significant exposure
-
Dussehra 2024 నవదుర్గా నమోస్తుతే!
నేటినుంచి ఆశ్వీయుజ మాసం ఆరంభం అవుతోంది. ఈ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ తొమ్మిది రోజులను నవ రాత్రులు అంటారు. నవ రాత్రులంటే మహిళలు దేవిని స్మరిస్తూ పండగ చేసుకుంటారు. ఈ అమ్మవారి ఆరాధనా మహోత్సవాన్ని ’శరన్నవరాత్రి ఉత్సవాలు’గా, ’దేవీనవ రాత్రులు’గా పిలుస్తుంటారు. మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈతొమ్మిదిరోజుల పాటు తొమ్మిది రూపాలలో అలంకరించి పూజించడం జరుగుతుంటుంది.భక్తులు ఈ తొమ్మిదిరోజుల పాటు దీక్ష చేపట్టి, ఏకభుక్త వ్రతాన్ని ఆచరిస్తూ అమ్మవారిని పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.శరన్నవరాత్రులలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఎవరైతే తనని పూజిస్తారో,వాళ్లు తనకి అత్యంత ప్రీతిపాత్రులని అమ్మవారే స్వయంగా చెప్పినట్టుగా పురాణాలు వెల్లడిస్తున్నాయి. దేవీ నవరాత్రులు ఎంతో విశిష్టమైనవి, మహా పవిత్రమైనవి. ఈ తొమ్మిది రోజులపాటు ఒక్కోరోజు ఒక్కో రూపంగా అలంకృతమైన అమ్మవారిని దర్శించుకోవడం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. ఇలా తొమ్మిది రోజుల పాటు నవదుర్గలను ఆరాధించడం వలన ధనధాన్యాలు ... సంతాన సౌభాగ్యాలు ... సుఖశాంతులు చేకూరుతాయని పండితులు చెబుతారు. ఇక దేవీ నవరాత్రి పూజలు చేయుట, అనునది అనాది కాలంగా వస్తున్న శాస్త్రవిధి. ‘అశ్వనీ‘ నక్షత్రంలో కలసి వచ్చిన పూర్ణిమమాసమే ‘ఆశ్వీయుజమాసం‘ అవుతుంది. ఈ మాసమందు ’దేవీనవరాత్రుల’ను శరన్నవరాత్రులని పిలుస్తూ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభించి తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు వైభవంగా చేస్తారు.∙ప్రథమాశైలపుత్రి,ద్వితీయా బ్రహ్మచారిణీ ∙తృతీయాచంద్రఘంటీతి, ∙కూష్మాండేతి చతుర్థికీ ∙పంచమా స్కందమాతేతి∙షష్టాకాత్యాయనేతి ∙సప్తమా కాళరాత్రిచ ∙అష్టమాచాతి భైరవీ ∙నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా. మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒకరే! అలంకారాలు వేరైనా అమ్మదయ అందరిపట్ల ఒకటే! హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో వైభవంగా నిర్వహించే పండుగలలో ఈ ‘దసరావైభవం‘ ఒకటి. ఇది పదిరోజులు పండుగ అయినప్పటికి దేవిని రోజుకో అవతారంగా అలంకరించి అమ్మవారికి అర్చనలుచేసి, నవవిధ పిండివంటలతో నివేదనలుచేస్తూ విశేష పూజలతో పాటు నిత్యం శ్రీలలితా సహస్రనామ పారాయణ గావిస్తూ ‘శరన్నవరాత్రులు‘ గా వ్యవహరిస్తారు. శ్రవణానక్షత్రయుక్త ’దశమి’ తిథిన విజయదశమితో ఈ దసరావైభవాలు పూర్తిచేస్తారు. దసరాకు మరోపేరు ‘దశహరా‘ అంటే! పది పాపాలను హరించేది అని అర్థం చెబుతారు దైవజ్ఞలు. ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి, హస్తా నక్షత్రంలో కూడియున్న శుభదినాన ఈ దేవీ పూజ ప్రారంభించడం చాలా మంచిదని మార్కండేయ పురాణం చెబుతోంది. అందువల్ల ఈ రోజు నుంచి నవరాత్రులు ప్రారంభిస్తారు. అందులో మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలనిపెద్దలు చెబుతున్నారు.దుర్గమ్మకు దసరా అలంకారాలు∙స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి ( పాడ్యమి) ∙శ్రీ బాల త్రిపుర సుందరి (విదియ) ∙శ్రీ అన్నపూర్ణా దేవి (తదియ) ∙శ్రీ గాయత్రి దేవి (చవితి) ∙శ్రీ లలిత త్రిపుర సుందరి(పంచమి) ∙శ్రీ మహాలక్ష్మి దేవి (షష్టి) ∙శ్రీ సరస్వతి దేవి (సప్తమి) ∙శ్రీ దుర్గాదేవి (అష్టమి) ∙శ్రీ మహిషాసురమర్ధిని దేవి (నవమి) ∙శ్రీ రాజ రాజేశ్వరి దేవి (దశమి) -
World Lung Cancer Day 2024 లక్షణాలను గుర్తించడం ముఖ్యం, లేదంటే ముప్పే!
ఊపిరితిత్తుల క్యాన్సర్ అత్యంత సాధారణ కేన్సర్. ప్రపంచవ్యాప్తంగా అనేకమరణాలను ప్రధానకారణం లంగ్ కేన్సర్. ప్రతీ ఏడాది 1.6 మిలియన్ల మంది ఈ కేన్సర్‌కి బలవుతున్నారు. ఊపిరితిత్తుల కేన్సర్‌కు ప్రధాన కారణం పొగాకు,ధూమపానం అయినప్పటికీ, ఎపుడూ ధూమపానం చేయని వ్యక్తులలో కూడా సంభవించవచ్చు. దాదాపు 15 శాతం మంది పొగాడు వినియోగం చరిత్ర లేనప్పటికీ ఈ వ్యాధిబారిన పడుతున్నారని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. అందుకే దీనిపై అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. ఈరోజు ( ఆగస్టు 1)న ప్రపంచ ఊపిరితిత్తుల కేన్సర్ దినోత్సవంగా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. ధూమపానంతో పాటు కొన్ని జన్యు పరమైన కారణాలు, గాలి కాలుష్యం, పరోక్షంగా ధూమపాన ప్రభావానికి లోనుకావడం, ఆస్బెస్టాస్ ఎక్స్పోజర్, రాడాన్ వాయువులు, డీజిల్ ఎగ్జాస్ట్ పొగ తదితర కారణాల వల్ల ఈ వ్యాధి సోకుతుంది. దీర్ఘకాలికంగా స్టెరాయిడ్స్ వాడే వారిలో కూడా ఈ ఊపిరితిత్తుల కేన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. ఊపిరితిత్తుల కేన్సర్‌ను సోకిన మహిళల్లో 20 శాతం మంది ఎప్పుడూ ధూమపానం చేయనివారే.ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం 2024: చరిత్రఊపిరితిత్తుల కేన్సర్ వ్యాప్తి మరియు ప్రభావం,ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం పాటిస్తారు. ఫోరమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రెస్పిరేటరీ సొసైటీస్ (FIRS), ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ లంగ్ క్యాన్సర్ (IASLC) మధ్య సహకారంతో 2012లో మొదటిసారిగా దీన్ని పాటించారు. గమనించారు. ఇక అప్పటినుంచి ఊపిరితిత్తుల కేన్సర్ దినోత్సవాన్ని ఏటా ఆగస్టు 1న జరుపు కుంటారు. లంగ్ కేన్సర్‌పై అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం.కేన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించడం, సమయానికి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. ఈ కేన్సర్‌ను ఎదుర్కోవడానికి కొనసాగుతున్న పరిశోధన ఆవిష్కరణల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రచారాలు ,కార్యకలాపాలు నిర్వహిస్తారు.థీమ్: “క్లోజ్ ది కేర్ గ్యాప్: ప్రతి ఒక్కరూ కేన్సర్ నుంచి రక్షణ పొందేందుకు అర్హులు’’ అనే థీమ్‌తో 2024 వరల్డ్ లంగ్ కేన్సర్ డే ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.ఊపిరితిత్తుల కేన్సర్ రకాలుఊపిరితిత్తుల క్యాన్సర్ సాధారణంగా రెండు రకాలగా విభజించారు. నాన్-స్మాల్ సెల్ ఊపిరితిత్తుల కేన్సర్ (NSCLC) , చిన్న-కణ ఊపిరితిత్తుల క్యాన్సర్ (SCLC). రెండో రకం కేన్సర్‌లో రెండింటి లక్షణాలు ఉంటాయి. లక్షణాలు ఎడతెరపి లేని దగ్గుఉన్నట్టుండి బరువు తగ్గడంగాలిపీల్చుకోవడంలో ఇబ్బంది, ఆయాసంఛాతీలో నొప్పిదగ్గుతున్నప్పుడు రక్తం పడటంఎముకల్లో నొప్పివేలిగోళ్లు బాగా వెడల్పుకావడంజ్వరం అలసట / నీరసంఆహారాన్ని మింగడంలో ఇబ్బందులుఆహారం రుచించకపోవడంగొంతు బొంగురుపోవడంచర్మం, కళ్లు పసుపు రంగులో మారడంనోట్ : వీటిల్లో కొన్ని లక్షణాలు కనిపించినంత మాత్రాన కేన్సర్ సోకినట్టు కాదు. ఇలాంటి లక్షణాలు శరీరంలో కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. టీబీ సోకినా వీటిల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వైద్య నిపుణుల పర్యవేక్షణలో వ్యాధి నిర్ణారణ చేసుకోవాలి. ఈ కేన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులువవుతుంది. -
ఆషాడ మాసం: గోరింటాకు పెట్టుకోవడం వెనకున్న ఆంతర్యం ఇదే..
సాక్షి, మహబూబ్‌నగర్: ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఆషాఢమాసం నేటి (గురువారం) నుంచి ప్రారంభం అయ్యిందది. ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచే ఆషాఢమాసం వర్ష రుతువులో గోరింటాకు పెట్టుకుంటే చర్మవ్యాధుల బారి నుంచి రక్షణ పొందవచ్చనేది ఆరోగ్య రహస్యం. అందుకే ఈ మాసంలో వానలు ఎక్కువై ఇంటి లోగిళ్లు, పంట పొలాలు బురదమయమై, క్రిమి కీటకాలు పెరుగుతాయి. మహిళలు వాటిలో కాళ్లు, చేతులు ఆడిస్తూ పనిచేయడం పరిపాటి. కాబట్టి చర్మ రోగాలు దరిచేరకుండా గోరింటాకును పెట్టుకునే వారు. ప్రస్తుతం రకరకాల మెహందీ డిజైన్లు వాడుకలోకి రావడం వల్ల అందం కోసం గోరింటాకును మహిళలు అలంకరించుకోవడం అధికమై, కాలక్రమేణ పట్టణ ప్రాంతాల్లో వేడుకలు చేసుకోవడం ఆచారంగా మారింది. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక పలు శాస్త్రీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. గోరింటాకు వల్ల గోళ్లకు అందం రావడమేకాక, గోరుచుట్ట వంటివి రాకుండా ఉంటాయి. ఈ మాసం సందర్భంగా కొన్నిచోట్ల మహిళా సంఘాలు, సంస్థల ఆధ్వర్యంలో మహిళలంతా సామూహికంగా గోరింటాకు వేడుకలు నిర్వహిస్తారు. పండుగలకు ప్రత్యేకం ఆషాఢం పండుగలకు ఆషాఢం ప్రత్యేకతగా చెప్పవచ్చు. వచ్చేనెల 10వ తేదీన శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి), 12వ తేదీన గురుపౌర్ణమి (ఆషాడ పౌర్ణమి) పండుగలు రానున్నాయి. ఆషాఢ మాసంలో బోనాల వేడుకలను జరుపుకుంటారు. గ్రామ దేవతలకు బోనాలతో మొక్కులు సమర్పిస్తారు. ఆషాఢ శుద్ధ పాఢ్యమి నుంచి బహుళ అమావాస్య వరకు బోనాల వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. -
పరిమళించిన మానవత్వం
‘రోడ్డున పడ్డ బంధం’ కథనానికి విశేష స్పందన వృద్ధురాలిని ఆదుకునేందుకు ముందుకొచ్చిన మానవతామూర్తులు ఆశ్రయమిస్తామన్న అభయ ఫౌండేషన్ చేయూతనిస్తానన్న పూరి జగన్నాథ్ సతీమణి సుందరయ్య విజ్ఞానకేంద్రం: ‘రోడ్డున పడ్డ బంధం’ పేరుతో సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన వృద్ధురాలి కథనంపై మానవతావాదులు విశేషంగా స్పందించారు. వృద్ధురాలిని ఆదుకునేం దుకు మేమున్నామంటూ ముందుకు వచ్చారు. సమాజంలో ఇంకా కొంతమంది మానవతామూర్తులున్నారని రుజువు చేశారు. కథనానికి స్పందించిన అభయ ఫౌండేషన్ చైర్మన్ మేడ నర్సింహులు వెంటనే ఫౌండేషన్ కార్యదర్శి బాలచంద్ర, కిరణ్‌కుమార్‌లకు ఫోన్ చేసి ఆమెను చేరదీయాలని చెప్పడంతో.. ఫౌండేషన్ సభ్యులు సుందరయ్య విజ్ఞానకేంద్రానికి సాక్షి దినపత్రికను పట్టుకొని ఆమెను వెతుక్కుంటూ వచ్చారు. వృద్ధురాలిని తమ వెంట రావాలని కోరుతున్న తరుణంలోనే.. ప్రముఖ సినీ దర్శకులు పూరి జగన్నాథ్ సతీమణి లావణ్య సైతం ఆమెను ఆదుకోవడానికి అదే సమయంలో అక్కడికి వచ్చారు. దీంతో అభయ ఫౌండేషన్ సభ్యులు, లావణ్య కలిసి వృద్ధురాలు దుర్గమ్మను ఇబ్రహీంపట్నంలోని ఫౌండేషన్ ఆశ్రమానికి తీసుకెళ్లారు. అయితే లావణ్య ఆమెకయ్యే ఖర్చులను తాను భరిస్తానని, 50 వేల రూపాయలను ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చారు. అంతేకాదు ప్రతి నెలా ఆమెకయ్యే ఖర్చును తాను భరిస్తానన్నారు. ఇదిలా ఉండగా కృష్ణానగర్‌లో నివసించే దుర్గమ్మ కూతురైన సుబ్బలక్ష్మి, అల్లుడు రాజేష్ కుమార్ ‘సాక్షి’లో వచ్చిన దుర్గమ్మ కథనాన్ని చూసి తమ కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు కూడా దుర్గమ్మను వెతకడం ప్రారంభించారు. అయితే అప్పటికే ఆమెను అభయ ఫౌండేషన్‌కు తీసుకొచ్చారని తెలుసుకొని, ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి మెహిదీపట్నంలోని ఫౌండేషన్ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా సుబ్బలక్ష్మి మాట్లాడుతూ ఐదు నెలల క్రితం తన తల్లి దుర్గమ్మ ఇంటి వద్ద నుంచి తప్పిపోయిందని, ఎంత వెతికినా ఆచూకీ లభించలేదని తెలిపారు. అయితే అదే సమయంలో తన కూతురు పెళ్లి కావడంతోపాటు తన భర్త రామారావుకు యాక్సిడెంట్ అయి తీవ్ర గాయాల పాలు కావడంతో కొంత అశ్రద్ధ చేశామన్నారు. తన తల్లి గత 20 ఏళ్ల నుంచి తన దగ్గరే ఉంటుందని, ఇక నుంచి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటానని, కన్నీటి పర్వమయ్యారు. ఫౌండేషన్ సభ్యులు దుర్గమ్మ కూతురుతో హామీపత్రం రాయించుకొని ఆమెతో పంపడానికి అంగీకరించారు. అయితే పూరి జగన్నాథ్ భార్య లావణ్య స్వయాన తన కారులో ఇబ్రహీంపట్నంలోని ఆశ్రమానికి కారును పంపించి వృద్ధురాలు దుర్గమ్మను కృష్ణానగర్‌లోని సుబ్బలక్ష్మి ఇంట్లో దించారు. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ భార్య లావణ్య మాట్లాడుతూ.. తనకు సమాజ సేవ అంటే చిన్నప్పటి నుంచీ ఇష్టమని, తన భర్త ప్రోత్సాహంతో ఇలాంటి సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నానన్నారు. -
సుష్మాస్వరాజ్ రాకతో కమల నాథుల్లో కదనోత్సాహం
తెలుగులో ఉచ్చరించిన మాటలకు స్పందించిన జనం హిందీ ప్రసంగాన్ని తెలుగులో అనువదించిన మురళీధర్‌రావు హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : బీజేపీ పార్లమెం టరీ నాయకురాలు సుష్మాస్వరాజ్ రాకతో జిల్లాలోని పార్టీ శ్రేణుల్లో నూతనోత్సహం నెలకొంది. ఆమె స్ఫూర్తివంతమైన ప్రసంగంతో కమలనాథుల్లో కదనోత్సాహం వెల్లివిరిస్తోంది. ఈ సభ తో జిల్లాలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులతోపాటు నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం సుష్మాస్వరాజ్ మధ్యాహ్నం 2.45 గంటలకు హెలికాప్టర్ లో హన్మకొండ కాకతీయ డిగ్రీ కాలేజీ మైదానానికి చేరుకుని, నేరుగా కుడా మైదానంలో ఏర్పా టు చేసిన బహిరంగ సభాస్థలికి వచ్చారు. తెలంగాణపై పూర్తి అవగాహన ఉన్న ఆమె ప్రసంగాన్ని సభికులు ఆసక్తిగా విన్నారు. హిందీ లో మాట్లాడగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని మురళీధర్‌రావు తెలుగులో అనువదించారు. పార్లమెంట్లో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న తీరును స్వయంగా చూశానని వివరించిన క్రమంలో ప్రజల్లో నుంచి విశేష స్పందన లభించింది. తెలంగాణలో బలి దానాలు జరిగినపుడు తాను స్పందించానని, ‘తెలంగాణ కోసం బలిదానాలు వద్దు.. బతకా లి, బతికుండి తెలంగాణ చూడాలి..’అని చెప్పానని తెలుగులో మాట్లాడగా ప్రజలు హర్షద్వానా లు చేశారు. అంతకు ముందు వేదికపైకి చేరుకు న్న సుష్మాస్వరాజ్‌కు పార్టీ నాయకులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. బీజేవైఎం అర్బన్ జిల్లా అధ్యక్షుడు బండి సాంబయ్య యా దవ్, నాయకులు గడప శివశంకర్ తలపాగా దరింపజేసి కత్తిని అందజేశారు. బీజేపీ నాయకుడు గందె నవీన్ త్రిశూలం అందించారు. మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు, మార్తినేని ధర్మారావు కూతురు దీప చీరను బహూకరించారు. పార్టీ జిలా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, నగర అధ్యక్షుడు చింతాకుల సునీల్ తదితరులు కాకతీయ తోరణాన్ని జ్ఞాపికగా అందజేశారు. సమావేశంలో అభ్యర్థులు డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్, మార్తినేని ధర్మారావు, రావు పద్మ, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల చంద్రశేఖర్‌రావు, ఎంపీ గుండు సుదారాణి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎ.బస్వారెడ్డి, నగర అధ్యక్షుడు అనిశెట్టి మురళీమనోహర్, బీజేపీ నాయకులు డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, వన్నాల శ్రీరాములు, డాక్టర్ టి.విజయలక్ష్మి, నాగపురి రాజమౌళి, రావు అమరేందర్‌రెడ్డి, వి.సమ్మిరెడ్డి, చాడా శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ పి.విజయ్‌చందర్‌రెడ్డి, రావుల కిషన్, గాదె రాంబాబు, మల్లాడి తిరుపతిరెడ్డి, ఎస్. మురళీమనోహర్, దిలీప్ నాయక్, గుజ్జ సత్యనారాయణరావు, కొత్త దశరథం, దొంతి దేవేందర్‌రెడ్డి, పొట్టి శ్రీనివాస్, శేషగిరిరావు, బన్న ప్రభాకర్, రాజేందర్, రంజిత్, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ హెలికాప్టర్ వెళ్లేందుకు అనుమతిం చకపోవడంతో సుష్మాస్వరాజ్ రోడ్డు మార్గంలో నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లో జరిగే బహిరంగ సభకు వెళ్లారు.