Hydroxychloroquine
-
ట్రంప్ నిర్ణయం; 293 మంది అమెరికన్ల మృతి
వాషింగ్టన్: కరోనా మహమ్మారికి హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మంచి జౌషధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా గట్టిగా వాదించారు. అంతేకాకుండా భారత్ నుంచి కూడా అధిక మొత్తంలో దానిని దిగుమతి చేసుకున్నారు. హైడ్రాక్సీ క్లోరోక్వీన్ వల్ల ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 293 మంది అమెరికన్లు చనిపోయారని ‘మిల్వాకీ జర్నల్ సెంటినెల్’ అధ్యయనంలో వెల్లడైంది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) వెల్లడించిన సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చనిపోయినవారి సంఖ్య ఆధారంగా ఈ అధ్యయం చేసింది. చాలా మంది వైద్యనిపుణులు హైడ్రాక్సీ క్లోరోక్వీన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయని హెచ్చరించారు. అయినప్పటికీ ట్రంప్ ఈ డ్రగ్స్ వాడటం వల్ల కోల్పోయేది ఏం ఉండదు అని ప్రకటించారు. దాంతో అందరూ వాడటం మొదలు పెట్టారు. సాధారణంగా మలేరియా చికిత్సలో వాడే ఈ మందును గుండె జబ్బులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉండే వారు ఉపయోగించరు. అయితే ట్రంప్ ఈ డ్రగ్‌ను వాడటానికి అనుమతినివ్వడంతో డాక్టర్లు కూడా తమ పేషెంట్‌కు ఈ మందును వాడొచ్చని చెప్పారు. దీంతో మార్చి నెలలో హైడ్రాక్సీ క్లోరోక్వీన్ వినియోగం ఒక్కసారిగా 2000 శాతం పెరిగింది. ఈ డ్రగ్ వాడటం వలన 2019లో 75 మంది చనిపోతే ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో అంతకు రెట్టింపు 293 మంది మరణించారు. హైడ్రాక్సీ క్లోరోక్వీన్ డ్రగ్ వల్ల ఇంకా చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. చదవండి: అమెరికా అధ్యక్షుడికి ఫేస్బుక్ షాక్ -
క్లోరోక్విన్‌తో ఉపయోగం లేదు: డబ్ల్యూహెచ్‌వో
బెర్లిన్: కరోనా బాధితులకు యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పెద్దగా ఉపయోగం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. బాధితులకు ఈ ఔషధం పని చేస్తుందా లేదా అనే విషయం తెలుసుకునేందుకు నిర్వహించిన పరీక్షను ముగించినట్లు వెల్లడించింది. హైడ్రాక్సీక్లోరోక్విన్, లోపినవిర్/రిటోనవిర్ కాంబినేషన్ డ్రగ్‌ను హెచ్ఐవీ/ఎయిడ్స్ చికిత్సలో వాడుతున్నారు. ఈ కాంబినేషన్ డ్రగ్ కరోనాను నయం చేస్తుందని ప్రచారం కావడంతో దీనిపై డబ్ల్యూహెచ్‌వో పరీక్ష చేపట్టింది. ఈ కాంబినేషన్ డ్రగ్ కరోనా బాధితులకు ఉపయోగపడినట్లు ఆధారాలు లభించలేదని తెలిపింది. క్లోరోక్విన్ ఇచ్చినప్పటికీ బాధితుల్లో మరణాల రేటు తగ్గలేదంది. -
కరోనాకు ఇందులో ఏది సరైన మందు?
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ బారిన పడి తీవ్రంగా బాధ పడుతున్న రోగులకు ‘డెక్సామెథాసోన్’ అనే స్టెరాయిడ్ బాగా పని చేస్తోందంటూ వార్తలు వెలువడిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ స్టెరాయిడ్ ఉత్పత్తిని పెంచాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. ప్రస్తుతం కరోనా రోగులపై ఈ స్టెరాయిడ్ ప్రయోగాలు బ్రిటన్‌లో కొనసాగుతున్నాయి. ప్రస్తుత స్టెరాయిడ్ పరీక్షల ఫలితాలు వెలుగులోకి వచ్చే వరకు కరోనా చికిత్సకు అందుబాటులో ఉన్న ఏకైక మందు ‘హైడ్రాక్సిక్లోరోక్విన్’ మాత్రమే అంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మలేరియాకు వాడే హైడ్రాక్సిక్లోరోక్విన్‌ను పెద్ద ఎత్తున అమెరికా, భారత్ నుంచి దిగుమతి చేసుకొంది. అసలు ఈ రెండు ఔషధాల్లో ఏదీ ఉత్తమమైనది? ఏదీ ప్రయోజనకరం? ఎంతమేరకు? కరోనా రోగులపై ‘హైడ్రాక్సిక్లోరోక్విన్’ నూటికి నూరు శాతం విజయవంతం అయినట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కరోనాతో తీవ్రంగా బాధ పడుతున్న రోగులపై జరిపిన ప్రయోగాల్లో ఈ మందు ఎలాంటి ప్రభావాన్ని చూపలేక పోయింది. అంటే పూర్తిగా విఫలమైంది. ఆ తర్వాత కరోనాతో స్వల్పంగా బాధ పడుతున్న రోగులపై ప్రయోగాలు జరిపారు. ఆ ప్రయోగాల వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే హైడ్రాక్సిక్లోరోక్విన్‌ను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిందిగా అంతకు ముందు జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకున్నట్లు జూన్ 15న అమెరికా ప్రకటించింది. అంతర్జాతీయ ట్రయల్స్ నుంచి దీన్ని ఉపసంహరిస్తూ జూన్ 17వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాలు జారీ చేసింది. డెక్సామెథాసోన్ అంటే ఏమిటీ? స్టెరాయిడ్‌గా పిలిచే ఈ మందు కృత్రిమ హర్మోన్. మనిషిలో కుడివైపు కిడ్నీకి ఎగువ భాగాన టోపీ ఆకారంలో అడ్రినల్ గ్రంధి ఉంటుంది. అనేక రకాల వైరస్‌లను ఎదుర్కొనేందుకు అడ్రినల్ గ్రంధి డెక్సామెథాసోన్ లాంటి సహజ సిద్ధమైన హార్మోన్‌ను విడుదల చేస్తోంది. ఈ గ్రంధి లేకుండా పుట్టే బిడ్డలు అర గంటలో మరణిస్తారు. ఆ హార్మోన్ కొందరిలో తక్కువగా విడుదలవుతుంది. వయస్సు రీత్యా కూడా ఉత్పత్తి తగ్గుతుంది. దాంతో సహజ సిద్ధంగా వైరస్‌లను ఎదుర్కోవడం కష్టమవుతుంది. ఇలాంటి అవసరాల్లోనే ఈ కృత్రిమ స్టెరాయిడ్ పుట్టుకొచ్చింది. వైరస్ల ఇన్ఫెక్షన్ల చికిత్స కోసం కొన్ని దశాబ్దాలుగా ఈ స్టెరాయిడ్‌ను వాడుతున్నారు. ట్యాబ్లెట్లు, ఆయింట్మెంట్, నరాల ఇంజెక్షన్ల రూపాల్లో ఈ మందు అందుబాటులో ఉంది. వెన్నుముఖ క్యాన్సర్లకు, కొన్ని రకాల టీబీలకు, మెదడు వాపుకు, ఆస్తమాలను నయం చేయడానికి, కీమో థెరపి చికిత్స వల్ల వాంతులు కాకుండా నివారించేందుకు ఈ స్టెరాయిడ్‌ను విరివిగా వాడుతున్నారు. ఏఆర్డీఎస్ చికిత్స కోసం దీన్ని వాడినప్పుడు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కరోనా చికిత్సపై ప్రభావం కరోనాపై డెక్సామెథాసోన్ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం నేడు బ్రిటన్‌లో ఎన్హెచ్ఎస్ ఆధ్వర్యంలోని 175 ఆస్పత్రుల్లో ప్రయోగాలు నడుస్తున్నాయి. తాము జరిపిన ప్రయోగాల్లో మంచి ఫలితాలు వచ్చాయంటూ ఇటీవల ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రకటించింది. వెంటిలేటర్ల ఉన్న కరోనా రోగులపై ఈ మందును ప్రయోగించగా, మూడింట ఒక వంతు మంది కోలుకున్నారని, అది వెంటిలేటర్‌పై లేకుండా ఉన్న రోగులపై ప్రయోగించగా ఐదింట రెండు వంతుల మంది కోలుకున్నారని తెలిపింది. వాస్తవానికి దీన్ని విజయం కింద పేర్కొనరు. వీటిని మిశ్రమ ఫలితాలుగానే చెబుతారు. ఎన్హెచ్ఎస్ ఆస్పత్రుల పరిశోధనల ఫలితాలు వెలువడితేనే ఓ స్పష్టత లభిస్తుంది. (కరోనా వ్యాక్సిన్‌పై ‘జాతీయవాదం’ తగదు) -
అత్యవసర పరిస్థితుల్లో రెమ్‌డెసివిర్
న్యూఢిల్లీ: కరోనా బాధితులకు చికిత్స అందించే విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ సవరించిన ‘క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ ఫర్ కోవిడ్–19’ను శనివారం విడుదల చేసింది. యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్‌ను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. అలాగే కరోనా ప్రాథమిక దశలోనే ఉంటే యాంటీ మలేరియల్ డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు వాడుకోవచ్చని తెలియజేసింది. తీవ్రత అధికంగా ఉన్న కేసుల్లో ఈ మాత్రలు వాడకపోవడమే మంచిదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఈ విషయంలో గతంలో జారీ చేసిన ప్రోటోకాల్‌లోని అంశాలను కేంద్ర ఆరోగ్యశాఖ తొలగించింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న కేసుల్లో హైడ్రాక్సీక్లోరోక్విన్‌తోపాటు అజిత్రోమైసిన్ ఇవ్వొచ్చని గతంలో సూచించిన సంగతి తెలిసిందే. వాసన, రుచి గ్రహణ శక్తిని కోల్పోవడం కరోనా లక్షణాలే దగ్గు, జ్వరం, అలసట, డయేరియా, గొంతు నొప్పి, శ్వాస పీల్చడంలో ఇబ్బందులతోపాటు వాసన, రుచిని గ్రహించే శక్తిని కోల్పోవడం కూడా కరోనా వైరస్ లక్షణాలేనని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. సవరించిన క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్‌లో ఈ అంశాన్ని చేర్చింది. -
నాలుగు వారాల్లో వైరస్‌కు మందులు!
సాక్షి, హైదరాబాద్: కరోనా చికిత్సకు ఇంకో నాలుగు వారాల్లో మందులు అందుబాటులోకి రానున్నాయా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. కరోనా చికిత్స కోసం రెమిడెస్విర్, ఫావిపిరావిర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లు ఉపయోగపడతాయని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) కొన్ని నెలల కిందటే గుర్తించింది. వీటిల్లో రెమిడెస్విర్, ఫావిపిరావిర్‌పై దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలైన సిప్లా, గ్లెన్‌మార్క్‌లు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాయి. ఈ మందులను ఉపయోగించిన 100 మంది రోగుల్లో కనీసం 60–70 శాతం మంది పరిస్థితి మెరుగు కాగా, మిగిలిన వారిలో పెద్దగా దుష్ఫలితాలు కనిపించలేదు. వైరస్ సోకిన తొలినాళ్లలో లేదా తేలికపాటి నుంచి ఓ మోస్తరు లక్షణాలు మాత్రమే ఉన్న రోగులకు ఫావిపిరావిర్, మధ్యమ స్థాయి నుంచి తీవ్ర లక్షణాలు ఉన్న వారికి రెమిడెస్విర్ వాడటం మంచిదన్న అంచనా బలపడింది. ఫావిపిరావిర్‌ను జపాన్‌లో సుమారు 70 వేల మంది రోగులకు అందించి సత్ఫలితాలు రాబట్టారని, రష్యాలోనూ దీని వాడకానికి అనుమతులు లభించాయని ఓ శాస్త్రవేత్త తెలిపారు. భారత్‌లో ఫావిపిరావిర్‌తో పాటు రెమిడెస్‌విర్‌పై ముందుగా 50 మందిపై ప్రయోగాలు జరిగాయని, ఆ తర్వాత దీన్ని 150కు పెంచారని గత నెల 24న ప్రయోగ ఫలితాలను డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాకు అందించడం పూర్తయిందని వివరించారు. ఈ రెండు మందులను ఇప్పటివరకు భారత ప్రజలు ఎప్పుడూ వాడని కారణంగా డ్రగ్ కంట్రోలర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారని, మరింత మంది భారతీయులకు ఈ మందులు ఇచ్చి ఫలితాల సమాచారం ఇవ్వాలని సూచిస్తోంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో త్వరలోనే అను మతులు లభించే అవకాశం ఉందని అంచనా. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో నెలలో 2 మందులకూ అనుమతులు లభించనున్నాయి. ఆ వెంటనే ఆయా కంపెనీలు మందులను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. సాధారణ ప్రజలకు ఈ మందులు ఇచ్చిన తర్వాత కూడా వాటి సమర్థత, దుష్ప్రభావాలపై పరీక్షలు జరుగుతాయి. అంతేకాకుండా.. రెండు కంపెనీలు ఉత్పత్తి చేసిన మందులు ఒకే రీతిగా ఉన్నాయా.. లేదా అన్న దానిపై తుది అనుమతుల జారీ ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే ఆలస్యం.. నిజానికి కరోనా చికిత్సకు మందులు అభివృద్ధి చేసేందుకు భారత్ అందరి కంటే ముందుగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇతర వ్యాధుల కోసం అభివృద్ధి చేసి.. అర్ధంతరంగా ప్రయోగాలను నిలిపేసిన వందలాది మందులను హైదరాబాద్‌లోని ఐఐసీటీ స్క్రీన్ చేసి పని చేస్తాయనుకున్న మూడింటిని వేరు చేసింది. ఎబోలా వైరస్ కోసం అమెరికన్ కంపెనీ గిలియాడ్ అభివృద్ధి చేసిన రెమిడెస్విర్, సాధారణ జలుబు కోసం జపనీస్ కంపెనీ తయారు చేసిన ఫావిపిరావిర్‌తో పాటు మలేరియా చికిత్సకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లు కరోనా చికిత్సకూ ఉపయోగపడతాయని ఐఐసీటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ సమయంలోనే సిప్లా ఓ అడుగు ముందుకేసి ఆ మందులను తయారు చేసి ఇస్తే తాము వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేస్తామని ఫార్మా కంపెనీ సిప్లా ముందుకొచ్చింది. అయితే మానవ ప్రయోగాల దశకు చేరుకునేటప్పటికి వివిధ కారణాల వల్ల ప్రాజెక్టు ఆలస్యమైంది. భారత్‌లోని రోగులపై ప్రయోగించడం ద్వారా మాత్రమే వాటి పనితీరును మదింపు చేయాలని డ్రగ్ కంట్రోలర్ నిర్ణయించడం దీనికి ఒక కారణం. ఇందుకు తగ్గట్టుగా సిప్లాతోపాటు గ్లెన్‌మార్క్ కూడా మొత్తం ఏడు ఆసుపత్రులతో ఒప్పందాలు చేసుకున్నాయి. అయితే కరోనా రోగులతో వైద్యులు క్షణం తీరికలేని పరిస్థితులు ఏర్పడటం.. ఈ మందులను రోగులకు ఇచ్చి వాటి ఫలితాలను, సమాచారాన్ని నమోదు చేసే అవకాశం లేకపోవడంతో ఆలస్యమైంది. కొత్త మందులను ఉపయోగించేందుకు రోగులు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. చివరకు రెండు కంపెనీలు వేర్వేరుగా నిర్వహించిన ప్రయోగాల సమాచారాన్ని జోడించి డ్రగ్ కంట్రోలర్‌కు అందించారు. డ్రగ్ కంట్రోలర్ ఈ సమాచారాన్ని విశ్లేషించి అనుమతులిస్తే కరోనాపై పోరులో కొత్త అధ్యాయం మొదలైనట్లే. -
‘క్లోరోక్విన్’కు డబ్ల్యూహెచ్ఓ అనుమతి
లండన్: కోవిడ్-19 చికిత్సకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను వినియోగించే దిశగా జరిగే క్లినికల్ ట్రయల్స్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అనుమతినిచ్చింది. గతంలో ఈ క్లినికల్ ట్రయల్స్‌ను డబ్ల్యూహెచ్ఓ అనుమతించలేదు. ఈ ఔషధానికి సంబంధించిన సేఫ్టీ డేటాను నిపుణులు పరిశీలించారని, ఆ తరువాతే క్లినికల్ ట్రయల్స్‌ను కొనసాగించేందుకు అనుమతిస్తున్నామని బుధవారం డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఘెబ్రియెసస్ తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ అనుమతినివ్వడం అంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం కోసం ఎన్రోల్ అయి ఉన్న రోగులకు డాక్టర్లు హైడ్రాక్సీ క్లోరొక్విన్‌ను ప్రయోగాత్మకంగా ఇవ్వవచ్చు. (ఏడాది చివరిలో వ్యాక్సిన్: పరిశోధకులు) వారంలో భారత్‌కు అమెరికా వెంటిలేటర్లు వాషింగ్టన్: అమెరికా విరాళంగా ఇస్తానని ప్రకటించిన వెంటిలేటర్లలో 100 వెంటిలేటర్లను వచ్చేవారం భారత్‌కి పంపనున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీకి చెప్పారు. జీ–7 శిఖరాగ్ర సమావేశాలకు హాజరుకావాలంటూ మోదీకి ట్రంప్ ఆహ్వనం పలికారు. గతహామీ ప్రకారం తొలిదశలో 100 వెంటిలేటర్లను భారత్‌కు పంపుతున్నామని ట్రంప్ చెప్పారు. ట్రంప్‌తో జీ7 సమావేశాల ప్రణాళిక గురించీ, కోవిడ్ సంక్షోభంతో సహా అనేక ఇతర అంశాలపై ప్రధాని మోదీ మాట్లాడినట్లు ట్వీట్ చేశారు. అమెరికాలో నల్లజాతీయుల ఆందోళనల విషయాన్ని ట్రంప్‌తో మోదీ ప్రస్తావించినట్టు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఇండోచైనా బోర్డర్ సమస్యపైనా చర్చించారు. (‘2 మీటర్ల భౌతిక దూరం తప్పనిసరి’) -
పోలీస్‌కు ‘క్లోరోక్విన్’
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు విభాగంలో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతుండటంతో ఉన్నతాధికారులు మేల్కొన్నారు. ప్రాధాన్యత క్రమంలో అధికారులు, సిబ్బందికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందులు సరఫరా చేస్తున్నారు. సిటీలో ఉన్న పోలీసు క్లినిక్స్ ద్వారా, వైద్యుల పర్యవేక్షణలో వీటిని సిబ్బందికి అందిస్తున్నారు. లాక్డౌన్ అమలులోకి వచ్చిన నాటి నుంచి పోలీసు అధికారులు అనునిత్యం విధులకు అంకితమయ్యారు. దీంతో అనేక మంది లక్షణాలు బయటపడని ‘పాజిటివ్ వ్యక్తులతో’ కాంటాక్ట్‌లోకి వెళ్లి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో పాటు గాంధీ ఆసుపత్రి వద్ద విధులు నిర్వర్తించిన సిబ్బందితో పాటు కోవిడ్ హాట్‌స్పాట్స్‌గా మారిన ప్రాంతాల్లో నివసించే, అక్కడ పని చేసిన వారు, కంటైన్మెంట్ జోన్లలో డ్యూటీలకు హాజరైన వారికి ఈ ముప్పు ఎక్కువగా ఉందని పోలీసు విభాగం గుర్తించింది. ఒకదాని తర్వాత ఒకటి చొప్పున వరుసగా వెలుగులోకి వస్తున్న పాజిటివ్ కేసులు ఈ విషయాన్ని నిర్థారించాయి. దీంతో పోలీసు ఉన్నతాధికారులు వైద్య ఆరోగ్య శాఖను సంప్రదించారు. పూర్వాపరాలు పరిశీలించిన ఆ శాఖ అ«ధికారులు పోలీసు సిబ్బందికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు సరఫరాకు అనుమతి ఇచ్చింది. నగర పోలీసు విభాగానికి మూడు క్లినిక్స్ ఉన్నాయి. బేగంపేట పోలీసు లైన్స్, పేట్ల బురుజులోని సీఏఆర్ హెడ్–క్వార్టర్స్, అంబర్‌పేట పోలీసు లైన్స్ ప్రాంగణాల్లో ఇవి పని చేస్తున్నాయి. వీటి ద్వారానే పోలీసు సిబ్బందికి ఈ మందులు సరఫరా చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. గాంధీ ఆసుపత్రి, హాట్‌స్పాట్స్, కంటైన్మెంట్ జోన్స్, చెక్‌పోస్టులు, క్షేత్రస్థాయిలో, కార్యాలయాల్లో...ఇలా ఆయా ప్రాంతాల్లో పని చేసిన వాళ్లను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో అందిస్తున్నారు. శాంతిభద్రతల విభాగం, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్, సీసీఎస్, సిటీ సెక్యూరిటీ వింగ్ తదితర విభాగాలకు చెందిన సిబ్బంది, అధికారుల జాబితాలు సిద్ధమయ్యాయి. ప్రతి రోజూ ఒక్కో విభాగం నుంచి కొందరిని ఎంపిక చేస్తున్న అధికారులు వారిని ఈ మూడు క్లినిక్స్‌లో అనువైన దానికి పంపిస్తున్నారు. అక్కడ ఉంటున్న వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి, వారి మెడికల్ హిస్టరీని పరిశీలించి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు ఇస్తున్నారు. దీన్ని ఎలా వినియోగించాలి? ఆ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలను వైద్యులు సిబ్బందికి వివరిస్తున్నారు. వయసు ఎక్కువ, ఊబకాయం, కొన్ని రుగ్మతలు కలిగి ఉండటం వంటి కేసుల్లో ఈసీజీ వంటి పరీక్షలకు సిఫార్సు చేస్తున్నారు. ఈ నివేదిక వచ్చిన తర్వాతే ఈ మందు అందిస్తున్నారు. వ్యక్తిగత జాగ్రత్తలు, భౌతిక దూరం తదితర అంశాల పైనా పోలీసుస్టేషన్ల వారిగా అవగాహన కల్పిస్తున్నారు. -
క్లోరోక్విన్‌తో దుష్ప్రభావాల్లేవు
న్యూఢిల్లీ: హైడ్రాక్సిక్లోరోక్విన్(హెచ్‌సీక్యూ) ఔషధం వాడకంతో పెద్దగా దుష్ప్రభావాలేవీ లేవనీ, కోవిడ్–19 నివారణ, చికిత్సలో దీని వాడకం కొనసాగించాలని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) స్పష్టం చేసింది. కోవిడ్–19 రోగుల భద్రత దృష్ట్యా హెచ్‌సీక్యూను ప్రయోగాత్మకంగా వాడటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిర్ణయించిన నేపథ్యంలో ఐసీఎంఆర్ ఈ మేరకు పేర్కొంది. ‘హెచ్‌సీక్యూ వాడకంతో కొద్దిపాటి వికారం, వాంతులు, గుండెదడ తప్ప మరే ఇతర తీవ్ర దుష్ప్రభావాలు మా అధ్యయనంలో కనిపించలేదు. అందుకే, కోవిడ్–19 నివారణకు దీనిని వాడవచ్చని సిఫారసు చేస్తున్నాం’ అని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు. ‘కోవిడ్–19 చికిత్సకు ఏ ఔషధం పనిచేస్తుంది? ఏది పనిచేయదు? అనేది ఇంకా రుజువు కాలేదు. ఖాళీ కడుపుతో కాకుండా ఆహారంతోపాటే హెచ్‌సీక్యూను తీసుకోవాలి. దీంతో చికిత్స సమయంలో ఈసీజీ పరీక్ష జరపాలి. హెచ్‌సీక్యూ వాడకంతో ఉన్న లాభాల దృష్ట్యా ఆరోగ్య కార్యకర్తలు, ఇతర వైద్య సిబ్బందికీ ఇవ్వాలని నిర్ణయించాం’ అని భార్గవ తెలిపారు. ప్రతి రోజూ లక్షకు పైగా కోవిడ్ పరీక్షలు జరిపే స్థాయికి చేరుకున్నామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు 31,26,119 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఆంక్షల సడలింపే ఆజ్యం పోసింది దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పైపైకి ఎగబాకుతుండటానికి ముఖ్య కారణం ప్రయాణ ఆంక్షల సడలింపేనని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, హాట్స్పాట్లున్న ప్రాంతాల నుంచే కోవిడ్–19 కేసులు బయటపడుతున్నాయని తెలిపారు. ‘సడలించిన ప్రయాణ ఆంక్షలు, వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్తుండటం వల్ల కూడా రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వలస కార్మికులు తిరిగి వచ్చిన ప్రాంతాల్లో ఈ వ్యాధి వ్యాపించే ప్రమాదముంది. ఇలాంటి చోట్ల పర్యవేక్షణ, నిఘా మరింతగా పెరగాలి. జనం ఇళ్లు వదిలి బయటకు వచ్చినప్పుడు భౌతిక దూరం, పరిశుభ్రత పాటించాలి. లేకుంటే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది’ అని తెలిపారు. 24 గంటల్లో 6,500 కేసులు దేశంలో కోవిడ్–19 మహమ్మారితో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,167కు చేరుకోగా, మొత్తం కేసులు 1,45,380కు పెరిగాయి. 24 గంటల్లోనే 146 మంది చనిపోగా 6,535 కేసులు వెలుగులోకి వచ్చాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా, యాక్టివ్ కేసులు 80,722 కాగా, ఇప్పటి వరకు 60,490 మంది బాధితులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపింది. దీంతో రికవరీ రేటు 41.61%గా ఉన్నట్లు వివరించింది. అదేవిధంగా, మృతుల రేటు ఏప్రిల్ 15న 3.3 శాతం ఉండగా ప్రస్తుతం 2.87 శాతానికి తగ్గిందని తెలిపింది. -
కోవిడ్-19 : పరిశీలనలో అతి చవకైన మందు
సాక్షి, చెన్నై: కరోనా వైరస్ వల్ల సంభవించే మరణాలను నిరోధించగలిగే అతి చవకైన మందును ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ట్రయల్స్ కోసం పరిశీలించనుంది. కరోనా బాధితుల మరణాలకు కారణంగా భావిస్తున్న సైటోకిన్ ఉధృతిని ఎదుర్కొనేందుకు యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఔషధం ఇండోమెథాసిన్ ఉపయోగపడుతుందని చెన్నైకి చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ రాజన్ రవిచంద్రన్ తాజాగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్రయల్స్ కోసం తన ప్రతిపాదనలను ఐసీఎంఆర్ తోపాటు, అమెరికా, కెనడా దేశాలకు ఏప్రిల్ 29 న పంపించారు. దీనిపై స్పందించిన యూకే విభాగం వీటిని తమ చికిత్సా టాస్క్ ఫోర్స్ కు పంపించినట్టు తెలిపింది. కిడ్నీ మార్పిడి రోగుల్లో సైటోకిన్ తీవ్ర ప్రభావాన్ని ఆపడానికి ఇండోమెథాసిన్ ఉపయోగించిసఫలమైనట్టు కిడ్నీ మార్పిడి సర్జన్ రవి చంద్రన్ తెలిపారు. కోవిడ్-19 బాధితులపై దీనిని ఔషధంగా ఉపయోగించవచ్చని డాక్టర్ రవిచంద్రన్ సూచించారు. అయితే ఆశాజనక ఫలితాలకు పెద్ద ఎత్తున నిర్వహించే మెడికల్ ట్రయిల్స్ కీలకమన్నారు. ఇండోమెథాసిన్ క్యాప్సూల్ ధర కేవలం రూ. 5 మాత్రమే. మరోవైపు కోవిడ్-19 రోగుల్లో ఇప్పుడు ఉపయోగించే టోసిలిజుమాబ్ ఒక మోతాదు ధర రూ. 60 వేలు ఖర్చు అవుతుంది. (హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్రయల్స్‌పై తాత్కలిక నిషేధం: డబ్ల్యూహెచ్ఓ) ఇలాంటి 185 ప్రతిపాదనలు తమ దృష్టికి వచ్చినట్టు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం బయోటెక్నాలజీ విభాగంలోని నిపుణులు, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ అనాలిసిస్ తో కలిసి ఐసీఎంఆర్ ఒకదాని తరువాత మరొక ప్రతిపాదనను పరిశీలిస్తోందన్నారు. మరోవైపు హైడ్రాక్సిక్లోరోక్విన్ కంటే ఇండోమెథాసిన్ సమర్ధవంతంగా పనిచేస్తోందని బ్రూక్లిన్‌లోని ఒక ప్రధాన వైద్యుడు డాక్టర్ జోనాథన్ లీబోవిట్జ్ ప్రకటించారు. దాదాపు 60 మంది కరోనా రోగుల్లో సాధారణంగా కంటే ఎక్కువగా ఇది సమర్థవంతంగా పనిచేసినట్టు తెలిపారు. అలాగే ఈ ఔఫధానికి కావాల్సిన ప్రాముఖ్యతనివ్వడం లేదని కూడా పేర్కొన్నారు. నిర్మాణాత్మక ప్రభావాన్ని కలిగి ఉన్నట్లు కనిపిస్తోందనీ, కానీ దీనిపై అదనపు పరిశోధనలు అవసరమని ఆయన సూచించారు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ నివారణకు యాంటి మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ పనిచేస్తుందని..తాను వాడి చూశానని ప్రకటించగా, హైడ్రాక్సీక్లోరోక్విన్ క్లినికల్ ట్రయల్స్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది. -
హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్రయల్స్‌పై నిషేధం
వాషింగ్టన్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సోమవారం కీలక ప్రకటన చేసింది. కరోనా కట్టడి కోసం వినియోగిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్ క్లినికల్ ట్రయల్స్‌ను తాత్కలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ డ్రగ్ వాడకం వల్ల కోవిడ్-19 రోగుల చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉందంటూ లాన్సెట్ నివేదిక వెల్లడించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ వర్చువల్ విలేకరుల సమావేశంలో చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కట్టడి కోసం ఈ యాంటీ మలేరియా డ్రగ్‌ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. సాలిడారిటీ ట్రయల్ అని పిలవబడే ఎగ్జిక్యూటివ్ గ్రూప్‌లో అనేక దేశాల్లోని వందలాది ఆస్పత్రులు కరోనా పేషంట్లను చేర్చుకుని వారి మీద రకరకాల ప్రయోగాలు జరుపుతున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా వీరికి హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్‌ను వాడుతున్నారు. (హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై యూఎస్ హెచ్చరిక) ఈ నేపథ్యంలో సేఫ్టీ మానిటరింగ్ బోర్డు భద్రతా డాటాను సమీక్షించే వరకు సాలిడారిటీ ట్రయల్స్‌లో కరోనా రోగుల మీద క్లోరోక్విన్ డ్రగ్ వాడకాన్ని తాత్కలికంగా నిలిపివేయనున్నట్లు టెడ్రోస్ ప్రకటించారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ సాధారణంగా ఆర్థరైటిస్‌కు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. కాని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా పలువురు ప్రముఖులు ఈ ఔషధాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. గత వారం బ్రెజీల్ ఆరోగ్యమంత్రి ఒకరు తేలికపాటి కోవిడ్-19 కేసులకు చికిత్స చేయడానికి హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పాటు యాంటీ మలేరియా క్లోరోక్విన్‌ను ఉపయోగించాలని సిఫారసు చేశారు. అయితే ఈ రెండు మందుల వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు, ముఖ్యంగా హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని లాన్సెట్ అధ్యయనం హెచ్చరించింది.(మలేరియా మందు భేష్!) -
‘ట్రంప్.. కుక్క విసర్జన పూసుకుని తిరిగే పిల్లవాడు’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పీకర్ నాన్సీ పెలోసిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ట్రంప్‌పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు పెలోసి. ట్రంప్ తన షూస్‌కు కుక్కల విసర్జన పూసుకుని తిరిగేవాడంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. కొద్ది రోజుల క్రితం ట్రంప్ ఎమ్‌ఎస్‌ఎన్‌బీసీ టెలివిజన్ హోస్ట్ జియో స్కార్బరో గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతడిని సైకో అంటూ ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. దీని గురించి మీడియా ప్రతినిధిలు పెలోసిని ప్రశ్నించగా.. ‘అధ్యక్షుడు.. షూస్‌కు కుక్క విసర్జన పూసుకుని తిరిగే పిల్లాడిలాంటి వారు అంటూ మండిపడ్డారు. తనతో పాటు పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ దీన్ని పూస్తాడని అన్నారు. ఆ కుక్క విసర్జనను ఒకసారి పూసుకుంటే అది చాలా కాలం పాటు అలానే ఉంటుంది’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు పెలోసి. (ట్రంప్ - పెలోసీల మధ్య వార్ షురూ..!) అధ్యక్షుని తర్వాత హోదాలో ఉపాధ్యక్షుని తర్వాతి స్థానంలో ఉన్న నాన్సీ పెలోసి డెమొక్రాటిక్ పార్టీకి చెందినవారు. ఆమెకు, అధ్యక్షుడు ట్రంప్‌కు అస్సలు పడటంలేదు. గత ఏడు నెలలుగా ఇద్దరూ కనీసం ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. కానీ మాటల యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. వైద్యశాస్త్రపరంగా రుజువుకాని హైడ్రాక్సీక్లోరోక్విన్ వేసుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటించిన తర్వాత పెలోసి ఆయన ఊబకాయాన్ని ఎత్తిచూపారు. తానైతే అధ్యక్షునికి అలాంటి మందులు సూచించనని అన్నారు. దీనిపై ట్రంప్ తనదైన శైలిలో వ్యక్తిగత విమర్శలకు దిగారు. ‘పెలోసి ఒక రోగిష్టి మహిళ అని.. ఆమెకు చాలా సమస్యలు ఉన్నాయి.. పలు మానసిక సమస్యలతో ఆమె బాధపడుతున్నారు’ అంటూ విమర్శించారు. ఈ క్రమంలో ప్రస్తుతం పెలోసి వ్యాఖ్యలపై ట్రంప్ ఎలా స్పందిస్తారో.. ఈ మాటల యుద్ధం ఎక్కడి దాకా తీసుకెళ్తుందో చూడాలి.(రోజూ హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకుంటున్నా: ట్రంప్) -
మలేరియా మందు భేష్!
వాషింగ్టన్: కరోనా వైరస్ నుంచి రక్షణ కోసం మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకోవడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. రెండు వారాలుగా తాను ఈ మందును తీసుకుంటున్నట్లు ట్రంప్ సోమవారం చెప్పడం తెల్సిందే. మరికొంత కాలం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తీసుకుంటానని, అది సురక్షితమైందని కరోనా వైరస్ ఎదుర్కొనే మేలైన మార్గమని మంగళవారం ఆయన పునరుద్ఘాటించారు. ‘అది చాలా శక్తిమంతమైన మందు. మీకు హాని కలిగించదు. కాబట్టి దాన్ని కరోనా చికిత్సకు వాడాలని అనుకున్నా’ అని విలేకరులతో చెప్పారు. (హెచ్1బీతో అమెరికన్లకు నష్టం లేదు!) ప్రపంచవ్యాప్తంగా చాలామంది వైద్యులు ఈ మందును ప్రశంసించారని, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ తదితర దేశాల్లో గొప్ప అధ్యయనాలు జరిగాయని అమెరికాలోనూ పలువురు వైద్యులు ఈ మందుపై సానుకూలంగా వ్యవహరించారని ట్రంప్ వివరించారు. మరణం ముంగిట్లో ఉన్నవారికి ఈ మందు ఇచ్చి అది పనిచేయలేదని కొంతమంది ఒక అధ్యయనం ద్వారా చెప్పారని వాళ్లు తమ శ్రేయోభిలాషులు కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. (ప్రపంచంపై కరోనా పంజా) మలేరియా చికిత్సకు ఈ మందును నలభై ఏళ్లుగా వాడుతున్నారని కానీ వైద్యుల సలహా మేరకు వాడేందుకు ఎఫ్‌డీఏ అనుమతిచ్చిందని ఆయన వివరించారు. కాబట్టి వైద్యుల సలహా మేరకే ఎవరైనా ఆ మందును వాడాలని చెప్పారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ట్రంప్ శాస్త్రీయంగా నిరూపణ కాని ఓ మందును కరోనా చికిత్సకు వాడటాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటలు విని ఎవరైనా ఈ మందును వాడితే ఎలా? అని సెనేట్ మైనారిటీ నేత చక్ షుమర్ ప్రశ్నించారు. చైనాతో ఒప్పందంపై భిన్నాభిప్రాయం చైనాతో వాణిజ్యానికి సంబంధించి ఈ ఏడాది జనవరిలో చేసుకున్న ఒప్పందంపై తనకు ఇప్పుడు భిన్నాభిప్రాయం ఉందని అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది జనవరిలో కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రకారం 2020 –21లో అమెరికా ఉత్పత్తులను ఎక్కువగా కొనుగోలుచేసేందుకు చైనా అంగీకరించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తిని చైనా అడ్డుకోలేకపోయిందని వూహాన్‌కు మాత్రమే వైరస్‌ను పరిమితం చేసిన చైనా ఇతర దేశాలకు చేరకుండా ఎందుకు అడ్డుకోలేకపోయిందన్నది తెలియడం లేదని అన్నారు. -
రోజూ హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకుంటున్నా: ట్రంప్
వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) నుంచి తనను తాను రక్షించుకోవడానికి యాంటీ మాలేరియా డ్రగ్ తీసుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. పదిరోజులుగా హైడాక్సీక్లోరోక్విన్, జింక్ సంప్లిమెంట్ తీసుకుంటున్నానని సోమవారం విలేకరులతో పేర్కొన్నారు. కాగా కరోనా పేషెంట్లకు ఉపశమనం కలిగించడంలో హైడ్రాక్సీక్లోరోక్విన్ సత్ఫలితాలను ఇస్తుందన్న వార్తల నేపథ్యంలో తమకు ఈ డ్రగ్‌ను ఎగుమతి చేయాల్సిందిగా ట్రంప్ భారత్‌ను కోరిన విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజుల క్రితం ఈ ఔషధం కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో అంతగా ప్రభావం చూపడం లేదని, పైపెచ్చు దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని ట్రంప్ యంత్రాంగంలోని పలువురు వైద్య నిపుణులు హెచ్చరించారు. (ఒబామాపై విమర్శలు గుప్పించిన ట్రంప్) ఈ క్రమంలో ట్రంప్ సైతం అదే బాటలో నడిచారు. హైడ్రాక్సీక్లోరోక్వీన్ పరమౌషధమని తొలుత చెప్పుకొచ్చిన ట్రంప్ ఆ తర్వాత అతినీలలోహిత కిరణాలు కోవిడ్-19 చికిత్సకు ఉపకరిస్తాయంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనంతరం రెమిడిసివిర్ మందు కరోనా చికిత్సకు ప్రభావవంతంగా పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. ఇక తాజాగా శ్వేతసౌధంలోని పలువురు సిబ్బందికి కరోనా సోకిందని తేలిన నేపథ్యంలో తాను హైడ్రాక్వీక్లోరోక్విన్ వాడుతున్నానంటూ ట్రంప్ ప్రకటించడం విశేషం. అయితే ఈ ఔషధాన్ని వాడమని తన వ్యక్తిగత వైద్యులు సూచించలేదని, వైట్‌హౌజ్ ఫిజీషియన్ ద్వారా దీనిని తెప్పించుకున్నానని పేర్కొన్నారు. (భారతీయులు భళా: ట్రంప్) ఈ డ్రగ్ బాగా పనిచేస్తుందని తాను భావిస్తున్నానని... దీని వల్ల ఎంతో మంది కోవిడ్ నుంచి కోలుకున్న స్ఫూర్తివంతమైన కథలు తాను విన్నానంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా అని విలేకరులు ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని.. తాను బాగానే ఉన్నా కదా అంటూ వారిని ఎదురు ప్రశ్నించారు. కాగా కరోనా విస్తృతమైన నేపథ్యంలోనూ తాను మాస్కు ధరించనంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక కరోనా సాధారణ ఫ్లూ వంటిదేనని.. దీని గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఇక లక్షలాది మంది కరోనా బారిన పడుతున్న తరుణంలోనే తిరిగి ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించి లాక్డౌన్ నిబంధనలు సడలించారు. (ఆంటొని చాలా మంచివారు.. కానీ: ట్రంప్) -
హైడ్రాక్సీ క్లోరోక్విన్ నీడలో కరోనా యోధులు!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణలో పాలుపంచుకుంటున్న వారందరికీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హై డ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను సరఫరా చేసింది. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు, వైరస్‌ను అడ్డుకుంటుం ది. ఆ ప్రకారం రాష్ట్రంలో వైరస్ నియంత్రణ కోసం పనిచేస్తున్న కరోనా యోధులైన ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, డాక్టర్లు, నర్సులు ఇతర వైద్య సిబ్బందికి అందజేశారు. అలాగే పోలీసులు, పురపాలక సిబ్బంది, ఇతర శాఖలకు చెందిన కరోనా విధుల్లో ఉన్న వారికి కూడా ఇచ్చారు. నిర్ణీ త డోసుల్లో విడతల వారీగా ఈ మాత్రలు వేసుకున్నప్పటి నుంచి 3 నెలల వరకు దీని ప్రభావం ఉంటుందని, వైరస్‌ను దరిచేరనివ్వదని, సిబ్బందిని కాపాడుతుందని వైద్యాధికారులు అంటున్నారు. 49,503 మంది వైద్య సిబ్బంది: వైద్య ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం అన్ని జిల్లాల్లో వైద్య సిబ్బంది మొత్తం కలిపి 49,503 మంది కరోనా నియంత్రణలో పాలుపంచుకుం టున్నారు. వారిలో ఆశ కార్యకర్తలు 27,045 మందికి, ఏఎ న్‌ఎంలు 8,647 మందికి, ఆరోగ్య కార్యకర్తలు, సూపర్ వైజర్ కేటగిరీలోని 2,026 మందికి, స్టాఫ్ నర్సులు 2,140 మందికి, ల్యాబ్ టెక్నీషియన్లు 887 మందికి, మరో 887 ఫార్మాసిస్టులకు, ఇతరత్రా సహాయక సిబ్బంది 1,174 మందికి, మెడికల్ ఆఫీసర్లు 1,097 మందికి ఈ మాత్రలను అన్ని జిల్లాల్లో అందజేశారు. వీరుగాక ఇతర శాఖలకు (లైన్ డిపార్ట్మెంట్ స్టాఫ్) చెందిన కరోనా నియంత్రణలో పాల్గొంటున్న 2,24,500 మంది సిబ్బందికి కూడా అందజేశారు. అలాగే రాష్ట్రస్థాయిలో 34 వివిధ శాఖల కార్యాలయాలకు చెందిన 20 వేల మంది సిబ్బంది కూడా ఉన్నారు. వీరందరికీ కలిపి వివిధ డోసులకు చెందిన 73,98,072 హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను ఇప్పటివరకు సరఫరా చేశారు. ఈ మాత్రలు 400 ఎంజీ, 200 ఎంజీ డోసుల్లో ఉంటాయి. వాటిలో ఎక్కువగా 200 ఎంజీ మాత్రలను అందజేశారు. ఈ మాత్రలను రాష్ట్రస్థాయిలో ఉన్నత స్థానాల్లో ఉన్న వివిధ శాఖల కీలకాధికారులు కూడా వాడినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. వైద్య ఆరోగ్యశాఖలోని అధికారులు, వైద్యులు కూడా వీటిని వాడారని అధికారులు వెల్లడించారు. కరోనా కాంటాక్టులకు వాడకం: ఇక హైడ్రాక్సిక్లోరోక్విన్ మాత్రలను పాజిటివ్ వచ్చిన రోగులకు, వారి కాంటాక్టులకు, వారి కుటుంబాల్లోని వ్యక్తులకు కూడా వాడారు. 60 వేల మందికి ఈ మాత్రలు ఇచ్చినట్లు చెబుతున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ లేవు..: ఈ మాత్రలు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉం డవని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను కొన్ని జబ్బుల్లో నిత్యం వాడేవారు కూడా ఉన్నారు. వారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. మేమంతా వాడుతున్నాం. మాకేమీ కాలేదు. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నది తప్పు’అని ఆయన అన్నారు. వాస్తవంగా కరోనా వైరస్ పాజిటివ్ కాంటాక్టుల నుంచి సామూహిక వ్యాప్తి జరగకపోవడానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ చాలావరకు ఉపయోగపడిందని ఆయన పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన వారు వాడితే మంచిదేనని, ఈ మాత్రలకు ఇప్పటికీ కొరత లేదని ఆయన వివరించారు. -
హైడ్రాక్సీక్లోరోక్విన్ తయారీకి వేగంగా అనుమతులు
సాక్షి,హైదరాబాద్: ప్రస్తుతం వైద్య, ఆరోగ్యపరంగా ఏర్పడిన అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్, ప్రాణాలను కాపాడే ఇతర బల్క్ డ్రగ్స్, తదితర మందుల తయారీకి అవసరమైన అనుమతులు వేగంగా ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) వెల్లడించింది. ఈ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యమైందిగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఈ మందులను ఇతర దేశాలకు ఎగుమతి, ఇతరత్రా అవసరాల నిమిత్తం తయారు చేయనున్నందున దీన్ని ప్రజా ప్రయోజనంగా పరిగణిస్తూ ప్రస్తుత బల్క్‌డ్రగ్స్/ డ్రగ్ ఇంటర్మీడియట్ మాన్యుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్ తమ ప్రతిపాదనలను cee-tspcb@telangana.gov. in/tspcbseeunit2@gmail.com ఈ–మెయిల్ ఐడీలకు పంపాలని పీసీబీ సభ్య కార్యదర్శి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రతిపాదనలతో పాటు తాము ఉత్పత్తి చేసే మందుల మార్పు, కంపారెటివ్ పొల్యూషన్ లోడ్స్ స్టేట్మెంట్, ఈ ప్రతిపాదిత ఉత్పత్తులకు మెటీరియల్ బ్యాలెన్స్, ఎన్విరాన్మెంట్ ఆడిటర్ సర్టిఫికెట్‌ను జతచేయాలని సూచించారు. కరోనా చికిత్సకు సంబంధించి బల్క్‌డ్రగ్స్/ లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌ను ఉత్పత్తి చేసే ఇంటర్మీడియట్ ఇండస్ట్రీస్/ ఇంటర్మీడియెట్స్ ప్రతిపాదనలను ప్రాధాన్యతతో పరిశీలించి, వేగంగా క్లియరెన్స్‌లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ మందులను కరోనా నియంత్రణకు ఉపయోగించేందుకు కేంద్రం అనుమతినిచ్చిన నేపథ్యంలో ప్రపంచస్థాయిలో వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వీటి తయారీకి రాష్ట్రంలోని కొన్ని బల్స్డ్రగ్స్/ డ్రగ్ ఇంటర్మీడియట్ మాన్యుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చినట్లు పేర్కొన్నారు. -
హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై యూఎస్ హెచ్చరిక
వాషింగ్టన్ : యాంటీ మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కీలక ప్రకటన చేసింది. కరోనా రోగులకు ఈ ఔషధాన్ని ఉపయోగిస్తే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. కరోనాను హైడ్రాక్సీ క్లోరోక్విన్ నియంత్రిస్తుందనే దానిపై సరైన ప్రయోగం జరగలేదని, దీనిని ఎక్కువగా వాడటం మూలంగా ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని ఎఫ్‌డీఏ అభిప్రాయడింది. అంతేకాకుండా హృదయ సంబంధిత వ్యాధులు కూడా సంక్రమించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకే ఎఫ్‌డీఏ చీఫ్ ఎమ్. స్టీఫెన్ ఓ ప్రకటక విడుదల చేశారు. అమెరికాలో వైరస్ సోకిన వారికి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు. కరోనా సోకిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి స్థానిక వైద్యులే అతనికి తగిన ఔషధాన్ని వాడాలని ఆయన సూచించారు. వైరస్ నియంత్రణకు మందును కనిపెట్టే ప్రయోగాలు వేగవతంగా జరుగుతున్నాయన్నారు. కాగా ప్రమాదకర కరోనా వైరస్‌కు ఇంతవరకు మందులేని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైరస్ నుంచి రోగిని కాపాడేందుకు మలేరియా నియంత్రణకు ఇచ్చే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వాడొచ్చ భారత్ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) అనుమతినిచ్చింది. (భారత ప్రజలకు ధన్యవాదాలు: ట్రంప్) ఈ క్రమంలోనే ఆ మెడిసిన్‌ను తమకు కూడా సరఫర చేయాలని అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు భారత్‌ను అభ్యర్థించాయి. దీనికి ఎఫ్‌డీఏ కూడా గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. దీంతో అమెరికాతో పాటు పలు ప్రపంచ దేశాలకు భారత్ ఈ ఔషధాన్ని ఎగుమతి చేసింది. అయితే కరోనాను నియంత్రించే శక్తి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందుకు ఉందని వైద్యుల ఇప్పటి వరకు ధృవీకరించలేదు. దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతానికి మాత్రం కరోనా రోగులకు ఇదే మందును ఉపయోగిస్తున్నారు. -
హెచ్‌సీక్యూ మందుల అమ్మకాలపై ఆంక్షలు
సాక్షి, అమరావతి: కరోనా (కోవిడ్-19) వైరస్ నిరోధానికి ఉయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ (HCQ) అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాష్ట్రంలోని మందుల షాపుల్లో సాధారణ ప్రజలకు హెచ్‌సీక్యూ మందులను విక్రయించరాదని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఈ ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర కోవిడ్-19 నోడల్ అధికారి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వైద్యులు సూచించిన వారు మాత్రమే హెచ్‌సీక్యూ విక్రయించాలని, ప్రిస్కిప్షన్ లేకుండా వీటిని విక్రయించరాదని పేర్కొన్నారు. ఈ మందులను వైద్యులు సూచించిన వారు, కోవిడ్-19 వైరస్ బారిన పడ్డవారు, ఇంట్లో వారి ద్వారా వ్యాప్తి చెందినవారు మాత్రమే వీటిని వినియోగించాలని, సాధారణ ప్రజలు వినియోగిస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుందని పేర్కొంది.