వివిధ రకాల కీటకాలు, పురుగులను లొట్టలేసుకుంటూ తినే ఆహార ప్రియులకు సింగపూర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కీచురాళ్లు, గొల్లభామలు, చిమ్మట జాతులకు చెందిన కీటకాలను మనుషులు నిర్భయంగా, ఏమాత్రం సందేహం లేకుండా ఆహారంగా లాగించేయవచ్చని సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది.
సింగపూర్ ఫుడ్ రెగ్యులేటర్ ఏజెన్సీ (ఎస్‌ఎఫ్‌ఏ) తాజాగా 16 జాతుల కీటకాలను మనుషులు తినవచ్చని తెలిపింది. వీటిని ఆహారంలో వినియోగించేందుకు ఆమోదముద్ర వేసింది. ఈ కీటకాలు సింగపూర్, చైనా వంటకాలలో విరివిగా వినియోగిస్తుంటారు.
స్ట్రెయిట్స్ టైమ్స్ వార్తాపత్రిక అందించిన నివేదిక ప్రకారం క్యాటరింగ్ వ్యాపార నిర్వాహకులు ఎస్‌ఎఫ్‌ఏ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరు చైనా, థాయ్‌లాండ్, వియత్నాంలో ఉత్పత్తి అయ్యే ఈ కీటకాలను సింగపూర్‌కు సరఫరా చేస్తుంటారు. వీరు ఈ కీటకాలను సింగపూర్ తీసుకురావాలంటే ఎస్‌ఎఫ్‌ఏ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment