Karnataka Shocking Incident: Seven Aborted Fetuses Found In Canister In Belagavi - Sakshi
Sakshi News home page

షాకింగ్‌ ఘటన... డబ్బాలో ఏడు పిండాలు!

Published Sat, Jun 25 2022 10:59 AM | Last Updated on Sat, Jun 25 2022 12:57 PM

Shocking Incident Seven Aborted Fetal Found In Canister  - Sakshi

7 Aborted Fetuses: బెళగావి జిల్లాలోని ముదలగి గ్రామంలో ఒక డబ్బాలో గర్భస్రావం చేయబడిన ఏడు పిండాలను స్థానికులు గుర్తించారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ షాకింగ్‌ ఘటన బెళగావి జిల్లా ముదలగి గ్రామంలోని బస్టాండ్‌ సమీపంలో చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వెంటనే సంఘటనే స్థలానికి చేరుకుని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు.

ఈ మేరకు పోలీసులు ఆ డబ్బాలో ఏడు పిండాలను గుర్తించారు. అవన్నీ ఐదు నెలల పిండాలని, భ్రూణ హత్యలు జరిగినట్లు తెలుస్తోందని చెప్పారు. ఈ విషయమై జిల్లా యంత్రంగాం వెంటనే స్పందించి సమగ్ర దర్యాప్తు చేపట్టింది. అంతేకాకుండా ఈ పిండాలను ఆస్పత్రికి తరలించి,  ఆపై పరీక్ష కోసం జిల్లా ఫంక్షన్‌ సైన్స్‌ సెంటర్‌ తీసుకువెళ్తున్నామని పోలీసులు చెప్పారు.

(చదవండి: మహిళను బంధించి దోపిడీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement