హైడ్రాక్సీక్లోరోక్విన్‌ తయారీకి వేగంగా అనుమతులు | Permission Granted For Preparation Of Hydroxychloroquine By TSPCB | Sakshi
Sakshi News home page

హైడ్రాక్సీక్లోరోక్విన్‌ తయారీకి వేగంగా అనుమతులు

Published Sun, Apr 26 2020 4:30 AM | Last Updated on Sun, Apr 26 2020 4:30 AM

Permission Granted For Preparation Of Hydroxychloroquine By TSPCB - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: ప్రస్తుతం వైద్య, ఆరోగ్యపరంగా ఏర్పడిన అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్, ప్రాణాలను కాపాడే ఇతర బల్క్‌ డ్రగ్స్, తదితర మందుల తయారీకి అవసరమైన అనుమతులు వేగంగా ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) వెల్లడించింది. ఈ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యమైందిగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఈ మందులను ఇతర దేశాలకు ఎగుమతి, ఇతరత్రా అవసరాల నిమిత్తం తయారు చేయనున్నందున దీన్ని ప్రజా ప్రయోజనంగా పరిగణిస్తూ ప్రస్తుత బల్క్‌డ్రగ్స్‌/ డ్రగ్‌ ఇంటర్మీడియట్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఇండస్ట్రీస్‌ తమ ప్రతిపాదనలను cee-tspcb@telangana.gov. in/tspcbseeunit2@gmail.com ఈ–మెయిల్‌ ఐడీలకు పంపాలని పీసీబీ సభ్య కార్యదర్శి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ మేరకు ప్రతిపాదనలతో పాటు తాము ఉత్పత్తి చేసే మందుల మార్పు, కంపారెటివ్‌ పొల్యూషన్‌ లోడ్స్‌ స్టేట్‌మెంట్, ఈ ప్రతిపాదిత ఉత్పత్తులకు మెటీరియల్‌ బ్యాలెన్స్, ఎన్విరాన్‌మెంట్‌ ఆడిటర్‌ సర్టిఫికెట్‌ను జతచేయాలని సూచించారు. కరోనా చికిత్సకు సంబంధించి బల్క్‌డ్రగ్స్‌/ లైఫ్‌ సేవింగ్‌ డ్రగ్స్‌ను ఉత్పత్తి చేసే ఇంటర్మీడియట్‌ ఇండస్ట్రీస్‌/ ఇంటర్మీడియెట్స్‌ ప్రతిపాదనలను ప్రాధాన్యతతో పరిశీలించి, వేగంగా క్లియరెన్స్‌లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ మందులను కరోనా నియంత్రణకు ఉపయోగించేందుకు కేంద్రం అనుమతినిచ్చిన నేపథ్యంలో ప్రపంచస్థాయిలో వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వీటి తయారీకి రాష్ట్రంలోని కొన్ని బల్స్‌డ్రగ్స్‌/ డ్రగ్‌ ఇంటర్మీడియట్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఇండస్ట్రీస్‌ ముందుకొచ్చినట్లు పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement