Murlidhar Rao
-
‘ఇంటర్’ వెనుక పెద్దల హస్తం
సాక్షి, హైదరాబాద్: పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం సరిగా వ్యవహరించని కారణంగానే రాష్ట్రంలో 23 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఇప్పటి వరకు ఏర్పడలేదని, ఇది అసాధార ణ సమస్య అని పేర్కొన్నారు. ఇంత జరిగినా ప్రభు త్వం సరిగా వ్యవహరించకపోవటం దారుణమన్నా రు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల నుంచే తప్పిదాలు చోటు చేసుకున్నట్టు తేలినా బోర్డు సరిగా వ్యవహరించలేదని, దాన్ని పర్యవేక్షించే వారు పరిష్కారానికి చొరవ చూపలేదని, అదే ఇప్పుడు ఇందరు విద్యార్థుల మృతి, లక్షల కుటుంబాల్లో ఆవేదనకు కారణమైందన్నారు. ఆదివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయతో కలసి మీడియాతో మాట్లాడారు. ఇంటర్ వ్యవహారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక సారాంశంతో బీజేపీ ఏకీభవించడం లేదని తెలిపారు. ఇలాంటి పెద్ద పరీక్షలను నిర్వహించిన పరిపాలనపరమైన అనుభవం ఉన్నవారు కమిటీలో లేకపోవడం సరికాదని మురళీధర్‌రావు అభిప్రాయపడ్డారు. ఏదో కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఈ నివేదికపై ప్రభావం చూపిందని స్పష్టంగా తెలుస్తోందన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం ఆశ్చర్యపరుస్తోందని, ఈ వ్యవహారానికి కారకులెవరో చెప్పకపోవటం విడ్డూరమన్నారు. ఎవరినో రక్షించేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని, ఈ వ్యవహారంలో దోషులకు ప్రభుత్వంలో పెద్దస్థాయి వారితో సన్నిహిత సంబంధాలుండటమే దీనికి కారణమనే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతి, అసమర్ధత వల్లనే 23 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని దత్తాత్రేయ ఆరోపించారు. త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక సంతృప్తికరంగా లేదన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పాత్రధారి అయితే సూత్రధారి ఎవరో ప్రభుత్వం వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. -
‘శబరిమల’ తీర్పుపై నిరసనల జోరు
తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలనూ అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై కేరళలో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. కేరళలో వామపక్ష ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పత్తనంమిట్ట జిల్లా పండాలం నుంచి గత వారం బీజేపీ నేతలు ప్రారంభించిన పాదయాత్ర 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సోమవారం తిరువనంతపురం చేరింది. ప్రభుత్వం ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించగా.. బీజేపీ కార్యకర్తలు, భక్తులతోపాటు ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు అయ్యప్పస్వామి చిత్రాలతో కూడిన ప్లకార్డులను పట్టుకుని, కీర్తనలు ఆలపిస్తూ సెక్రటేరియట్ వద్దకు చేరుకున్నారు. ర్యాలీకి ముందు వరుసలో బీజేపీ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లైతోపాటు ఇటీవల ఆ పార్టీలో చేరిన నటుడు సురేష్ గోపీ, భారతీయ ధర్మ జన సేన అధ్యక్షుడు తుషార్ వెల్లప్పల్లి ఉన్నారు. ఈ సందర్భంగా మురళీధర్ రావు మాట్లాడుతూ.. తమ డిమాండ్లపై 24 గంటల్లోగా స్పందించకుంటే నిరసనలు మరింత తీవ్రరూపం దాలుస్తాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వివిధ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం కేరళ ప్రభుత్వానికి విషమ పరీక్షగా మారింది. మరోవైపు, శబరిమల ఆలయ ట్రావెన్కోర్ దేవస్వోమ్ బోర్డ్ మంగళవారం సమావేశం కానుంది. వార్షిక మండలమ్–మకరవిలక్కు యాత్ర ఏర్పాట్లతోపాటు సుప్రీంకోర్టు తీర్పుపైనా ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. -
అమిత్ షా పర్యటన వాయిదా
హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నగర పర్యటన వాయిదా పడింది. ఎన్డీఏ పార్టీల సమావేశం కారణంగా అమిత్‌షా ఢిల్లీలో బిజీగా ఉన్నరని అందుకే పర్యటనను వాయిదా వేస్తున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తెలిపారు. ఏప్రిల్ 7న నగరానికి రావాల్సిన అమిత్‌షా ఢిల్లీలో ముఖ్యమైన సమావేశం ఉండటంతో పర్యటన వాయిదా వేసుకున్నారు. ఈ పర్యటన త్వరలోనే మరో సారి ఉంటుందని ఆయన అన్నారు. -
మత ప్రాతిపదికన రిజర్వేషన్లు సరికాదు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సాక్షి, న్యూఢిల్లీ: మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం ఆమోదయోగ్యం కాదని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. లౌకిక దేశంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు ఆస్కారం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు పేర్కొన్నారు. తెలంగాణలోని ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని శాసనసభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించడంపై మురళీధర్‌రావు స్పందించారు. ‘‘తమిళనాడులో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన పద్ధతులలోనే రాష్ట్రంలోని ముస్లింలకు కూడా 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం ఆమోదయోగ్యం కాదు’’ అని మురళీధర్ రావు గురువారం సోషల్ మీడియా ట్వీటర్లో చెప్పారు. -
బలహీన ప్రభుత్వంపై ఉద్యమిస్తాం
బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో బలహీన ప్రభుత్వం కొనసాగు తోంది. ఇతర పార్టీలకు చెంది న ఎమ్మెల్యేలను బహిరంగం గా కొనుగోలు చేసి దర్పాన్ని ప్రదర్శిస్తోంది. నిజానికి ప్రతి పక్షాలు బలంగా లేవు. పరీక్షల కు ఇంకా సమయముందని భావి స్తున్నట్లున్నాయి. అందుకే చురు కుగా ప్రజల్లోకి వెళ్లడం లేదు. ప్రభుత్వం తీసుకుంటు న్న ప్రజా వ్యతిరేక విధానాలపై త్వరలో బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడ తాం. ఇందుకు సామాజిక మాధ్యమాలను విసృ్తతంగా వినియోగించుకుంటాం’ అని బీజేపీ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు అన్నారు. ఆదివారం నగరంలో భారత్‌నీతి సంస్థ ఏర్పాటు చేసిన ‘సోషల్ మీడియా- ఫ్యూచర్ గవర్నెన్స అండ్ డెమొక్రసీ’ చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, పార్టీ విధానాల అమలును వివరించారు. ‘‘పెద్ద నోట్ల రద్దుతో తెలంగాణలో కుటుంబ పాలన సంకటంలో పడింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ‘నల్ల’ నాయకత్వం భారీగా నష్టపోయింది. అందుకే కేంద్రంపై అక్కసు వెళ్లగక్కుతోంది. సుపరిపాల న, కుటుంబ సంక్షేమం ఒకచోట మనజాలదు. సుదీర్ఘకాలం పాలనలో కొనసా గుదాం అనుకున్న పార్టీ నాయకత్వం జైలుకు వెళ్తుంది’’ అని విమర్శించారు. మిషన్ కాకతీయ, భగీరథలో అక్రమాలు, నాణ్యత లేని పనులపై వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో వీడియోలు హల్చల్ చేస్తున్నాయన్నారు. సోషల్ మీడియాపై ఆధారపడాల్సిందే: భవిష్యత్తులో ప్రతి రాజకీయ పార్టీ సామాజిక మాధ్యమంపై ఆధార పడాల్సిందేనని మురళీధర్‌రావు అన్నారు. కేంద్రం సామాజిక మాధ్యమాన్ని పాలనలో సూచనలు, ప్రజా సమస్యల పరి ష్కారం కోసం వినియోగిస్తోందని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోషల్ మీడియా పాత్ర క్రీయాశీలంగా మారిందన్నారు. ప్రజల సూచనలన్నీ అనుసరిస్తూ సమస్యల పరిష్కారం కోసం మంత్రులు నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. దక్షిణ భారతంలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు ఖాయ మని, బలమైన ప్రతిపక్షంగా కొనసాగే పార్టీలే ప్రభుత్వాలు ఏర్పాటు చేసే సత్తా సాధిస్తాయన్నారు. ప్రధాని మోదీని ఫేస్బుక్, ట్విట్టర్లో అనుసరించే వారిలో ఎక్కువ మంది దక్షిణ భారతీయులేనన్నారు. ఐఎస్బీ ప్రొఫెసర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్, అపోలో ఆస్పత్రుల జీఎం సురేశ్ కొచట్టిల్ పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కేసీఆర్ పాలన
మోదీ పర్యటనతో రాష్ట్రంలో బీజేపీకి ఊపు: మురళీధర్‌రావు హన్మకొండ: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తోం దని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఆరోపించారు. ఆదివారం హన్మకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం విపక్ష పార్టీల నాయకులను బెదిరించి, ప్రలోభపెట్టి, ఫిరాయింపులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. బీజేపీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందన్నారు. మోదీ ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య సిద్ధాంత భేదాభిప్రాయాలు ఉన్నాయని, టీఆర్ఎస్ కుటుంబ రాజకీయాలు కోరుకుంటోందన్నారు. కేంద్రం కోఆపరేటివ్ ఫెడరిలిజంతో ముందుకు పోతోందన్నారు. మోదీ పర్యటన రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేస్తుందన్నారు. ఎంసెట్-2 ప్రశ్నాపత్రాల లీకేజీకి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి బాధ్యత వహించాలని మురళీధర్‌రావు అన్నారు. -
ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కేసీఆర్ పాలన
- కేంద్రానిది కో ఆపరేటివ్ ఫెడరిలిజం - బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని మురళీధర్‌రావు హన్మకొండ(వరంగల్ జిల్లా) రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని మురళీధర్‌రావు ఆరోపించారు. ఆదివారం హన్మకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని విపక్ష పార్టీల నాయకులను బెదిరించి, ప్రలోభపెట్టి, ఫిరాయింపులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఈ దెబ్బతో రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కనుమరుగవుతున్నాయని, ఈ క్రమంలో బీజేపీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య సిద్ధాంత బేదాభిప్రాయాలు ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ కుటుంబ రాజకీయాలు కోరుకుంటోందని, తమ పార్టీ అందుకు వ్యతిరేకమని చెప్పారు. కేంద్రం కో ఆపరేటివ్ ఫెడరిలిజంతో ముందుకు పోతోందన్నారు. ప్రపంచ స్థాయిలో ఆర్థికమాంద్యం నెలకొందని, అభివృద్ధి రేటు తగ్గుతోందని, అమెరికాలాంటి దేశంలోనూ వృద్ధి రేటు తగ్గిందని, ఈ సమయంలో దేశంలో అభివృద్ధి రేటు పెరుగుతోందని వివరించారు. మోదీ పర్యటన రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయనుందన్నారు. ఎంసెట్-2 ప్రశ్నాపత్రాల లీకేజీకి విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి బాధ్యత వహించాలని మురళీధర్‌రావు అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఎంసెట్ నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందని విమర్శించారు. -
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు షాద్‌నగర్: బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం అభివృద్ధి చెందాలన్నా, రైతుల ఆత్మహత్యలు లేని రాష్ట్రం కావాలన్నా బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. శనివారం పట్టణంలోని గ్రీన్‌పార్క్ ఫంక్షన్హాల్లో జరిగిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉజ్వల యోజన పథకం ద్వారా పొగరాని పొయ్యి(గ్యాస్ స్టౌ)లను అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సరిగ్గా అందించడం లేదన్నారు. సీఎం కే సీఆర్‌కు రాష్ట్ర ప్రజలపై చిత్తశుద్ధి లేదన్నారు. జిల్లాలో కృష్ణానీరు వందల కిలోమీటర్లు ప్రవహిస్తున్నా రైతులకు సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం పార్టీ జాతీయ కార్యవర్గసభ్యులు నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ నాయకత్వం పటిష్టంగా ఉందన్నారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా రెండేళ్ల పాలన పూర్తిచేసుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ైరె తులపై ప్రత్యేకదృష్టి సారించిందన్నారు. గతంలో 50 శాతం పంటనష్టపోతే నష్టపరిహారం అందేదన్నారు. కేంద్రం నుంచి మంజూరైన నిధులను టీఆర్ఎస్ సర్కారు ప్రజల కోసం ఖర్చుచేయడం లేదన్నారు. అనంతరం రతంగ్ పాండురెడ్డి మాట్లాడుతూ మూడేళ్లుగా కరువుతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలపై చార్జీల మోత వేయడం సరికాదన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు కల్పించలేదని విమర్శించారు. బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావుల రవింద్రనాథ్‌రె డ్డి, ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి, నాగురావు నామాజీ, శాంతకుమార్, రాములు, పద్మజారెడ్డి, కొండయ్య, యోగేశ్వర్‌రెడ్డి, శ్రీవర్ధన్‌రెడ్డి, బాల్‌రాజ్, వెంకట్‌రెడ్డి, కృష్ణ పాల్గొన్నారు. -
పార్టీ నేతలతో మురళీధర్‌రావు సమాలోచన
సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. బీజేపీ నేతలు ఒక అడుగు ముందు వెళుతున్నారు. రాష్ట్ర నేతలతో ఆ పార్టీ ఇన్చార్జ్ మురళీధర్‌రావు గురువారం సమాలోచనలు జరిపారు. పొత్తు అంశంపై ప్రధానంగా చర్చించారు. మేనిఫెస్టో రూపకల్పన అంశంపై దృష్టి పెట్టారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తథ్యమని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల ముందు రాష్ట్రంలో చతికిలబడిన బీజేపీ తర్వాత క్రమేణా పుంజుకుంటోంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా కూటమి సైతం ఏర్పడింది. ఆ ఎన్నికల వరకు అంతా సజావుగా సాగినా తదుపరి పరిణామాలతో మిత్రులు ఆ పార్టీకి షాక్ ఇస్తూ వచ్చారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ చుట్టూ తిరిగిన పార్టీలన్నీ ప్రస్తుతం తలా ఓ దిక్కు వెళ్లాయి. ఇందులో ఎండీఎంకే నేత వైగో ఒక అడుగు ముందుకు వేసి వామపక్షాలను ఏకం చేయడమేగాక వీసీకేను కలుపుకుని ప్రజా కూటమి ఏర్పాటు చేశారు. అధికార లక్ష్యంగా తమ కూటమి ఆవిర్భవించిందని ప్రకటించారు. పీఎంకే తమదీ ఓ కూటమి అంటూ సీఎం అభ్యర్థిగా అన్భుమణి రాందాసు పేరును ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు ప్రకటించారు. ఇక డీఎండీకే నేత విజయకాంత్, మరికొన్ని చిన్న పార్టీలు మౌనంగా ఉన్నాయి. వైగో ఆహ్వానించినా ఇంతవరకు ఆ పార్టీల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో తమ నేతృత్వంలో కూటమి ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో కమలనాథులు పావులు కదుపుతున్నారు. ఎండీఎంకేతో కలసి పనిచేస్తున్న పార్టీలు ఎలాగో తమతో చేతులు కలిపే అవకాశం లేని దృష్ట్యా పీఎంకే, డీఎండీకేపై దృష్టి సారించారు. రాష్ర్టంలో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం ఎన్డీఏ కూటమి అని చాటుకోవడంతో పాటు అందుకు తగ్గ ప్రయత్నాలను వేగవంతం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని రంగంలోకి దించేందుకు సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రజా కూటమికి ఇతర పార్టీల నుంచి మిశ్రమ స్పందన వచ్చిన దృష్ట్యా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పాటు దిశగా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధరరావు సిద్ధమయ్యారు. చెన్నైలో పార్టీ వర్గాలతో ఆయన సమాలోచనలో పడ్డారు. టీనగర్‌లోని కమలాలయంలో పార్టీ వర్గాలతో మురళీధర్‌రావు గురువారం సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, జాతీయ నేతలు హెచ్.రాజా, ఇలగణేషన్, సీపీ రాధాకృష్ణన్, పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. బీహార్‌లో ఎన్నికల పర్వం ముగియడంతో ఇక రాష్ట్రం మీద ఢిల్లీ పెద్దలు దృష్టి పెట్టారని, రాష్ర్టంలోని ప్రధాన సమస్యలపై చర్చించి, అధ్యయనం చేయడంతో పాటు వాటిని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని, జాతీయ నాయకుల ద్వారా వాటి పరిష్కారానికి తగ్గ హామీలు ఇప్పించే రీతిలో కార్యచరణ సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ విషయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్‌ను కదిలించగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అవతరించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. జనరంజకమైన మ్యానిఫెస్టో రూపొందిస్తామని చెప్పారు. -
సుష్మాస్వరాజ్ రాకతో కమల నాథుల్లో కదనోత్సాహం
తెలుగులో ఉచ్చరించిన మాటలకు స్పందించిన జనం హిందీ ప్రసంగాన్ని తెలుగులో అనువదించిన మురళీధర్‌రావు హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : బీజేపీ పార్లమెం టరీ నాయకురాలు సుష్మాస్వరాజ్ రాకతో జిల్లాలోని పార్టీ శ్రేణుల్లో నూతనోత్సహం నెలకొంది. ఆమె స్ఫూర్తివంతమైన ప్రసంగంతో కమలనాథుల్లో కదనోత్సాహం వెల్లివిరిస్తోంది. ఈ సభ తో జిల్లాలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులతోపాటు నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం సుష్మాస్వరాజ్ మధ్యాహ్నం 2.45 గంటలకు హెలికాప్టర్ లో హన్మకొండ కాకతీయ డిగ్రీ కాలేజీ మైదానానికి చేరుకుని, నేరుగా కుడా మైదానంలో ఏర్పా టు చేసిన బహిరంగ సభాస్థలికి వచ్చారు. తెలంగాణపై పూర్తి అవగాహన ఉన్న ఆమె ప్రసంగాన్ని సభికులు ఆసక్తిగా విన్నారు. హిందీ లో మాట్లాడగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని మురళీధర్‌రావు తెలుగులో అనువదించారు. పార్లమెంట్లో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న తీరును స్వయంగా చూశానని వివరించిన క్రమంలో ప్రజల్లో నుంచి విశేష స్పందన లభించింది. తెలంగాణలో బలి దానాలు జరిగినపుడు తాను స్పందించానని, ‘తెలంగాణ కోసం బలిదానాలు వద్దు.. బతకా లి, బతికుండి తెలంగాణ చూడాలి..’అని చెప్పానని తెలుగులో మాట్లాడగా ప్రజలు హర్షద్వానా లు చేశారు. అంతకు ముందు వేదికపైకి చేరుకు న్న సుష్మాస్వరాజ్‌కు పార్టీ నాయకులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. బీజేవైఎం అర్బన్ జిల్లా అధ్యక్షుడు బండి సాంబయ్య యా దవ్, నాయకులు గడప శివశంకర్ తలపాగా దరింపజేసి కత్తిని అందజేశారు. బీజేపీ నాయకుడు గందె నవీన్ త్రిశూలం అందించారు. మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు, మార్తినేని ధర్మారావు కూతురు దీప చీరను బహూకరించారు. పార్టీ జిలా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, నగర అధ్యక్షుడు చింతాకుల సునీల్ తదితరులు కాకతీయ తోరణాన్ని జ్ఞాపికగా అందజేశారు. సమావేశంలో అభ్యర్థులు డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్, మార్తినేని ధర్మారావు, రావు పద్మ, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల చంద్రశేఖర్‌రావు, ఎంపీ గుండు సుదారాణి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎ.బస్వారెడ్డి, నగర అధ్యక్షుడు అనిశెట్టి మురళీమనోహర్, బీజేపీ నాయకులు డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, వన్నాల శ్రీరాములు, డాక్టర్ టి.విజయలక్ష్మి, నాగపురి రాజమౌళి, రావు అమరేందర్‌రెడ్డి, వి.సమ్మిరెడ్డి, చాడా శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ పి.విజయ్‌చందర్‌రెడ్డి, రావుల కిషన్, గాదె రాంబాబు, మల్లాడి తిరుపతిరెడ్డి, ఎస్. మురళీమనోహర్, దిలీప్ నాయక్, గుజ్జ సత్యనారాయణరావు, కొత్త దశరథం, దొంతి దేవేందర్‌రెడ్డి, పొట్టి శ్రీనివాస్, శేషగిరిరావు, బన్న ప్రభాకర్, రాజేందర్, రంజిత్, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ హెలికాప్టర్ వెళ్లేందుకు అనుమతిం చకపోవడంతో సుష్మాస్వరాజ్ రోడ్డు మార్గంలో నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లో జరిగే బహిరంగ సభకు వెళ్లారు.