'షీనా' ఆరు మెస్సేజ్ లు పంపింది! | Rahul Got 6 Messages From 'Sheena', Asking Him to Stop Contacting Her | Sakshi
Sakshi News home page

'షీనా' ఆరు మెస్సేజ్ లు పంపింది!

Published Tue, Sep 1 2015 7:36 PM | Last Updated on Sun, Sep 3 2017 8:33 AM

'షీనా' ఆరు మెస్సేజ్ లు పంపింది!

'షీనా' ఆరు మెస్సేజ్ లు పంపింది!

ముంబై: షీనా బోరా హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. క్రైమ్ సీరియల్ ను తలపిస్తోన్న షీనా కేసులో తాజాగా మరో విషయం బయటపడింది. 2012, ఏప్రిల్ నెలలో షీనా హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నా.. ఆ తరువాత ఆమె సొంత మొబైల్ ఫోన్ నుంచి తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ ముఖర్జీయాకు ఆరు మెస్సేజ్ లు వచ్చాయట. ఈ విషయాన్ని పోలీసు విచారణలో రాహుల్ స్పష్టం చేశాడు. షీనా అదృశ్యమైన నాటి నుంచి తనకు వరుసగా కొన్ని మెస్సేజ్ లు వచ్చినట్లు పోలీసులకు తెలిపాడు.  దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్న పోలీసులు.. అసలు ఆ మెస్సేజ్ లు పంపిందెవరు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

'నేను యూఎస్ కు వెళ్లిపోయాను.. దయచేసి నన్ను ఫాలో కావద్దు. ఇక నీతో ఎటువంటి సంబంధం కొనసాగించదలుచుకోలేదు.. నాకు ఫోన్ చేయకు. మెస్సేజ్ లు కూడా పంపకు. నేను ఇక్కడ సంతోషంగా ఉన్నా.. నీతో మాట్లాడం నాకు ఇష్టం లేదు. నేను అమెరికాలో ఉన్నా. నాకు యూఎస్ లో కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి...  నేను అతనితో సంతోషంగా ఉన్నా' అని షీనా తన మొబైల్ కు మెస్సేజ్ లు పంపినట్లు రాహుల్ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement