తించడం ముఖ్యం, లేదంటే ముప్పే!
ఊపిరితిత్తుల క్యాన్సర్ అత్యంత సాధారణ కేన్సర్. ప్రపంచవ్యాప్తంగా అనేకమరణాలను ప్రధానకారణం లంగ్ కేన్సర్. ప్రతీ ఏడాది 1.6 మిలియన్ల మంది ఈ కేన్సర్‌కి బలవుతున్నారు. ఊపిరితిత్తుల కేన్సర్‌కు ప్రధాన కారణం పొగాకు,ధూమపానం అయినప్పటికీ, ఎపుడూ ధూమపానం చేయని వ్యక్తులలో కూడా సంభవించవచ్చు. దాదాపు 15 శాతం మంది పొగాడు వినియోగం చరిత్ర లేనప్పటికీ ఈ వ్యాధిబారిన పడుతున్నారని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. అందుకే దీనిపై అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. ఈరోజు ( ఆగస్టు 1)న ప్రపంచ ఊపిరితిత్తుల కేన్సర్ దినోత్సవంగా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. ధూమపానంతో పాటు కొన్ని జన్యు పరమైన కారణాలు, గాలి కాలుష్యం, పరోక్షంగా ధూమపాన ప్రభావానికి లోనుకావడం, ఆస్బెస్టాస్ ఎక్స్పోజర్, రాడాన్ వాయువులు, డీజిల్ ఎగ్జాస్ట్ పొగ తదితర కారణాల వల్ల ఈ వ్యాధి సోకుతుంది. దీర్ఘకాలికంగా స్టెరాయిడ్స్ వాడే వారిలో కూడా ఈ ఊపిరితిత్తుల కేన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. ఊపిరితిత్తుల కేన్సర్‌ను సోకిన మహిళల్లో 20 శాతం మంది ఎప్పుడూ ధూమపానం చేయనివారే.ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం 2024: చరిత్రఊపిరితిత్తుల కేన్సర్ వ్యాప్తి మరియు ప్రభావం,ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం పాటిస్తారు. ఫోరమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రెస్పిరేటరీ సొసైటీస్ (FIRS), ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ లంగ్ క్యాన్సర్ (IASLC) మధ్య సహకారంతో 2012లో మొదటిసారిగా దీన్ని పాటించారు. గమనించారు. ఇక అప్పటినుంచి ఊపిరితిత్తుల కేన్సర్ దినోత్సవాన్ని ఏటా ఆగస్టు 1న జరుపు కుంటారు. లంగ్ కేన్సర్‌పై అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం.కేన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించడం, సమయానికి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. ఈ కేన్సర్‌ను ఎదుర్కోవడానికి కొనసాగుతున్న పరిశోధన ఆవిష్కరణల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రచారాలు ,కార్యకలాపాలు నిర్వహిస్తారు.థీమ్: “క్లోజ్ ది కేర్ గ్యాప్: ప్రతి ఒక్కరూ కేన్సర్ నుంచి రక్షణ పొందేందుకు అర్హులు’’ అనే థీమ్‌తో 2024 వరల్డ్ లంగ్ కేన్సర్ డే ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.ఊపిరితిత్తుల కేన్సర్ రకాలుఊపిరితిత్తుల క్యాన్సర్ సాధారణంగా రెండు రకాలగా విభజించారు. నాన్-స్మాల్ సెల్ ఊపిరితిత్తుల కేన్సర్ (NSCLC) , చిన్న-కణ ఊపిరితిత్తుల క్యాన్సర్ (SCLC). రెండో రకం కేన్సర్‌లో రెండింటి లక్షణాలు ఉంటాయి. లక్షణాలు ఎడతెరపి లేని దగ్గుఉన్నట్టుండి బరువు తగ్గడంగాలిపీల్చుకోవడంలో ఇబ్బంది, ఆయాసంఛాతీలో నొప్పిదగ్గుతున్నప్పుడు రక్తం పడటంఎముకల్లో నొప్పివేలిగోళ్లు బాగా వెడల్పుకావడంజ్వరం అలసట / నీరసంఆహారాన్ని మింగడంలో ఇబ్బందులుఆహారం రుచించకపోవడంగొంతు బొంగురుపోవడంచర్మం, కళ్లు పసుపు రంగులో మారడంనోట్ : వీటిల్లో కొన్ని లక్షణాలు కనిపించినంత మాత్రాన కేన్సర్ సోకినట్టు కాదు. ఇలాంటి లక్షణాలు శరీరంలో కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. టీబీ సోకినా వీటిల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వైద్య నిపుణుల పర్యవేక్షణలో వ్యాధి నిర్ణారణ చేసుకోవాలి. ఈ కేన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులువవుతుంది. -
చావు వస్తుందని తెలిసి.. ముందే ఏర్పాట్లు చేసుకుని..
ఖమ్మం: ఈరోజుల్లో మనిషికి చావు ఊహించనిది. కానీ, అతనికి మాత్రం ఊహించిందే. అందుకే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. జీవిత భాగస్వామి కోసం కావాల్సిన ఏర్పాట్లు చేసేశాడు. కన్నవాళ్లకు, తోడబుట్టిన వాడికి ధైర్యం చెప్పి.. ఓదారుస్తూ వచ్చాడు. విదేశాల్లో ఉంటున్న తాను.. ఎలాగైనా తన మృతదేహం స్వదేశానికి చేరేలా ముందుగానే ఏర్పాట్లు చేశాడు. ఖమ్మం వాసులను కంటతడి పెట్టిన హర్షవర్థన్ గాథలోకి వెళ్తే.. ఖమ్మం సిటీలో ఉండే ఏపూరి రామారావు, ప్రమీలకు ఇద్దరు సంతానం. పెద్ద కొడుకు హర్షవర్థన్ బీఫార్మసీ చేసి.. 2013లో ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడ ఉన్నత విద్యను అభ్యసించి.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తూ వచ్చాడు. కరోనాకి ముందు.. 2020 ఫిబ్రవరిలో ఖమ్మం వచ్చి వివాహం చేసుకున్నాడు. వీసా వస్తే భార్యను తీసుకెళ్లాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలో వైరస్-లాక్డౌన్ వచ్చి పడ్డాయి. ఇదిలా ఉండగానే.. 2020 అక్టోబర్‌లో జిమ్ చేస్తున్న హర్షవర్ధన్‌కి ఆరోగ్యం తేడాగా అనిపించింది. దగ్గు ఆయాసం అనిపించడంతో టెస్టులు చేయించుకోగా.. లంగ్స్ క్యాన్సర్ సోకిందని చెప్పారు. తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో.. వాళ్లు రోదించారు. ఇంటికి వచ్చేయమని కోరారు. కానీ, హర్ష వాళ్లకు ధైర్యం అందించాడు. అక్కడే ఉండి చికిత్స తీసుకుంటానని చెప్పాడు. క్యాన్సర్ సోకింది.. తనకు చావు తప్పదని అనుకున్నాడో ఏమో భార్యకు విడాకులిచ్చేశాడు. అంతేకాదు.. ఆమె జీవితంలో స్థిరపడేందుకు కొన్ని ఏర్పాట్లు చేశాడు. ఈ క్రమంలో.. క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న క్రమంలో.. నయమైందని డాక్టర్లు చెప్పడంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 2022 సెప్టెంబర్‌లో ఇంటికి వచ్చి పదిరోజులు ఉన్నాడు. తిరిగి వెళ్లాక.. వ్యాధి తిరగబడింది. ఇక చావు తప్పదని అతనికి అర్థమైంది. విషయం అందరికీ ఫోన్ చేసి చెప్పాడు. రోజూ వీడియో కాల్లో మాట్లాడడం చేశాడు. ఇంతలో తమ్ముడు అఖిల్‌కు వివాహం నిశ్చయ్యం అయ్యిందని సంతోషించాడు. మే నెలలో ముహూర్తం ఫిక్స్ చేయడంతో.. సంతోషించి ఆరోగ్యం సహకరిస్తే వస్తానంటూ చెప్పాడు కూడా. ఆ సమయంలో అతని ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాను చనిపోయాక.. మృతదేహాన్ని స్వదేశానికి తరలించడంపై అతను దృష్టిసారించారు. ఆ విషయంలో తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనుకున్నాడు. ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం.. ఓ లాయర్‌ను పెట్టుకుని ఫార్మాలిటీస్ పూర్తి చేశాడు. మార్చి 24వ తేదీన హర్షవర్ధన్ కన్నుమూశాడు. ఏప్రిల్ 5వ తేదీ(బుధవారం) అతని మృతదేహాం ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు చేరింది. హర్ష మృతదేహాన్ని చూసి కుటుంబంతో పాటు స్థానికులంతా కన్నీరు మున్నీరుగా విలపించగా.. అంత్యక్రియలు ముగిశాయి. -
రాచపుండు... కేసులు మెండు
మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేక పోవడం, ధూమపానం, రోజు రోజుకు పెరుగుతున్న పర్యావరణ కాలుష్యాలు ప్రజల్లో క్యాన్సర్ బీజాల్ని నాటుతున్నాయి. ఫలితంగా గతంలో పొగతాగేవారికి మాత్రమే సోకే లంగ్ క్యాన్సర్ ఇప్పుడు అందరికీ సోకుతోంది. మరోవైపు జంక్‌ఫుడ్స్‌కు అలవాటు పడుతున్న నగర వాసులు అన్నవాహిక, లివర్, పేగుల క్యాన్సర్లకు గురవుతున్నట్లు వైద్యులు చెపుతున్నారు. క్యాన్సర్ కేసులు, నివారణ మార్గాలపై ప్రత్యేక కథనం. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల్లో క్యాన్సర్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అందుకు ప్రజల జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లే ప్రధాన కారణంగా చెబుతున్నారు. రెండు జిల్లాల్లో నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో ప్రధానంగా పట్టణ ప్రాంతాల మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా, గ్రామీణుల్లో సర్వైకల్ క్యాన్సర్(గర్భాశయ ముఖద్వారం) సోకుతున్నట్లు చెబుతున్నారు. పురుషుల్లో లంగ్ క్యాన్సర్, చెవి, ముక్కు, గొంతు క్యాన్సర్, కడుపులో (పెద్దపేగు) క్యాన్సర్లు నమోదవుతున్నట్లు నిపుణులు వివరిస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై పెరిగిన అవగాహన అర్బన్ ప్రాంతాల్లో నివశించే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరిగాయి. ప్రస్తుతం అవగాహన పెరగడంతో మొదటి రెండు దశల్లోనే 60 శాతం మంది రోగులు చికిత్సకోసం వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మోమోగ్రఫీ వంటి స్క్రీనింగ్ పరీక్షలు సైతం అందుబాటులో ఉండటంతో పలువురు మహిళలు తరచూ పరీక్షలు చేయించుకుంటున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌కు మూడు దశల్లో శస్త్ర చికిత్సలు చేస్తుండగా, నాలుగో దశలో గుర్తించిన వారికీ కీమో చికిత్సలు అందించనున్నట్లు వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. పెరుగుతున్న లంగ్ క్యాన్సర్ కేసులు ప్రస్తుతం లంగ్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. వ్యాధి బాధితుల్లో 65 శాతం మందికి ధూమపానం కారణం కాగా, 20 శాతం మందికి «పొగ పీల్చడం కారణంగా తెలుస్తోంది. మరో 15 శాతం మందికి వాతావరణ కాలుష్యం కారణంగా చెబుతున్నారు. లంగ్ క్యాన్సర్ బాధితుల్లో 15 శాతం మంది మహిళలు ఉండటం ఆందోళన కలిగించే అంశంగా వైద్యులు చెబుతున్నారు. లివర్, అన్నవాహిక, పేగుల్లో క్యాన్సర్ ఆహారపు అలవాట్లు, అధికశాతం కొలస్ట్రాల్, హెపటైటీస్–బి, సీ వైరస్ల కారణంగా ఇటీవల జిల్లాలో లివర్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా జంక్‌ఫుడ్, కల్తీ ఆహారం కారణంగా అన్నవాహిక క్యాన్సర్, పేగుల్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. పాన్‌పరాగ్, గుట్కా వంటి వాటి కారణంగా ఓరల్ క్యాన్సర్ కేసులు కూడా పెరుగుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. గ్రామీణుల్లో సర్వైకల్ క్యాన్సర్ గ్రామీణుల్లో వయస్సు 50 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా గర్భాశయ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. పెళ్లికి ముందు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించడం ద్వారా వ్యాధి రాకుండా నివారించవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. తొలిదశలో నిర్ధారణ ముఖ్యం ప్రస్తుతం అర్బన్ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీస్ క్యాన్సర్ సోకుతుండగా, గ్రామీణులకు సర్వైకల్ క్యాన్సర్ వస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ ప్రమాణాలతో వ్యాధి నిర్ధారణ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం పెద్ద ఎత్తున క్యాన్సర్ ఆస్పత్రులకు నిధులు కేటాయిస్తోంది. నిర్ధారిత సమయాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు చేయించుకోవడం ద్వారా వ్యాధిని గుర్తించవచ్చు. తొలిదశలో గుర్తిస్తే ఎలాంటి క్యాన్సర్‌నైనా వంద శాతం నివారించే అవకాశం ఉంది. ఎక్కువ మంది రెండు, మూడు దశల్లో చికిత్స కోసం వస్తున్నారు. – డాక్టర్ ఏవై రావు, క్యాన్సర్ వ్యాధి చికిత్సా నిపుణుడు -
రెడ్డినాడు శ్రీనివాస్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పాత్రికేయుడు, రెడ్డినాడు మాసపత్రిక వ్యవస్థాపక సంపాదకుడు వై.శ్రీనివాసరెడ్డి ఆదివారం కన్నుమూశారు. గత రెండు నెలలుగా పెద్దపేగు, ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1985లో పాత్రికేయ వృత్తిని ప్రారంభించిన ఆయన ఈనాడు, డెక్కన్ క్రానికల్, సమయం, ఆంధ్రజ్యోతి, ఉదయం పత్రికల్లో దీర్ఘకాలం పనిచేశారు. రెడ్డినాడు అనే పత్రికను నెలకొల్పి రెడ్డినాడు శ్రీనివాస్‌గా గుర్తింపు పొందారు. మాజీమంత్రి మైసూరారెడ్డి వద్ద ప్రజాసంబంధాల అధికారి (పీఆర్వో)గా పనిచేశారు. శ్రీనివాస్‌రెడ్డి కోలుకోవడం కోసం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ 24 యూనిట్ల రక్తాన్ని ఆయనకు దానం చేసింది. శ్రీనివాస్‌రెడ్డి మృతి పట్ల పలువురు పాత్రికేయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
ధూమపానం.. లంగ్ క్యాన్సర్ లింక్‌కు ఆధారాల్లేవు!
అహ్మదాబాద్: ఒక పేషెంటు అతిగా పొగతాగడం వల్ల మరణించాడని పేర్కొంటూ క్లెయిమ్ చెల్లించేందుకు నిరాకరించిన బీమా కంపెనీకి వినియోగదారుల కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సదరు పేషెంటుకు వైద్య బీమా వ్యయ మొత్తాన్ని ఇవ్వాలని కంపెనీని ఆదేశించింది. పొగతాగడం వల్లనే సదరు పేషెంటుకు లంగ్‌క్యాన్సర్ వచి్చందనేందుకు సరైన ఆధారాల్లేవని కోర్టు అభిప్రాయపడింది. కేవలం చికిత్స రిపోర్టులో పొగతాగడం అలవాటైంది(అడిక్షన్ స్మోకింగ్) అని రాయడాన్ని తిరస్కరణకు కారణంగా పేర్కొనలేమంది. పొగతాగని వాళ్లకు కూడా లంగ్‌క్యాన్సర్ వస్తుందని గుర్తు చేసింది. అలోక్ కుమార్ బెనర్జీ అనే వ్యక్తి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణించారు. అతని వైద్య చికిత్సకు అయిన రూ. 93,927 చెల్లించేందుకు బీమా కంపెనీ తిరస్కరించింది. దీంతో బెనర్జీ భార్య స్మిత కన్జూమర్ కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం సదరు మొత్తాన్ని 7 శాతం వడ్డీతో కలిపి 2016 ఆగస్టు నుంచి లెక్కించి ఇవ్వాలని పేర్కొంది. -
‘మున్నాభాయ్’ వైరల్ పిక్ : షాక్‌లో ఫ్యాన్స్
సాక్షి,ముంబై : ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (61) ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎయిర్‌పోర్టులో ఓ అభిమాని ఆయనతో తీసుకున్న ఫొటో చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఆ ఫొటోలో సంజయ్‌దత్ చాలా బలహీనంగా కనిపిస్తున్నారు. దీంతో సంజయ్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ‘మున్నాభాయ్ ఎంబీబీస్’ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో ఆకాంక్షిస్తున్నారు. తన ఆరోగ్యం బాగా లేదని చికిత్స నిమిత్తం కొంత కాలం విరామం తీసుకుంటున్నట్టు ఆగస్టు 11న సంజయ్ ట్వీట్ చేశారు. నాలుగో దశ ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ముంబైలో తొలి దశ కీమోథెరపీని పూర్తి చేసుకున్నారు. అనంతరం భార్య మాన్యతో కలిసి దుబాయ్‌లో ఉంటున్న పిల్లలతో కొన్ని రోజులు గడిపిన సంజయ్ ఇటీవల ముంబైకి తిరిగి వచ్చారు. ఆయనకు రెండో దశ కీమోథెరపీ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. (దుబాయ్‌లో సంజయ్ దత్ ఫ్యామిలీ..) He looks so different gosh.... lost so much weight?? Uff... so sad. #SanjayDutt pic.twitter.com/7Fimr7KWAP — IkraaaShahRukh💕 (@Ikra4SRK) October 3, 2020 -
విక్కీ డోనర్ నటుడు మృతి
ముంబై: విక్కీ డోనర్ సినిమా నటుడు భూపేష్ కుమార్ పాండ్యా బుధవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా పాండ్యా మరణాన్ని వెల్లడిస్తూ ట్వీట్ చేసింది. సీనియర్ నటులు మనోజ్ బాజ్‌పేయి, గజ్రాజ్ రావు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. తన భర్త స్టేజి 4 లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని పాండ్యా భార్య ఛాయ ఇటీవల మీడియాకు తెలిపారు. అహ్మదాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ట్రీట్మెంట్ జరగుతోందని వెల్లడించారు. భర్త ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, క్యాన్సర్ ట్రీట్మెంట్ ఖర్చులతో పాండ్యా కుటుంబం ఆర్థికంగా కుదేలైంది. దీంతో ఆ కుంటుంబాన్ని ఆదుకునేందుకు పాండ్యా స్నేహితుడొకరు నిధులు సమీకరించే యత్నం చేశాడు. మనోజ్ బాజ్‌పేయి కూడా పాండ్యాకు ఆర్థిక సాయం చేసి నిధులు సమకూర్చేందుకు ముందుకొచ్చారు. నటుడు గజ్రాజ్ రూ.25 వేలు, సిఖియా ఎంటర్టైన్మెంట్స్ రూ. 2 లక్షలు సాయమందించినట్టు సమాచారం. (చదవండి: మేమెప్పుడూ ఇలానే ఉండాలి) -
న్యూయార్క్‌లో చికిత్స
బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్‌కు లంగ్ కేన్సర్ అని తెలిసిందే. ప్రస్తుతం ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు సంజయ్ దత్. త్వరలో న్యూయార్క్ వెళ్లటానికి వీసా అప్లయ్ చేసుకున్నారాయన. ఐదేళ్ల గడువు ఉండే ఆరోగ్య వీసా కోసం అప్లయ్ చేశారట. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత భార్య మాన్యత, చెల్లెలు ప్రియాదత్‌తో కలిసి న్యూయార్క్ ప్రయాణం అవుతారని తెలిసింది. అక్కడి మెమోరియల్ సియాన్ కేటరింగ్ కేన్సర్ సెంటర్లో చేరనున్నారు సంజయ్ దత్. 1980–81ల మధ్యకాలంలో సంజయ్ దత్ తల్లి, ప్రముఖ నటి నర్గిస్కి ఆ ఆస్పత్రిలోనే కేన్సర్ చికిత్స జరిగింది. కేన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి ప్రపంచంలోని ప్రముఖ హాస్పిటల్స్‌లో ఇది ఒకటి. మనీషా కొయిరాల, సోనాలి బింద్రేలు కూడా అక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నారు. వీళ్లలానే సంజయ్ దత్ కూడా త్వరగా కేన్సర్‌ను జయించి తిరిగి రావాలని కోరుకుంటున్నారు ఆయన అభిమానులు. -
ఈ క్లిష్ట సమయం నుంచి బయటపడతాం: మాన్యత
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ఆరోగ్యంపై ఆయన భార్య మాన్యత దత్ ఒక ప్రకటన చేశారు. తమ కుటుంబంపై చూపిస్తున్న ప్రేమ, మద్దతుకు ఆ ప్రకటన ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. 'ఈ కఠిన సమయాన్ని దాటేందుకు మీ అందరి తోడు కావాలి. గతంలో కూడా ఎన్నో ఆపదల నుంచి మా కుటుంబం బయపడింది. ఈ ఇబ్బందికర పరిస్థితిని కూడా దాటేస్తాం. సంజయ్‌అభిమానులందరికి నా విజ్ఞప్తి ఒక్కడే. దయచేసి పుకార్లను నమ్మకండి, వాటిని ప్రచారం చేయకండి. సంజయ్ ఆరోగ్యానికి సంబంధించి క్రమం తప్పకుండా మీకు అప్డేట్ అందిస్తాం. నా పిల్లలకు మాత్రమే కాదు ..తల్లిదండ్రులు చనిపోయాక సంజయ్ కుటుంబం మొత్తానికి తండ్రిలా ఉన్నాడు. తనకి క్యాన్సర్ అని తెలియగానే మొత్తం కుటుంబం కదిలిపోయింది. అయితే మేం అందరం కలిసి పోరాడాలని నిశ్చయించుకున్నాం. ఈ క్లిష్ట సమయాన్ని సానుకూల దృక్పదంతో ఎదుర్కోవాలనుకుంటున్నాం. ఈ సుదీర్ఘ పోరాటంలో అభిమానుల ప్రార్థనలు, ఆశీర్వాదాలు కావాలి. మీ ప్రార్థనలు, దేవుని ఆశిస్సులతో ఈ క్లిష్ట సమయం నుంచి బయటపడతాం' అని మాన్యత ఓ ప్రకటనలో పేర్కొన్నారు. (సంజయ్ ఎప్పుడూ పోరాట యోధుడే: మాన్యత దత్) అయితే తన ఆరోగ్య చికిత్స నిమిత్తం షూటింగ్ నుంచి కాస్త విరామం తీసుకుంటున్నట్లు అభిమానులకు తెలియజేస్తూ సంజయ్ దత్ ఓ పోస్టును విడుదల చేశారు. దీంతో సంజయ్ దత్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో భాదపడతున్నట్లు సోషల్ మీడియాలో పలు వార్తలు వచ్చాయి. సంజయ్ త్వరగా కోలుకొని మరోసారి తెరమీద కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంజయ్ దత్ గతేడాది.. కళంక్, ప్రస్తానం, పానిపట్ చిత్రాలతో అలరించారు. తాజాగా 1991లో మహేశ్ బట్ దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ సడక్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సడక్ 2లో నటిస్తున్నారు. ఆదిత్యారాయ్ కపూర్, ఆలియా భట్ ప్రధాన పాత్రలో.. పూజాభట్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ భట్ దర్శకత్వం వహిస్తుండగా.. ఆయన సోదరుడు ముఖేశ్ భట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. (క్యాన్సర్ శాపం) 🙏🏻 pic.twitter.com/tinDb6BxcL — Sanjay Dutt (@duttsanjay) August 11, 2020 -
'సంజయ్.. ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసు'
ముంబై : బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ గత ఆదివారం అనారోగ్య సమస్యతో ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అనధికారిక సమాచారం మేరకు సంజయ్ దత్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయనకు క్యాన్సర్ 4వ దశలో ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి చికిత్స చేయించుకోవడానికి మంగళవారం రాత్రి అమెరికా వెళ్లినట్లు తెలిసింది. అయితే ఆయన అమెరికా వెళ్లారా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. తాజాగా సంజయ్ దత్ క్యాన్సర్ నుంచి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు భారత మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు.(ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు) 'సంజయ్ దత్.. నువ్వు ఒక ఫైటర్‌లా కనిపిస్తావు. నీ బాధ తెలుసుకున్నా.. ఆ నొప్పి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను.. ఎందుకంటే నేను స్వయంగా అనుభవించాను. కానీ ఆ నొప్పిని భరించేందుకు నువ్వు మరింత ధృడంగా తయారవ్వాలి.. క్యాన్సర్ మహమ్మారి నుంచి తొందరగా కోలుకోవాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అంటూ ట్వీట్ చేశాడు. కాగా గతంలో యువరాజ్ కూడా లంగ్ క్యాన్సర్ బారీన పడిన సంగతి తెలిసిందే. 2011 ప్రపంచకప్ అనంతరం యువరాజ్ లండన్ వెళ్లి శస్త్రచికిత్స తీసుకొని విజయవంతంగా క్యాన్సర్‌ను జయించాడు. సంజయ్ దత్ చికిత్సకు సంబంధించి అమెరికా వెళ్లే విషయమై ఆయన టీం అధికారిక సమాచారం ఇవ్వాల్సి ఉంది.(సంజయ్‌దత్‌కు క్యాన్సర్!) You are, have and always will be a fighter @duttsanjay. I know the pain it causes but I also know you are strong and will see this tough phase through. My prayers and best wishes for your speedy recovery. — Yuvraj Singh (@YUVSTRONG12) August 11, 2020 ఇదిలా ఉంటే గత ఆదివారం శ్వాస సంబంధిత ఇబ్బందితో సంజయ్ ఆదివారం లీలావతి ఆస్పత్రికి వెళ్లారు. ఒక రోజు తర్వాత ఇంటికి వచ్చేశారు. పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చిందని మాత్రమే బయటకు తెలిపారు. కానీ, మంగళవారం ఆయన మళ్లీ ఆస్పత్రికి వెళ్లారు. వైద్య పరీక్షలు చేయగా ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్ధారణ అయ్యిందని సమాచారం. ఈ విషయాన్ని ఆయన మంగళవారం స్వయంగా తన ఇన్‌స్టాలో వెల్లడించారు. 'హాయ్ ఫ్రెండ్స్...వైద్యం నిమిత్తం నేను పని నుంచి చిన్న విరామం తీసుకుంటున్నాను.నా కుటుంబం, మిత్రులు తోడుగా ఉన్నారు. నా గురించి ఆందోళన చెందవద్దు, ఊహాగానాలు చేయవద్దని శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరి ప్రేమాభిమానాలతో త్వరలోనే తిరిగివస్తా’ అని సంజయ్ మంగళవారం తన ఇన్‌స్టాలో పేర్కొన్నారు. కాగా విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంజయ్ దత్ గతేడాది.. కళంక్, ప్రస్తానం, పానిపట్ చిత్రాలతో అలరించారు. తాజాగా 1991లో మహేశ్ బట్ దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ సడక్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సడక్ 2లో నటిస్తున్నారు. ఆదిత్యారాయ్ కపూర్, ఆలియా భట్ ప్రధాన పాత్రలో.. పూజాభట్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ భట్ దర్శకత్వం వహిస్తుండగా.. ఆయన సోదరుడు ముఖేశ్ భట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
లక్షలో 40 మందికి లంగ్ కేన్సర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతి లక్ష మందిలో 40 మంది ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్నట్లు పలువురు పల్మొనాలజిస్టులు వెల్లడించారు. ప్రస్తుతం నమోదవుతున్న కేన్సర్ కేసుల్లో కేవలం ఊపిరితిత్తుల కేన్సర్లే 8 శాతం ఉండగా, కేన్సర్ మరణాల్లో లంగ్ కేన్సర్ రెండో స్థానంలో ఉందని తెలిపారు. ప్రాథమిక దశలో గుర్తించడం ద్వారా ఈ కేన్సర్ నుంచి బయటపడొచ్చని స్పష్టం చేశారు. ఇందుకు ‘లంగ్‌పాయింట్’(వర్చువల్ బ్రాంకోస్కోపిక్ నావిగేషన్ సిస్టమ్) సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ మేరకు యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఓ హోటల్లో ఊపిరితిత్తుల కేన్సర్లపై లైవ్ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేశారు. యశోద గ్రూప్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ రావు ముఖ్యఅతిథిగా హాజరై వర్క్‌షాప్‌ను ప్రారంభించగా, డాక్టర్ చాంగ్ హూ జాంగ్(చైనా), డాక్టర్ మెల్విన్ టే(సింగపూర్), డాక్టర్ టై వాన్ సెక్ (మలేసియా) సహా దేశవిదేశాలకు చెందిన సుమారు 300 మంది వైద్యనిపుణులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా.. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా యశోద ఆస్పత్రిలో అందుబాటులోకి తెచ్చిన అత్యాధునిక ‘లంగ్ పాయింట్’(వర్చువల్ బ్రాంకోస్కోపిక్ నావిగేషన్ సిస్టమ్)ని ఈ సందర్భంగా ప్రారంభించారు. సోమాజి గూడ యశోద హాస్పిటల్స్ ఇంట్రావేన్షనల్ పల్మొనాలజిస్టులు డాక్టర్ వి.నాగార్జున మాటూరు, డాక్టర్ నవనీత్ సాగర్‌రెడ్డి, డాక్టర్ రఘోత్తమ్‌రెడ్డిలు లంగ్ కేన్సర్ గుర్తింపు, చికిత్సలో మెళకువలను లైవ్‌లో ప్రదర్శించారు. ఇప్పటివరకు బయాప్సీ ద్వారా మాత్రమే లంగ్ కేన్సర్లు గుర్తించే వారని, కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రాథమిక దశలోనే ఈ కేన్సర్‌ను గుర్తించే అవకాశం లభించిందన్నారు. శరీరంపై ఎటువంటి కోతలు లేకుండా, రక్తం చుక్క కూడా చిందించాల్సిన అవసరం లేకుండా కనీసం నొప్పి కూడా తెలియకుండా శ్వాస మార్గాల ద్వారా రక్తనాళాలు, శ్వాసకోశాలు, ఊపిరితిత్తుల చిత్రాలను చూస్తూ పనితీరును తెలుసుకునే అవకాశం దీని ద్వారా లభించిందని యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి స్పష్టం చేశారు. తొలిదశలో వ్యాధి నిర్ధారణ జరిగి సరైన సమయంలో సరైన రీతిలో చికిత్స అందిస్తే ప్రాణాంతక శ్వాసకోశ వ్యాధులు, టీబీ, ఊపిరితిత్తుల కేన్సర్ల నుంచి ఉపశమనం పొంది సాధారణ జీవితం గడపటం పూర్తిగా సాధ్యపడుతుందని డాక్టర్ నాగార్జున తెలిపారు. -
తేయాకు కణాలతో ఊపిరితిత్తుల కేన్సర్‌కు కొత్త ఔషధం
గ్రీన్ టీలో బోలెడన్ని యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని, తరచూ ఈ పానీయాన్ని సేవించడం ద్వారా కేన్సర్‌ను నివారించవచ్చునని మనం తరచూ వింటుంటాం. ఇందులో వాస్తవం లేకపోలేదు. భారతియార్, స్వాన్సీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఇంకో అడుగు ముందుకేసి తేయాకులోకి కొన్ని ప్రత్యేక కణాల ద్వారా ఊపిరితిత్తుల కేన్సర్‌కు సమర్థమైన చికిత్స ఇవ్వవచ్చని నిరూపించారు. ఈ క్వాంటమ్ డాట్ కణాలు అతి సూక్ష్మమైనవి. ధర్మాలూ అనూహ్యం. కొన్ని రసాయనాలతో కలిసి వేర్వేరు రంగుల్లో ప్రతిదీప్తిని కనబరుస్తాయి. అందువల్లనే వీటిని ఇప్పటికే సోలార్ సెల్స్ మొదలుకొని వైద్య పరీక్షల్లోనూ వాడుతున్నారు. కేన్సర్ చికిత్సలోనూ, యాంటీబయాటిక్ నిరోధకతను ఎదుర్కొనేందుకూ ఈ క్వాంటమ్ డాట్స్ ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతియార్, స్వాన్సీ యూనివర్శిటీల శాస్త్రవేత్తలు తేయాకు నుంచి క్వాంటమ్ డాట్ కణాలను వెలికి తీశారు. వీటి సమక్షంలో ఊపిరితిత్తుల కేన్సర్ కణాలు వెలిగిపోవడమే కాకుండా.. వాటిని నాశనం కూడా చేసేశాయి. కేన్సర్ కణాల్లోకి చొచ్చుకుపోయిన క్వాంటమ్ డాట్స్ 80 శాతం కణాలను నిర్వీర్యం చేసినట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సుధాకర్ పిచ్చయి ముత్తు తెలిపారు. క్వాంటమ్ డాట్స్‌ను కేన్సర్ చికిత్సకు మాత్రమే కాకుండా యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలున్న రంగుల తయారీలోనూ వాడవచ్చునని, తేయాకు నుంచి వీటిని మరింత చౌకగా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. -
లంగ్ క్యాన్సర్‌కు క్యూబా వ్యాక్సిన్
హవానా: క్యూబా రాజధాని హవానాలోని సెంట్రో డీ ఇమ్యునాలోజియా మాలక్యూల్ (సీఐఎం-ఇంగ్లీష్‌లో సెంటర్ ఫర్ మాలెక్యూల్ ఇమ్యునాలోజి ) కేంద్రంపై ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతమైంది. ప్రపంచాన్ని పీడిస్తున్న లంగ్ క్యాన్సర్‌కు ఇప్పుడు ఈ కేంద్రం వ్యాక్సిన్‌ను కనుగొనడమే అందుకు కారణం. ‘సిమ్‌ఆవాక్స్’గా పిలిచే ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 5 వేల మందిపైనా, ఒక్క క్యూబాలోనే వెయ్యి మందిపైనా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా, మంచి ఫలితాలు లభించాయి. 60 ఏళ్ల లోపు రోగులపైనా ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌ను నిర్వహించారు. వ్యాక్సిన్ ఇవ్వని రోగులతో పోలిస్తే వ్యాక్సిన్ ఇచ్చిన రోగులు 11 నెలలు అదనంగా జీవించారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న ఒరేల్వ్ ఆల్బర్ట్ సాంచెజ్ అనే 77 ఏళ్ల వృద్దుడు మాత్రం ఇంకా బతికే ఉన్నారు. ఆయనకు 2007లోనే లంగ్ క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఎన్ని థెరపీలు ఇచ్చినా ఆయన క్యాన్సర్ తగ్గలేదు. దాంతో ఆయన సిమ్‌ఆవాక్స్ వ్యాక్సిన్ తీసుకోవాడిని స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఆశ్చర్యంగా రెండేళ్లలోనే ఆయన ఆరోగ్యం ఎంతో మెరుగుపడింది. ఆయనలో వ్యాక్సిన్ పనిచేయడంతోపాటు ఆయనకున్న మనోధైర్యం కూడా ఆయన ఎక్కువ కాలం బతికేందుకు దోహదపడిందని సీఐఎంలో పనిచేస్తున్న శాస్త్రవేత్త కామిలో రోడ్రిగెజ్ తెలిపారు. ఈ సరికొత్త వ్యాక్సిన్ ఇతర క్యాన్సర్ థెరపీల్లోలాగా క్యాన్సర్ కణాలను చంపేయదని, క్యాన్సర్ కణాలను శరీరంలోని రోగ నిరోధక శక్తే చంపేసీ విధంగా శక్తిని పెంచుతుందని ఆయన చెప్పారు. తన విషయంలో మాత్రం సిమ్‌ఆవాక్స్ వ్యాక్సిన్ బ్రహ్మాండంగా పనిచేసిందని ఒరేల్వ్ ఆల్బర్ట్ మీడియాకు తెలిపారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న మిగతా రోగులు తనలాగా ఎక్కువ కాలం జీవించక పోవడానికి వారికి తగినంత మనోధైర్యం లేకపోవడం కారణమై ఉండవచ్చని, క్యాన్సర్ వచ్చిందని తెలియగానే రోగులు సగం చచ్చిపోతారని ఆయన చెప్పారు. అయినా రోగాన్ని గుర్తించిన వెంటనే వ్యాక్సిన్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని తాను విశ్వసిస్తున్నానని ఆయన చెప్పారు. క్యూబాలోని సీఐఎం ఇంతవరకు 21 ప్రాణాంతక రోగాలకు వ్యాక్సిన్లను కనిపెట్టింది. క్యూబాపై 1960 దశకం నుంచి అమెరికా ఆంక్షలు కొనసాగుతుండడం వల్ల సొంతంగా వైద్య పరిశోధనలపై దృష్టిని కేంద్రీకరించాల్సి వచ్చింది. ఓ వ్యక్తి ఆరోగ్యం కోసం క్యూబా వెచ్చిస్తున్న వైద్య పరిశోధనల ఖర్చుకన్నా అమెరికా ఐదింతలు ఖర్చు పెడుతున్నా సీఐఎం సాధించిన విజయాలను అమెరికా ల్యాబ్‌లు కూడా అందుకోలేక పోయాయి. క్యూబా ప్రజలు జీవిస్తున్న సరాసరి సగటు వయస్సు 80 ఏళ్లుకాగా, అమెరికాలో ఈ వయస్సు 79 ఏళ్లే ఉంది. ఇటీవలి కాలంలో క్యూబాతో సంబంధాలను మెరగుపర్చుకునేందుకు అమెరికా కృషి చేస్తున్న నేపథ్యంలో న్యూయార్క్‌కు చెందిన రోజ్కూల్ పార్క్ క్యాన్సర్ సెంటర్ క్యూబా తయారు చేసిన క్యాన్సర్ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోంది. జపాన్, కొన్ని యూరప్ దేశాలు ఇప్పటికీ లంగ్ క్యాన్సర్ వ్యాక్సిన్ కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. క్యూబాలో క్యాన్సర్‌తో చనిపోతున్న రోగుల్లో ఎక్కువ మంది లంగ్స్ క్యాన్సర్ రోగులే ఉంటున్నారు. ఎందుకంటే క్యూబా ప్రజల్లో పొగాకు వాడకం ఎక్కువ. ముఖ్యంగా సిగార్ల వల్ల చాలా మంది లంగ్స్ క్యాన్సర్ వ్యాధిన పడుతున్నారు. ఏడాదికి క్యూబాలో 4,500 లంగ్స్ క్యాన్సర్ రోగులు నమోదవుతున్నారు. వారంతా ఏదో దశలో మృత్యువాత పడుతున్నారు. -
లంగ్ క్యాన్సర్ చికిత్సలో నూతన విధానం
టొరంటో: ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధి చికిత్సలో నూతన విధానాన్ని ఆవిష్కరించినట్లు గురువారం అమెరికన్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. వివిధ అవయవాలకు సంభవించే క్యాన్సర్ వ్యాదుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ రెండవ స్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్‌కు సంబంధించిన మృతుల్లో సుమారు 25 శాతం మృతులు ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితులే కావడం గమనార్హం. అమెరికాకు చెందిన మెక్‌గిల్ యూనివర్సిటీ, రష్యాకు చెందిన ఐటీఎంవో యూనివర్సిటీ. యూకేకు చెందిన బ్రిస్టల్ యూనివర్సిటీలు సంయుక్తంగా లంగ్ క్యాన్సర్ కణాలపై నిర్వహించిన ప్రయోగంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. పరిశోధనకు సంబంధించి మెక్‌గిల్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ పరిశోధకుడు ఎమ్మా విన్సెంట్ మాట్లడుతూ.. క్యాన్సర్ కణాల జీవక్రియ సాధారణ కణాలతో పోల్చినప్పుడు విభిన్నంగా ఉంటుందని తెలిపారు. అయితే క్యాన్సర్ కణాలు 'పిఈపీసీకే' అనే జన్యువును ఉపయోగించుకొని వాటియొక్క విస్తరణ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయని గుర్తించినట్లు తెలిపారు. ఈ ఎంజైమ్‌ను గుర్తించడం ద్వారా లంగ్ క్యాన్సర్ కణాల చికిత్సలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలిపారు. -
ట్యాబ్లెట్ల రూపంలోనూ కీమోథెరపీ
క్యాన్సర్ కౌన్సెలింగ్ నా సోదరికి 39 ఏళ్లు. ఆమె ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతూ స్టేజ్ 4లో ఉంది. ఇంట్రావీనస్ కీమోథెరపీ అంటే ఆమెకు భయంగా ఉంది. ఇది కాకుండా మరేదైనా ప్రక్రియ ఉందా? అలాగే దుష్ఫలితాలు లేకుండా కీమోథెరపీ తీసుకునే అవకాశం ఉందా? - సందీప్, కరీంనగర్ ఇటీవల మన దేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడే మహిళల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. పాశ్చాత్యదేశాల స్త్రీలతో పోలిస్తే మన దేశం మహిళలు ప్రధానంగా నాన్-స్మోకర్లే అయినా వాళ్లు ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడటానికి ప్రధానంగా వారిలో వచ్చే జన్యుమార్పులే లంగ్ క్యాన్సర్‌కు కారణం. జన్యుపరమైన కారణాలతో క్యాన్సర్ బారిన పడిన పేషెంట్లకు చికిత్స ప్రారంభించడానికి ముందుగానే వారిలో జన్యుకణ పరిణామ ప్రక్రియ ఏవిధంగా కొనసాగుతోందో తెలుసుకోవడం చాలా అవసరం. అలా చేయడం వల్ల అవసరమైతే వారికి ఇంట్రావీనస్ (రక్తనాళం నుంచి) కీమో ఇవ్వడానికి బదులుగా టాబ్లెట్ల రూపంలోనూ కీమోథెరపీ అందించే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఇలాంటి పేషెంట్లకు ముందుగా ఎపీడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ (ఈజీఎఫ్ఆర్) మ్యుటేషన్ అనే పరీక్ష నిర్వహించాలి. ఎందుకంటే ఆరోగ్యవంతమైన కణంలో కణాల పెరుగుదల, విభజనకు ఈజీఎఫ్ఆర్ తోడ్పడుతుంది. క్యాన్సర్ కణాల పెరుగుదల, విభజనలో ఈజీఎఫ్ఆర్ మరింత క్రియాశీలకంగా పనిచేస్తూ క్యాన్సర్ కణాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతూ అవి ట్యూమర్లకింద రూపాంతరం చెందేలా చేస్తుంది. అందువల్ల ఈ పరీక్ష ఫలితాలను అనుసరించి, వైద్యులు లంగ్ క్యాన్సర్ పేషెంట్లకు టాబ్లెట్ల రూపంలో కీమోథెరపీని అందించే సౌలభ్యాన్ని కల్పిస్తారు. ఇది కూడా ఐవీ కీమోథెరపీతో సమానంగా లేదా అంతకంటే మంచి ఫలితాలనే ఇస్తుంది. పైగా దీనివల్ల కలిగే దుష్ఫలితాలు (సైడ్ఎఫెక్ట్స్) కూడా తక్కువ. పేషెంట్లు టాబ్లెట్లను ఇంటికి తీసుకెళ్లి మరీ వాడవచ్చు. ఈవిధంగా టాబ్లెట్లద్వారా కీమోథెరపీ చేయించుకున్న పేషెంట్ల సుదీర్ఘకాలం జీవించిన సంఘటనలు చాలా ఎక్కువే. కాబట్టి మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. -
లంగ్ కేన్సర్‌ను గుర్తించే నా‘నోస్’ చిప్..
ప్రాణాంతకమైన ఊపిరితిత్తుల కేన్సర్‌ను ఇకపై ఓ బ్రీథలైజర్(శ్వాస విశ్లేషణ పరికరం) ద్వారా కూడా గుర్తించొచ్చు. శ్వాస విశ్లేషణ ద్వారా లంగ్ కేన్సర్‌ను గుర్తించే నానోస్ అనే నానోటెక్ చిప్‌ను టెల్ అవైవ్ యూనివర్సిటీ పరిశోధకులు ఆవిష్కరించారు. ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడిన, ఆ వ్యాధి ముప్పు తీవ్రంగా ఉన్న 358 మంది రోగులపై, సాధారణ ఆరోగ్యవంతులపై ఈ నానోస్ చిప్ బ్రీథలైజర్తో పరీక్షలు నిర్వహించగా.. 90 శాతం కచ్చితత్వంతో ఫలితాలు వచ్చాయని పరిశోధకులు వెల్లడించారు. మామూలుగా అయితే ఊపిరితిత్తుల కేన్సర్ నిర్ధారణకు కఠినమైన బ్రాంకోస్కోపీలు, కంప్యూటర్ ఆధారిత బయాప్సీలు లేదా శస్త్రచికిత్సల వంటివి అవసరం అవుతాయట. కానీ ఈ నానోస్ చిప్ బ్రీథలైజర్ శ్వాస పరీక్ష ద్వారానే కేన్సర్‌ను గుర్తిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఊపిరితిత్తుల కేన్సర్ కణతులు విడుదల చేసే రసాయనాలు గాలిలో సులభంగానే ఆవిరిగా మారుతాయి. వాటిని పసిగట్టడం ద్వారా ఈ పరికరం కేన్సర్‌ను గుర్తుపడుతుంది. అలాగే కే న్సర్ కణతుల రకం, తీవ్రతను కూడా దీనితో గుర్తించవచ్చట. వీరి అధ్యయన ఫలితాలను షికాగోలో ఇటీవల జరిగిన అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ సదస్సులో సమర్పించారు. -
లంగ్ క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలు!
ఊపిరితిత్తులు మన శ్వాసక్రియకు ఎంతో కీలకం. ఎందుకంటే... శ్వాస తీసుకోవడం క్షణం ఆలస్యం జరిగినా ప్రమాదమే. అంతటి కీలకమైన ఈ అవయవానికి క్యాన్సర్ సోకితే... గుర్తించడం ఒకింత కష్టం. కారణం... దీన్ని క్షయగా పొరబడే అవకాశం ఉండటం. ఈ కారణంగా చికిత్స ఆలస్యమయ్యే అవకాశం ఉన్న ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అవగాహన కోసం ఈ కథనం. ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే... అక్కడి కణాలు నియంత్రణ లేకుండా అపరిమితంగా పెరిగిపోవడమే. అప్పుడా వ్యాధికి చికిత్స చేయకుండా వదిలేస్తే ప్రమాదకరమైన క్యాన్సర్ కణాలు ఇతర అవయవాలకూ పాకుతాయి. ఇలా క్యాన్సర్ ఒకచోటి నుంచి మరో అవయవానికి వ్యాపించడాన్ని మెటాస్టాసిస్ అంటారు. క్యాన్సర్ మొదట ఊపిరితిత్తుల్లోని ఎపిథీలియల్ కణాల్లో కనిపిస్తే దాన్ని ‘ప్రైమరీ లంగ్ క్యాన్సర్’ అంటారు. ఇందులో అనేక రకాలున్నాయి. అందులో ప్రధానమైనవి రెండు. మొదటిది స్మాల్‌సెల్ లంగ్ క్యాన్సర్, రెండోది నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్. స్మాల్‌సెల్ లంగ్‌క్యాన్సర్ (ఎస్సీఎల్సీ): మొత్తం లంగ్ క్యాన్సర్లలో 14 శాతం ఇవే ఉంటాయి. ఇవి వడివడిగా పాకడం వల్ల లింఫ్‌నోడ్స్, ఎముకలు, మెదడు, అడ్రినల్ గ్రంథి, కాలేయంలోకీ పాకే అవకాశాలున్నాయి. నాన్-స్మాల్‌సెల్ లంగ్ క్యాన్సర్ (ఎన్ఎల్సీఎల్సీ): క్యాన్సర్ వ్యక్తమయ్యే తీరు, లక్షణాలనుబట్టి ఇందులో మూడు రకాలున్నాయి. అవి... స్క్వామస్ సెల్ కార్సినోమా (ఎస్సీసీ): మొత్తం ఊపిరితిత్తుల క్యాన్సర్లలో 25 శాతం - 30శాతం ఈ తరహాకు చెందినవి. ఇది ఊపిరితిత్తుల మధ్యభాగం నుంచి ఆవిర్భవిస్తుంది. అడినోకార్సినోమా: మొత్తం ఊపిరితిత్తుల్లో ఈ తరహాకు చెందినవి 40 శాతం ఉంటాయి. ఈ క్యాన్సర్ ఊపిరితిత్తుల బయటి భాగం నుంచి ఉద్భవిస్తుంది. లార్జ్ సెల్ కార్సినోమా (ఎల్సీసీ): మొత్తం లంగ్ క్యాన్సర్లలో ఇవి 10 శాతం - 15 శాతం ఉంటాయి. ఈ తరహా క్యాన్సర్ చాలా వేగంగా విస్తరించడంతో పాటు... తగ్గే అవకాశాలు బాగా తక్కువ. ఇవేగాక... చాలా తక్కువపాళ్లలో కార్సినాయిడ్ ట్యూమర్స్, అడినాయిడ్ సిస్టిక్ కార్సినోమా, హామార్టోమా, లింఫోమా, సార్కోమా తరహా క్యాన్సర్లూ ఉంటాయి. సెకండరీ లంగ్ క్యాన్సర్: రోగిలో క్యాన్సర్ వేరేచోట ఆవిర్భవించి, పాకే గుణం వల్ల అది ఊపిరితిత్తులకూ విస్తరించడం వల్ల వచ్చే లంగ్ క్యాన్సర్‌ను సెకండరీ లంగ్ క్యాన్సర్ అంటారు. ఉదాహరణకు చాలామందిలో రొమ్ముక్యాన్సర్ మెటస్టాటిస్ వల్ల ఊపిరితిత్తులకూ పాకుతుంది. లక్షణాలు: ఎడతెరపి లేకుండా దగ్గు బరువు తగ్గడం వేగంగా గాలిపీల్చడం (ఆయాసం) ఛాతీనొప్పి దగ్గుతున్నప్పుడు రక్తం పడటం ఎముకల్లో నొప్పి వేలిగోళ్లు బాగా వెడల్పుకావడం జ్వరం అలసట / నీరసం గుండె పైభాగంలోని కుడి గది నుంచి వెళ్లే సిరలోని రక్తప్రవాహంలో అడ్డంకులు మింగడంలో ఇబ్బంది పిల్లికూతలు ఆహారం రుచించకపోవడం గొంతు బొంగురుపోవడం... ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను కలవాలి. ఒకవేళ అది క్షయగా పొరబడి చికిత్స ప్రారంభించినా... నెల తర్వాత కూడా అవే లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం తప్పనిసరిగా క్యాన్సర్ నిపుణుడిని కలిసి అది క్షయా లేక క్యాన్సరా అన్నది నిర్ధారణ చేసుకోవడం ప్రధానం. ఎందుకంటే క్యాన్సర్‌ను త్వరగా గుర్తిస్తే సమర్థమైన చికిత్సకు అవకాశాలు ఎక్కువ. నిర్ధారణ పరీక్షలు: పై లక్షణాలు కనిపించినప్పుడు ముందుగా ఛాతీ ఎక్స్-రే తో పాటు బయాప్సీ, సీటీస్కాన్, పెట్ సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేయాలి. వాటితోపాటు లంగ్స్‌ను పరీక్షించే బ్రాంకోస్కోపీ, రక్తపరీక్షల వంటివి చేయించి వ్యాధి నిర్ధారణ చేసి, వ్యాధి దశను బట్టి అవసరమైన చికిత్స అందించాలి. క్యాన్సర్ కణితి ఊపిరితిత్తుల పైభాగంలోనే ఉంటే దాన్ని నీడిల్ పరీక్ష లేదా బయాప్సీ ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తారు. ఒకవేళ కణితి లంగ్‌లో మధ్యభాగంలో ఉంటే బ్రాంకోస్కోపీ చేసి, బయాప్సీ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ కణితి క్యాన్సరే అని నిర్ధారణ జరిగితే పెట్ స్కాన్ ద్వారా శరీర భాగాలన్నింటినీ పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే... ఈ పరీక్ష ద్వారా క్యాన్సర్ ఏ దశలో ఉంది, అది శరీరంలోని ఏయే భాగాలకు విస్తరించి ఉంది అనే విషయాలు తెలుస్తాయి. అయితే కొన్ని రకాల ఎముకలకు సంబంధించిన మెటాస్టాటిస్లు పెట్స్కాన్లోనూ కనిపించక పోవచ్చు. అప్పుడు అవసరాన్ని బట్టి బోన్‌స్కాన్, ఎమ్మారై స్కాన్ వంటి పరీక్షలూ చేయాల్సి ఉంటుంది. చికిత్స: ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ఒకవేళ నాలుగోదశలో గుర్తిస్తే అప్పుడు కీమోథెరపీతో పాటు మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇచ్చి, రోగి జీవితకాలాన్ని పొడిగిస్తారు. బయాప్సీ ముక్కను ఈజీఎఫ్ఆర్ అనే కొన్ని ప్రత్యేక పరీక్షలకు పంపి, వాటిలో పాజిటివ్ ఫలితం వస్తే దాన్ని బట్టి మాత్రల ద్వారా కూడా నాలుగో దశ లంగ్ క్యాన్సర్‌కు చికిత్స చేయవచ్చు. ఒకవేళ క్యాన్సర్ మూడో దశ (3-ఏ)లో ఉన్నప్పుడే గుర్తిస్తే... అప్పుడు కీమోథెరపీ, రేడియోథెరపీలను కూడా ఇవ్వవచ్చు. కొన్నిసార్లు కీమోథెరపీతో వ్యాధిని నియంత్రణలోకి తెచ్చి అప్పుడు శస్త్రచికిత్స చేసి క్యాన్సర్ ఉన్న భాగాన్ని తొలగించాల్సి ఉంటుంది. ఇక మూడోదశలోనే 3-బి అనే దశలో గుర్తిస్తే అప్పుడు కీమోథెరపీ, రేడియోథెరపీ ఒకసారిగాని... లేదా ఒకదాని తర్వాత మరొకటి గాని ఇస్తారు. క్యాన్సర్‌ను రెండోదశలోనే గుర్తిస్తే... ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఉన్న భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించి, అప్పుడు కీమో ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను చాలా ముందుగా అంటే... మొదటి దశలోనే గుర్తిస్తే మ్తారం ఒక్క శస్త్రచికిత్స చికిత్సతోనే అంతా పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే లంగ్ క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తించడం అన్నివిధాలా మేలు. నివారణ: అన్నిరకాల ఊపిరితిత్తుల క్యాన్సర్లకూ ప్రప్రథమ, ప్రధాన కారణం పొగాకు వాడకం. అది పొగతాగడం రూపంలోగాని లేదా పొగాకు నమలడం గాని లేదా అడ్డపొగాకు రూపంలో నిప్పు ఉన్నవైపును నోట్లో పెట్టి కాల్చడం గాని... ఇలా ప్రక్రియ ఏదైనా పొగాకు అన్నది అన్ని రకాల లంగ్ క్యాన్సర్లకు మూలకారణం. సిగరెట్ పొగలో 4000 రకాల హానికరమైన రసాయనాలు, అందులో 60కి పైగా క్యాన్సర్ కారక పదార్థాలు ఉంటాయి. ఆ పొగ నేరుగా కాకుండా, పొగతాగేవారి పక్కన ఉండే వారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా హానికరం కాబట్టి ఈ దురలవాటును దూరం చేసుకుంటే 90 శాతం రోగుల్లో సమర్థమైన నివారణ సాధ్యమవుతుంది. ఇక సూర్యరశ్మికి ఎక్స్పోజ్ కావడం ద్వారా విటమిన్-డిని శరీరానికి లభించేలా చేయడం కూడా క్యాన్సర్ నివారణకు తోడ్పడే అంశమే. పొగాక వాడకంతో పాటు... ర్యాడాన్ గ్యాస్, ఆస్బెస్టాస్, అల్యూమినియం పరిశ్రమల్లో పనిచేయడం, రేడియేషన్‌కు ఎక్స్పోజ్ అయ్యే రంగాల్లో ఉన్నవారు, ఆర్సినిక్ లాంటి విషాలకు ఎక్స్పోజ్ కావడం, బొగ్గు ఉత్పాదనకు సంబంధించిన రంగాల్లో ఉండటం కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు రిస్క్ ఫ్యాక్టర్లు. కాబట్టి ఈ రంగాల్లో ఉండేవారు తమకు క్షయ, బ్రాంకైటిస్‌కు సంబంధించిన లక్షణాలు కనిపించినా అది ఊపిరితిత్తుల క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకోవాలి. అయితే ఈ తరహా క్యాన్సర్ కణాలు అత్యంత సూక్ష్మమైనవి కావడం వల్ల మొదట తీసిన స్కాన్‌లో అవి కనిపించకపోయినా... మూడు లేదా ఆరు నెలల తర్వాత తీయించిన స్కాన్‌లో వాటిని కనుగొంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రిస్క్ ఫ్యాక్టర్ల రంగాల్లో ఉన్నవారు తరచూ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటూ ఉండటం మంచిది. డాక్టర్ సిహెచ్.మోహనవంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్ ఫోన్: 9848011421 -
ఇప్పుడు హైదరాబాద్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లోనే...
రెండు దశాబ్దాల క్రితం వరకు కూడా బైపాస్ సర్జరీ అంటే మన దగ్గర ఓ అబ్బురం. ఆర్థికంగా ఉన్నవారు, పలుకుబడిగల వారు అమెరికా వెళ్లి సర్జరీ చేయించుకుని వచ్చేవారు. కారణం... అప్పట్లో బైపాస్ సర్జరీ చేసే డాక్టర్లు అమెరికాలోనే ఉండేవారు. కానీ ఇప్పుడా చికిత్స ఇక్కడి ఓ మోస్తరు ఆసుపత్రుల్లో సైతం రోజూ జరిగే ప్రక్రియ. అలాగే ఇప్పుడు కేవలం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు జరిగే ఉన్నతస్థాయి శస్త్రచికిత్సలు అమెరికాలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. మనదేశంలోని అత్యంత పెద్దస్థాయి వైద్యకేంద్రాల్లోనూ కేవలం ప్రస్తావనాపూర్వకంగా ఉన్న ఈ విభాగంలో ప్రత్యేక శిక్షణను అమెరికాలోని అత్యంత ఉన్నతస్థాయి సంస్థల్లో పొంది వచ్చిన డాక్టర్ సాయి యండమూరి... ఇప్పుడు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లో ఈ విభాగంలో ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు చేసే అత్యంత నైపుణ్యమైన శస్త్రచికిత్స గురించి చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే... ప్ర: మన దేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాప్తి, విస్తృతి గురించి చెప్పండి డా. సాయి యండమూరి: మన దేశంలో... పురుషుల్లో వచ్చే క్యాన్సర్లలో అది గణనీయమైన స్థానంలోనే ఉంది. పాశ్చాత్యదేశాల్లోలాగా అది తగ్గుముఖం పట్టాలంటే మరో పాతికేళ్లు పడుతుంది. అప్పటివరకూ ఇక్కడ ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా సంభవించే మరణాలను అరికట్టాలి కదా. అందుకు ఆ స్థాయి చికిత్స అవసరం. ప్ర: మరి అలా అరికట్టడం సాధ్యమేనా? డా. సాయి: ఇది జబ్బు ఏ దశలో ఉందనే అంశంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మొదటి దశలో గుర్తిస్తే 70% నుంచి 75% ప్రాణహాని పూర్తిగా తగ్గుతుంది. అదే రెండోదశలో గుర్తిస్తే 50 శాతం, మూడోదశలో గుర్తిస్తే కేవలం 20% నుంచి 25శాతం మాత్రమే కాపాడగలం. నాలుగోదశలోకి ప్రవేశిస్తే నయం కావడం చాలా కష్టం. ఇంతగా నయం చేయగలగడానికి అవకాశం ఉన్న ఈ క్యాన్సర్‌కు స్క్రీనింగ్ చాలా సులభం. కేవలం ఒక్క సీటీ స్కాన్‌తోనే దీన్ని గుర్తుపట్టవచ్చు. ప్ర: మీరు చేసే చికిత్స తీరుతెన్నులు...? డా. సాయి: నేను అమెరికాలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, అత్యున్నత స్థాయి సంస్థల్లో పనిచేశా. అక్కడ సూపర్‌స్పెషాలిటీలో శిక్షణ తర్వాత మళ్లీ అందులోనే మరింత నైపుణ్యం సాధించడానికి సబ్-స్పెషాలిటీని ఎంచుకోవాలి. అప్పుడు నేను కార్డియోథొరాసిక్ విభాగాన్ని గాక... కేవలం థొరాసిక్ సర్జరీని ఎంచుకున్నా. కార్డియోథొరాసిక్లో శిక్షణ పొందినవారు గుండె, ఛాతీ భాగంలోని ఊపిరితిత్తులు ఈ రెండింటినీ అధ్యయనం చేస్తారు. అయితే నేను గుండెను మినహాయించి... అంతే శిక్షణను కేవలం ఊపిరితిత్తుల భాగానికే కేటాయించి, నైపుణ్యం పొందగలిగాను. అంత సబ్-స్పెషాలిటీ స్థాయి శిక్షణ పొందినవారు అమెరికాలోనే కాస్త తక్కువ. మా శిక్షణ ఎంత నిశితంగా ఉంటుందంటే... ఇప్పుడు కేవలం నాలుగు సెం.మీ. గాటుతో ఊపిరితిత్తుల్లో దాదాపు సగభాగానికి సమర్థమైన శస్త్రచికిత్స చేయడం సాధ్యం. ఇక ఈ నాలుగు సెం.మీ. గాటుతో పాటు మరో రెండు చోట్ల ఒక సెం.మీ., ఒక సెం.మీ. పరిమాణం గల రెండు గాట్లతో పూర్తి ఊపిరితిత్తులకు శస్త్రచికిత్స చేయగల సామర్థ్యాన్ని మా టీమ్ సాధించింది. ఎండోబ్యాగ్ అనే చిన్న సంచిలో ఊపిరితిత్తులను ఉంచి ఈ చిన్నపాటి రంధ్రాల నుంచే వాటిని బయటకు తీసి, క్యాన్సర్ కణుతులను, గడ్డలను పూర్తిగా తొలగించవచ్చు. పైగా మేం శిక్షణ పొందిన తరహా శస్త్రచికిత్సలో గాటు చాలా తక్కువ కావడంతో అది తగ్గడానికీ పట్టే సమయం తక్కువ. ఇన్ఫెక్షన్లు తక్కువ. నిమోనియా వంటి కాంప్లికేషన్లూ తక్కువ. కేవలం రెండు వారాల్లోనే నయమవుతుంది. ఆసుపత్రిలో ఉండే సమయం కూడా తగ్గుతుంది. పైగా శస్త్రచికిత్స చేసిన చోట నొప్పి ఉండదు. ప్ర: ఇంత శిక్షణ పొంది, ఆ స్థాయిలో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్న మీరు ఇక్కడికి రావడానికి కారణం? డా. సాయి: రెండు మూడు దశాబ్దాల క్రితం బైపాస్‌ను ఎంత సంక్లిష్టంగా పరిగణించేవారో అందరికీ తెలిసిందే. అప్పుడు అదెంతటి సంక్లిష్టమో, ఇప్పుడు నేను నిర్వహించే తరహా ఆపరేషన్లు సైతం అంతే సంక్లిష్టం. ఒకప్పుడు అమెరికన్ నిపుణులు ఇక్కడికి వచ్చి ఇక్కడా వారి స్థాయి నైపుణ్యం గల వారిని తయారు చేశారు. అదే తరహా నైపుణ్యం (ఎక్స్పర్టైజ్) ఇప్పుడు ఊపిరితిత్తుల విషయంలో మనకు అవసరం. ఎందుకంటే ఇక్కడి రోగుల సంఖ్య, ఇక్కడి ఊపిరితిత్తుల జబ్బుల వ్యాప్తి, విస్తృతి, డిమాండ్‌కు తగినట్లుగా నిపుణులు లేరు. మనకూ ఆ స్థాయి నిపుణుల అవసరం ఉంది. అందుకే నేను కేవలం శస్త్రచికిత్సలు చేయడం కంటే... నా స్థాయిలో చేయగలిగేవారిని పదిమందిని తయారు చేస్తే ఇక్కడి రోగుల అవసరాలను సమర్థంగా తీర్చగలనని అనిపించింది. అమెరికా స్థాయి నైపుణ్యం మనకూ కావాలన్న సంకల్పంతో నేనీదేశానికి వచ్చా. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా... మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉన్న పెద్దవైద్యకేంద్రాల్లోనూ అమెరికా స్థాయి వైద్యం అందేలా నిపుణులను తయారు చేసే పనిలో కొందరు ఉన్నారు. నాదీ అదే ఉద్దేశం కావడంతో నాలాంటి దృష్టికోణంతో పనిచేసే వారితో పాటు ఆ క్రతువులో నేనూ భాగస్వామిని అవుతున్నాను. ఇప్పుడు బైపాస్ విషయంలో ఏం జరుగుతోందో... త్వరలో ఊపిరితిత్తుల సర్జరీల విషయంలోనూ అదే జరగాలని నా కోరిక. ప్ర:హైదరాబాద్‌నే కేంద్రంగా ఎంచుకోడానికి కారణం? డా. సాయి: నేను అమెరికాలోని అంతర్జాతీయ స్థాయి సంస్థలో, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సంస్థల్లో పనిచేశానని చెప్పాను కదా. అదే తరహా ప్రొటోకాల్ అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లో ఉంది. ఒక వాతావరణంలో పనిచేశాక మళ్లీ మన దేశంలో అదే తరహా వాతావరణంలో పనిచేయడం సులువు కదా. ఆ స్థాయి చికిత్స జరిగే ప్రదేశంగా నేను అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ను గుర్తించాను. ఇక్కడి చాలా పెద్ద సంస్థల్లోనూ సర్జరీ, రేడియేషన్, కీమో తరహా చికిత్సలు వేటికవే స్వతంత్రంగా జరుగుతాయి. కానీ ఈ సంస్థలో మాత్రం అన్నీ సంయుక్తప్రభావంతో జరిగేలా చూస్తారు. ఇలాంటి మల్టీడిసిప్లినరీ అప్రోచ్ విషయంలో మిగతా సంస్థలు... అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ కంటే కాస్త వెనకే ఉన్నాయనిపించింది. ప్ర: విదేశాలతో పోలిస్తే ఊపిరితిత్తుల క్యాన్సర్ విషయంలో మన దేశ పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? డా. సాయి: ఆఁ... ఉన్నాయి. పైగా ఆ అంశాలు కూడా ఇక్కడే నా సేవలు అవసరమని భావనను పెంచి నన్నిక్కడే ఉంచేలా చేశాయి. ఉదాహరణకు... ఆస్బెస్టాస్ వాడకం వల్ల మీసోథీలియోమా అనే తరహా క్యాన్సర్ వస్తుంది. దీన్ని గుర్తించిన విదేశాలు ఆస్బెస్టాస్ను పూర్తిగా నిషేధించాయి. కానీ మన దేశంలో ఆస్బెస్టాస్ ఉపయోగం ఎక్కువే. అందుకే ఈ తరహా క్యాన్సర్లు విదేశాలతో పోలిస్తే మన దగ్గర ఎక్కువ. పైగా ఈ మీసోధీలియోమా క్యాన్సర్‌కు చికిత్స అత్యంత సంక్లిష్టం, చాలా కష్టం. అందుకే ఇక్కడ ఆ తరహా క్యాన్సర్‌ను ఎదుర్కొనే బృందాన్ని ఇక్కడ రూపొందేలా కృషి చేస్తున్నాం. నాకు తెలిసి ఈ తరహా టీమ్ గత 72 ఏళ్లలో ఇదే మొదటి శ్రేణిది అని చెప్పవచ్చు. అంతేకాదు... ఈ మీసోథీలియోమా చికిత్సలో మొత్తం ఛాతీ క్యావిటీని కడిగేయడం కూడా చేస్తున్నాం. దీన్నే వైద్య పరిభాషలో ఇంట్రాప్లూరల్ కీమో థెరపీ అంటారు. ఈ తరహా అత్యున్నత స్థాయి చికిత్సలు ఇక్కడ అందుబాటులోకి రావాలన్నదే ప్రస్తుతం మా లక్ష్యం. సంప్రదించాల్సిన చిరునామా... అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్, ఎట్ సిటిజన్ హాస్పిటల్, శేరిలింగంపల్లి, హైదరాబాద్ - 500 019; వెబ్సైట్ : www.americanoncology.com డాక్టర్ సాయి యండమూరి కన్సల్టెంట్ - హెడ్ ఆఫ్ థొరాసిక్ సర్జరీ, అమెరికల్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ ఎట్ సిటిజన్స్ హాస్పిటల్స్, ఫోన్: 67199835 -
ఊపిరితిత్తుల క్యాన్సర్ - కొత్త చికిత్సలు హాయిగా ఊపిరి పీల్చుకోండి!
ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న క్యాన్సర్ మరణాల్లో మూడోవంతు ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగానే కలుగుతున్నాయి. రొమ్ము, పెద్దపేగు, ప్రోస్టేట్ క్యాన్సర్లు.. ఈ మొత్తాన్ని కలుపుకున్నా, వాటన్నిటికంటే ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో సంభవించే మరణాలే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అంటే దీని తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో ఈ వ్యాధి తీవ్రతపై సమగ్రమైన అధ్యయనాలు లేవు. పైగా లక్షణాల ఆధారంగా దాన్ని ట్యూబర్క్యులోసిస్ (టీబీ) గా పొరబడి చికిత్స విషయంలోనూ ఆలస్యం జరిగే కేసులే ఎక్కువ. కాబట్టి ప్రపంచవ్యాప్తపు లెక్కల ఆధారంగా చూస్తే మన దేశంలో దీనివల్ల కలిగే మరణాలు ఎక్కువేనని తెలుస్తోంది. ఒక అంచనా ప్రకారం ఏడాదికి మన దేశంలో 63,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి. అందులో 80 శాతం మంది పురుషులే. తీవ్రత, వ్యాధి నిర్ధారణలో పొరబడే అవకాశాలను దృష్టిలో పెట్టుకుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవడం ఎంత అవసరమో తెలుస్తుంది. ఆ అవగాహన కోసమే ఈ కథనం. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు అనేక అంశాలు దోహదపడతాయి. మన దేశంలో 90 శాతం కేసుల్లో క్యాన్సర్ వ్యాప్తికి పొగాకు వాడకమే ప్రధాన కారణం. సాధారణ వ్యక్తితో పోలిస్తే పొగతాగేవారిలో ఈ వ్యాధి రావడానికి అవకాశాలు 2.5 రెట్లు ఎక్కువ. అయితే పొగతాగడం అలవాటు లేని ఊపిరితిత్తుల క్యాన్సర్ పేషెంట్లలో 65 శాతం మహిళలు కాగా... కేవలం 35 శాతం మంది మాత్రమే పురుషులున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటున్న వివరాల మేరకు వాతావరణ కాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణం. ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు: మానకుండా అదేపనిగా వచ్చే దగ్గు కళ్లెలో రక్తం పడటం ఛాతీలో నొప్పి ఒకవేళ మెదడుకు పాకితే తలనొప్పి వాంతులు వంటివి. నెలరోజులకు పైగా ఎడతెరిపి లేకుండా దగ్గు వస్తున్నా, బరువు క్రమంగా తగ్గుతున్నా, గొంతులో (స్వరంలో) మార్పు కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. చికిత్స: గతంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తే ఏ రోగికైనా ఒకేలాంటి చికిత్స చేసేవారు. అయితే ఇప్పుడు రోగిని, అతడికి ఉన్న లక్షణాలను బట్టి ప్రత్యేకంగా చికిత్స చేస్తున్నారు. అంటే ఒకే చికిత్స దశ నుంచి ఇప్పుడు వ్యక్తిగతమైన చికిత్స అవసరమైన (పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్) దశకు వైద్యవిజ్ఞానం చేరుకుంది. దీనికోసం రోగి జీవశాస్త్రపరమైన స్వభావాన్ని (నేచురల్ హిస్టరీ/బయలాజికల్ హిస్టరీ) తెలుసుకునేందుకు అనేక పరీక్షలు చేసి అతడికి అవసరమైన చికిత్స ఏమిటో నిర్ణయించాల్సి ఉంటుంది. అర్లీ లంగ్ క్యాన్సర్‌లో... గతంలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను త్వరగా (అర్లీ లంగ్ క్యాన్సర్స్‌ను) గుర్తిస్తే, క్యాన్సర్‌కు గురైన మేరకు ఊపిరితిత్తిని గాని వ్యాధికి గురైన మొత్తం తమ్మె (లోబ్) ను గాని తొలగించేవారు. ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో కోత అవసరం లేకుండా చేసే రేడియో సర్జరీ పద్ధతులను అవలంబిస్తున్నా రు. అయితే గతంలోని శస్త్రచికిత్సకు ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చేది కానీ ఇప్పుడు అవలంబిస్తున్న రేడియో సర్జరీ ప్రక్రియలో రోగులు ఔట్ పేషెంట్ గానే ఆసుపత్రికి వచ్చి నొప్పి లేని ఈ రేడియోథెరపీ తీసుకుంటే చాలు. దీనివల్ల గతంతో పోలిస్తే చికిత్స వ్యవధి కూడా బాగా తగ్గింది. ఈ తరహా చికిత్సల కోసం ఇప్పుడు ర్యాపిడ్ ఆర్క్ వంటి సరికొత్త ఆధునిక ప్రక్రియలు కూడా అందుబాటులోకి వచ్చాయి. కాస్తంత అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉన్న రోగులకు... ఇక అర్లీ దశను దాటి కాస్తంత అడ్వాన్స్డ్ దశకు చేరుకున్న రోగులకు కీమోథెరపీగాని లేదా కీమోతో పాటు రేడియోథెరపీ సహాయంతో గాని చికిత్స చేయాల్సి ఉంటుంది. కీమోథెరపీలో క్యాన్సర్ కణాలను తుదముట్టించే విధంగా పనిచేసే ఇంజెక్షన్లను నోటి ద్వారా తీసుకునే విధంగా (ఓరల్‌గా) గాని ఇంజెక్షన్ల రూపంలో గాని మందులు ఇస్తారు. గతంలో కంటే భిన్నంగా ఇప్పుడు రోగికి ఉన్న క్యాన్సర్ తీవ్రతను బట్టి అతడికే ప్రత్యేకంగా ఉద్దేశించిన విధంగా (పర్సనలైజ్డ్) చికిత్స జరుగుతోంది. ఇలా వ్యక్తిగతమైన చికిత్స వల్ల కేవలం క్యాన్సర్ ఉన్న మేరకే క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని చికిత్స చేస్తారన్నమాట. అందుకే దీన్ని టార్గెటెడ్ థెరపీగా అభివర్ణిస్తున్నారు. దీనివల్ల క్యాన్సర్ రోగుల చికిత్సలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. కేవలం వ్యాధి ఉన్న ప్రాంతాన్నే లక్ష్యంగా చేసుకుని చికిత్స ఇవ్వడం, గతంలో తప్పనిసరిగా శస్త్రచికిత్స అవసరమైన సందర్భాల్లోనూ, నోటి ద్వారానే ట్యాబ్లెట్లను, మందులను తీసుకోగలగడం, శస్త్రచికిత్స అవసరాలను గణనీయంగా తగ్గించగలగడం వంటివి చేస్తున్నారు. గతంలో మందుల దుష్ర్పభావాలైన... జుట్టు రాలిపోవడం, ఆకలి లేకపోవడం, వాంతులు, వికారం, వ్యాధినిరోధకశక్తి తగ్గడం ఇలాంటివన్నీ చాలావరకు తగ్గాయి. మరిన్ని ఆధునిక విధానాలు ‘ట్రిపుల్ ఎఫ్ బీమ్స్’ అనే కిరణాలతో చేసే చికిత్స ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో మరింత ఆధునికమైనది. ఇప్పుడు అందుబాటులో ఉన్న అన్ని చికిత్స విధానాలతో పోలిస్తే దీనివల్ల చికిత్స గతంలో కంటే మరింత వేగంగా, సురక్షితంగా, ప్రభావపూర్వకంగా జరుగుతుంది. ఈ కిరణాల వల్ల క్యాన్సర్ ఉన్న భాగానికి చికిత్స చేసినప్పుడు, పక్కన ఉండే కణజాలంపై పడే ప్రభావం అత్యంత తక్కువ. దాంతో దీర్ఘకాలికంగా కనిపించే దుష్ర్పభావాలూ తక్కువే. ఎలాంటి కత్తిగాటు లేకుండానే, శస్త్రచికిత్స చేయకుండానే, ఈ ట్రిపుల్ ఎఫ్ బీమ్‌తో సమర్థంగా చికిత్స చేయవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాధారణ సంప్రదాయ సీటీ స్కానర్లతో పోలిస్తే ఇప్పుడు 4డీ-సీటీ స్కాన్ (ఫోర్త్ డైమన్షనల్ సీటీ) వసతులు సైతం అందుబాటులోకి వచ్చాయి. గతంలోని స్కాన్ల సహాయంతో వ్యాధిగ్రస్తమైన క్యాన్సర్ ట్యూమర్‌ను చూసినప్పుడు దాని ఆకృతిలో, పొడవు, వెడల్పు, ఎత్తు వంటి పరిమాణాలలో ఎంతోకొంత తేడా (డిస్టార్షన్) ఉండేది. కానీ ఈ సరికొత్త స్కానర్లతో రోగగ్రస్తమైన భాగాన్ని పరిశీలిస్తే దానిలో ఎలాంటి తేడాలు (డిస్టార్షన్స్) ఉండనంత కచ్చితంగా ట్యూమర్లను చూడవచ్చు. కదులుతున్నా చికిత్స చేయగల ‘రెస్పిరేటరీ గేటింగ్’ టెక్నిక్... ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు చికిత్స విషయంలో ఒకింత కష్టమయ్యే అంశం ఏమిటంటే... ఇవి స్థిరంగా ఉండవు. మనం శ్వాసించేటప్పుడు ఇవి క్రమబద్ధంగా కదులుతూ ఉంటాయన్న విషయం తెలిసిందే. అందుకే ఊపిరితిత్తులతో పాటు వాటిపై ఉండే ట్యూమర్ కూడా క్రమబద్ధంగా కదులుతూ ఉంటుంది. రేడియోథెరపీ ఇచ్చే సమయంలో ఈ అంశం డాక్టర్లకు ఒక సవాలుగా ఉంటుంది. ఇప్పుడు ‘రెస్పిరేటరీ గేటింగ్’ అనే ఊపిరితిత్తుల కదలికలను నిత్యం పర్యవేక్షించే ఉపకరణం (మానిటరింగ్ డివైజ్) ఉపయోగపడుతుంది. ఈ రెస్పిరేటరీ గేటింగ్ టెక్నిక్ ఆధారంగా ట్యూమర్ ఎప్పుడూ ఒక నిర్దిష్టమైన స్థానంలో ఉన్నప్పుడే రేడియోథెరపీ తరంగాలు దాన్ని తాకేలా ‘ఆన్’ అవుతూ ఉంటుంది. అంటే... మిగతాచోట్ల ఉన్నప్పుడు తరంగాలు తగలకుండా ‘ఆఫ్’ అయిపోయే ప్రక్రియ నడుస్తుంటుంది. దీనివల్ల రోగగ్రస్థం కాని భాగానికి రేడియోథెరపీ తరంగాలు తగలవు. కేవలం వ్యాధి ఉన్న కణజాలాన్నే ఈ కిరణాలు నాశనం చేస్తాయన్నమాట. టార్గెటెడ్ థెరపీ: ఇప్పుడు లభ్యమవుతున్న క్యాన్సర్ చికిత్స ప్రక్రియలన్నింటిలోనూ ఇది అత్యాధునికమైనదని చెప్పవచ్చు. దీన్ని కీమోథెరపీతోగాని కీమో, రేడియోథెరపీలతో పాటు గాని ఇస్తుంటారు. ఇందులో నోటి ద్వారానే మందులు తీసుకోవడానికి వీలవుతుంది. దీని కారణంగా గతంలో ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాల్సిన అడ్వాన్స్డ్ దశ పేషెంట్లు సైతం ఇప్పుడు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండానే (ఇంట్లోనే) చికిత్స తీసుకోవచ్చు. అన్ని పనులూ యథావిధిగా చేసుకోవచ్చు. ఫలితంగా రోగి జీవన నాణ్యతలో ఎలాంటి మార్పూ ఉండదన్నమాట. ఈ కారణంగానే ఈ ప్రక్రియ మరింత ప్రాచుర్యం పొందుతోంది. ఇక సాధారణ కీమోథెరపీలో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ టార్గెటెడ్ థెరపీలో ఉండవు. అందుకే ఇప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు చికిత్స తీసుకోవాల్సి వస్తే రోగులు గతంలోలాగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మునుపటికంటే మెరుగైన చికిత్స తీసుకోవచ్చు. నిర్వహణ: యాసీన్ నివారణ: పొగతాగే అలవాటును, పొగాకు వాడకాన్ని తక్షణం మానేయడం ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణకు తోడ్పడే విషయం అన్నది తెలిసిందే. దీనికి తోడు ఒకవేళ క్యాన్సర్ వచ్చినవారిలోనూ పొగ అలవాటు లేనట్లయితే మందులు ఇంకా బాగా పనిచేసే అవకాశం ఉంటుందని తేలింది. ఇక పొగతాగేవారి పక్కన ఉండటం (ప్యాసివ్ స్మోకింగ్) కూడా చేయకూడదు. వాహనపు పొగల వంటి వాహన కాలుష్యం నుంచి, పరిసరాల్లో వ్యాపించే వాతావరణ కాలుష్యం నుంచి దూరంగా ఉండాలి. పరిశుభ్రమైన వాతావరణంలో నివసించాలి. పొగతాగే కోరికను అధిగమించలేని వారికి ఇప్పుడు పొగ తాగే కోరికను తగ్గించే మందులు సైతం అందుబాటులోకి వచ్చాయి. వీటిని వాడటం కూడా ఒక రకంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నివారించడం వంటిదే. అందుకే పొగతాగే అలవాటు ఉన్నవారు, పొగాకు ఏ రూపంలోనైనా వాడే అలవాటు ఉన్నవారు తక్షణం, ఆ అలవాటు నుంచి దూరం కావాలి. అది ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పాటు అనేక క్యాన్సర్ల నివారణకు తొలిమెట్టు. పొగతాగడం మానేయండి... మీకంతా లాభమే... మందులు రోగులపై ఎలా పనిచేస్తున్నాయన్న అంశంపై నిర్వహించిన అధ్యయనాల్లో... పొగ అలవాటు లేనివారిలో, మహిళల్లో మందుల ప్రభావం చాలా సమర్థంగా ఉంటోందని తేలింది. ఇంకా ఆసక్తికరమైన అంశమేమిటంటే... పాశ్చాత్య దేశాల్లోని జనాభా కంటే మన దేశస్థుల్లో (ప్రధానంగా ఆసియా ఖండవాసులందరిలోనూ) ఈ మందులు బాగా పనిచేస్తున్నాయని పరిశోధనల్లో తెలిసింది. అందుకే పొగతాగడం మానేస్తే ఎన్నో ప్రయోజనాలు.