సాక్షి, ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్నఇంద్రాణీ ముఖర్జియా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. కుమార్తె హత్య కేసులో ముంబైలోని బైకుల్లా జైలులో ఉన్న ఆమెను అపస్మారక స్థితిలో అసుపత్రికి తరలించడం చర్చనీయాంశమైంది. తీవ్ర రక్తపోటుతో బాధపడుతున్న ఇంద్రాణీని జైలు అధికారులు ముంబైలోని జేజే హాస్పిటల్‌కి తరలించారు. ప్రసుత్తం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ఇంద్రాణీపై విష ప్రయోగం జరిగిందా లేక డ్రగ్ మోతాదు ఎక్కువైందా అనే కోణంలో పరీక్షలు నిర్వహిస్తున్నామని జేజే హాస్పిటల్ డీన్ ఎస్‌డీ నానంద్‌కర్ వెల్లడించారు. రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. దీంతో ఇంద్రాణీ ముఖర్జియా ఆకస్మిక అనారోగ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఆసుపత్రిలోముఖర్జీని కలవటానికి ప్రయత్నించిన ఆమె వ్యక్తిగత న్యాయవాది గుంజన్ మంగళను వైద్యులు అనుమతించలేదు. ముందుగా జైలు అధికారుల అనుమతి తీసుకోవాలని వైద్యులు అతనికి సూచించారు. కాగా ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కూడా నిందితురాలిగా ఉన్న ఇంద్రాణీ ముఖర్జియా తన భర్త పీటర్ ముఖర్జీతో కలిసి సొంత కూతుర్ని హతమార్చిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment