చాన్నాళ్లకు షీనాపై నోరు విప్పిన రాహుల్..
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసు విషయంలో తొలిసారి ఈ కేసులో దోషిగా పేర్కొన్న పీటర్ ముఖర్జియా కుమారుడు రాహుల్ ముఖర్జియా స్పందించాడు. ట్విట్టర్ ద్వారా అతను రాష్ట్రపతి భవన్‌కు, ప్రధానమంత్రి కార్యాలయానికి విజ్ఞప్తి చేసుకున్నాడు. ఈ కేసును దర్యాప్తును చూసిన ఐపీఎస్ అధికారి రాకేశ్ మారియా అంతకుముందు ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ గత మూడేళ్ల కింద ఈ కేసు బయటకు రాకుండా కొంతమంది డబ్బున్న వ్యక్తులు, ప్రభావంతమైన హోదాలో ఉన్న వ్యక్తులు తొక్కిపట్టారని చెప్పారు.
ఆయన అలా చెప్పిన వెంటనే రాహుల్ ట్వీట్‌లో ‘సరిగ్గా ఎవరు 2012లో దర్యాప్తును ప్రభావానికి గురిచేశారు? ఇంద్రాణి ఆ సమయంలో జాయింట్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న దేవెన్ భారతీతో మాట్లాడినట్లు మారియా చెబుతున్నారా?(ఆ సమయంలో ముంబయి కమిషనర్‌గా రాకేశ్ మారియా ఉన్నారు) లేదా అంతకంటే పెద్దదైన విషయం ఇంకేదైనా ఉందా? అసలు రహస్యం ఎందుకు? అంటూ అతను ప్రశ్నించాడు.
తన తండ్రిని వివాహం ఆడిన ఇంద్రాణి ముఖర్జియా కన్నకూతురునే సోదరిగా రాహుల్‌కు పరిచయం చేసింది. అతడికి సోదరి అవుతుందనే విషయం దాచడంతో అతడు ఆమెతో ప్రేమలోపడ్డాడు. వారిద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు కూడా. అయితే, ఆ విషయం ఇష్టం లేని ఇంద్రాణి అనూహ్యంగా పీటర్ తో కలిసి షీనాను హత్య చేయించింది. ఇటీవల ముంబయి కోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.