
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పాత్రికేయుడు, రెడ్డినాడు మాసపత్రిక వ్యవస్థాపక సంపాదకుడు వై.శ్రీనివాసరెడ్డి ఆదివారం కన్నుమూశారు. గత రెండు నెలలుగా పెద్దపేగు, ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
1985లో పాత్రికేయ వృత్తిని ప్రారంభించిన ఆయన ఈనాడు, డెక్కన్ క్రానికల్, సమయం, ఆంధ్రజ్యోతి, ఉదయం పత్రికల్లో దీర్ఘకాలం పనిచేశారు. రెడ్డినాడు అనే పత్రికను నెలకొల్పి రెడ్డినాడు శ్రీనివాస్‌గా గుర్తింపు పొందారు. మాజీమంత్రి మైసూరారెడ్డి వద్ద ప్రజాసంబంధాల అధికారి (పీఆర్వో)గా పనిచేశారు. శ్రీనివాస్‌రెడ్డి కోలుకోవడం కోసం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ 24 యూనిట్ల రక్తాన్ని ఆయనకు దానం చేసింది. శ్రీనివాస్‌రెడ్డి మృతి పట్ల పలువురు పాత్రికేయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment