సుష్మాస్వరాజ్ రాకతో కమల నాథుల్లో కదనోత్సాహం
- తెలుగులో ఉచ్చరించిన మాటలకు స్పందించిన జనం
- హిందీ ప్రసంగాన్ని తెలుగులో అనువదించిన మురళీధర్‌రావు
హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : బీజేపీ పార్లమెం టరీ నాయకురాలు సుష్మాస్వరాజ్ రాకతో జిల్లాలోని పార్టీ శ్రేణుల్లో నూతనోత్సహం నెలకొంది. ఆమె స్ఫూర్తివంతమైన ప్రసంగంతో కమలనాథుల్లో కదనోత్సాహం వెల్లివిరిస్తోంది. ఈ సభ తో జిల్లాలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులతోపాటు నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం సుష్మాస్వరాజ్ మధ్యాహ్నం 2.45 గంటలకు హెలికాప్టర్ లో హన్మకొండ కాకతీయ డిగ్రీ కాలేజీ మైదానానికి చేరుకుని, నేరుగా కుడా మైదానంలో ఏర్పా టు చేసిన బహిరంగ సభాస్థలికి వచ్చారు.
తెలంగాణపై పూర్తి అవగాహన ఉన్న ఆమె ప్రసంగాన్ని సభికులు ఆసక్తిగా విన్నారు. హిందీ లో మాట్లాడగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని మురళీధర్‌రావు తెలుగులో అనువదించారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న తీరును స్వయంగా చూశానని వివరించిన క్రమంలో ప్రజల్లో నుంచి విశేష స్పందన లభించింది. తెలంగాణలో బలి దానాలు జరిగినపుడు తాను స్పందించానని, ‘తెలంగాణ కోసం బలిదానాలు వద్దు.. బతకా లి, బతికుండి తెలంగాణ చూడాలి..’అని చెప్పానని తెలుగులో మాట్లాడగా ప్రజలు హర్షద్వానా లు చేశారు.
అంతకు ముందు వేదికపైకి చేరుకు న్న సుష్మాస్వరాజ్‌కు పార్టీ నాయకులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. బీజేవైఎం అర్బన్ జిల్లా అధ్యక్షుడు బండి సాంబయ్య యా దవ్, నాయకులు గడప శివశంకర్ తలపాగా దరింపజేసి కత్తిని అందజేశారు. బీజేపీ నాయకుడు గందె నవీన్ త్రిశూలం అందించారు. మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు, మార్తినేని ధర్మారావు కూతురు దీప చీరను బహూకరించారు.
పార్టీ జిలా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, నగర అధ్యక్షుడు చింతాకుల సునీల్ తదితరులు కాకతీయ తోరణాన్ని జ్ఞాపికగా అందజేశారు. సమావేశంలో అభ్యర్థులు డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్, మార్తినేని ధర్మారావు, రావు పద్మ, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల చంద్రశేఖర్‌రావు, ఎంపీ గుండు సుదారాణి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎ.బస్వారెడ్డి, నగర అధ్యక్షుడు అనిశెట్టి మురళీమనోహర్, బీజేపీ నాయకులు డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, వన్నాల శ్రీరాములు, డాక్టర్ టి.విజయలక్ష్మి, నాగపురి రాజమౌళి, రావు అమరేందర్‌రెడ్డి, వి.సమ్మిరెడ్డి, చాడా శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ పి.విజయ్‌చందర్‌రెడ్డి, రావుల కిషన్, గాదె రాంబాబు, మల్లాడి తిరుపతిరెడ్డి, ఎస్. మురళీమనోహర్, దిలీప్ నాయక్, గుజ్జ సత్యనారాయణరావు, కొత్త దశరథం, దొంతి దేవేందర్‌రెడ్డి, పొట్టి శ్రీనివాస్, శేషగిరిరావు, బన్న ప్రభాకర్, రాజేందర్, రంజిత్, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ హెలికాప్టర్ వెళ్లేందుకు అనుమతిం చకపోవడంతో సుష్మాస్వరాజ్ రోడ్డు మార్గంలో నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లో జరిగే బహిరంగ సభకు వెళ్లారు.