sheena bora murder
-
ఐసీయూలో ఇంద్రాణీ ముఖర్జియా..పలు అనుమానాలు
సాక్షి, ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్నఇంద్రాణీ ముఖర్జియా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. కుమార్తె హత్య కేసులో ముంబైలోని బైకుల్లా జైలులో ఉన్న ఆమెను అపస్మారక స్థితిలో అసుపత్రికి తరలించడం చర్చనీయాంశమైంది. తీవ్ర రక్తపోటుతో బాధపడుతున్న ఇంద్రాణీని జైలు అధికారులు ముంబైలోని జేజే హాస్పిటల్‌కి తరలించారు. ప్రసుత్తం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇంద్రాణీపై విష ప్రయోగం జరిగిందా లేక డ్రగ్ మోతాదు ఎక్కువైందా అనే కోణంలో పరీక్షలు నిర్వహిస్తున్నామని జేజే హాస్పిటల్ డీన్ ఎస్డీ నానంద్కర్ వెల్లడించారు. రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. దీంతో ఇంద్రాణీ ముఖర్జియా ఆకస్మిక అనారోగ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఆసుపత్రిలోముఖర్జీని కలవటానికి ప్రయత్నించిన ఆమె వ్యక్తిగత న్యాయవాది గుంజన్ మంగళను వైద్యులు అనుమతించలేదు. ముందుగా జైలు అధికారుల అనుమతి తీసుకోవాలని వైద్యులు అతనికి సూచించారు. కాగా ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కూడా నిందితురాలిగా ఉన్న ఇంద్రాణీ ముఖర్జియా తన భర్త పీటర్ ముఖర్జీతో కలిసి సొంత కూతుర్ని హతమార్చిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. -
చాన్నాళ్లకు షీనాపై నోరు విప్పిన రాహుల్..
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసు విషయంలో తొలిసారి ఈ కేసులో దోషిగా పేర్కొన్న పీటర్ ముఖర్జియా కుమారుడు రాహుల్ ముఖర్జియా స్పందించాడు. ట్విట్టర్ ద్వారా అతను రాష్ట్రపతి భవన్‌కు, ప్రధానమంత్రి కార్యాలయానికి విజ్ఞప్తి చేసుకున్నాడు. ఈ కేసును దర్యాప్తును చూసిన ఐపీఎస్ అధికారి రాకేశ్ మారియా అంతకుముందు ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ గత మూడేళ్ల కింద ఈ కేసు బయటకు రాకుండా కొంతమంది డబ్బున్న వ్యక్తులు, ప్రభావంతమైన హోదాలో ఉన్న వ్యక్తులు తొక్కిపట్టారని చెప్పారు. ఆయన అలా చెప్పిన వెంటనే రాహుల్ ట్వీట్లో ‘సరిగ్గా ఎవరు 2012లో దర్యాప్తును ప్రభావానికి గురిచేశారు? ఇంద్రాణి ఆ సమయంలో జాయింట్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న దేవెన్ భారతీతో మాట్లాడినట్లు మారియా చెబుతున్నారా?(ఆ సమయంలో ముంబయి కమిషనర్‌గా రాకేశ్ మారియా ఉన్నారు) లేదా అంతకంటే పెద్దదైన విషయం ఇంకేదైనా ఉందా? అసలు రహస్యం ఎందుకు? అంటూ అతను ప్రశ్నించాడు. తన తండ్రిని వివాహం ఆడిన ఇంద్రాణి ముఖర్జియా కన్నకూతురునే సోదరిగా రాహుల్‌కు పరిచయం చేసింది. అతడికి సోదరి అవుతుందనే విషయం దాచడంతో అతడు ఆమెతో ప్రేమలోపడ్డాడు. వారిద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు కూడా. అయితే, ఆ విషయం ఇష్టం లేని ఇంద్రాణి అనూహ్యంగా పీటర్ తో కలిసి షీనాను హత్య చేయించింది. ఇటీవల ముంబయి కోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. -
'ముగ్గురం కలిసి ఆమెను చంపేశాం'
ముంబై: సొంత కూతురు షీనా బోరాను ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా హత్య చేసిందని అప్రూవర్‌గా మారిన డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ వెల్లడించాడు. ఇంద్రాణికి తాను, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా సహకరించామని ఒప్పుకున్నాడు. 2012, ఏప్రిల్ 24న కారులో షీనాకు చంపినట్టు తెలిపాడు. తాను షీనా నోరు మూసేయగా, ఖన్నా ఆమె జట్టు పట్టుకుని కదలకుండా పట్టుకున్నాడని చెప్పాడు. ఇంద్రాణి తన చేతులతో షీనా గొంతు పిసికేసిందని వెల్లడించాడు. పీటర్ ముఖర్జియా ప్రమేయం గురించి అతడు ఏమీ వెల్లడించలేదు. అయితే ఆయనకు ఎటువంటి సంబంధం లేదని పీటర్ తరపు న్యాయవాది మిహిర్ గీవాలా వాదించారు. 2012, ఏప్రిల్ 24న షీనా హత్యకు గురైనట్టు పోలీసులు పేర్కొన్నారు. అక్రమ ఆయుధాల కేసులో శ్యామ్వర్ రాయ్ అరెస్ట్ కావడంతో 2015లో ఈ దారుణోదంతం వెలుగు చూసింది. షీనా హత్య కేసులో రాయ్, ఇంద్రాణి, ఖన్నాను గతేడాది ఆగస్టులో అరెస్ట్ చేశారు. నవంబర్ లో పీటర్ ముఖర్జియాను అదుపులోకి తీసుకున్నారు. దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన సాక్షి.. హంతకుల్లో ఒకరు అప్రూవర్‌గా మారాడు. అందుకు కోర్టు సోమవారం అనుమతినిచ్చింది. కన్న కూతురైన షీనా బోరాను ఇంద్రాణి ముఖర్జియా ఆమె మాజీ భర్త, డ్రైవర్ కలిసి దారుణంగా గొంతునులిమి చంపిన విషయం తెలిసిందే. -
'నా ఆనందం కోసం ఆలోచించావా?'
న్యూఢిల్లీ: 'రాహుల్‌తో నా జీవితం ఆనందంగా, భద్రంగా ఉంటుంది. తల్లిదండ్రులుగా నన్ను ప్రేమించేవారికి అంతకన్నా ఇంకేం కావాలి?'.. షీనా బోరా తన తల్లి ఇంద్రాణి ముఖర్జీయాకు రాసిన లేఖ ఇది. వరుసకు సవతి సోదరుడయ్యే రాహుల్‌తో షీనా బోరా డేటింగ్ చేస్తుండటంతో ఇంద్రాణి కుటుంబంలో విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ఆ సమయంలో తన సొంత నిర్ణయాలు తాను తీసుకునేందుకు అనుమతించాలంటూ షీనా బోరా తల్లి ఇంద్రాణికి ఈమెయిల్ లేఖ రాసిందని సీబీఐ తన చార్జిషీట్లో పేర్కొంది. 2012లో షీనాను ఇంద్రాణి హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నది. ఈ హత్య ఘటనకు ముందే తల్లి ఇంద్రాణికి షీనా రాసిన లేఖలోని వివరాలను సీబీఐ వెల్లడించింది. ' నీ జీవితంలో నీకు ఏదైతే ఆనందం ఇస్తుందో అదే నువ్వు చేశావు. నాకు కూడా అంతే వర్తిస్తుంది. దానికి నువ్వెందుకు బాధపడుతున్నావు? నాలోను కొంతవరకు నీ లక్షణాలే ఉన్నాయి. నా జీవితాన్ని నేను వెతుక్కుంటాను. నువ్వు దాని గురించి కలతపడకు' అని షీనా తల్లిని ఉద్దేశించి లేఖలో పేర్కొంది. షీనా బోరా రాహుల్‌తో ప్రేమలో మునిగి ఉండటంతో వారిద్దరూ విడిపోవాల్సిందేనని ఇంద్రాణి ఒత్తిడి తెచ్చి ఉంటుందని, ఈ నేపథ్యంలోనే షీనా ఈ లేఖ రాసిందని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. దీంతోపాటు తన చిన్న కూతురు వైదేహీతో షీనా బోరా సన్నిహితంగా ఉండటం, తన భర్త, మీడియా టైకూన్ పీటర్ ముఖర్జీయాతో దగ్గరవుతుండటం కూడా ఇంద్రాణి సహించలేకపోయిందని, తన ఆస్తులను ఎక్కడ షీనా బోరా సొంతం చేసుకుంటుందోనని, వైదేహీని తనకు దూరం చేస్తుందేమోననే భావనతోనే ఇంద్రాణి ఆమె హత్యకు ఒడిగట్టి ఉండవచ్చునని దర్యాప్తు వర్గాలు వివరిస్తున్నాయి. అదేవిధంగా సవతి తండ్రి పీటర్‌కు కూడా షీనా లేఖ రాసిందని, అందులో 'నా సమస్య ఇంద్రాణితోనే. అది నా వ్యక్తిగత విషయం. మీరు ఇంద్రాణికి ఈ విషయాన్ని చెప్పి ఒప్పించండి. అంతేకానీ నన్ను-రాహుల్‌ను దూషించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు' అని షీనా పేర్కొందని సీబీఐ తెలిపింది. -
షీనా బోరా హత్య కేసులో కీలక మలుపు