'గ్లుకాన్-డీ' ఎనర్జీ డ్రింక్ లో పురుగులు | Insects Allegedly Found Inside Glucon-D Packet in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

'గ్లుకాన్-డీ' ఎనర్జీ డ్రింక్ లో పురుగులు

Published Tue, Jun 9 2015 8:47 AM | Last Updated on Fri, May 25 2018 2:59 PM

'గ్లుకాన్-డీ' ఎనర్జీ డ్రింక్ లో పురుగులు - Sakshi

'గ్లుకాన్-డీ' ఎనర్జీ డ్రింక్ లో పురుగులు

బులంద్షార్ (ఉత్తరప్రదేశ్): మ్యాగీ నూడుల్స్ వివాదం ముగిసిపోకముందే మరో వివాదం తలెత్తింది. తాజాగా ఎనర్జీ డ్రింక్ 'గ్లుకాన్-డీ'లో చిన్న చిన్న పురుగులు, కీటకాలు వస్తున్నాయని ఉత్తరప్రదేశ్ లోని బులందర్షార్లో ఆరోపణలు వచ్చాయి. దీంతో 'గ్లుకాన్-డీ' ఐటమ్ ను పరిశీలనకు పంపారు.

బబ్లూ అనే వ్యక్తి రెండు రోజుల క్రితం ఓ జనరల్ స్టోర్ నుంచి 'గ్లుకాన్-డీ' కొన్నాడు. అది తాగిన అనంతరం వారి కుటుంబం మొత్తం వాంతులు చేసుకుని, అస్వస్థతకు గురైంది. పరీక్షల నిమిత్తం గ్లుకాన్ ప్రాడక్ట్ ను లాబోరేటరికి పంపించగా, కీటకాలున్నట్లు తేలినట్లు సమాచారం. తమకు ఫిర్యాదు అందిన తర్వాత ఆ జనరల్ స్టోర్ నుంచి నాలుగు పాకెట్లను డ్రగ్ సేఫ్టీ ఆఫీసర్ శివదాస్ లక్నోలోని లాబ్ కు పంపి పరీక్షలు జరిపినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ ఉత్పత్తులను అమెరికన్ ఫార్మాస్యూటికల్, హెచ్జే హీంజ్ కంపెనీ తయారుచేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement