Drug Research
-
పాము విషానికి విరుగుడు.. ఒంటె కన్నీరు!
ఒంటె కన్నీటిలోని రసాయనాలు పాము విషానికి విరుగుడుగా పనికివస్తాయని శాస్త్రవేత్తలు చేసిన పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఈ నేపధ్యంలో ఒంటె కన్నీటితో పాము విషాన్ని తొలగించగల ఔషధాన్ని తయారు చేసే ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పాము కాటు కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 1.25 లక్షల మంది మరణిస్తున్నారు. కొన్ని పాములు అత్యంత విషపూరితమైనవి. ఇవి కాటువేసినప్పుడు మనిషి బతికేందుకు అవకాశం ఉండదు. ఈ నేపధ్యంలో పాము విషానికి విరుగుడుగా పనికి వచ్చే ఔషధాల తయారీకి నిరంతరం పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దుబాయ్‌లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ లాబొరేటరీ (సీవీఆర్ఎల్) ఒంటె కన్నీటిని ఉపయోగించి, పాము విషానికి విరుగుడును తయారు చేయవచ్చని వెల్లడించింది. దుబాయ్‌లోని ఈ ల్యాబ్‌లో దీనిపై చాలా ఏళ్ల క్రితం పరిశోధనలు జరిగినప్పటికీ నిధుల కొరత కారణంగా అవి ముందుకు సాగలేదు. అయితే ఇప్పుడు నిధులను సమకూర్చుకుని ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళతామని సీవీఆర్ఎల్ పేర్కొంది. తాము త్వరలోనే పాము విషాన్ని అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొనే ఔషధాన్ని తయారు చేయనున్నామని ఈ పరిశోధనా కేంద్రం అధిపతి డాక్టర్ వార్నర్ తెలిపారు. ఒంటె కన్నీటిలో అనేక రకాల ప్రొటీన్లు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కూడా కాపాడతాయి. ఒంటె కన్నీటిలోని ఔషధ లక్షణాలపై అమెరికా, ఇండియా, తదితర దేశాల్లో పలు పరిశోధనలు జరుగుతున్నాయి. ఒంటె కన్నీటిలో లైసోజైమ్‌లు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్‌లను నిరోధిస్తాయి. ఒంటె కన్నీరే కాదు మూత్రానికి కూడా ఔషదీయ గుణాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో తేలింది. -
వ్యాక్సిన్లపై ఆ ప్రచారాలు, నిజమెంతంటే..
వ్యాక్సిన్లు తప్ప మరో సురక్షిత మార్గం ఇప్పుడు మన ముందు లేదని వైద్య నిపుణులు, సైంటిస్టులు ప్రజలకు సూచిస్తున్నారు. మరోపక్క వ్యాక్సిన్లపై ఉత్త ప్రచారాలతో కొందరు వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ తరుణంలో వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీలు, కేంద్ర ఆరోగ్య శాఖ సౌజన్యంతో ఆ ఉత్త ప్రచారాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా.. వ్యాక్సిన్ డోసులు తీసుకున్న వాళ్లు ఆపరేషన్లకు దూరంగా ఉండాలని, కోవాగ్జిన్‌లో ఆవు దూడ సీరం ఉంటుందనే ప్రచారాలతో సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కరోనా వాక్సిన్లు తీసుకున్న వాళ్లు.. ఆపరేషన్లకు దూరంగా ఉండాలని, ఎందుకంటే ఆపరేషన్‌కి ముందు ఇచ్చే అనస్తీషియా డ్రగ్స్ వల్ల వ్యాక్సిన్ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని, అది ప్రాణాలకే ఎసరు తెచ్చే ప్రమాదం ఉందని ప్రచారం జరుగుతోంది. వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లకు అనస్థీషియా ముప్పు ఎక్కువగా ఉందనేది ఆ వార్త ప్రధాన సారాంశం. అయితే ఈ ప్రచారానికి ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు లేవని నిపుణులు చెప్తున్నారు. సర్జరీల టైంలో స్పృహ కోల్పోవడానికి మాత్రమే జనరల్ అనెస్థెషీయా ఇస్తారు. అనస్థటిక్ డ్రగ్స్ వల్ల మత్తు, శరీరం.. ప్రత్యేకించి ఆపరేషన్ జరిపే భాగం మొద్దుబారిపోతుందే తప్ప శరీరానికి ఎలాంటి హాని చేయబోదని వెల్లడించారు. A post claiming that anaesthetics can be life-threatening for #COVID19 vaccinated people is doing the rounds on social media#PIBFactCheck: ▶️This claim is #FAKE ▶️There is NO scientific evidence till date to confirm the claim ▶️Don't fall for misinformation. GET vaccinated pic.twitter.com/y6SASyZPQl — PIB Fact Check (@PIBFactCheck) June 16, 2021 ‘‘వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లలో కొందరికి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండొచ్చు. ఆ ప్రభావంతో వాళ్లు నీరసించిపోవచ్చు. అలాంటి పేషెంట్లకు రిస్క్ రేటు ఉంటుంది. కాబట్టే ఆ టైంలో ఆపరేషన్లకు వెళ్లొద్దని వద్దని సూచిస్తున్నాం. అంతేకాదు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అవసరమైతే ఆపరేషన్లు తప్పవు. అలాగే అనస్తీషియా డ్రగ్స్‌తో వచ్చిన ముప్పేమి ఉండదు. ఇప్పటివరకు అలాంటి కేసులేవీ దృష్టికి రాలేదు, అసలు ఈ అంశంపై అధ్యయనాలు ఇంకా మొదలుకాలేద’ని అనస్థీషియా నిపుణులు స్పష్టం చేశారు. దూడ సీరం ఇక దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌పై వ్యతిరేక ప్రచారం రకరకాలుగా ఉంటోంది. టీకా తయారీలో అప్పుడే పుట్టిన లేగ దూడల సీరం ఉందని కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ పోస్ట్‌లలో అసలు విషయాల్ని కాకుండా.. తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అప్పుడే పుట్టిన దూడ సీరంను వేరో కణాల (vero cells) తయారీకి, వాటి పెరుగుదలకు మాత్రమే ఉపయోగిస్తారని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ‘వివిధ రకాల బోవిన్ (ఆవు, గేదె), ఇతర జంతువుల సీరంను వేరో కణాల పెరుగుదలకు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. వ్యాక్సిన్ల తయారీకి ఇదొక ప్రామాణిక పదార్థం. టీకాల ఉత్పత్తిలో ఈ వేరో కణాల్ని ఉపయోగిస్తారు. Final vaccine product of #COVAXIN does NOT contain new born calf serum ! Claims suggesting otherwise are misrepresenting facts ! Animal serum has been used in vaccine manufacturing process for decades, but it is completely removed from the end product.https://t.co/NKlh5kow08 pic.twitter.com/L4CrEmZtT1 — Dr Harsh Vardhan (@drharshvardhan) June 16, 2021 కొత్తదేం కాదు అయితే వీరో కణాల్ని ప్రత్యేక పరిస్థితుల్లో శుద్ధి చేసిన తర్వాతే వ్యాక్సిన్ల తయారీకి ఉపయోగిస్తారు. అప్పుడు దూడ సీరం ఆనవాళ్లు పూర్తిగా తొలగిపోతాయి. అంటే అంతిమ దశలో అసలు సీరం ఆనవాళ్లు ఉండవన్నమాట. కొన్ని సంవత్సరాలుగా.. పోలియో, రేబిస్, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ల తయారీలో.. ఇప్పుడు కరోనా వైరస్ తయారీలోనూ ఈ పద్ధతిని కొన్ని దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. అందువల్ల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ వార్తలను, వ్యాక్సిన్లపై తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా, అందరూ టీకాలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ ప్రజలను కోరింది. ఈ మేరకు సమాచార హక్కుచట్టం కింద దాఖలైన ఓ పిటిషన్‌కు.. క్లారిటీ ఇచ్చింది కేంద్ర ఆరోగ్య శాఖ. చదవండి: వ్యాక్సిన్లు బాబూ.. వ్యాక్సిన్లు -
డీఆర్డీవో గుడ్‌న్యూస్: కరోనా బాధితులకు కొత్త ఔషధం సిద్ధం
1. పై ఫొటోలో ఆకుపచ్చ రంగువి ఆరోగ్యకరమైన కణాలు, ఎరుపురంగు చుక్కలు కరోనా వైరస్, నారింజ రంగులో మసకగా ఉన్నవి వైరస్ సోకి దెబ్బతిన్న కణాలు. 2–డీజీ ఇవ్వక ముందు వైరల్ లోడ్ ఎక్కువగా ఉంది. 2. మందు ఇచ్చిన తర్వాత పరిశీలిస్తే వైరస్ లోడ్ చాలా వరకు తగ్గింది. సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్డీవో శుభవార్త చెప్పింది. కరోనా బారినపడ్డ వారు వేగంగా కోలుకునేందుకు, ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు తోడ్పడే ‘2–డీజీ’ ఔషధాన్ని త్వరలో మార్కెట్లోకి తేనున్నట్టు ప్రకటించింది. కరోనా బాధితులపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ‘2–డీజీ’ మంచి ఫలితాలు ఇచ్చిందని, ఈ మేరకు అత్యవసర వినియోగానికి ‘డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)’అనుమతులు వచ్చాయని డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి శనివారం వెల్లడించారు. డీఆర్డీవో అనుబంధ సంస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ (ఇన్మాస్) ఈ ‘2–డీజీ’మందును అభివృద్ధి చేసిందని.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కలిసి ప్రయోగాలు నిర్వహించిందని తెలిపారు. ‘2–డీజీ’ఇచ్చిన కోవిడ్ రోగుల్లో చాలా మందికి నాలుగైదు రోజుల్లోనే కోవిడ్ నెగెటివ్ వచ్చిందని వివరించారు. దేశవ్యాప్తంగా పెరిగిపోయిన కోవిడ్ కేసులు, ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న సమయంలో ‘2–డీజీ’అందుబాటులోకి వస్తుండటంతో సంతోషం వ్యక్తమవుతోంది. ఏడాది కిందే ప్రయోగాలు మొదలు.. కరోనా వైరస్ పంజా విసరడం మొదలైన కొత్తలోనే.. అంటే గత ఏడాది ఏప్రిల్‌లోనే ఈ వైరస్‌కు మందు కనిపెట్టడంపై ఇన్మాస్ సంస్థ దృష్టి పెట్టింది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ)తో కలిసి పరిశోధనలు చేసి.. ‘2–డీజీ (2 డీఆక్సి–డీ గ్లూకోజ్)’మందును రూపొందించింది. ఇది కరోనా వైరస్ పెరుగుదలను సమర్థవంతంగా అడ్డుకుంటోందని గుర్తించి.. క్లినికల్ ట్రయల్స్ కోసం ‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌డీఓ)’కు దరఖాస్తు చేసింది. ఈ మేరకు అనుమతి రావడంతో గత ఏడాది మే నెలలోనే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఫార్మా కంపెనీతో కలిసి.. కోవిడ్ రోగులపై ప్రయోగాత్మక పరిశీలన చేపట్టింది. ఈ మందు సామర్థ్యం, భద్రత ఏమేరకు ఉన్నాయనేది నిర్ధారించేందుకు ప్రయోగాలు నిర్వహించింది. కరోనా వైరస్ ఉన్న శాంపిల్స్.. ఇన్ఫెక్ట్ అయిన కణాలకు 2–డీజీ మందు వాడిన తర్వాత మందు సురక్షితమే.. గత ఏడాది మే – అక్టోబరు మధ్య నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ‘2–డీజీ’మందు సురక్షితమైనదేనని, రోగులు వేగంగా కోలుకునేందుకు ఉపయోగపడుతోందని గుర్తించారు. తర్వాత రెండో దశలో ఫేజ్–2ఏ కింద ఆరు ఆస్పత్రుల్లో, ఫేజ్–2బీ కింద 11 ఆస్పత్రుల్లో పరిశీలన చేపట్టారు. మొత్తం 110 మంది రోగులకు 2–డీజీ మందును ఇచ్చి ఫలితాలను బేరీజు వేశారు. సాధారణ చికిత్సా పద్ధతులతో పోలిస్తే 2–డీజీ మందు ఇచ్చిన రోగులు.. కోవిడ్ లక్షణాల నుంచి వేగంగా బయటపడుతున్నట్టు నిర్ధారించారు. మరోలా చెప్పాలంటే 2–డీజీ తీసుకున్నవారు మూడు రోజులు ముందుగానే కోలుకుంటున్నారని తేల్చారు. మూడో దశలోనూ సత్ఫలితాలు తొలి, రెండు దశల ప్రయోగాలు విజయవంతమైన నేపథ్యంలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు గత ఏడాది నవంబరులోనే డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. గతేడాది డిసెంబరు – ఈ ఏడాది మార్చి మధ్య 220 మంది రోగులకు ఈ మందును ఇచ్చి పరిశీలించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 27 కోవిడ్ ఆస్పత్రుల్లో పేషెంట్లపై ప్రయోగాలు చేశారు. 2–డీజీ మందు ఇవ్వడం మొదలుపెట్టిన మూడో రోజు నుంచే దాదాపు 42 శాతం మంది రోగుల్లో ఆక్సిజన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది. అరవై ఐదేళ్ల కంటే ఎక్కువ వయసున్న వారిలోనూ ఇదేరకమైన ఫలితాలు వచ్చాయి. మూడు దశల ఫలితాల ఆధారంగా.. మధ్యమ, తీవ్ర స్థాయి కోవిడ్ రోగుల చికిత్సలో 2–డీజీని ఉపయోగించేందుకు డీసీజీఐ ఈ నెల ఒకటో తేదీనే అనుమతులు జారీ చేసింది. తాజాగా ఈ మందుకు సంబంధించిన వివరాలను డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. పొడి.. నీళ్లలో కలుపుకొని తాగడమే 2–డీజీ మందు.. పొడి రూపంలో లభిస్తుంది. దానిని నీటిలో కరిగించుకుని తాగాలి. ఈ ఔష ధం మన శరీరంలో వైరస్ సోకిన కణాల్లోకి చేరుకుని.. ఆ కణాల నుంచి వైరస్లు శక్తి పొందకుండా నిరోధిస్తుంది. దీంతో వైరస్ వృద్ధి తగ్గిపోతుంది. వైరస్‌తో కూడిన కణాల్లోకే చేరుకోవడం 2–డీజీ ప్రత్యేకత. ఈ మందులోని అణువులు.. సాధారణ గ్లూకోజ్ అణువులను పోలి ఉండటం వల్ల విస్తృతంగా ఉత్పత్తి చేయడానికి వీలుందని డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. అన్నీ సవ్యంగా సాగితే వారం, పదిరోజుల్లోనే ఈ మందు తొలి విడత మార్కెట్లోకి వచ్చేస్తుందని.. మూడు వారాల్లో మరింత మోతాదులో అందుబాటులోకి వస్తుందని వివరించారు. -
మూసీలో ‘డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా’పై పరిశోధన
సాక్షి, హైదరాబాద్: మూసీ నదిలోని ‘డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా’పై పరిశోధన సాగనుంది. మందుల ఉత్పత్తి తర్వాత ఆయా కంపెనీల నుంచి విడుదలైన ‘యాంటీ బయోటిక్స్’వ్యర్థాల గాఢత మూసీలో అత్యధికస్థాయిలో ఉన్నట్టు ఇప్పటికే బయటపడింది. ఈ నేపథ్యంలో వీటిస్థాయి అధికస్థాయిలో ఉన్న మూసీతోపాటు తక్కువస్థాయిలో ఉన్న చెన్నైలోని అడయార్ నదిపైనా ఈ పరిశోధన జరగనుంది. ఇండో–యూకే ప్రాజెక్ట్‌లో భాగంగా బ్రిటన్ బర్మింగ్హమ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ అధ్యయనంలో ఐఐటీ–హైదరాబాద్ కూడా భాగస్వామి కానుంది. ఈ కొత్త పరిశోధక ప్రాజెక్ట్ కోసం ఇండియా, యూకే కలిసి 1.2 మిలియన్ పౌండ్ స్టెర్లింగ్‌లు కేటాయించాయి. బ్రిటన్–ఇండియా ప్రభుత్వాల సహకారంతో 8 మిలియన్ల పౌండ్ స్టెర్లింగ్‌ల ఖర్చులో నిర్వహిస్తున్న యాంటీ–మైక్రోబియల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్) సైంటిఫిక్ రీసెర్చ్‌లో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను కూడా చేపడుతున్నారు. తల్లుల నుంచి సోకే ‘సూపర్ బగ్ ఇన్ఫెక్షన్ల’తో భారత్‌లో ప్రతిఏటా 58 వేల చిన్నారులు మృత్యువాత పడుతున్నట్టు, యూరప్ యూనియన్‌లో ప్రతి ఏడాది 28–38 వేల మధ్యలో ‘డ్రగ్ రెసిస్టెన్స్ పాథోజెన్ల’తో మరణాలు సంభవిస్తున్నట్టు అంచనా. నదుల్లోకి ప్రవేశించాక... ‘పర్యావరణంలో యాంటీ బయోటిక్స్ ఎంత త్వరగా క్షిణిస్తాయనేది మనకు తెలియదు. పెద్ద నదుల్లోకి ప్రవేశించాక, వర్షాలతో అవి ఏ మేరకు బలహీనమవుతాయన్న విషయమూ తెలియదు. ఏఎంఆర్ ఫ్లోస్ ప్రాజెక్ట్ ద్వారా యాంటీ బయోటిక్స్ ఎలా ఉత్పత్తి అవుతాయి, అవి తట్టుకునే బ్యాక్టీరియాను ఎలా ఎంపిక చేసుకుని నదుల నెట్‌వర్క్‌ల ద్వారా ఎలా వ్యాపిస్తాయి, నదుల్లో ఎంత దూరం ప్రయాణిస్తాయి, వరదల సందర్భంగా ఎక్కడి నుంచి అవి పంటపొలాల్లోకి, జనసమూహాల్లోకి వ్యాప్తి చెందుతాయి... అనే అంశాలను పరిశీలిస్తారు. నీటివనరుల్లో యాంటీ బయోటిక్స్ ఏ మేరకు కేంద్రీకృతమైతే నష్టం జరగదన్న దాని ప్రాతిపదికన పర్యావరణ ప్రమాణాలను రూపొందించే అవకాశం ఉంది’అని యూకే ప్రాజెక్ట్ లీడ్ హెడ్ డాక్టర్ జాన్ క్రెఫ్ట్ తెలిపారు. పర్యావరణంలో ఎలా వ్యవహరిస్తుందో... ‘మూసీ నది సూపర్‌బగ్‌లకు కేంద్రంగా ఉన్నట్టు గతంలోని పరిశోధనలతోనే మనకు తెలుసు. యాంటీ బయోటిక్స్‌ను తట్టుకునే బ్యాక్టీరియా పర్యావరణంలో ఎలా వ్యవహరిస్తుంది, దాని భవితవ్యం ఏమిటీ అన్నది తెలుసుకునేందుకు నీటి ప్రవాహాల నమూనాలను అంచనా వేయడం కీలకం. ఇతర దేశాలతో పాటు ఇతర నదులకు సరిపోయే నమూనాలను రూపొందించే లక్ష్యంతో మేం పనిచేస్తున్నాం’అని ఇండియన్ ప్రాజెక్ట్ లీడ్ ప్రొఫెసర్, ఐఐటీ–హైదరాబాద్ ప్రొఫెసర్ శశిధర్ తాటికొండ వెల్లడించారు. -
క్లోరోక్విన్‌తో ఉపయోగం లేదు: డబ్ల్యూహెచ్‌వో
బెర్లిన్: కరోనా బాధితులకు యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పెద్దగా ఉపయోగం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. బాధితులకు ఈ ఔషధం పని చేస్తుందా లేదా అనే విషయం తెలుసుకునేందుకు నిర్వహించిన పరీక్షను ముగించినట్లు వెల్లడించింది. హైడ్రాక్సీక్లోరోక్విన్, లోపినవిర్/రిటోనవిర్ కాంబినేషన్ డ్రగ్‌ను హెచ్ఐవీ/ఎయిడ్స్ చికిత్సలో వాడుతున్నారు. ఈ కాంబినేషన్ డ్రగ్ కరోనాను నయం చేస్తుందని ప్రచారం కావడంతో దీనిపై డబ్ల్యూహెచ్‌వో పరీక్ష చేపట్టింది. ఈ కాంబినేషన్ డ్రగ్ కరోనా బాధితులకు ఉపయోగపడినట్లు ఆధారాలు లభించలేదని తెలిపింది. క్లోరోక్విన్ ఇచ్చినప్పటికీ బాధితుల్లో మరణాల రేటు తగ్గలేదంది. -
మార్కెట్లోకి కరోనా ఔషధం..
హరిద్వార్ : ఆయుర్వేదిక్ ఉత్పత్తుల దిగ్గజం పతంజలి రూపొందించిన కరోనా ఔషధం కొరోనిల్‌ను యోగా గురు రాందేవ్ బాబా మంగళవారం హరిద్వార్‌లో విడుదల చేశారు. కరోనావైరస్కు వ్యాక్సిన్ కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోందని, కరోనా చికిత్సకు ఈరోజు తాము తొలి ఆయుర్వేద ఔషధం కొరోనిల్‌ను అభివృద్ధి చేశామని రాందేవ్ బాబా పేర్కొన్నారు. దాదాపు 100 మంది రోగులపై తాము క్లినికల్ పరీక్షలు నిర్వహించగా 65 శాతం మందికి మూడురోజుల్లో నెగెటివ్ ఫలితాలు వచ్చాయని చెప్పారు.ఏడు రోజుల్లో వంద శాతం మంది రోగులు కోలుకున్నారని వెల్లడించారు. తమ ఔషధం నూరు శాతం రికవరీ రేటు, సున్నా శాతం మరణాల రేటును కలిగిఉందని చెప్పుకొచ్చారు. కోవిడ్-19 రోగుల చికిత్సలో ఉపయోగించే ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసే క్రమంలో పతంజలి అన్ని శాస్త్రీయ నిబంధనలను పాటించిందని చెప్పారు. పతంజలి పరిశోధనా కేంద్రం, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) సహకారంతో పరిశోధన చేపట్టామని పతంజలి పేర్కొంది. కోవిడ్-19 చికిత్స కోసం పలు వ్యాక్సిన్ల అభివృద్ధి వివిధ దశల్లో ఉన్న సమయంలో ఆయుర్వేద ఔషధం అందుబాటులోకి వచ్చింది. పలు వ్యాక్సిన్లు మానవ పరీక్షలపై కీలక దశకు చేరుకున్నాయి. ఆస్ర్టాజెనెకా, మొడెర్నా, ఫిజర్, జాన్సన్ అండ్ జాన్సన్, మెర్క్, సనోఫి, బయోఎన్‌టెక్, కాన్సినో బయోలాజిక్స్ వంటి పలు సంస్ధలు వ్యాక్సిన్ అభివృద్ధిలో నిమగ్నమయ్యాయి. చదవండి : యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం -
ఆ ఔషధ ఉత్పత్తిని పెంచండి: డబ్ల్యూహెచ్ఓ
జెనీవా: కరోనా రోగుల పాలిట సంజీవనిగా భావిస్తున్న స్టెరాయిడ్ డెక్సామిథాసోన్ ఉత్పత్తిని పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూఓ) సోమవారం పిలుపునిచ్చింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కరోనా వైరస్ రోగులకు ఈ ఔషధాన్ని వాడటం వల్ల మరణాల సంఖ్య తగ్గుతుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ ‘బ్రిటీష్ ట్రయల్‌లో ఈ ఔషధం మంచి ఫలితాన్ని ఇచ్చినట్లు నిరూపితం కావడంతో డెక్సామిథాసోన్‌కు ఇప్పటికే డిమాండ్ బాగా పెరిగింది. ఉత్పత్తిని వేగవంతం చేయాలి’ అని ఆయన సూచించారు. గత వారం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ బృందం నేతృత్వంలోని పరిశోధకులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 2 వేల మంది రోగులకు ఈ ఔ షధాన్ని ఇచ్చారు. ఇది మరణాల సంఖ్యను 35 శాతం తగ్గించినట్లు తెలిసింది. ‘పరిశోధనలు ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్నప్పటికీ.. డెక్సమిథాసోన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కరోనా రోగుల ప్రాణాలను రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని నిరూపితమైనది. అందుకే ఈ ఔషధం వాడటానికి అనుమతిస్తున్నాం’ అని జెనీవాలో జరిగిన ఒక వర్చువల్ న్యూస్ కాన్ఫరెన్స్‌లో టెడ్రోస్ వెల్లడించారు. అంతేకాక ‘ఇప్పుడు మన ముందున్న సవాళ్లు ఏమిటంటే ఈ ఔషధ ఉత్పత్తిని పెంచడం.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా.. దీని అవసరమున్న దేశాలకు సమానంగా పంపిణీ చేయడం.. ఎక్కువ అవసరమైన చోట దృష్టి సారించడం’ అని పేర్కొన్నారు.(వాటి వల్ల కరోనా చావదు: డబ్ల్యూహెచ్‌వో) ప్రాముఖ్య దేశాలు డెక్సామిథాసోన్ 60 సంవత్సరాలుగా మార్కెట్లో ఉంది. సాధారణంగా ఈ ఔషధం మంటను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుతం కరోనాతో తీవ్రమైన అనారోగ్యానికి గురైన రోగులకు మాత్రమే డెక్సామిథాసోన్ వాడాలని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అంతేకాక తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్న రోగులకు లేదా కోవిడ్-19 నివారణ కోసం ఈ ఔషధం పనిచేస్తుందనడానికి ఎటువంటి ఆధారం లేదు. హాని కలిగించే ప్రమాదం కూడా ఉంది అని టెడ్రోస్ హెచ్చరించారు. దీని సరఫరాలో అధిక సంఖ్యలో కరోనా వైరస్ రోగులు ఉన్న దేశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని టెడ్రోస్ తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ ప్రకటన ఫలితంగా నాణ్యత లేని లేదా తప్పుడు ఉత్పత్తులు మార్కెట్లోకి ప్రవేశించే ప్రమాదం ఉన్నందున.. ఈ ఔషధ ఉత్పత్తిదారులు నాణ్యతకు సంబంధించి హామీ ఇవ్వవలసి ఉంటుందని టెడ్రోస్ హెచ్చరించారు. మింక్‌తో సంబంధం చైనా వుహాన్ కరోనాకు జన్మస్థలంగా భావిస్తున్న క్రమంలో శాస్త్రవేత్తలు ఇక్కడి మాంసం దుకాణాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఈ వైరస్ మొదట జంతువుల నుంచి మానవులకు సోకిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కరోనాపై పనిచేస్తున్న డబ్ల్యూహెచ్ఓ అధికారి మరియా వాన్ కెర్ఖోవ్ మాట్లాడుతూ.. ఉత్తర ఐరోపాలో జరిపిన అధ్యయనాల్లో కరోనా వైరస్ మానవులకు మింక్(అమెరికాలో కనిపించే ఓ జంతువు) ద్వారా సోకినట్లు తెలుస్తుందన్నారు. నెదర్లాండ్స్ మరియు డెన్మార్క్‌లో కొన్ని మింకులు కరోనా వైరస్‌కు సానుకూలంగా ఉన్నాయి అని వాన్ కెర్ఖోవ్ చెప్పారు. -
కరోనా కట్టడిలో కొత్త ఆశలు: ‘రెమెడిసివిర్’పై ప్రశంసలు
వాషింగ్టన్ : ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ చికిత్సలో కీలక పురోగతి సాధించామని అమెరికా శాస్త్రవేత్త ఒకరు ప్రకటించారు. రికవరీ శాతం బాగా పెరిగిందని , చాలా తక్కువ సమయంలో, అతివేగంగా రోగులు కోలుకున్నారని అమెరికా బుధవారం ప్రకటించింది. ప్రయోగాత్మక ఔషధం రెమెడిసివిర్ ద్వారా కోవిడ్-19ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని కొత్త అధ్యయనం ద్వారా తేలింది. దీనిద్వారా రోగులు కోలుకోవడానికి సగటున నాలుగు రోజులు కంటే తక్కువ సమయం పడుతోందని ఈ స్టడీ తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నఈ కరోనా వైరస్ కట్టడికి గిలియడ్ సైన్సెస్ కు చెందిన రెమెడిసివిర్ కీలక విజయాన్నిసాధించిందని, ప్రత్యేకించి కరోనా నివారణకు టీకా అందుబాటులోకి తేవడానికి కనీస ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ సమయమేపడుతుందన్నఅంచనాల మధ్య ఇది కీలక విజయమని అమెరికా ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. (కరోనా వైరస్ : గ్లెన్‌మార్క్ ఔషధం!) (కోవిడ్-19 : యాంటీ వైరల్ ట్యాబ్లెట్ల మార్కెట్) యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ ఫలితాలు కనిపించాయి. ప్రపంచవ్యాప్తంగా (యుఎస్, యూరప్ , ఆసియా) 68 ప్రదేశాలలో 1,063 మంది ఆసుపత్రిలో చేరిన కరోనావైరస్ రోగులలో యాంటీవైరల్ డ్రగ్ రెమెడిసివిర్ మంచి ఫలితాలనిచ్చిందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్, ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ వెల్లడించారు. రోగులు కోలుకునే సమయాన్ని 31శాతం తగ్గించిందనీ, సగటున 11 రోజుల్లో వ్యాధి నయమైందని చెప్పారు. రెమెడిసివిర్ ఉపయోగంతో మరణించే వారి సంఖ్య బాగా తగ్గుముఖం పడుతుందని తెలిపారు. పూర్తి ఫలితాలను మెడికల్ జర్నల్‌లో త్వరలోనే ప్రచురిస్తామని ఫౌసీ అన్నారు. ఎక్కువమంది వ్యక్తులు, ఎక్కువ కంపెనీలు, ఎక్కువ పరిశోధకులు పాల్గొనడం వల్ల ఇది మరింత మెరుగవుతుందని తెలిపారు రెమెడిసివిర్ ఔషధంతో కరోనాకు చెక్ పెట్టవచ్చని ఫౌసీ ధీమా వ్యక్తం చేశారు.రికవరీకి సమయంతగ్గించడంలో స్పష్టమైన, ముఖ్యమైన, సానుకూల ప్రభావాన్ని కలిగి ఉందని డేటా ద్వారా తెలుస్తోందన్నారు. అంతేకాదు 1980లో హెచ్ఐవీ కి మందు కనుగొన్ప్పటి విజయంతో దీన్ని ఫౌసీ పోల్చారు. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం) యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీఏ) నుండి వచ్చిన ఒక ప్రకటన ప్రకారం, కాలిఫోర్నియాకు చెందిన ప్రపంచ ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్ తో సంప్రదింపులు జరుపుతోంది. రోగులకు సాధ్యమైనంత త్వరగా, తగిన విధంగా అందుబాటులో ఉంచడంపై మాట్లాడుతోంది. అత్యవసర వినియోగ అధికారాన్ని ప్రకటించాలని ఎఫ్‌డీఏ యోచిస్తోందని సీనియర్ అధికారిని ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ ప్రకటించింది. మరోవైపు ఒక నిపుణుడుగా తాజా ఫలితాలపై సంతోషంగా, ఆశాజనకంగా ఉన్నామని వాండర్బిల్ట్ విశ్వవిద్యాలయం వైద్య నిపుణుడు మార్క్ డెనిసన్ చెప్పారు. తమ ల్యాబ్ లో ఈ వైరస్ నివారణకు సంబంధించి 2013 లో రెమెడెసివిర్ సామర్థ్యాన్ని పరీక్షించామని, అప్పటినుంచి చాలా పరిశోధనలు చేశామని తెలిపారు. కానీ ఎన్ఐహెచ్ అధ్యయనంలో పాల్గొనలేదన్నారు. (కరోనా వ్యాక్సిన్: బిల్ గేట్స్ వ్యాఖ్యలు) కరోనావైరస్ నిరోధానికి ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్న పరీక్షిస్తున్న అనేక చికిత్సలలో గిలియడ్‌కు చెందిన రెమెడిసివిర్ ఒకటి. దీన్ని ఇప్పటికే చైనాలో ఉపయోగించినా, ఫలితాలు పెద్దగా ఆశాజనంగా లేవని గతంలో అధ్యయనాలు తెలిపాయి. అలాగే గిలియడ్ మొదట ఎబోలాకు మందుగా రెబోడెసివిర్ను అభివృద్ధి చేసింది. కానీ ఆమోదానికి నోచుకోలేదు. ఈ ఇంట్రావీనస్ ఔషధం అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్), మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్) వ్యాధిని జంతువుల్లో నివారించడంలో సహాయపడింది. వ్యాధి లక్షణాల తీవ్రతను తగ్గించింది. కానీ ప్రపంచంలో ఎక్కడా ఉపయోగానికి ఆమోదం లభించలేదు. -
రెండు మందులతో కేన్సర్‌కు చెక్!
కేన్సర్ చికిత్సకు వాడే రెండు మందులను వేర్వేరుగా కాకుండా కలిపి వాడటం ద్వారా ఎక్కువ ఫలితం ఉంటుందని అంటున్నారు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు. ఈ రెండు మందుల్లో ఒకటి రైబోన్యూక్లియస్కు సంబంధించింది.. రెండోది ప్రొటీన్ కైనేస్ ఇన్హిబిటర్. కేన్సర్‌కు సమర్థమైన చికిత్సగా భావిస్తున్న రైబో న్యూక్లియస్ మందులు మానవ కణాల నుంచి తయారవుతాయి. వీటి పని చాలా సింపుల్. మనకు అవసరం లేని కణాల పోగులను, వైరస్‌లను బయటికి పంపించడమే! ఈ సామర్థ్యాన్ని కేన్సర్‌కు విరుగుడుగా వాడేందుకు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకోవైపు ప్రొటీన్ కైనేస్ ఎంజైమ్‌లు కణ విభజన ప్రక్రియ నెమ్మదించేలా చేస్తాయి. ఈ రెండు మందులు వేర్వేరుగా కేన్సర్‌పై ప్రభావం చూపుతున్నప్పటికీ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ రెండింటిని కలిపి కొన్ని రకాల కేన్సర్లకు వాడారు. తక్కువ మోతాదుతోనే మెరుగైన ఫలితాలు కనపడటంతో ప్రస్తుతం వారు ఎలుకలపై ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
ఇక ఎక్కడైనా ఔషధ తయారీ!
లండన్: అత్యవసర సమయాల్లో రోగికి అవసరమైన ఔషధం దొరకకపోతే ఎదురయ్యే పరిస్థితి వర్ణనాతీతం. పెద్ద పెద్ద నగరాల్లో అయితే ఔషధాలు వెంటనే దొరికే అవకాశం ఉన్నా.. కుగ్రామాలు, కొండ ప్రాంతాల్లో అత్యవసరంగా కావాల్సిన ఔషధాలు దొరికే పరిస్థితి లేదు. అయితే ఈ పరిస్థితులు త్వరలో తొలగిపోయే అవకాశాలున్నాయి. ఎక్కడి నుంచైనా ఔషధాలను కంప్యూటర్ సాయంతో తయారుచేసే కొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘కెంప్యూటర్’గా పిలిచే ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ సాయంతో ప్రపంచంలోని ఏ మూల నుంచైనా సులభంగా, అత్యంత నమ్మదగిన సహజ సిద్ధమైన ఔషధాలను తయారు చేసుకోవచ్చని బ్రిటన్‌లోని గ్లాస్గౌ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు. ఈ పద్ధతి అందుబాటులోకి వస్తే ఫార్మా రంగంపై కొన్ని కంపెనీల ఆధిపత్యం తగ్గిపోనుందని వారు పేర్కొన్నారు. ఈ కెంప్యూటర్ద్వారా రసాయన సమ్మేళనాల కోడ్‌ను అభివృద్ధి చేసి ఇతరులకు షేర్ చేయవచ్చు. ఈ రసాయన సమ్మేళన కోడ్‌ను అమలు చేసే విధానాన్ని కెంపేలర్ అంటారు. ఈ కెంపేలరే ఔషధాలను రూపొందించే విధానాన్ని వివరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు సైతం వారు అభివృద్ధి చేసిన రసాయన సమ్మేళనాలనూ డిజిటల్ రూపంలోకి మార్చుకోవచ్చు. -
క్షయను రూపుమాపే కొత్త మందు
పారీస్: మందులకు లొంగకుండా ప్రపంచంలోని అనేక మందిని వేధిస్తున్న క్షయ వ్యాధికి నూతన చికిత్సా విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని ద్వారా ప్రస్తుత వ్యాధిగ్రస్తుల్లో 80 శాతం మందికి క్షయ వ్యాధిని శాశ్వతంగా దూరం చేయవచ్చన్నారు. ప్రస్తుతమున్న చికిత్సా విధానం ద్వారా కేవలం 55 శాతం మందికే క్షయ వ్యాధిని తగ్గించవచ్చు. సోమవారం నిర్వహించిన పరీక్షల్లో ఈ నూతన విధానం సత్ఫలితాలను అందించినట్లు వివరించారు. ప్రపంచంలోనే అత్యధిక క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్న బెలారస్ దేశంలోని డాక్టర్లు ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ చికిత్సలో ముఖ్యమైనది బెడాక్విలైన్ ఔషధం. చికిత్సలో భాగంగా 181 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు కొన్ని నెలల పాటు బెడాక్విలైన్ ఔషధంతోపాటు ఇతర యాంటీబయాటిక్స్ కూడా అందించారు. మొత్తం కోర్సును పూర్తిచేసిన 168 మందిలో 144 మంది క్షయ నుంచి శాశ్వతంగా విముక్తి పొందారు. -
ఫార్మా అభివృద్ధికి రూ.460 కోట్లు!!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమ అభివృద్ధికి రూ.460 కోట్లతో మద్దతునందించాలని ప్రతిపాదించింది. దీని ద్వారా కామన్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు, ఎస్ఎంఈల టెక్నాలజీ అప్‌గ్రేడ్ వంటి వాటితో బల్క్ డ్రగ్స్, వైద్య పరికరాల తయారీ వ్యయాన్ని తగ్గించాలని భావిస్తోంది. అందుకోసం ఫార్మాస్యూటికల్స్ డిపార్ట్మెంట్.. ఫార్మా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఐదు సబ్ స్కీములకు మార్గదర్శకాలను ప్రకటించింది. బల్క్ డ్రగ్స్ పార్క్స్‌లో తయారీ వ్యయాన్ని 20–25 శాతంమేర తగ్గించడమే లక్ష్యమని తెలిపింది. అలాగే మెడికల్ డివైస్ పార్క్స్ ద్వారా వైద్య పరికరాల తయారీ ఖర్చును కూడా తగ్గించాలని చూస్తోంది. బల్క్ డ్రగ్ పరిశ్రమకు చేయూతనందించేందుకు ఒక స్కీమ్ కింద 2018–20 మధ్యకాలంలో రూ.200 కోట్లతో కామన్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తన వెబ్సైట్లో తెలిపింది. మెడికల్ డివైస్ పరిశ్రమకు కూడా సాయమందించేందుకు మరో స్కీమ్ కింద రూ.100 కోట్లతో కామన్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. రూ.20 కోట్లతో ఫార్మా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రతిపాదించామని తెలిపింది. ఫార్మా రంగ ప్రమోషన్‌కు ఫార్మాస్యూటికల్ ప్రమోషన్ డెవలప్మెంట్ స్కీమ్‌ను తీసుకువస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇక ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ అసిస్టెన్స్ స్కీమ్‌కు బడ్జెట్లో రూ.144 కోట్ల కేటాయింపులు ఉన్నాయని తెలిపింది. -
ఐసీయూలో ఇంద్రాణీ ముఖర్జియా..పలు అనుమానాలు
సాక్షి, ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్నఇంద్రాణీ ముఖర్జియా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. కుమార్తె హత్య కేసులో ముంబైలోని బైకుల్లా జైలులో ఉన్న ఆమెను అపస్మారక స్థితిలో అసుపత్రికి తరలించడం చర్చనీయాంశమైంది. తీవ్ర రక్తపోటుతో బాధపడుతున్న ఇంద్రాణీని జైలు అధికారులు ముంబైలోని జేజే హాస్పిటల్‌కి తరలించారు. ప్రసుత్తం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇంద్రాణీపై విష ప్రయోగం జరిగిందా లేక డ్రగ్ మోతాదు ఎక్కువైందా అనే కోణంలో పరీక్షలు నిర్వహిస్తున్నామని జేజే హాస్పిటల్ డీన్ ఎస్డీ నానంద్కర్ వెల్లడించారు. రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. దీంతో ఇంద్రాణీ ముఖర్జియా ఆకస్మిక అనారోగ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఆసుపత్రిలోముఖర్జీని కలవటానికి ప్రయత్నించిన ఆమె వ్యక్తిగత న్యాయవాది గుంజన్ మంగళను వైద్యులు అనుమతించలేదు. ముందుగా జైలు అధికారుల అనుమతి తీసుకోవాలని వైద్యులు అతనికి సూచించారు. కాగా ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కూడా నిందితురాలిగా ఉన్న ఇంద్రాణీ ముఖర్జియా తన భర్త పీటర్ ముఖర్జీతో కలిసి సొంత కూతుర్ని హతమార్చిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. -
డ్రగ్స్ మత్తులో జంట మృతి.. తిండిలేక చిన్నారి!
అమెరికాలో ఘోరం జరిగింది. డ్రగ్స్ ఓవర్‌డోస్ కావడంతో యువ దంపతులు మరణించగా, నాలుగు రోజుల తర్వాత వాళ్ల చిన్నారి కూతురు తిండిలేక చనిపోయింది. ఐదు నెలల వయసున్న సమ్మర్ చాంబర్స్ అనే ఈ చిన్నారి డీహైడ్రేషన్, తిండి లేక మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆమె తల్లిదండ్రులు జాసన్ చాంబర్స్ (27), చెల్సియా కార్డారో (19)లతో పాటు చిన్నారి సమ్మర్ మృతదేహాలు పిట్స్బర్గ్ నగరానికి 60 మైళ్ల దూరంలోని జాన్స్టౌన్ సమీపంలో ఉన్న వాళ్ల ఇంట్లో పడి కనిపించాయి. వాళ్ల ఇంట్లో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించాయని పోలీసులు తెలిపారు. దంపతులిద్దరూ చాలా ఎక్కువ మొత్తంలో హెరాయిన్ తీసుకున్నారని, కొద్ది నిమషాల తేడాలోనే ఇద్దరూ మరణించి ఉంటారని చెప్పారు. వాళ్లు మరణించి దాదాపు వారం అయ్యిందన్నారు. చాబర్స్ ఆ ఇంట్లోని మొదటి అంతస్తులో మరణించి పడి ఉండగా, కార్డారో రెండో ఫ్లోర్‌లోని బాత్రూంలో పడి ఉంది. వాళ్ల కూతురు మృతదేహం రెండో ఫ్లోర్‌లోని బెడ్రూంలో కనిపించింది. ఇంట్లో డ్రగ్స్ ఓవర్‌డోస్ అయి మరణించిన ఘటనలు తరచు అమెరికాలో వెలుగుచూస్తున్నాయి. ప్రధానంగా నార్త్ కరొలినా, ఓహియో, పెన్సల్వేనియా రాష్ట్రాల్లో డ్రగ్స్ కారణంగా సంభవిస్తున్న మరణాలు 2014, 2015 సంవత్సరాల్లో ఎక్కువగానే ఉన్నాయి. ఈ దంపతులు కొంత కాలం క్రితమే న్యూయార్క్ నుంచి పెన్సల్వేనియాకు వెళ్లినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. -
స్త్రీలకూ వయాగ్రా!
ఎఫ్‌డీఏ ఆమోదం వాషింగ్టన్: కామోద్దీపన ఔషధం వయాగ్రా ఇకపై స్త్రీలకూ అందుబాటులోకి రానుంది. రుతుచక్రం ఆగిపోయే దశకు చేరువైన స్త్రీలలో లైంగిక కోరికలు తగ్గిపోయే సమస్యకు చికిత్స చేసేందుకు గాను తొలిసారిగా ఓ ఔషధానికి ఆమోదం లభించింది. ‘ఫిమేల్ వయాగ్రా’గా పిలుస్తున్న ఈ మందుకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) మంగళవారం ఆమోదం తెలిపింది. అయితే, ఈ మందు వినియోగం వల్ల రక్తపోటు పడిపోవడం, మూర్ఛపోవడం వంటి తీవ్రమైన దుష్ర్పభావాలు కలిగే అవకాశాలుంటాయని ఎఫ్‌డీఏ హెచ్చరించింది. ‘యాడ్‌యీ(ఫ్లిబాన్సెరిన్ ఔషధం)’ పేరుతో తయారుచేసిన ఈ మందును రుతుచక్రం ఆగిపోయే దశకు ముందు ఉన్న స్త్రీలలో ‘హైపోయాక్టివ్ సెక్సువల్ డిజైర్ డిజార్డర్(హెచ్ఎస్డీడీ)’ సమస్యకు చికిత్స చేసేందుకుగాను ఎఫ్‌డీఏ అనుమతించింది. అయితే, ఇంతవరకూ స్త్రీలలో లేదా పురుషుల్లో లైంగిక కోరికలకు సంబంధించి ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన చికిత్సలేవీ లేవని ఎఫ్‌డీఏకు చెందిన ఔషధ పరిశోధన కేంద్రం డెరైక్టర్ వుడ్‌కాక్ వెల్లడించారు. లైంగిక కోరికలు తగ్గే సమస్యతో బాధపడుతున్న స్త్రీలకు తొలిసారిగా యాడ్‌యీ మందుతో చికిత్సకు వీలవుతుందని తెలిపారు. అతిగా మద్యం సేవించడం, మానసిక సమస్యలు, ఇతర కారణాల వల్ల వచ్చే హెచ్ఎస్డీడీకి ఈ మందుతో చికిత్స చేయొచ్చన్నారు. అయితే, దీనితో చికిత్సకు ముందు దుష్ర్పభావాల గురించి పూర్తిగా తెలుసుకోవాలన్నారు. -
'గ్లుకాన్-డీ' ఎనర్జీ డ్రింక్ లో పురుగులు
బులంద్షార్ (ఉత్తరప్రదేశ్): మ్యాగీ నూడుల్స్ వివాదం ముగిసిపోకముందే మరో వివాదం తలెత్తింది. తాజాగా ఎనర్జీ డ్రింక్ 'గ్లుకాన్-డీ'లో చిన్న చిన్న పురుగులు, కీటకాలు వస్తున్నాయని ఉత్తరప్రదేశ్ లోని బులందర్షార్లో ఆరోపణలు వచ్చాయి. దీంతో 'గ్లుకాన్-డీ' ఐటమ్ ను పరిశీలనకు పంపారు. బబ్లూ అనే వ్యక్తి రెండు రోజుల క్రితం ఓ జనరల్ స్టోర్ నుంచి 'గ్లుకాన్-డీ' కొన్నాడు. అది తాగిన అనంతరం వారి కుటుంబం మొత్తం వాంతులు చేసుకుని, అస్వస్థతకు గురైంది. పరీక్షల నిమిత్తం గ్లుకాన్ ప్రాడక్ట్ ను లాబోరేటరికి పంపించగా, కీటకాలున్నట్లు తేలినట్లు సమాచారం. తమకు ఫిర్యాదు అందిన తర్వాత ఆ జనరల్ స్టోర్ నుంచి నాలుగు పాకెట్లను డ్రగ్ సేఫ్టీ ఆఫీసర్ శివదాస్ లక్నోలోని లాబ్ కు పంపి పరీక్షలు జరిపినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ ఉత్పత్తులను అమెరికన్ ఫార్మాస్యూటికల్, హెచ్‌జే హీంజ్ కంపెనీ తయారుచేస్తుంది. -
మరింత వేగంగా ‘ఔషధ’ పరిశోధనలు
కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగారామ్ అయ్యర్ బాలానగర్: ఔషధాల పరిశోధన మరింత వేగవంతంగా, ఫలవంతంగా జరగాలని, ప్రాణాంతక వ్యాధులకు మందులు కనుగొనాలని కేంద్ర రసాయన, ఎరువుల శాఖా మంత్రి హన్సరాజ్ గంగారామ్ అయ్యర్ అన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూ ఆఫ్ ఫార్మసూటికల్స్ అండ్ రీసర్చ్ ఆడిటోరియంలో ఔషధాల తయారీలో ఆధునిక ఆవిష్కరణలు (ఐపీబీడీ-2015) అనే అంశంపై గురువారం అవగాహన సదస్సును కేంద్ర కార్మికశాఖ మంత్రి దత్తాత్రేయతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఎన్ఎంఆర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హన్సరాజ్గంగారామ్ అయ్యర్ మాట్లాడుతూ దేశంలోనే హైదరాబాద్ నైపర్‌లో ఔషధ పరిశోధనలు బాగా జరుగుతున్నాయని ప్రశంసించారు. నేటి ఫార్మా కంపెనీల అధినేతలు ఒకప్పుడు ఐడీపీఎల్ ఉద్యోగులే నని ఆయన గుర్తు చేశారు. ప్రసుత్తం క్యాన్సర్, హెచ్ఐవీ వంటి భయంకరమైన వ్యాధులకు సరైన మందులు లేవని, వీటిని నివారించేందుకు కొత్త ఔషధాలు కనుగొనాలని కోరారు. పరిశోధనలకు అయ్యే ఖర్చు భరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన చెప్పారు. తక్కువ ఖర్చుతో త్వరగా నయం అయ్యే మందులను కనుగొని ఫార్మా రంగంలో నైపర్ ఖ్యాతిని నిలబెట్టాలని కోరారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ సరికొత్త పద్ధతుల ద్వారా అత్యాధునిక పరిజ్ఞానంతో మందులను కనుగొన్నప్పుడే నైపర్‌కు పేరు ప్రఖ్యాతలు వస్తాయని అన్నారు. ఐడీపీఎల్‌కు పూర్వ వైభవాన్ని నైపర్ విద్యార్థులు తీసుకురావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఐఐసీటీ డెరైక్టర్ లక్ష్మీకాంతం, నైపర్ ప్రాజెక్టు డెరైక్టర్ అహ్మద్ కమల్, నైపర్ రిజిస్ట్రార్ సత్యనారాయణ, కార్యక్రమ కన్వీనర్లు ఎల్.శ్రీనివాస్, నాగేంద్రబాబు, ఫార్మా విద్యార్థులు పాల్గొన్నారు. -
పునరావాస కేంద్రం వద్ద పేలుడు: నలుగురు మృతి
కోలంబియా మెడిల్లెన్ నగరంలో పునరావాస కేంద్రం వద్ద శనివారం బాంబు పేలుడు సంభవించింది.నలుగురు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆరుగురు పోలీసులు ఉన్నారు.బాంబు పేలుడును కోలంబియా పోలీసు డైరెక్టర్ ఖండించారు.ఆ పేలుడుకు బాధ్యులైన వారిపై సమాచారం అందిస్తే రూ.10 వేల అమెరికన్ డాలర్లు బహుమతిగా అందజేస్తామని ప్రకటించారు. పునరావాస కేంద్రం తలుపు వద్ద బాంబును ఉంచి సెల్ ఫోన్ ద్వారా పేలుడుకు పాల్పడ్డారని పోలీసు డైరెక్టర్ తెలిపారు. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని చెప్పారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే కోలంబియాలో డ్రగ్స్ బారిన పడిన వేలాది మంది ఆ పునరావాస కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. డ్రగ్స్ బారిన పడినవారికి చికిత్స అందించడంపై డ్రగ్స్ ముఠాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. దాంతో పేలుడుపై డ్రగ్స్ ముఠాల హస్తం ఉండవచ్చని తాము అనుమానిస్తున్నామని కోలంబియా పోలీసు డైరెక్టర్ వెల్లడించారు. ఆ కోణంలో దర్యాప్తు జరుగుతుందన్నారు. -
సునంద మృతికి కారణమిదేనా?
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతికి గల కారణాలను అన్వేషించే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సునంద ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు వెలువడగా, ఆమె మరణం ఆకస్మిక, అసజమైనదిగా వైద్యులు నిర్దారించడంతో పలు సందేహాలు తలెత్తాయి. కాగా అధిక మోతాదులో మందులు తీసుకోవడం వల్లే ఆమె మరణించి ఉంటారని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. పూర్తి స్థాయి వైద్య నివేదిక రెండు రోజుల్లో వెల్లడి కానుంది. సునంద మృతిపై శశిథరూర్‌ను సోమవారం పోలీసులు ప్రశ్నించనున్నారు. శనివారమే ఆయన్ను ప్రశ్నించాలని పోలీసులు భావించినప్పటికీ ఆయన కుటుంబం హరిద్వార్‌కు వెళ్లనుండటంతో వాయిదా వేసుకున్నారు. సునంద సోదరుడు, కుమారుడు, ఇద్దరు పనిమనుషుల వాంగ్మూలాన్ని నమోదు చేశారు. సునంద మృతదేహానికి ఎయిమ్స్ వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం అనంతరం లోథీ రోడ్డులోని శశిథరూర్ నివాసానికి మృతదేహాన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. సునంద పుష్కర్ శుక్రవారం రాత్రి ఢిల్లీలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా, ఈ కేసులో పలు సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు చేయించాలని బీజేపీ డిమాండ్ చేసింది. పాకిస్థాన్ మహిళా జర్నలిస్టుతో శశిథరూర్‌కు సంబంధాలున్నాయని సునంద ఆరోపించడం సంచలనం రేకెత్తించింది.