
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమ అభివృద్ధికి రూ.460 కోట్లతో మద్దతునందించాలని ప్రతిపాదించింది. దీని ద్వారా కామన్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు, ఎస్‌ఎంఈల టెక్నాలజీ అప్‌గ్రేడ్ వంటి వాటితో బల్క్ డ్రగ్స్, వైద్య పరికరాల తయారీ వ్యయాన్ని తగ్గించాలని భావిస్తోంది. అందుకోసం ఫార్మాస్యూటికల్స్ డిపార్ట్‌మెంట్.. ఫార్మా డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద ఐదు సబ్ స్కీములకు మార్గదర్శకాలను ప్రకటించింది. బల్క్ డ్రగ్స్ పార్క్స్‌లో తయారీ వ్యయాన్ని 20–25 శాతంమేర తగ్గించడమే లక్ష్యమని తెలిపింది. అలాగే మెడికల్ డివైస్ పార్క్స్ ద్వారా వైద్య పరికరాల తయారీ ఖర్చును కూడా తగ్గించాలని చూస్తోంది.
బల్క్ డ్రగ్ పరిశ్రమకు చేయూతనందించేందుకు ఒక స్కీమ్ కింద 2018–20 మధ్యకాలంలో రూ.200 కోట్లతో కామన్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తన వెబ్‌సైట్‌లో తెలిపింది. మెడికల్ డివైస్ పరిశ్రమకు కూడా సాయమందించేందుకు మరో స్కీమ్ కింద రూ.100 కోట్లతో కామన్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. రూ.20 కోట్లతో ఫార్మా క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రతిపాదించామని తెలిపింది. ఫార్మా రంగ ప్రమోషన్‌కు ఫార్మాస్యూటికల్ ప్రమోషన్ డెవలప్‌మెంట్ స్కీమ్‌ను తీసుకువస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇక ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ అసిస్టెన్స్ స్కీమ్‌కు బడ్జెట్‌లో రూ.144 కోట్ల కేటాయింపులు ఉన్నాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment