విక్కీ డోనర్‌ నటుడు మృతి | Vicky Donor Actor Bhupesh Kumar Pandya Died Fighting With Cancer | Sakshi
Sakshi News home page

విక్కీ డోనర్‌ నటుడు మృతి

Published Wed, Sep 23 2020 8:28 PM | Last Updated on Wed, Sep 23 2020 8:53 PM

Vicky Donor Actor Bhupesh Kumar Pandya Died Fighting With Cancer - Sakshi

ముంబై: విక్కీ డోనర్‌ సినిమా నటుడు భూపేష్‌ కుమార్‌ పాండ్యా బుధవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా పాండ్యా మరణాన్ని వెల్లడిస్తూ ట్వీట్‌ చేసింది. సీనియర్‌ నటులు మనోజ్‌ బాజ్‌పేయి, గజ్‌రాజ్‌ రావు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. తన భర్త స్టేజి 4 లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని పాండ్యా భార్య ఛాయ ఇటీవల మీడియాకు తెలిపారు.

అహ్మదాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్‌ జరగుతోందని వెల్లడించారు. భర్త ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ ఖర్చులతో పాండ్యా కుటుంబం ఆర్థికంగా కుదేలైంది. దీంతో ఆ కుంటుంబాన్ని ఆదుకునేందుకు పాండ్యా స్నేహితుడొకరు నిధులు సమీకరించే యత్నం చేశాడు. మనోజ్‌ బాజ్‌పేయి కూడా పాండ్యాకు ఆర్థిక సాయం చేసి నిధులు సమకూర్చేందుకు ముందుకొచ్చారు.  నటుడు గజ్‌రాజ్‌ రూ.25 వేలు, సిఖియా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ రూ. 2 లక్షలు సాయమందించినట్టు సమాచారం.
(చదవండి: మేమెప్పుడూ ఇలానే ఉండాలి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement