బెర్లిన్: కరోనా బాధితులకు యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పెద్దగా ఉపయోగం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. బాధితులకు ఈ ఔషధం పని చేస్తుందా లేదా అనే విషయం తెలుసుకునేందుకు నిర్వహించిన పరీక్షను ముగించినట్లు వెల్లడించింది. హైడ్రాక్సీక్లోరోక్విన్, లోపినవిర్/రిటోనవిర్ కాంబినేషన్ డ్రగ్‌ను హెచ్‌ఐవీ/ఎయిడ్స్ చికిత్సలో వాడుతున్నారు. ఈ కాంబినేషన్ డ్రగ్ కరోనాను నయం చేస్తుందని ప్రచారం కావడంతో దీనిపై డబ్ల్యూహెచ్‌వో పరీక్ష చేపట్టింది. ఈ కాంబినేషన్ డ్రగ్ కరోనా బాధితులకు ఉపయోగపడినట్లు ఆధారాలు లభించలేదని తెలిపింది. క్లోరోక్విన్ ఇచ్చినప్పటికీ బాధితుల్లో మరణాల రేటు తగ్గలేదంది.
Comments
Please login to add a commentAdd a comment