ఊపిరితిత్తుల క్యాన్సర్ అత్యంత సాధారణ కేన్సర్. ప్రపంచవ్యాప్తంగా అనేకమరణాలను ప్రధానకారణం లంగ్ కేన్సర్. ప్రతీ ఏడాది 1.6 మిలియన్ల మంది ఈ కేన్సర్‌కి బలవుతున్నారు. ఊపిరితిత్తుల కేన్సర్‌కు ప్రధాన కారణం పొగాకు,ధూమపానం అయినప్పటికీ, ఎపుడూ ధూమపానం చేయని వ్యక్తులలో కూడా సంభవించవచ్చు. దాదాపు 15 శాతం మంది పొగాడు వినియోగం చరిత్ర లేనప్పటికీ ఈ వ్యాధిబారిన పడుతున్నారని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. అందుకే దీనిపై అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. ఈరోజు ( ఆగస్టు 1)న ప్రపంచ ఊపిరితిత్తుల కేన్సర్ దినోత్సవంగా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.
ధూమపానంతో పాటు కొన్ని జన్యు పరమైన కారణాలు, గాలి కాలుష్యం, పరోక్షంగా ధూమపాన ప్రభావానికి లోనుకావడం, ఆస్బెస్టాస్ ఎక్స్‌పోజర్, రాడాన్ వాయువులు, డీజిల్ ఎగ్జాస్ట్ పొగ తదితర కారణాల వల్ల ఈ వ్యాధి సోకుతుంది. దీర్ఘకాలికంగా స్టెరాయిడ్స్ వాడే వారిలో కూడా ఈ ఊపిరితిత్తుల కేన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. ఊపిరితిత్తుల కేన్సర్‌ను సోకిన మహిళల్లో 20 శాతం మంది ఎప్పుడూ ధూమపానం చేయనివారే.
ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం 2024: చరిత్ర
ఊపిరితిత్తుల కేన్సర్ వ్యాప్తి మరియు ప్రభావం,ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం పాటిస్తారు. ఫోరమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రెస్పిరేటరీ సొసైటీస్ (FIRS), ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ లంగ్ క్యాన్సర్ (IASLC) మధ్య సహకారంతో 2012లో మొదటిసారిగా దీన్ని పాటించారు. గమనించారు. ఇక అప్పటినుంచి ఊపిరితిత్తుల కేన్సర్ దినోత్సవాన్ని ఏటా ఆగస్టు 1న జరుపు కుంటారు. లంగ్ కేన్సర్‌పై అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం.
కేన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించడం, సమయానికి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. ఈ కేన్సర్‌ను ఎదుర్కోవడానికి కొనసాగుతున్న పరిశోధన ఆవిష్కరణల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రచారాలు ,కార్యకలాపాలు నిర్వహిస్తారు.
థీమ్: “క్లోజ్ ది కేర్ గ్యాప్: ప్రతి ఒక్కరూ కేన్సర్ నుంచి రక్షణ పొందేందుకు అర్హులు’’ అనే థీమ్‌తో 2024 వరల్డ్ లంగ్ కేన్సర్ డే ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
ఊపిరితిత్తుల కేన్సర్ రకాలు
ఊపిరితిత్తుల క్యాన్సర్ సాధారణంగా రెండు రకాలగా విభజించారు. నాన్-స్మాల్ సెల్ ఊపిరితిత్తుల కేన్సర్ (NSCLC) , చిన్న-కణ ఊపిరితిత్తుల క్యాన్సర్ (SCLC). రెండో రకం కేన్సర్‌లో రెండింటి లక్షణాలు ఉంటాయి.
లక్షణాలు
ఎడతెరపి లేని దగ్గు
ఉన్నట్టుండి బరువు తగ్గడం
గాలిపీల్చుకోవడంలో ఇబ్బంది, ఆయాసం
ఛాతీలో నొప్పి
దగ్గుతున్నప్పుడు రక్తం పడటం
ఎముకల్లో నొప్పి
వేలిగోళ్లు బాగా వెడల్పుకావడం
జ్వరం అలసట / నీరసం
ఆహారాన్ని మింగడంలో ఇబ్బందులు
ఆహారం రుచించకపోవడం
గొంతు బొంగురుపోవడం
చర్మం, కళ్లు పసుపు రంగులో మారడం
నోట్ : వీటిల్లో కొన్ని లక్షణాలు కనిపించినంత మాత్రాన కేన్సర్ సోకినట్టు కాదు. ఇలాంటి లక్షణాలు శరీరంలో కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. టీబీ సోకినా వీటిల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వైద్య నిపుణుల పర్యవేక్షణలో వ్యాధి నిర్ణారణ చేసుకోవాలి. ఈ కేన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులువవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment