rahul mukerjea
-
వైద్యం అందకపోతే చచ్చిపోతాను!
ముంబై: షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలైన మీడియా బాస్ ఇంద్రాణి ముఖర్జీ సోమవారం ముంబై కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ కుట్ర పన్నుతోందని ఈ పిటిషన్లో ఆరోపించిన ఆమె.. తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఎమోషనల్‌గా అభ్యర్థించారు. వీలైనంత త్వరగా తనకు వైద్యం సహాయం అందకపోతే తాను చనిపోతానని, తన మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో సత్వరమే బెయిల్ ఇవ్వాలని ఆమె న్యాయస్థానాన్ని వేడుకున్నారు. ‘దాదాపు ఏడాది కిందట రాహుల్ ముఖర్జీ ఈ కేసులో తదుపరి సాక్షి అని ప్రాసిక్యూషన్ పేర్కొంది. 14 నెలలు అయినా ఇప్పటివరకు అతన్ని కోర్టులో సాక్షిగా ప్రవేశపెట్టలేదు. మరోవైపు అతడు కీలక సాక్షి అంటూ.. అతని సాక్ష్యం ఇవ్వని కారణంగా నాకుబెయిల్ నిరాకరిస్తూ వస్తున్నారు’ అని వాదనల సందర్భంగా ఇంద్రాణి న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇలా సాక్షిని ప్రవేశపెట్టకుండా తనకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ కుట్ర చేస్తున్నట్టు కనిపిస్తోందని ఆమె ఆరోపించారు. దీంతో ఈ కేసులో వాదనలను వేగవంతం చేయాలని ప్రాసిక్యూషన్, డిఫెన్స్ లాయర్లను ఆదేశించిన జడ్జి బెయిల్ పిటిషన్ విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేశారు. -
చాన్నాళ్లకు షీనాపై నోరు విప్పిన రాహుల్..
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసు విషయంలో తొలిసారి ఈ కేసులో దోషిగా పేర్కొన్న పీటర్ ముఖర్జియా కుమారుడు రాహుల్ ముఖర్జియా స్పందించాడు. ట్విట్టర్ ద్వారా అతను రాష్ట్రపతి భవన్‌కు, ప్రధానమంత్రి కార్యాలయానికి విజ్ఞప్తి చేసుకున్నాడు. ఈ కేసును దర్యాప్తును చూసిన ఐపీఎస్ అధికారి రాకేశ్ మారియా అంతకుముందు ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ గత మూడేళ్ల కింద ఈ కేసు బయటకు రాకుండా కొంతమంది డబ్బున్న వ్యక్తులు, ప్రభావంతమైన హోదాలో ఉన్న వ్యక్తులు తొక్కిపట్టారని చెప్పారు. ఆయన అలా చెప్పిన వెంటనే రాహుల్ ట్వీట్లో ‘సరిగ్గా ఎవరు 2012లో దర్యాప్తును ప్రభావానికి గురిచేశారు? ఇంద్రాణి ఆ సమయంలో జాయింట్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న దేవెన్ భారతీతో మాట్లాడినట్లు మారియా చెబుతున్నారా?(ఆ సమయంలో ముంబయి కమిషనర్‌గా రాకేశ్ మారియా ఉన్నారు) లేదా అంతకంటే పెద్దదైన విషయం ఇంకేదైనా ఉందా? అసలు రహస్యం ఎందుకు? అంటూ అతను ప్రశ్నించాడు. తన తండ్రిని వివాహం ఆడిన ఇంద్రాణి ముఖర్జియా కన్నకూతురునే సోదరిగా రాహుల్‌కు పరిచయం చేసింది. అతడికి సోదరి అవుతుందనే విషయం దాచడంతో అతడు ఆమెతో ప్రేమలోపడ్డాడు. వారిద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు కూడా. అయితే, ఆ విషయం ఇష్టం లేని ఇంద్రాణి అనూహ్యంగా పీటర్ తో కలిసి షీనాను హత్య చేయించింది. ఇటీవల ముంబయి కోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. -
వాళ్లు ఎలా కలిశారు?.. ఎవరు విడదీశారు?
ముంబై: రాహుల్ ముఖర్జీయా, షీనా బోరా విధివంచిత ప్రేమికులు. వారు ఎప్పుడు తొలిసారి కలుసుకున్నారు? ఎలా ప్రేమలో పడ్డారు? నిశ్చితార్థం జరిగిన తర్వాత విషాదకర పరిస్థితుల్లో ఎలా వేరయ్యారు? 2012లో షీనాబోరా దారుణ హత్యకు ముందు జరిగిన సంఘటనలేమిటి? అప్పటి పరిణామాలన్నింటినీ రాహుల్ ముఖర్జీయా పోలీసులకు పూస గుచ్చినట్టు వివరించాడు. తమ ప్రేమబంధం గురించి తెలుసుకొని షీనాబోరా తల్లి ఇంద్రాణి ముఖర్జీయా తీవ్రంగా నిస్పృహకు లోనైందని తెలిపాడు. అకస్మాత్తుగా షీనాబోరా కనిపించకపోవడం తనను మానసికంగా కుంగదీసిందని, ఆమె మిస్సింగ్ వెనుక ఇంద్రాణి ప్రమేయం ఉండవచ్చునని అనుమానించానని రాహుల్ చెప్పాడు. షీనాబోరా హత్యకేసులో ప్రధాన హంతకురాలిగా మీడియా అధిపతి పీటర్ ముఖర్జీయా రెండో భార్య ఇంద్రాణి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తొలిసారి ఎప్పుడూ కలిశారు? 2008లో రాహుల్ ముంబై వర్లిలోని మార్లో అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న తన తండ్రి పీటర్ ముఖర్జీయా నివాసానికి మారాడు. అప్పడే షీనాను తొలిసారి చూశాడు. 'వర్లీ ఫ్లాట్‌లోనే నేను తొలిసారి షీనాను చూశాను. ఆ తర్వాత మేం తరచూ కలుసుకున్నాం. ఇది మా మధ్య సన్నిహిత స్నేహాన్ని ఏర్పరిచింది' అని రాహుల్ పోలీసులకు ఇచ్చిన తన వాంగ్మూలంలో తెలిపాడు. ఆ తర్వాత నెల రోజులకే తాను లండన్ వెళ్లానని, అక్కడ కొన్నాళ్లు ఉండిన తర్వాత మళ్లీ ముంబై వచ్చానని చెప్పాడు. అయితే ఈసారి ఇంట్లో ఉండకుండా వేరే చోట ఉండాలని పీటర్‌తో ఇంద్రాణి చెప్పించిందని, దీంతో తాను ఖార్దండలో ఫ్లాట్ తీసుకున్నానని తెలిపాడు. మొదటిసారి అప్పుడే చెప్పింది..! యావత్ ప్రపంచం అనుకుంటున్నట్టు తాను ఇంద్రాణి సోదరిని కాదని, ఆమె కూతురినని ఓరోజు స్వయంగా షీనాబోరానే చెప్పిందని రాహుల్ పోలీసులకు తెలిపాడు. 'నా తండ్రి సహకారంతో నేను ప్రైమ్ ఫొకస్లో ఉద్యోగం సంపాదించాను. షీనాను కూడా తరచూగా కలుస్తుండేవాణ్ని. క్రమంగా మేం ప్రేమలో పడిపోయాం. ఒక రోజు తను వచ్చి 'నేను ఇంద్రాణి చెల్లెల్ని కాదు కూతరిని' అని చెప్పింది. మా అనుబంధం గురించి ఇంద్రాణికి తెలియడంతో తను కోపాద్రిక్తురాలైంది. ఈ విషయమై నా తండ్రితో తను కోట్లాడింది. వెంటనే షీనాను గువాహటి పంపించింది' అని రాహుల్ గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత 2009లో షీనాను ఢిల్లీకి పంపించారు. అక్కడ తీవ్ర అనారోగ్యంతో తను ఆస్పత్రి పాలైంది. ఆస్పత్రిలో ఉన్న ఆమెను ఇంద్రాణి, ఆమె మాజీ ప్రియుడు పరామర్శించారు. ఆ తర్వాత ఇంద్రాణి ఒత్తిడి మేరకు బెంగళూరు వచ్చిన షీనా బోరా.. ఇంద్రాణి మాజీ ప్రియుడితో కొంతకాలం ఉంది. 'ఆ సమయంలో నా దగ్గర డబ్బు లేదు. ఇంట్లోని వస్తువులన్ని అమ్మి బెంగళూరు వెళ్లి షీనాను కలుసుకున్నాను. ఆమె తన చాలా బలహీనంగా ఉంది. మానసిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందే ఔషధాలను వేసుకోమని ఇంద్రాణి షీనాకు ఇచ్చింది. ఆ ఔషధాలను వైద్యుడికి చూపిస్తే వాటిని వెంటనే మానేయాలని మాకు సూచించాడు. ఆ మందులు తీసుకోవడం మానిన తర్వాత ఆమె కోలుకుంది. షీనా తాత-నాయనమ్మ, మా అమ్మ అనుమతి తీసుకొని ఆమెను డెహ్రాడూన్‌లోని మా ఇంటికి తీసుకెళ్లాను' అని రాహుల్ తెలిపాడు. ఆ తర్వాత 2009 చివర్లో ఈ ప్రేమ జంట ముంబైకి వచ్చింది. షీనాకు ఉద్యోగం దొరికింది. అంధేరిలోని ఓ అద్దె ఇంట్లో ఇద్దరు మకాం వేశారు. ఈ విషయం తెలియడంతో పీటర్, ఇంద్రాణి మధ్య తీవ్రంగా గొడవలు జరిగాయి. 2011 అక్టోబర్‌లో రాహుల్, షీనా డెహ్రాడూన్ వెళ్లి నిశ్చితార్థం చేసుకున్నారు. షీనా తాత-నాయనమ్మ, రాహుల్ తల్లి అనుమతితో ఈ నిశ్చితార్థం జరిగింది. వారు మళ్లీ ముంబైకి రావడంతో నిశ్చితార్థం గురించి ఇంద్రాణికి తెలిసింది. ఈ సమయంలో ఆమె ఎంతో మారిన మనిషిలా కనిపించిందని రాహుల్ తెలిపాడు. షీనా ఎలా అదృశ్యమైంది? ఆ తర్వాత ఓసారి ఇంద్రాణి షీనాను డిన్నర్‌కు పిలిచింది. షీనా హత్యకు ముందురోజు కూడా ఆమెను ఇంద్రాణి డిన్నర్‌కు పిలిచింది. షీనాకు నిశ్చితార్థం కానుక ఇస్తానని చెప్పింది. హత్యకు ముందు రోజు 2012, ఏప్రిల్ 24న షీనాను నేను ఆఫీసు నుంచి ఇంటికి తీసుకొచ్చాను. ఆ రోజు ఇంద్రాణి పదేపదే ఫోన్ చేసింది. షీనా రావడానికి ఎంత సమయం తీసుకుంటుందని పదేపదే అడిగింది. ఆ తర్వాత ఇంద్రాణి చెప్పిన అడ్రస్‌కు మేం వెళ్లాం. అక్కడికి షెవ్రోలె కారులో ఇంద్రాణి, మరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చారు. డ్రైవర్ సీటులో శ్యామ్రాయ్ ఉన్నాడు' అని రాహుల్ వివరించాడు. ఆ గుర్తు తెలియని వ్యక్తి ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా అని తేలింది. ఆ తర్వాత షీనా ఇక ఎప్పటికీ కనిపించలేదని, ఆమె ఫోన్‌కు ఎన్నిసార్లు కాల్ చేసినా సమాధానం రాలేదని రాహుల్ తెలిపాడు. ఆ తర్వాత ఓ రోజు ఆమె తన మొబైల్ నుంచి ఓ మెసెజ్ వచ్చిందని, తాను కొత్త ప్రేమికుడిని చూసుకున్నానని, అతనితో ఆనందంగా ఉన్నానని ఆ మెసెజ్‌లో పేర్కొని ఉందని రాహుల్ చెప్పాడు. షీనా మిస్సింగ్‌పై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసినా.. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని వివరించాడు. ఈ కేసులో ప్రధాన నిందితులు ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్‌ఖన్నా, ఆమె మాజీ డ్రైవర్ శ్యాంరావులకు వ్యతిరేకంగా రాహుల్ వాంగ్మూలం ఇచ్చాడు. పీటర్ పాత్ర ఏమిటి? షీనా హత్యకేసులో పీటర్ ముఖర్జీయా పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షీనా హత్య కుట్ర పీటర్‌కు తెలుసని పేర్కొంటూ సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. అయితే రాహుల్ మాత్రం ఒక్కసారి మాత్రమే తన వాంగ్మూలంలో పీటర్ పేరు ప్రస్తావించాడు. అంతకుమించి ఎలాంటి విషయాలు తెలుపలేదని తెలుస్తున్నది. పోలీసులు నమోదుచేసిన చార్జ్‌షీట్‌లోని ఈ వివరాలను మిడ్డే పత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. -
'మా నాన్న అమాయకుడు.. ఆయనకేం తెలియదు'
ముంబయి: తన తండ్రి పీటర్ ముఖర్జియా అమాయకుడని, ఈ కేసుతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని షీనా బోరా హత్య కేసుకు సంబంధించి పీటర్ ముఖర్జియా తనయుడు రాహుల్ ముఖర్జియా అన్నాడు. గత శుక్రవారం సీబీఐ అధికారులు హత్య, నేర పూరిత కుట్ర ఆరోపణల పేరిట పీటర్ ముఖర్జియాను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం కొందరు మీడియా అధికారులు రాహుల్ ను సంప్రదించగా అతడు ఈ విధంగా స్పందించాడు. 'షీనా హత్యకు గురికావడానికి మా నాన్న ఎందుకు కారణం కాదో ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే కేసు విచారణలో ఉంది. నాకు పూర్తి నమ్మకం ఉంది. మా నాన్న అమాయకుడు ఆయనకు ఏమీ తెలియదు' అని రాహుల్ అన్నాడు. కీలక వర్గాల సమాచారం ప్రకారం రాహుల్ ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక వివరణలు ఇవ్వడంతోపాటు, చాలా ఆధారాలు విచారణ అధికారులకు ఇచ్చినట్లు తెలిసింది. అంతేకాకుండా తనకు నగరంలో మూడు బెడ్రూంల ఫ్లాట్ ఇవ్వకుంటే తాను ఇంద్రాణి సోదరిని కాదని, ఇంద్రాణి కూతురునని అందరికీ చెప్తానని తల్లి ఇంద్రాణిని షీనా బ్లాక్ మెయిలింగ్ చేసినట్లు తెలిసింది. ఇంద్రాణి ముఖర్జియా కుమార్తె అయిన షీనాతో రాహుల్ సంబంధం నెరిపాడన్న విషయం ఇప్పటికే తెలిసిందే. -
'షీనా' ఆరు మెస్సేజ్ లు పంపింది!
ముంబై: షీనా బోరా హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. క్రైమ్ సీరియల్ ను తలపిస్తోన్న షీనా కేసులో తాజాగా మరో విషయం బయటపడింది. 2012, ఏప్రిల్ నెలలో షీనా హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నా.. ఆ తరువాత ఆమె సొంత మొబైల్ ఫోన్ నుంచి తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ ముఖర్జీయాకు ఆరు మెస్సేజ్ లు వచ్చాయట. ఈ విషయాన్ని పోలీసు విచారణలో రాహుల్ స్పష్టం చేశాడు. షీనా అదృశ్యమైన నాటి నుంచి తనకు వరుసగా కొన్ని మెస్సేజ్ లు వచ్చినట్లు పోలీసులకు తెలిపాడు. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్న పోలీసులు.. అసలు ఆ మెస్సేజ్ లు పంపిందెవరు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 'నేను యూఎస్ కు వెళ్లిపోయాను.. దయచేసి నన్ను ఫాలో కావద్దు. ఇక నీతో ఎటువంటి సంబంధం కొనసాగించదలుచుకోలేదు.. నాకు ఫోన్ చేయకు. మెస్సేజ్ లు కూడా పంపకు. నేను ఇక్కడ సంతోషంగా ఉన్నా.. నీతో మాట్లాడం నాకు ఇష్టం లేదు. నేను అమెరికాలో ఉన్నా. నాకు యూఎస్ లో కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి... నేను అతనితో సంతోషంగా ఉన్నా' అని షీనా తన మొబైల్ కు మెస్సేజ్ లు పంపినట్లు రాహుల్ తెలిపాడు. -
'వాళ్లిద్దరి పెళ్లికి మేమంతా ఒప్పుకున్నాం'
డెహ్రడూన్: షీనా బోరా హత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాహుల్ ముఖర్జియా, షీనా బోరా మూడేళ్ల క్రితమే పెళ్లి చేసుకోవాలనుకున్నారని వెల్లడైంది. వీరి వివాహానికి పీటర్ ముఖర్జియా మొదటి భార్య షబ్నం కుటుంబం మొత్తం అంగీకరించిందని తెలిసింది. పెళ్లికి తన తల్లి అంగీకారం కోసం 2011లో షీనాను రాహుల్ తీసుకొచ్చాడని షబ్నం తమ్ముడు షలీన్ తెలిపాడు. షీనా తమ కుటుంబ సభ్యులందరికీ ఎంతో నచ్చిందని చెప్పాడు. అందరితో కలిసిపోవడమే కాకుండా, పెద్దల పట్ల ఆమె చూపించిన గౌరవాభిమానాలు తమందరినీ ఆకట్టుకున్నాయన్నారు. దీంతో తామందరం రాహుల్, షీనా పెళ్లికి ఏకగ్రీవంగా అంగీకారం తెలిపామని చెప్పారు. కొద్ది రోజుల్లోనే వాళ్ల పెళ్లి జరుగుతుందని భావించామన్నారు. షీనా హత్యకు గురైందన్న విషయం వార్తా చానళ్ల ద్వారా తెలిసిందన్నారు. ఆమె హత్యకు గల కారణాలు తెలియదని చెప్పారు. చురుకైన షీనాను పొట్టన పెట్టుకున్న వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదలకూడదని, హంతకులను కఠినంగా శిక్షించాలని షలీన్ డిమాండ్ చేశారు. మోడల్, టీవీ నటుడైన 49 షలీన్ కు జోగివాలా ప్రాంతంలో ఇంటర్నేషనల్ స్కూల్ నడుపుతున్నారు. -
'చివరిగా బ్రేకప్ మెస్సేజ్'
ముంబయి: కీలకమలుపులు తిరిగి సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో మరో విషయం వెలుగు చూసింది. ఆమె మొబైల్ ఫోన్ నుంచి తనకు చివరిసారి బ్రేకప్ మెస్సేజ్ వచ్చినట్లు ఆమె బాయ్ ఫ్రెండ్ సవతి తండ్రి కుమారుడు రాహుల్ ముఖర్జియా తెలిపాడు. అప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయిందనే విషయం తెలిపాడు. ఈ కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు గురువారం రాహుల్ ముఖర్జియాను ఓ ప్రాంతంలోకి వ్యక్తిగతంగా విచారించగా అతడు ఈ విషయం చెప్పినట్లు తెలిసింది. దాంతోపాటు షీనా ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించిన ప్రతిసారి ఆమె వెంటపడటం మానుకో అని చెప్పేదని కూడా పోలీసులకు చెప్పినట్లు అధికారిక వర్గాల సమాచారం. చివరిసారిగా 2012 ఏప్రిల్ 24న ఆమె తన తల్లితో బయలుదేరడానికి కొద్ది గంటల ముందు మాత్రమే రాహుల్ ఆమెను కలిశాడని, ఇక అప్పుడే చివరిసారని కూడా వివరించినట్లు తెలిసింది. కన్నకూతురినే తొలుత సోదరిగా పరిచయం చేసి.. పీటర్‌ను వివాహం ఆడిన ఇంద్రాని ముఖర్జియా ఆమె కుట్రకు భంగం కలిగే పరిస్థితి తలెత్తడంతో షీనాను హత్య చేసిన విషయం తెలిసిందే.