బలహీన ప్రభుత్వంపై ఉద్యమిస్తాం
బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో బలహీన ప్రభుత్వం కొనసాగు తోంది. ఇతర పార్టీలకు చెంది న ఎమ్మెల్యేలను బహిరంగం గా కొనుగోలు చేసి దర్పాన్ని ప్రదర్శిస్తోంది. నిజానికి ప్రతి పక్షాలు బలంగా లేవు. పరీక్షల కు ఇంకా సమయముందని భావి స్తున్నట్లున్నాయి. అందుకే చురు కుగా ప్రజల్లోకి వెళ్లడం లేదు. ప్రభుత్వం తీసుకుంటు న్న ప్రజా వ్యతిరేక విధానాలపై త్వరలో బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడ తాం. ఇందుకు సామాజిక మాధ్యమాలను విసృ్తతంగా వినియోగించుకుంటాం’ అని బీజేపీ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు అన్నారు. ఆదివారం నగరంలో భారత్‌నీతి సంస్థ ఏర్పాటు చేసిన ‘సోషల్ మీడియా- ఫ్యూచర్ గవర్నెన్‌స అండ్ డెమొక్రసీ’ చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, పార్టీ విధానాల అమలును వివరించారు. ‘‘పెద్ద నోట్ల రద్దుతో తెలంగాణలో కుటుంబ పాలన సంకటంలో పడింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ‘నల్ల’ నాయకత్వం భారీగా నష్టపోయింది. అందుకే కేంద్రంపై అక్కసు వెళ్లగక్కుతోంది. సుపరిపాల న, కుటుంబ సంక్షేమం ఒకచోట మనజాలదు. సుదీర్ఘకాలం పాలనలో కొనసా గుదాం అనుకున్న పార్టీ నాయకత్వం జైలుకు వెళ్తుంది’’ అని విమర్శించారు. మిషన్ కాకతీయ, భగీరథలో అక్రమాలు, నాణ్యత లేని పనులపై వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయన్నారు.
సోషల్ మీడియాపై ఆధారపడాల్సిందే: భవిష్యత్తులో ప్రతి రాజకీయ పార్టీ సామాజిక మాధ్యమంపై ఆధార పడాల్సిందేనని మురళీధర్‌రావు అన్నారు. కేంద్రం సామాజిక మాధ్యమాన్ని పాలనలో సూచనలు, ప్రజా సమస్యల పరి ష్కారం కోసం వినియోగిస్తోందని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోషల్ మీడియా పాత్ర క్రీయాశీలంగా మారిందన్నారు. ప్రజల సూచనలన్నీ అనుసరిస్తూ సమస్యల పరిష్కారం కోసం మంత్రులు నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. దక్షిణ భారతంలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు ఖాయ మని, బలమైన ప్రతిపక్షంగా కొనసాగే పార్టీలే ప్రభుత్వాలు ఏర్పాటు చేసే సత్తా సాధిస్తాయన్నారు. ప్రధాని మోదీని ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో అనుసరించే వారిలో ఎక్కువ మంది దక్షిణ భారతీయులేనన్నారు. ఐఎస్‌బీ ప్రొఫెసర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్, అపోలో ఆస్పత్రుల జీఎం సురేశ్ కొచట్టిల్ పాల్గొన్నారు.