ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కేసీఆర్ పాలన
మోదీ పర్యటనతో రాష్ట్రంలో బీజేపీకి ఊపు: మురళీధర్‌రావు
హన్మకొండ: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తోం దని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఆరోపించారు. ఆదివారం హన్మకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం విపక్ష పార్టీల నాయకులను బెదిరించి, ప్రలోభపెట్టి, ఫిరాయింపులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. బీజేపీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందన్నారు. మోదీ ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య సిద్ధాంత భేదాభిప్రాయాలు ఉన్నాయని, టీఆర్‌ఎస్ కుటుంబ రాజకీయాలు కోరుకుంటోందన్నారు.
కేంద్రం కోఆపరేటివ్ ఫెడరిలిజంతో ముందుకు పోతోందన్నారు. మోదీ పర్యటన రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేస్తుందన్నారు. ఎంసెట్-2 ప్రశ్నాపత్రాల లీకేజీకి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి బాధ్యత వహించాలని మురళీధర్‌రావు అన్నారు.