బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం | BJP possible to develop with | Sakshi
Sakshi News home page

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

Published Sun, Jun 26 2016 8:37 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం - Sakshi

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు
 
షాద్‌నగర్:
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం అభివృద్ధి చెందాలన్నా, రైతుల ఆత్మహత్యలు లేని రాష్ట్రం కావాలన్నా బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. శనివారం పట్టణంలోని గ్రీన్‌పార్క్ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉజ్వల యోజన పథకం ద్వారా పొగరాని పొయ్యి(గ్యాస్ స్టౌ)లను అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సరిగ్గా అందించడం లేదన్నారు. సీఎం కే సీఆర్‌కు రాష్ట్ర ప్రజలపై చిత్తశుద్ధి లేదన్నారు. జిల్లాలో కృష్ణానీరు వందల కిలోమీటర్లు ప్రవహిస్తున్నా రైతులకు సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

అనంతరం పార్టీ జాతీయ కార్యవర్గసభ్యులు నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ నాయకత్వం పటిష్టంగా ఉందన్నారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా రెండేళ్ల పాలన పూర్తిచేసుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ైరె తులపై ప్రత్యేకదృష్టి సారించిందన్నారు. గతంలో 50 శాతం పంటనష్టపోతే నష్టపరిహారం అందేదన్నారు. కేంద్రం నుంచి మంజూరైన నిధులను టీఆర్‌ఎస్ సర్కారు ప్రజల కోసం ఖర్చుచేయడం లేదన్నారు. అనంతరం రతంగ్ పాండురెడ్డి మాట్లాడుతూ  మూడేళ్లుగా కరువుతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలపై చార్జీల మోత వేయడం సరికాదన్నారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు కల్పించలేదని విమర్శించారు. బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావుల రవింద్రనాథ్‌రె డ్డి, ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి, నాగురావు నామాజీ, శాంతకుమార్, రాములు, పద్మజారెడ్డి, కొండయ్య, యోగేశ్వర్‌రెడ్డి, శ్రీవర్ధన్‌రెడ్డి, బాల్‌రాజ్, వెంకట్‌రెడ్డి, కృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement